"చైత్ర శుక్ల ప్రతిపత్ - సూర్యోదయ వ్యాపినీ గ్రాహ్యా' చాంద్ర సంవత్సరాదిని ఉదయకాలీన చైత్రశుద్ధ ప్రతిపత్తుని బట్టి నిర్ణయించాలని సామాన్య నియమము.
ఒకప్పుడు ఆ ప్రతిపత్తు అమావాస్య నాడు ఏష్యమై - ఏనాడూ ఉదయ స్పర్శిని కాకపోవచ్చు. అట్లగుచో - ఆ అమావాస్య నాడే చాంద్రసంవత్సరాది యని - " ఉదయ ద్వితయే పూర్వా - నోదయ యగులేలి_పి పూర్వైవ ", "దినద్వయే తద్వ్యాప్తా - అవ్యాప్తా వా - పూర్వైవ "ఇత్యాదిగా ప్రమాణ గ్రంథములన్నిట ఏకరీతిగ నిర్ణయింపబడి ఉన్నది.
ప్రస్తుతము 28-03-2017 మంగళవారము నాడు ఫాల్లన అమావాస్య తదుపరి చైత్రశుద్ధ పాడ్యమి ఏష్యమైనది గనుక ఈనాడే నిస్సందేహముగ హేమలంబ నామ చాంద్రమాన సంవత్సరాది యగును. ఈ పరిస్థితి తెలంగాణా, ఆంధ్రప్రదేశము వంటి పరిసరములందే గాక -- దక్షిణ భారతదేశము మొత్తము ఇంతే. అయితే ఏ రోజున అయినను, సూర్యోదయము అన్ని ప్రాంతము లందు ఒకే సమయమున జరుగదు. అది ఒక ప్రాంతమున ఎప్పుడు అగునో - అదేరోజున ఆ ప్రాంతానికి తూర్పున ఒకింత ముందుగనే జరుగును.
ఉత్తరభారతమున కూడ పూరి, భువనేశ్వర్, కటక్, పాట్నా - ఇంకా ఉత్తరాన నేపాల్లోని ఖాట్మాండు ప్రాంతాలు. వాటికి పశ్చిమ ప్రాంతాలలో కూడా పరిస్థితి ఇంతే (మార్చి 28 నాడే చాంద్ర సంవత్సరాది). వాటికి తూర్పు ప్రాంతాలలో (బెంగాలు, అస్సాం ...) మాత్రం మార్చి 29 నాడు సంవత్సరాది అగును. కానీ, ఉత్తర భారతమున చాంద్రమానము గాక బార్హస్పత్యమానమును అనుసరించవలెను గనుక అచట 29-03-2017 బుధవారము నాడు సాధారణ నామ సంవత్సరాది యగును.
తెలుగు ప్రజలందరూ శాస్త్రీయమైన, ప్రామాణికమైన కంటికి ప్రత్యక్షంగా రుజువునకు సిద్ధపడే దృక్ పంచాంగాన్నే పాటించి మార్చి 28 మంగళవారం ఉగాదిగా ఆచరించండి.
No comments:
Post a Comment