Friday, 27 May 2016

27-May-2016 FRIDAY
మాసము: వైశాఖము
రాహుకాలము: 10:35 am - 12:13 pm
పక్షము: కృష్ణపక్షం
యమగండము: 3:28 pm - 5:06 pm
తిథి: పంచమి 7:28 am
గుళిక: 7:20 am - 8:57 am
నక్షత్రము: శ్రవణ 3:58 am+
దుర్ముహూర్తము: 8:18 am - 9:10 am, 12:39 pm - 1:31 pm
యోగము: బ్రహ్మ 10:58 pm
అభిజిత్: 11:49 am - 12:37 pm
కరణము: తైతుల 7:28 am, గరజ 7:22 pm
సూర్యోదయము: 5:42 am
అమృతకాలము: 5:23 pm - 7:00 pm
సూర్యాస్తమయము: 6:44 pm

మేషం
ఉద్యోగస్తులకు యూనియన్ బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. వ్యవహారాలు స్వయంగా చూసుకోండి. అయినవారితో సంప్రదింపులు జరుపుతారు. మీ మాటకు స్పందన లభిస్తుంది. అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు.

వృషభం
అధికారులకు పర్యటనలు, ఒత్తిడి, విశ్రాంతి లోపం. కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వకండి. దంపతుల మధ్య సఖ్యత లోపిస్తుంది. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆలయాలను సందర్శిస్తారు.

మిథునం
వృత్తిపరమైన ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమచారం అందుతుంది.

కర్కాటకం
ప్రతి విషయంలోనూ అచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వైద్య, ఇంజనీరింగ్ రంగాల వారికి పురోభివృద్ధి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
సింహం
కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి. భాగస్వామిక ఒప్పందాలకు అనుకూలం. కోర్టు వాయిదాలకు హాజరవుతారు. ఉద్యోగస్తులు సాదర వీడ్కోలు అందుకుంటారు. విందులు, వేడుకల్లో మితంగా వ్యవహరించండి. నిరుద్యోగులకు ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. పరిచయం లేని వారితో జాగ్రత్త.


కన్య
ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. పనులు అనుకున్న విధంగా సాగవు. భాగస్వామిక చర్చలు పురోగతిన సాగుతాయి. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు. ప్రకటనలు పట్ల అవగాహన ప్రధానం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి.

తుల
పొదుపు మూలక ధనం ముందుగానే తీసుకుంటారు. చిన్ననాటి పరిచయస్తులు కలుకుసుకుంటారు. రియల్టర్లు, మార్కెగ్ రంగాల వారికి కొత్త చికాకులు తలెత్తుతాయి. వ్యవసాయ, తోటల రంగాల వారికి ఆశాజనకం. వృత్తి ఉపాధి పథకాల్లో బాగుగా రాణిస్తారు. ప్రభుత్వ కార్యలయాల్లో పనులు సానుకూలమవుతాయి.

వృశ్చికం

ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. షేర్ల క్రియ విక్రయాలు లాభిస్తాయి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన మంచిది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు. వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కంప్యూటర్, టెక్నికల్ రంగాల వారికి సామాన్యం.

ధనస్సు
ముందు చూపుతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. సొంత పరిజ్ఞానంతో ముందులు వేసుకోవద్దు. యత్నాలు ఫలిస్తాయి. పదువులు బాధ్యతలు స్వీకరిస్తారు.

మకరం
ఆర్థిక లావాదేవీలు సమర్ధంగా నిర్వహిస్తారు. గత అనుభవాలు గుర్తుకొస్తాయి. రుణ యత్నాలు ఫలిస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. బంధువుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రేమికుల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.

కుంభం
ఖర్చులు అధికం. ప్రయోజనకరం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు అంతగా ఉండవు. ఎగుమతి, దిగుమతి రంగాల వారికి ప్రోత్సాహకరం. రియల్టర్లు, వ్యవసాయ రంగాల వారికి కొత్త సమస్య లెదురవుతాయి. జూదాలు, బెట్టింగ్‌ల వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది.

మీనం
అవసరాలకు ధనం సర్దుబాటు చేసుకోగలుగుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లు నష్టాలను ధీటుగా ఎదుర్కొంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. ప్రముఖుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కళ్ళు, నరాలు, దంత సమస్యలెదుర్కొంటారు. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి.

No comments:

Post a Comment