Sunday 29 May 2016

గోమాత - భారతీయ సనాతన ధర్మంలో దైవంగా భావిస్తాము.



శ్లో || నమో దేవ్యై మహా దేవ్యై సురబ్యైచ నమో నమః |
గావం బీజ స్వరూపాయ నమస్తే జగదంబికే ||

మన పూర్వీకులు గోవును పవిత్రతకు శుభానికి చిహ్నంగా భావించేవారు. ఉదయం ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంబించటం ఎంతో శుభశకునంగా భావించేవారు. సాక్షాత్ శ్రీ మహా విష్ణువు తన కృష్ణ అవతారం లో గోపాలకునిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. హైందవ ధర్మంలో అంతటి ప్రాశస్త్యం వున్నా గోమాత యొక్క పాలు మాత్రమే కాదు పేడ మరియు మూత్రము కూడా పవిత్రమైనవే.
ఆవు పాల లోని వివిధ రకాల ఔషధ గుణాల కారణంగా ఆవుపాలను అమృతం తో పోలుస్తారు. ఆవు పేడ లోని ఔషద గుణాల వలన పూర్వం ఆవు పేడతో ఇంటిని అలికేవారు తత్ ద్వారా ఇంటిలోకి పురుగులు, కీటకాలు రాకుండా ఉండేవి. పొద్దున్నే ఆవుపేడ కలిపినా నీళు కల్లాపిగా ఇంటి ముందు చల్లటం వలన ఎటువంటి పరాన్నజీవులు ఇంటిలోకి రాకుండా ఉండేవి. ఆవు మూత్రాన్ని మన పురాణాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలలో సైతం వాడుతారు. గొప్పఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన గోరోజనము ఆవు నుదిటి భాగంలో ఓ సంచి లాంటి దానిలో వుంటుంది. ఇంతటి మహత్వం కలిగిన గోవును పూజించటం మన కర్తవ్యంగా భావించిన మహర్షులు గోపూజ విధానన్ని కూడా మనకు సూచించారు.

No comments:

Post a Comment