Friday 27 May 2016

లక్ష్య సాధన

 

జీవితం చాలా విలువైనది. మన ఆలోచనలు, మన భావనలు కేవలం కోరికలకే పరిమితం కాకుండా అనేక లక్ష్యాలను సాధించే దిశగా ఉండటానికి జ్యోతిషశాస్త్రం ద్వారా విలువైన అంశాలను తెలుసుకోవచ్చు. కేవలం జీవనయానంలో సంభవించే ఒడి దుడుకులు కాకుండా ఆర్ధిక స్థితి గతులు కాకుండా...  విజయ సాధన వైపు మన పయనం సాగటం కోసం జ్యోతిష్య నిర్ణయాలు అనేకం ఉన్నాయి. 
పేదరికం నుంచి రాచరికం వైపు వెళ్తుంటారు.  అనుకోకుండా వెనక్కి తిరిగి వస్తారు. అనుభవాలతో నిరాశా నిస్పృహలకు గురయ్యే వారూ ఉంటారు. జీవితంలో అనేక పాఠాలు నేర్చుకున్న మహనీయులు ఎంతో మంది ఉన్నారు. శూన్యంతో ప్రారంభించి నిరంతరం లక్ష్యాన్ని ఏర్పరుచుకుంటూ ఓ క్రమ పద్దతిలో నడుస్తూ తమ జీవితాలను పూర్తిగా తమ ఆధీనంలోనే ఉంచుకొని సంవృద్ది వైపుకి, సంతృప్తి వైపుకి విజయం వైపుకి వెళ్లి వెలది మందికి జీవనోపాధి చూపించిన విశిష్ట వ్యక్తులు కూడా ఎంతో మంది ఉన్నారు.

లక్ష్యాలను ఏర్పరుచుకోవటం అతి పెద్ద నేర్పు. ప్రతి వ్యక్తిలో ఏదో ఓ సహజమైన శక్తి దాగి ఉంటుంది. ఈ శక్తితో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు. సామర్ధ్యాన్ని అధికం చేయవచ్చు. అదే స్థాయిలోనే ఓ ప్రేరణకు రూపమిచ్చి  పయనించవచ్చు. మనం ఎక్కడ నించి వచ్చామన్నది ప్రస్తుతం అనవసరం. మన పయనమెటు... అనేది అవసరం. ఈ అంశం మన ఆలోచనల మీద, భావనల మీదా ఆధారపడి ఉంటుంది. అందుకే మన మనస్సు మన జీవితంలోని దాదాపు అనీ పార్శ్వాలని సృష్టించగలదు. ఓటమి చవి చూసి... ఇంకేమి అక్కర్లేదు అనుకునేవారు ఉంటారు.... తమ సమస్యలకు, బెంగలకు ఎవరో బాధ్యులని వాపోతున్నవారు ఉంటారు. 


మనసు లోతుల్లో ఉండే   కోరికలు నిత్యం వస్తూ వుంటాయి. కొంతమంది ఊహలలో తేలుతూ ఉంటారు. రకరకములైన భావాలను ఊహించుకుంటుంటారు. లక్ష్యానికి, కోరికకు చాలా తేడా వుంది. ఒక లక్ష్యాన్ని సాధించటానికి గాని లేదా ఒక గమ్యాన్ని చేరటానికి గాని ఆచరించే ప్రణాళిక ఏదైతే ఉంటుందో దానిని గురించి ఊహించండి లేదా దానిని కోరికగా తెచ్చుకోండి. 



నవగ్రహాలలో మనఃకారకుడైన చంద్రుడు లక్ష్య సాధనలో ప్రధాన భూమికను పోషిస్తాడు. నేనేం చేయగలను ? అసమర్దుడను,  ఉత్సాహం ఉన్నప్పటికీ కార్యాచరణ వైపు మొగ్గు చూపలేని ఆశక్తుడను అనుకునేవారు ఎంతోమంది ఉంటారు.. ఈ అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలి. 
 ప్రస్తుత కాలమాన పరిస్థితులను విశ్లేషిస్తే అచ్యున్నత మానవ శ్రేయస్సయిన మనఃశాంతి ఉంటే ఆయుష్షు పెరుగుతూ ఉంటుంది . లేనిచో తగ్గుతూ ఉంటుంది. ఒక లక్ష్యాన్ని లేక గమ్యాన్ని సాధించటానికి...  నాలుగు ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళవచ్చును. అలా ముందుకు వెళ్ళినప్పుడు వ్యక్తికి కావలసింది మనఃశాంతి.... ఈ మనఃశాంతి ఉంటేనే లక్ష్య సాధనవైపు వెళ్ళగలడు. 


 రాత్రి తల కింద (దిండు క్రింద అయినా) గవ్వ పెట్టుకుని నిద్రపోవాలి.  తర్వాతి రోజు ఉదయం దాన్ని పారే నీటిలో వేయాలి. ఇలా చేస్తూ ఉంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.' చంద్రమసే నమః' అని ద్యానించాలి. ధన నష్టం నివారణ అవుతుంది.  గోమతిచక్ర ధారణవల్ల
విఫలం కావటం వంటి దోషాలు సైతం నివారించబడతాయి.గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే అమితమైన గుర్తింపు లభిస్తుంది.

No comments:

Post a Comment