Tuesday, 31 May 2016

ఆంజనేయుడు హనుమ అయిన కధ


ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు .ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని .ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది .అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు . .ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి .తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది . నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు .అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు .తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు .దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము ,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు .నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు .దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని ,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు .వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు .
ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక ,ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు .అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు .వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు .ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది .మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు .దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు .దీర్ఘాయువు ,బలం ,పరాక్రమం ,ఆరోగ్యం తేజస్సు ,గుణం ,బుద్ధి ,విద్య ,విచక్షణ ,ప్రసన్నత ,చతురత ,వైరాగ్యం ,విష్ణు భక్తి ,దయ పర స్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు .వజ్రాయుధం చేత మరణం ఉండదని ,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగి పోవాల్సిన పరిస్థితి వస్తుందనిఅన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి ఆన్జనేయునికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు .
విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని ,రామ కార్యం నేరవేరుస్తాడని ,శివునిలా దుష్ట సంహారం చేస్తాడని ,లంక లోని రాక్షసులను వదిస్తాడని ,త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరు తో పిలువ బడ తాడని ,,దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు .ఇలా ఆంజనేయుడు హనుమ గా మారాడు .
దేవతలిచ్చిన వరాలతో హనుమ విజ్రు
మ్భించి సహజ మైన కోతి చేష్టలు చేస్తూ ,అందర్నీ బాధిస్తుందే వాడు .అతను భవిష్యత్ లో చేయ బోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన మునులు ఏమీ అనకుండా వుండే వారు .వాళ్ల గోచీలు లాగటం, మడి బట్టలు చిమ్పేయటం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి ”నీ సహజ శక్తిని మర్చిపోతావు ”అని శపించాడు తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుదవుతాడని అనుగ్రహించాడు .క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడనిపించుకున్నాడు .
విద్య నేర్చే వయసు వచ్చింది .తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది .ఆయన దగ్గరకు వెళ్లి విద్య నేర్పని అడిగాడు .తాను అనుక్షణం తిరుగుతూంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు .తాను కూడా సూర్యుని తో పాటు కదిలి పోతూ ,విద్యలు నేర్చాడుఒక కాలు ఉదయపర్వతం మీద ,రెండోది పశ్చిమ పర్వతం మీద వుంచి శ్రద్ధ తో విద్య నేర్చాడు .అయిదు వ్యాకరణాలు నేర్పాడు .మిగిలిన నాలుగు నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో మన్నాడు .చేసుకుంటాను కాని నేను బ్రహ్మ చారి గానే వుంటాను దా౦పత్య సుఖం వుండదు .దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు .ఆమె అంగీకారం తో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు .వీరి కన్యాదానం జ్యేష్ట శుద్ధ దశమి నాడు జరిగింది .సువర్చల తపోనిష్ట తో గడుపు తోంది. గంధ మాదన పర్వతం మీద .హనుమ తల్లి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పాడు .ఆమె సంతోషించి ”నాయనా !నాకు వాలి ,సుగ్రీవుడు అనే సోదరులున్నారు .నీకు వాళ్ళు మేన మామలు .వారిద్దరికీ బద్ధ వైరం .అందులో సుగ్రీవుడు ధర్మ స్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడు గా వుండు .నీ పెద్ద మేన మామ వాలితో విరోధం మాత్రం పెట్టుకోకు .నీకు శుభం జరుగుతుంది ”అనిదీవించి పంపింది .
తల్లి మాట విని హనుమ పంపానదీ తీరం లో వున్న చేరి మంత్రి అయాడు .తర్వాత రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చిసీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా , జాడను లంకలో తెలుసు కోని ,రాముని ముద్రికను ఆమెకిచ్చి ,ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇ౦ద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుడి దర్బార్ కు వెళ్లి హిత వచనాలు చెపాడు .వినక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి ,మళ్ళీసీతా దేవిని దర్శించి, సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు .రాముడిసైన్యం సముద్రుని పై వారధి నిర్మించి లంకను చేరింది. రామ రావణ యుద్ధం లో చాల మంది రాక్షసులను చంపాడు హనుమ .రావణున్ని రాముడు సంహరించాడు .సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్చను తొలగించాడు .మైరావణ సంహారం చేసి శ్రీ రామ పట్టాభిషేకం జరిపించి ,సేవా తత్పరుడై ,రామ కార్య దురంధరుడై ,త్రేతా యుగం తర్వాత గంధ మాదన పర్వతం చేరి తారక నామం జపిస్తూ ,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ ,భక్తుల మనో భీస్టాన్ని నెర వేరుస్తూ రామ భక్త హనుమాన్ గా ప్రజల హృదయం లో చిరస్థాయి గా వున్నాడు భక్త వరదుడైన శ్రీ హనుమ .

రామాయణ జయ మంత్రమ్




 జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః ||


న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః |
అర్ధయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం
సమృద్ధార్ధో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్ ||
శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం


హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧ ||
మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨ ||
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౩ ||
రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౪ ||
శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౫ ||
వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౬ ||
సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౭ ||
రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౮ ||
గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౯ ||
పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౦ ||
జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౧ ||
స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౨ ||
రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౩ ||
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౪ ||
భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౫ ||
వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౬ ||
వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౭ ||
అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౮ ||
లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౧౯ ||
రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౦ ||
ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౧ ||
సీతాఽశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || ౨౨ ||
ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ || ౨౩ ||
హనుమత్పంచరత్నం


వీతాఖిలవిషయేచ్ఛం జాతానందాశ్రుపులకమత్యచ్ఛమ్
సీతాపతి దూతాద్యం వాతాత్మజమద్య భావయే హృద్యమ్ || ౧ ||
తరుణారుణముఖకమలం కరుణారసపూరపూరితాపాంగమ్
సంజీవనమాశాసే మంజులమహిమానమంజనాభాగ్యమ్ || ౨ ||
శంబరవైరిశరాతిగమంబుజదల విపులలోచనోదారమ్
కంబుగలమనిలదిష్టం బింబజ్వలితోష్ఠమేకమవలంబే || ౩ ||
దూరీకృతసీతార్తిః ప్రకటీకృతరామవైభవస్ఫూర్తిః
దారితదశముఖకీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః || ౪ ||
వానరనికరాధ్యక్షం దానవకులకుముదరవికరసదృశమ్
దీనజనావనదీక్షం పవనతపః పాకపుంజమద్రాక్షమ్ || ౫ ||
ఏతత్పవనసుతస్య స్తోత్రం యః పఠతి పంచరత్నాఖ్యమ్
చిరమిహ నిఖిలాన్భోగాన్భుంక్త్వా శ్రీరామభక్తిభాగ్భవతి || ౬ ||

Monday, 30 May 2016

ఏకాదశముఖహనుమత్కవచమ్



శ్రీగణేశాయ నమః |
లోపాముద్రా ఉవాచ |
కుమ్భోద్భవ దయాసిన్ధో శ్రుతం హనుమతః పరమ్ |
యన్త్రమన్త్రాదికం సర్వం త్వన్ముఖోదీరితం మయా || ౧||

దయాం కురు మయి ప్రాణనాథ వేదితుముత్సహే |
కవచం వాయుపుత్రస్య ఏకాదశముఖాత్మనః || ౨||
ఇత్యేవం వచనం శ్రుత్వా ప్రియాయాః ప్రశ్రయాన్వితమ్ |
వక్తుం ప్రచక్రమే తత్ర లోపాముద్రాం ప్రతి ప్రభుః || ౩||
అగస్త్య ఉవాచ |
నమస్కృత్వా రామదూతాం హనుమన్తం మహామతిమ్ |
బ్రహ్మప్రోక్తం తు కవచం శ్రృణు సున్దరి సాదరమ్ || ౪||
సనన్దనాయ సుమహచ్చతురాననభాషితమ్ |
కవచం కామదం దివ్యం రక్షఃకులనిబర్హణమ్ || ౫||
సర్వసమ్పత్ప్రదం పుణ్యం మర్త్యానాం మధురస్వరే |
ఓం అస్య శ్రీకవచస్యైకాదశవక్త్రస్య ధీమతః || ౬||
హనుమత్స్తుతిమన్త్రస్య సనన్దన ఋషిః స్మృతః |
ప్రసన్నాత్మా హనూమాంశ్చ దేవతా పరికీర్తితా || ౭||
ఛన్దోఽనుష్టుప్ సమాఖ్యాతం బీజం వాయుసుతస్తథా |
ముఖ్యః ప్రాణః శక్తిరితి వినియోగః ప్రకీర్తితః || ౮||
సర్వకామార్థసిద్ధయర్థం జప ఏవముదీరయేత్ |
ఓం స్ఫ్రేంబీజం శక్తిధృక్ పాతు శిరో మే పవనాత్మజః || ౯||
క్రౌంబీజాత్మా నయనయోః పాతు మాం వానరేశ్వరః |
క్షంబీజరూపః కర్ణౌ మే సీతాశోకవినాశనః || ౧౦||
గ్లౌంబీజవాచ్యో నాసాం మే లక్ష్మణప్రాణదాయకః |
వంబీజార్థశ్చ కణ్ఠం మే పాతు చాక్షయకారకః || ౧౧||
ఐంబీజవాచ్యో హృదయం పాతు మే కపినాయకః |
వంబీజకీర్తితః పాతు బాహూ మే చాఞ్జనీసుతః || ౧౨||
హ్రాంబీజో రాక్షసేన్ద్రస్య దర్పహా పాతు చోదరమ్ |
హ్రసౌంబీజమయో మధ్యం పాతు లఙ్కావిదాహకః || ౧౩||
హ్రీంబీజధరః పాతు గుహ్యం దేవేన్ద్రవన్దితః |
రంబీజాత్మా సదా పాతు చోరూ వార్ధిలంఘనః || ౧౪||
సుగ్రీవసచివః పాతు జానునీ మే మనోజవః |
పాదౌ పాదతలే పాతు ద్రోణాచలధరో హరిః || ౧౫||
ఆపాదమస్తకం పాతు రామదూతో మహాబలః |
పూర్వే వానరవక్త్రో మామాగ్నేయ్యాం క్షత్రియాన్తకృత్ || ౧౬||
దక్షిణే నారసింహస్తు నైఋర్త్యాం గణనాయకః |
వారుణ్యాం దిశి మామవ్యాత్ఖగవక్త్రో హరీశ్వరః || ౧౭||
వాయవ్యాం భైరవముఖః కౌబేర్యాం పాతు మాం సదా |
క్రోడాస్యః పాతు మాం నిత్యమైశాన్యం రుద్రరూపధృక్ || ౧౮||
ఊర్ధ్వం హయాననః పాతు గుహ్యాధః సుముఖస్తథా |
రామాస్యః పాతు సర్వత్ర సౌమ్యరూపో మహాభుజః || ౧౯||
ఇత్యేవం రామదూతస్య కవచం యః పఠేత్సదా |
ఏకాదశముఖస్యైతద్గోప్యం వై కీర్తితం మయా || ౨౦||
రక్షోఘ్నం కామదం సౌమ్యం సర్వసమ్పద్విధాయకమ్ |
పుత్రదం ధనదం చోగ్రశత్రుసంఘవిమర్దనమ్ || ౨౧||
స్వర్గాపవర్గదం దివ్యం చిన్తితార్థప్రదం శుభమ్ |
ఏతత్కవచమజ్ఞాత్వా మన్త్రసిద్ధిర్న జాయతే || ౨౨||
చత్వారింశత్సహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మకో నరః |
ఏకవారం పఠేన్నిత్యం కవచం సిద్ధిదం పుమాన్ || ౨౩||
ద్వివారం వా త్రివారం వా పఠన్నాయుష్యమాప్నుయాత్ |
క్రమాదేకాదశాదేవమావర్తనజపాత్సుధీః || ౨౪||
వర్షాన్తే దర్శనం సాక్షాల్లభతే నాత్ర సంశయః |
యం యం చిన్తయతే చార్థం తం తం ప్రాప్నోతి పూరుషః || ౨౫||
బ్రహ్మోదీరితమేతద్ధి తవాగ్రే కథితం మహత్ || ౨౬||
ఇత్యేవముక్త్వా వచనం మహర్షిస్తూష్ణీం బభూవేన్దుముఖీం నిరీక్ష్య |
సంహృష్టచిత్తాపి తదా తదీయపాదా ననామాతిముదా స్వభర్తుః || ౨౭||
|| ఇత్యగస్త్యసారసంహితాయామేకాదశముఖహనుమత్కవచం సమ్పూర్ణమ్ ||


Hanuman dwadasa nama Stotram or 12 names of Hanuman to get rid of fear


Many practices are followed by religious minded or even common people to get rid of or get protection against various problems faced in life.

Some people wear yantras or lockets offered by holy people or sadhus and priests. Some recite mantras prescribed for these purposes as mentioned in our vedas and puranas.

One such method of chanting mantras or hymns is that of the reciting of 12 names of Lord Hanuman which are uttered along with another concluding sloka to proclaim 'Amen' to the wish that it will yield fruitful and divine results. This dwadasa nama stotram is composed in a lyrical form as given below.

As usual, I am giving hanuman dwadasa nama stotram in all three languages of Telugu, Hindi and English with meanings.

Hanuman dwadasa nama stotram in Telugu

హనుమాన్, అంజనాసూనుహు, వాయుపుత్రో, మహాబలః: 
రామేష్ఠ, ఫల్గుణ సఖః, పింగాక్షో, అమిత విక్రమః 
ఉదధి క్రమణ శ్చ్చైవ, సీతా శోక వినాశకః 
లక్ష్మణ ప్రాణ దాతాచ, దశగ్రీవస్య దర్పహా ॥ 
ద్వాదశైతాని నామాని కపింద్రస్య మహాత్మనః 
స్వాపకాలే పటేర్నిత్యం యాత్ర కాలే విశేషతః  
తస్య మృత్యుర్భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ( 3 సార్లు )
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగతా 
అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్ ॥  
                            శ్రీ రామ జయరామ జయజయ రామ ॥ 

Hanuman dwadasa nama stotram in Hindi


हनुमान, अन्जनासूनुहु, वायुपुत्रो, महाबलः 
रामेष्ट, फल्गुण सखः, पिन्गाक्षो, अमित विक्रमः 
उदधि क्रमणश्चैव, सीता शोक विनाशकः 
लक्ष्मण प्राण दाताच, दशग्रीवस्य दर्पहा ॥ 
द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मनः 
स्वापकाले पठे नित्यम् यात्र काले विशेषतः 
तस्य मृत्त्रुर्भयम् नास्ति सर्वत्र विजयी भवेत् ( तीन बार )
बुद्धिर्बलम् यशोधैर्यम् निर्भयत्वम् अरोगता 
अजाड्यम् वाक्पटुत्वम्च हनुमत स्मरणात् भवेत् ॥ 
                                  श्रीराम जयराम जयजय राम ॥   

Hanuman dwadasa nama stotram in English Text

Hanumaan, anjanaasoonuhu, vaayuputro, mahaabalaha,
Raameshta, phalguna sakhaha, pingaaksho, amita vikramaha,
udadhi kramanaschaiva, Sita shoka vinaashakaha,
laxmana praana daataacha, dashagreevasya darpahaa ||

dwaadashaitaani naamaani kapeendrasya mahaatmanaha
swaapakaale pathernityam yaatra kaale visheshataha
tasya mrityur bhayam naasti sarvatra vijayee bhaveth
budhhirbalam yashodhairyam nirbhayatvam arogataa
azaadyam vaakpatutvamcha Hanumad smaranaat bhaveth ||
                                              Sri Rama Jaya Rama Jaya Jaya Rama ||

Meanings in English:- 
Hanuman = O Hanumaan, anjanaasunuhu = son of Anjana(mother), vayuputro = O son of Vayu(wind),
mahaabalaha = possessor of great strength, Rameshta = liked by Rama, phalguna = Arjuna, great warrior of Mahabharata epic, sakha = friend, pingaaksho = brown eyed (derived from ceramics),
amita = boundless, vikramaha =  brave warrior, udadhi = sea, kramanaschaiva = after crossing, Sita = consort of Rama, shoka = grief, vinaashakaha = one who destroyed, laxmana = brother of Rama, praana = life, daatacha = bestower, dashagreevasya = ten headed Ravana's , darpahaa = pride remover.

dwaadashaitani = all these twelve, naamaani = names, kapeendrasya = of Hanuman, mahatma = great soul, swaapakaale = morning time, pathernityam = recite daily, yatra kaale = during journey, visheshataya = especially, tasya = to him, mrityur = death and, bhayam = fear, naasti = will not be there, sarvatra = everywhere, vijayee = victory, bhaveth = take place or happen, budhirbalam = wisdom and strength, yashodhairyam = fame and bravery, nirbhayatvam = fearlessness, arogataa = no disease, azaadyam = no infection, vaakpatutvam = command over speech, Hanumat smaranaath = remembering Hanuman, bhaveth = will happen.

So, entire meaning of above hymns will be like this:-
O Hanuman, son of Anjana and Vayu! You possess great strength.
Liked by Rama, you are friend of Arjuna, the great warrior of Mahabhaarata. You are brown eyed and a boundless brave personality.
Crossing sea, you removed Sita's grief.
You gave life to Laxmana. Driven out pride of ten-headed Ravana.

All these are twelve names of the great souled monkey king Hanuman.
Whoever recite them daily morning and especially during journeys,
There will be no death or fear to him and there will be victory always.
Wisdom, strength, fame, courage, fearlessness, no diseases and
infections, command over language - he will obtain all these by reciting Hanuman names.
 ఆంజనేయ మంగళాష్టకం


వైశాఖేమాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్రాప్రభూతాయ మంగళం శ్రీహనూమతే
కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ,
మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీహనూమతే
సువర్చలాకళత్రాయ చతుర్భుజధరాయ చ,
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే
దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ,
తప్త కాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే
భక్తరక్షణ శీలాయ జానకీ శోక హారిణే,
సృష్టికారణ భూతాయ మంగళం శ్రీహనూమతే
రంభావనవిహారాయ గంధమాదవ వాసినే,
సర్వలోకైక నాథాయ మంగళం శ్రీహనూమతే
పంచాననాయ భీమాయ కాలనేమి హరాయ చ,
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే
కేసరీ పుత్ర!దివ్యాయ సీతాన్వేష పరాయ చ,
వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీహనూమతే
ఇతి శ్రీ ఆంజనేయ మంగళాష్టకం
శ్రీ ఆంజనేయ జయ ఘోషః


నమోపాస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మ జాయై,
నమోపాస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో నమోపాస్తు చంద్రార్క మరుద్గణేభ్యః
జయత్యతి బలోరామో లక్ష్మణశ్చమహాబలః, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః.
దాసోపాహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః, హనుమాన్ శత్రు సైన్యానాం నిహన్తా మారుతాత్మజః.
న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిశ్చప్రహరతి పాదపైశ్చ సహస్రశః.
అర్థయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీమ్, సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్.
అర్థసిద్ధిం తు వైద్యేహ్యః పశ్యామ్యహముపస్థితామ్, రాక్షసేంద్రవినాశం చ విజయం రాఘవ స్య చ.

Sunday, 29 May 2016

                              ద్వాదశ రాశులు -- ద్వాదశ జ్యోతిర్లింగాలు



01. మేషరాశి: "రామేశ్వరం" :
శ్లోకం:- "సుతామ్ర పర్ణీ జలరాశి యోగే, నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై
శ్రీరామ చంద్రేన సమర్పితం తం, రామేశ్వరాఖ్యం నియతం నమామి."
ఈ రాశి కుజునికి స్వగృహం, చర రాశి వారికి పదకండవ ఇంటి అధిపతి అయిన శని బాధకుడు. గ్రహ పీడా నివారణార్థం రామేశ్వర తీర్థ యాత్ర,, పైన చెప్పిన శ్లోకం రోజు చదువుకొనుట చేయవలెను, శ్రీరామ చంద్రుడు శని బాధ నివారణార్ధం ఈ లింగము స్తాపించేనని చెప్పబడినది. కుజునకు కందుల దానము, యెర్ర వస్త్ర దానములుకుడా చేసిన మంచి ఫలితములు వచ్చును.
02. వృషభ రాశి: "సోమనాధ జ్యోతిర్లింగము"
శ్లోకం:- "సౌ రాష్ట్ర దేశే విదేశే తిరమ్యే జ్యోతిర్మయం చంద్ద్ర కళావ సంతం,భక్తి ప్రాధానాయ క్రుపావతీర్ణం తం సోమనాధం శరణం ప్రపద్యే."
ఈ రాశి శుక్రునికి స్వ గృహం, చంద్రునికి ఉచ్చ రాశి. సోమనాధ జ్యోతిర్లింగం శ్రీ క్రిష్ణుడుచే స్తాపించ బడింది. ఈ రాశికి శని నవామాదిపత్య బాధకుడు అయినందున శని దోషాలకు సోమనాధ దేవాలయ దర్శనం, పై శ్లోక ధ్యానము చేసిన సుభ ప్రదము. జన్మ నక్షత్రమందు రుద్రాభిషేకం చేయించుట వలన మంచి ఫలితములు పొందగలరు. బొబ్బర్ల దానము, బియ్యము దానము చేసిన మంచిది.
03. మిధున రాశి: "నాగేశ్వర జ్యోతిర్లింగం":
శ్లోకం:-"యామ్యే సదంగే నగరే తిరమ్యే విభ్శితాంగం వివిధైశ్చ భొగై ,
సద్భక్తి ముక్తి ప్రదమేకం, శ్రీ నగనాధం శరణం ప్రపద్యే."
ఈరాశి బుధునికి స్వగృహము. దోషాలకు నాగేశ్వర పుణ్య క్షేత్ర దర్శన, ప్రతి రోజు పై శ్లోకమును చదువుట, ఈ రాశి శని సంచరించు కాలమునందు జన్మ నక్షత్ర రోజున కైలాస యంత్ర ప్రస్తార మహా లింగార్చన జరిపించిన విశేషమైన ఫలితములు కలుగును.
04. కర్కాటకం: "ఓం కార జ్యోతిర్లింగం":
శ్లోకం:-"కావేరికా నర్మదాయో పవిత్రే , సమాగమే సజ్జన తారణాయ,
సదైవమాన్దాత్రు పురే వసంతం, ఓం కారమీశం శివమే మీడే"
ఈ రాశి చంద్రునకు స్వగృహం , . ఓం కార జ్యోతిర్లింగ దర్శనం, రోజు పై శ్లోకం చదువుట , జన్మ నక్షత్రం రోజున ఓం కార బీజాక్షరం ఉచారిస్తూ ఉండటం మంచి నివారణ ఉపాయములు.
05. సింహరాశి : "శ్రీ ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం"
శ్లోకం:-"ఇలాపురే రమ్య విశాల కేస్మిన్ సముల్ల సంతం చ జగద్వ రేణ్యం,
వందే మహా దారాతర స్వభావం, ఘ్రుశ్నేస్వరాఖ్యం శరణం ప్రపద్యే."
సింహరాశి సూర్యునకు స్వగృహం. ఘ్రుష్నేస్వర జ్యోతిర్లింగ దర్శనం, పై శ్లోకమును రోజు చదువుట, జన్మ నక్షత్రం నాడు ఏక దశ రుద్రాభిషేకం ద్వారా దోషాలనుండి విముక్తి పొందవచ్చును.
06. కన్యా రాశి: "శ్రీ శైల జ్యోతిర్లింగం".
శ్లోకం:-"శ్రీ శైల శ్రుంగే విభుధాతి సంగే తులాద్రి తుంగే పి ముదావసంతం,
తమర్జునం మల్లిక పూర్వ మేకం, నమామి సంసార సముద్ర సేతుం."
ఈ రాశికి అధిపతి బుధుడు. బాధల నుండి ఉపశమనం పొందుటకు శ్రీ శైల మల్లిఖార్జున దర్శనం, భ్రమరాంబ కి కుంకుమ అర్చన, జన్మ నక్షత్రం రోజున చండి హోమం చేసిన ఉపశమనం పొందగలరు. రోజు పైన చెప్పిన శ్లోకం చదువుట, జన్మ నక్షత్రం రోజున ఆవుకి ఆకు కూరలు, పచ్చ పెసలు తినిపించుట మంచిది.
07. తులారాశి: "మహాకాళే శ్వరం":
శ్లోకం:- "అవన్తికాయాం విహితావరం, ముక్తి ప్రధానాయ చ సజ్జనానాం
అకాల మృత్యో : పరిరక్ష ణా ర్థం వందే మహాకాల మహాసురేశం "
ఈ రాశికి శుక్రుడు అధిపతి, మహాకాళేశ్వర దర్శనము ద్వారా, , శుక్ర వారము సూర్యోదయ సమయములో బొబ్బర్లు దానం చేయుట ద్వారా దోషములు, బాధలనుండి విముక్తి పొందవచ్చును.
08. వృశ్చిక రాశి: "వైద్యనాదేశ్వరుడు:
శ్లోకం:-"పూర్వొత్తరె ప్రజ్వాలికానిధానే , సాదావసంతం గిరిజాసమేతం ,
నురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్య నాదం తమహం నమామి."
ఈ రాశికి కుజుడు అధిపతి, వృశ్చికం వైద్య వృత్తికి, శస్త్ర చికిత్సలకి కారణ భూతం. బాధలకు వైద్య నాదేశ్వరుని దర్శించి , పూజించుట ద్వారా , మంగళ వారము జన్మ నక్షత్రము రోజున కందులు, యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది. ఋతు క్రమ దోషములున్న స్త్రీలు పెద్ద ముత్తైదువులకు యెర్రని వస్త్రములు దానము చేయుట మంచిది.
09. ధనురాశి : "విశ్వేశ్వర లింగం":
శ్లోకం:- "సానంద వనే వసంతం, ఆనందకందం హత పాప బృందం
వారణాసీనాధ మనాద నాదం, శ్రీ విశ్వ నాదం శరణం ప్రపద్యే."
ఈ రాశి వారికి గురుడు అధిపతి, స్వస్తానం. వేదాంత ధోరణి విపరీత ఆలోచనలు, సైంటిఫిక్ ఆలోచనలు, వీరి లక్షణం. అద్దిశంకరుల వారికి మోక్షం ప్రసాదించిన కాశీ క్షేత్రం, , అన్నపూర్ణ వద్ద శివుడు భిక్ష అడుగుట, అర్ధరాత్రి గంగకి ఆవలి ఒడ్డున "నారాయణ మంత్రం"తొ శివుడు జీవులకి మోక్షము ప్రసాదిస్తాడని పురాణాలలో చెప్పబడింది. పై శ్లోక పారాయణ, పూజ చేయుట, కాశి క్షేత్ర దర్శనము , గురువారము రోజున, జన్మ నక్షత్రము రోజున శనగల దానము ఇచ్చుట ద్వారా శని, గురు గ్రహ దోషాల నుండి విముక్తి పొందవచ్చును.
10. మకరము: "భీమ శంకరం" :
శ్లోకం:- "యం డాకినీ శాకినికాసమాజై : ,నిషేవ్యమాణం పిశితా శనైశ్చ ,
సదైవ భీమాది పద ప్రసిధం, తం శంకరం భూత హితం నమామి."
ఈ రాశి అధిపతి శని. గురునికి నీచ, కుజునికి ఉచ్చ,గురుడు అంటే జీవుడు , అహంకార పూరితమైన గజరాజు మొసలిచే పీదిన్చాబడి గజేంద్ర మోక్షము అనే ఆర్తి పూరితమైన ఘట్టం పురాణాలలో చెప్పబడింది. దోషాలకి భీమ శంకరం దర్శనం,,పూజ చేయుట, పై శ్లోక పారాయణము నిత్య పారాయణము, శని వారము నల్ల నువ్వుల దానము, నల్లని వస్త్రాలు దానము ఇచ్చుట, అవిటివారికి, ముసలి వారికి వస్త్ర దానము చేయుట మంచిది
11. కుంభం:"కేదారేశ్వరుడు":
శ్లోకం:-"మహాద్రి పార్శ్వే చ రమంతం, సంపూజ్య మానం సతతం మునీన్ద్రై :
సురాసురై ర్యక్ష మహోర గాద్యై : కేదారమీశం శివమేక మీడే ".
ఈ రాశికి శని అధిపతి, దోషాలకి కేదాద్రేశ్వర దర్శనము, పూజించుట, నిత్యమూ పై శ్లోక పారాయణము, శని వారము నువ్వుల దానము, అభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభి షేకం చేసిన మంచిది.
12. మీనా రాశి: "త్రయంబకేశ్వరుడు" :
శ్లోకం:-"సహ్యాద్రి శీర్షే విమలే వసంతం, గోదావరీ తీర పవిత్ర దేశే ,
యద్దర్శనాథ్ పాతక మాశు నాశం, , ప్రయాతి తం త్రయంబక మీశ మీడే ".
ఈ రాశి అధిపతి గురుడు. త్రయంబకేశ్వరుడు ఎప్పుడు నీటి మధ్యలో ఉంటాడు. అధిక ఫలితాలని ఇస్తాడని పురాణ ప్రసిద్ది. దోషాలకు త్రయంబకేశ్వర దర్శనము, చిత్రపటము పూజ మందిరము నందు ఉంచి నిత్యమూ పై శ్లోకము పారాయణము చేయుట మంచిది.
                                             గాయత్రి మంత్ర విశిష్టత



గాయత్రీం వరదాం దేవీ - సావిత్రీం వేదమాతరం
ఆదిత్య పధగాం దేవీం-స్మరేద్ర్బహ్మ స్వరూపిణీం
మంత్రాధి దేవత, శ్రీ గాయత్రీ మాత మంత్రం ఉపదేశ ప్రధానమైనది. వేదాధ్యయనం చేయలేకపోయినా, యజ్ఞయాగాదులు నిర్వహించలేకపోయినా, పాపప్రక్షాళనం చేసి, శాంతిని, ప్రశాంతిని ప్రసాదించేది గాయత్రీ మంత్రానుష్ఠానం. ప్రతిరోజూ చేయవలసిన షట్కర్మలలో గాయత్రీ మంత్రానుష్ఠానం ప్రధానమైనది. సూతసంహితలో వ్యాసభగవానులు శ్రీ గాయత్రీ మంత్ర మహిమ, శక్తి సమగ్రంగా వివరించారు.గాయత్రీ మంత్రంలోని మూడు పాదాలలో, మొదటి పాదం "బీజం".రెండవది "శక్తి". మూడవది "కీలకం".
మనిషికి ఏ దేవతారూపం పైనైనా ఇష్టం కలుగవచ్చు. ఏ మంత్రానుష్ఠానం పైనైనా ఆసక్తి కలుగవచ్చు. కానీ మంత్రాది దేవత, శ్రీ గాయత్రీ స్వరూపంపై రక్తి, మహామంత్రంపై అనురక్తి కలగటం జన్మాంతర సుకృతం. ఆత్మతత్వ జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదించే గాయత్రిని శ్రుతులు "వరదా" అని "ఛన్దసాం మాత" అని ప్రస్తుతించాయి.విష్ణ్వాది దేవతలు, ఈ తల్లికి అంగప్రత్యంగాలు.
దుర్లభమైన మానవజన్మ, అందునా కొద్దోగొప్పో ఆధ్యాత్మిక చింతన కలిగిన జన్మ లభించినందుకు ఎంతో సంతోషించాలి. ఉత్తమ జన్మని అనుగ్రహించిన పరమాత్మకు కృతజ్ఞులమై ఉండాలి. మన జీవనక్రమం క్రమబద్దంగా ఉండాలంటే, నిత్యానుష్ఠాన కార్యక్రమాన్ని, క్రమం తప్పక ఆచరించాలి. బ్రహ్మానందానుభూతికి దేహశుద్ధి, మానసిక శుద్ఢి, చిత్తశుద్ది, ఆత్మశుద్ధి ముఖ్యం. ఇవి సాధించి, జీవనప్రయాణంలో సాధ్యమైనంత ఎక్కువ సమయం దైవచింతనకి, దైవప్రార్థనకి దైవకార్యాలకి సదుపయోగం చేయటం మన ధర్మం.
అభీష్ట వరప్రదాత్రి, సర్వాక్షర స్వరూపిణి, సంధ్యానుష్ఠాన జ్ఞానరూపిణి, గాయత్రీ మాత సర్వులకు, సర్వావస్థలందు, సర్వాకాలాదులందు శరణ్యం. అంతరంగ హృదయాలయంలో,ఉపవిష్ణురాలైన తల్లిని, అంతర్ దృష్టితో చూసి,అర్చించి, ఆరాధించి, ధ్యానించి అనుగ్రహం అపేక్షించాలి. వర్తమానకాలంలోని కృత్రిమ జీవనం నుంచి కొంతవరకైనా మనిషి, మనసు మరల్చి ఋషి జీవనం వైపు పయనించాలి. అప్పుడే మనసు నిర్మలమై, బుద్ధి వికసించి, పారమార్థికత్వం యొక్క నిజమైన విలువలు తెలుసుకోగలడు. పారమార్ధిక జీవితం తేలికగా లభించదు. సంపద కూడబెట్టడానికి మనిషి ఎంతో శ్రమపడతాడు. అట్లాగే ఆధ్యాత్మిక సంపద కూర్చుకోవటానికి, కొన్ని జీవితకాలాల శ్రమ పడాల్సి వస్తుంది. ఆ శ్రమ, ధర్మమార్గాన కర్మాచరణ వల్ల, ఈశ్వరోపాసన వల్ల వస్తుంది.చిఛ్చక్తి స్వరూపిణి, వేదమాత, గాయత్రీ ఉపాసన వల్ల ఫలసిద్ది త్వరగా లభిస్తుంది. ఎందుకంటే అందరు దేవతల శక్తులూ వేదమాతలో అంతర్గతంగా నిబిడీకృతమై ఉన్నాయి.
మనిషిలోని సనాతన చైతన్యస్వరూపమే ఆత్మ. అదే బ్రహ్మము. బ్రహ్మస్థానాన్ని తెలియపరచే మార్గం జ్ఞాన మార్గం. అవిద్యలను సగుణ విద్యలంటారు. గాయత్రి సగుణ, నిర్గుణ విద్యల సమన్వయ స్వరూపమై కర్మ, ఉపాసన, జ్ఞాన, తపో, యాగాల నిధియై, ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవటానికి సోపానమైనది. మనిషిని క్రియాశీలునిగా, వివేకవంతునిగా, సత్పురుషునిగా, తపశ్శీలునిగా, నిస్వార్థపరునిగా, సేవా పరాయణునిగా చేయగల శక్తి గాయత్రిది. అంతేకాదు గాయత్రి ఉపాసన వల్ల నిజంగా మనిషిలో దయ, కార్యదీక్ష, త్యాగం, సమదృష్టి , దానగుణం, ఇంకా ఎన్నో సద్గుణాలు కనపడతాయి.

మనసు రెండు విధాలుగా ఉంటుంది. ప్రత్యేక చేతన, పరంగ చేతన, ప్రత్యేక చేతన యందు మనస్సు జాగృతమార్గంలోకి కానీ , దాని వైపునకు కానీ మరల్చబడుతుంది. పరంగ చేతనయందు బయటకుకానీ, వేరుమార్గంలో కానీ పయనిస్తుంది. అంతర్గతమైన మనస్సు జాగృతమై, ఆత్మ సాక్షాత్కారమై, నిత్య జ్ఞానానంద స్వరూపుడైన పరమాత్మని తెలుసుకోగలం. ప్రత్యేక చేతనా మార్గంవైపు మనసును మళ్లించు శక్తి కలది గాయత్రి.
మంత్రాలు మూడు విధాలని చెబుతారు. పది అక్షరాల వరకు కలవి "బీజమంత్రాలు". ఇవి బాల్యంలో సిద్దిస్తాయి. ఇరవై అక్షరాలు కలవి "తథా మంత్రాలు" ఇవి యవ్వనంలో సిద్దిస్తాయి. ఇరవై దాటి అక్షరాలు కలవి "మాలా మంత్రాలు".ఇవి వార్దాక్యంలో సిద్దిస్తాయి. ఇంకా మంత్రాలు మూడు విధాలు.వైదికాలు, తాంత్రికాలు, అపభ్రంశముల్. "వైదికాలు" వేదోక్తాలు, జ్ఞానప్రధానాలు."తాంత్రికాలు" కామ్యప్రధానాలు. "అపభ్రంశములు" సంస్కృతం నుండి దేశభాషలలోకి వాడుకగా వచ్చినవి. మంత్రం "నమః"అంతం కలది నపుంసక మంత్రం అని, "స్వాహా" అంతం కలది స్త్రీ మంత్రమని, "హాంఫట్" చివర కలిగినది పుంసక మంత్రం అని ప్రసిద్ధి. అంతేకాదు ఏకాక్షర మంత్రాలను పిండములని, మూడు అక్షరాలు కలిగినవి కర్తరులని, నాలుగు నుండి తొమ్మిది అక్షరాల మంత్రాలు బీజములని, పది నుండి ఇరవై అక్షరాలుకల మంత్రాలను మాలా మంత్రాలనీ అంటారు. ఇంకా ఆగమములు, నిగమములు అని కూడా భేదం ఉంది. ఆగమములంటే ’ఆ’ శివముఖం నుండి వచ్చి ’గ’ పార్వతి ముఖమున ప్రవేశించునవి. నిగమము అంటే ’ని’ నిశ్చిత రూపములై ’గమ’ బ్రహ్మము నుండి తెలియబడిన వైదిక మంత్రాలు. ఈ నిబంధనలకన్నింటికీ అతీతము గాయత్రీ మంత్రం. ఏ స్థితిలోనైనా, ఏ అవస్థలోనైనా, నిశ్చల మనస్సుతో ఉపాసిస్తే ఫలసిద్ధి తథ్యం. మంత్రాలలో శైవ మంత్రాలు కోటి, సౌరమంత్రాలు రెండు కోట్లు, గణేశ మంత్రాలు 50 లక్షలు, వైష్ణవ మంత్రాలు 50 లక్షలు, శక్తి మంత్రాలు 3 కోట్లు. మంత్రాలకు ఆదిమంత్రమైన గాయత్రీ మహామంత్రానికి, ఈ సప్తకోటి మహామంత్రాలు ఆభరణాలు. పరమాత్మ నామమే అత్యద్భుత శక్తి కలది. ఆ నామానికి బీజాక్షరాలు చేర్చి జపిస్తే కలిగే స్పందన పరమాద్భుతం. అభ్యాసంతో జపానికి మనసే మాల అయి దివ్యానుభూతి పొందవచ్చు.
"పటలం పద్దతి ర్వర్శ తథా నామ సహస్రకం
స్తోత్రాణి చేతి పంచాంగం దేవతారాధనే స్మృతం"
ఇది మంత్రారాధన పంచకాన్ని తెలియజెప్పే శ్లోకం.
"కవచం దేవతాగాత్రం పటలం దేవతా శిరః
పద్దతిర్దేవసస్తౌతు ముఖ సాహస్తకం స్మృతం"
పటలం, పద్దతి, కవచం, సహస్రనామం, స్తోత్రాలు దేవతారాధనకు ముఖ్యమైనవి. వీనిలో కవచం దేవతకు శరీరం; పటలం-శిరస్సు;పద్దతి-హస్తాలు;సహస్రనామం-ముఖం;వీటిని క్రమం తప్పక అనుష్టిస్తే మంత్రసిద్ది తథ్యం.
సూర్యారాధన ఫలితంగా ఆరోగ్యం, క్షేమం, మోక్షం, సత్సంతానం సిద్దిస్తాయి. మహాదేవుని ఆరాధిస్తే యోగం, జ్ఞానం, కీర్తి, లభిస్తాయి. విష్ణువు ధర్మార్థ కామ మోక్ష ప్రదాత. సర్వకామ్యాల్ని, ముక్తిని అనుగ్రహించేది దుర్గ. గణేశుని ఆరాధన వల్ల కర్మసిద్ది, విఘ్న నివారణ కలుగుతాయి. గాయత్రీ మంత్ర జపం, ఈ పంచాయతన దేవతలు అనుగ్రహించు సర్వఫలములు ప్రసాదించును.
సాధారణంగా మనిషి నిముషానికి 15 సార్లు శ్వాసిస్తాడు. ఉచ్చ్వాస, నిశ్వాసలు కలిపి 1 శ్వాస. అయితే నిముషానికి మూడుసార్లు శ్వాసించగలిగితే మనిషి చిరంజీవి అవుతాడు. ఇది సాధన వల్ల మాత్రమే సాధ్యం. ఆ యోగమే ప్రాణాయామం. సాధకుడు గాయత్రీ మంత్ర ధ్యానంతో, కుండలినీ శక్తిని సుషుమ్నను దాటించి, శరీరమందలి మూలాధార, స్వాధిష్టాన మణిపూరక, అనాహత, విశుద్ఢ, ఆజ్ఞాచక్రాలను అధిగమించి, సహస్రారమందలి పరమాత్మను చేరటమే ముక్తి. ప్రాణాయామం సర్వశ్రేష్ఠమైన యోగసాధన. ఇది రెండు విధాలు. వైదిక ప్రాణాయామం. యౌగిక ప్రాణాయామం. గాయత్రీ మంత్రానుష్ఠానం వైదిక ప్రాణాయామం.
"సవ్యాహృతిం, సప్రణవం, గాయత్రీం శిరసాసహ
త్రిః పఠేదాయత ప్రాణః ప్రాణాయామ స్స ఉచ్చతే"
ప్రాణములను నిరోధించి, వ్యాహృతితో, ప్రణవంతో, శిరోమంత్ర సహితంగా మూడుసార్లు చేసే గాయత్రీ మంత్రోపాసనే ప్రాణాయామం.
గాయత్రీ యోగంలో జపయోగం, మంత్రయోగం, మాహాయోగం కలిసి ఉంటాయి. ప్రాణాయామ ప్రక్రియ ద్వారా, గాయత్రీ మంత్రోపాసనతో రాజయోగానుభూతి లభించి, అణిమాధి సిద్ధులు లభిస్తాయి. అవి
అణిమ - శరీరం అణుత్వం పొందటం
మహిమ - శరీరం యోజనం వరకు వ్యాపించటం
లఘిమ - శరీరం తేలికగా అగుట
గరిమ - భూమిపై నుండే చంద్రుని వేలితో తాకుట
ప్రాప్తి - ఇంద్రియ శక్తులు లభించుట
ప్రాకామ్యం - అంతటా స్వేచ్చగా తిరగగలగటం
ఈశిత - భూమి మీద, నీటిలోలాగా మునగటం
వశిత్వం - భూత, భౌతిక గుణాలను వశపరచుకోవటం.
ఇవే కాక సంకల్పించినవి ఖచ్చితంగా జరిగే శక్తి గాయత్రీ మంత్రం వల్ల సిద్ధిస్తుంది. సర్వతత్వ సంపూర్ణమైన గాయత్రీ మంత్రం శివశక్తి స్వరూపం. మానసికమైనది జప గాయత్రీ. మానసికావస్థను అధిగమించినది అజప గాయత్రి. ఈ స్థితిలో సంయమనం. జీవాత్మ పరమాత్మల ఐక్యత సిద్దిస్తుంది.
జీవాత్మ స్వస్థలం పరమాత్మ నిలయం. గాయత్రీ మంత్రశక్తి వల్ల, ప్రారబ్దకర్మను అనుభవించి, ఆగామి కర్మలను నిరోధించి, వాసనాక్షయం సాధించి మోక్షం పొందవచ్చు. అదే జన్మరాహిత్యం. కైవల్య సాధనకు,దేహాత్మల నిర్మలత్వం, అలౌకిక క్రమశిక్షణ, ధ్యానరక్షణ, దైనందిన చర్యలను ఈశ్వరార్పణగా ఆచరించటం, బ్రహ్మచర్యం ముఖ్యం. బ్రహ్మచర్యం అంటే నిరంతరం, సర్వకాల సర్వావస్థలందు, బ్రహ్మమునందు అనన్యభక్తితో, అనురక్తితో జీవించటం. ఆధ్యాత్మిక ధారణ పొందిన జీవాత్మ, సంకల్పంతో వేదమాత సాక్షాత్కారం పొందటం పరోక్షానుభూతి. తనయందే గాయత్రీ సాక్షాత్కారాన్ని పొందటం అపరోక్షానుభూతి. గాయత్రీ సాధన ’రహసి’ అంటే గుప్తంగా ఉంచవలసినది. మంత్రంలోని ప్రతి అక్షరంలో, ప్రతి స్థానంలో మహా రహస్యం ఇమిడి ఉంది.
పరమాత్మ శక్తికే ’ఛందస్సు’ అని పేరు. సాధకుని మృత్యువు నుండి కాపాడేది ఛందస్సులు. ప్రణవం, భూః, భువః, సువః, గాయత్రీ మంత్రం - ఇవి పంచ మహా యజ్ఞాలు. అంటే దేవ, ఋషి, పితృ, భూత, మనుష్య యజ్ఞాలు. ప్రణవ వ్యాహృతి త్రయ గాయత్రీ మంత్రోపాసన పంచ సూనముల నుండి కాపాడును.
"హంస" మంత్రాన్ని జపించేటప్పుడు, బయట అంతటా నిండి ఉన్న తేజస్సు. ‘హ’ కార స్వరూపమని, లోపల ఉన్న తేజస్సు ’స’ కార స్వరూపమని భావించాలి. అదే ధ్యానం. ‘హకారం’ శివ స్వరూపమైతే, ‘సకారం’ శక్తి స్వరూపం. స్వయం ప్రకాశాత్మకం, సర్వశక్తి సమన్వితం అయిన బ్రహ్మము నుండి మాయ జనించింది. అందుండి పంచభూతాలు, జీవరాశి పుట్టాయి. బ్రహ్మస్వరూపమైన ఆత్మ మాయచే కప్పబడి జీవుడనుబడుచున్నాడు. 24తత్వాలు శరీరం కలిగిన జీవుడు, వేదమంత్రమైన గాయత్రీ మంత్రాన్ని ఉపాసించిన పరమాత్మైక్యాన్ని సాధించగలడు.
మోక్షప్రాప్తికి సాధనం విద్య, విద్య అంటే బ్రహ్మ విద్య. గాయత్రీ విద్య. సంధ్యా విద్య.గాయత్రీ విద్యనుండే సకల విద్యలూ ఉధ్బవించాయి. సప్తస్వరాలు ఆవిర్భవించాయి. గాయత్రీ మంత్రం యొక్క గొప్పతనాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మంత్ర రాజప్రస్థావన లేకుండా ఏ పూజ కానీ,యజ్ఞం కానీ, యాగం కానీ జరుగవు. ఋషులు, సిద్ధపురుషులు యోగం వల్ల సాధించిన మహత్కార్యాలను, గాయత్రీ సాధకులు తేలికగా పొందగలరు. గాయత్రీ మంత్రంలోని విద్యుత్ ప్రవాహం వంటి తేజస్సే ఆత్మతేజస్సు. ఆ తేజస్సును ధ్యానిస్తే, సమస్తమైన ప్రాపంచిక వాసనలు నశించి, ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది. వేదాల్లోని ప్రతి ఒక్క మంత్రం అనంతమైన శక్తిని కలిగి ఉన్నాయి. వేదాలు శబ్ద బ్రహ్మగా మూర్తీభవించగా, ప్రజ్వరిల్లిన శబ్దశక్తియే గాయత్రీ బీజశక్తి, మన ఋషులు, తపస్సంపన్నులు, ముందుతరాల వారిపై అనుగ్రహంతో ప్రసాదించిన దివ్యశక్తియే గాయత్రీ మంత్రరాజం. గాయత్రీ చిచ్చక్తి స్వరూపిణి. చిచ్చక్తి అంటే చిత్+శక్తి. ’చిత్’ అంటే బుద్ధివికాసం, సమిష్టి భగవద్రూపమైన చిఛ్చక్తి, విశ్వంలోని చైతన్యం.
గాయత్రీ మంత్రంలోని నాలుగు పాదాలు వేదాల నుండి గ్రహింపబడినవని చెప్పుకున్నాం. మొదటి పాదంలో ఋగ్వేదంలో చెప్పబడిన శుభప్రాప్తి, ఈశ్వరప్రాప్తి, జ్ఞానం, ఆత్మశాంతి, ధర్మనిరతి, కర్తవ్యపాలన, ప్రేమ, దయ, సేవ, ఉపకారత్వం మొదలైన ఫలితాలు అంతర్గతమై ఉన్నాయి. రెండవ పాదంలో యజుర్వేదంలో చెప్పబడిన వీరత్వం, రక్షణ, కీర్తి, నేతృత్వం ఇమిడి ఉన్నాయి. మూడవ పాదంలో సామవేదంలో చెప్పబడిన మనోవికాసం, ఆనందం, సంగీతం, సాహిత్య కళలు, తృప్తి, వినోదాలనిచ్చు శక్తి ఇమిడి ఉన్నాయి. ఇక నాల్గవ పాదంలో అధర్వణ వేదంలో పేర్కొనబడిన ధన ధాన్య వైభవం, గృహములు, అన్న వస్త్రాదులు, వస్తు వాహనాలు, సుఖ జీవన సాధనాలు నిక్షిప్తమై ఉన్నాయి.
సత్వ, రజో, తమో గుణ సమన్విత గాయత్రి, మానసిక శక్తి, ఆత్మశక్తి, పారమార్ధిక శక్తి ప్రసాదించు ఆదిశక్తి. మొదటిపాదం "హ్రీం" రూపిణి - జ్ఞాన విజ్ఞాన ధాత్రి సరస్వతి. రెండవ పాదం ’శ్రీం’ రూపిణి - లక్ష్మీప్రదం. మూడవపాదం క్లీం రూపిణి - శక్తిప్రదాత్రి కాళి. గాయత్రీ మంత్రోపాసన మూఢవిశ్వాసం కాదు. వైజ్ఞానికం. ఈ మంత్ర సాధన ద్వారా శరీరంలో సర్వశక్తులు జాగృతమై, దుర్భలత తొలగి, ఆరోగ్య సిద్ధి, తద్వారా పరమ శాంతి లభిస్తుంది.
కదిలే శివలింగాలు ఉన్న దేవాలయం

శివలింగం ఏంటి కదలటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమేనండి ఇక్కడి కోవెలలో శివలింగం ఏకధాటిగా కదిలితే 24 గంటలు కదులుతుంది, లేదా ఎంత కదిపినా కదలదు. ఈ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరప్రదేశ్ లోని దియోరియా జిల్లాలో ఉంది. ఇక్కడి శివుడిని దుగ్దేశ్వరనాథుడు. మధ్యప్రదేశ్ లో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి ఇది ఉపలింగం అంటారు.
మన దేశం ఎన్నో అపురూప ఆలయాలకు ప్రసిద్ధి చెందింది అన్న విషయాన్ని మరోసారి రుజువు చేస్తుంది దియోరియాలోని రుద్రపురంలో ఉన్న ఈ శివాలయం.ఇక్కడి శివాలయం లోని శివలింగం పానమట్టము మీద కాకుండా సరాసరి భూమి మీదనే ప్రతిష్టించబడింది. రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం లో శివలింగం చాలాసార్లు కదులుతుంది. అలా ఒక గంటసేపు కదలచ్చు,లేదా ఐదు గంటలు కదలచ్చు.
అయితే ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటల సేపు కూడా కదులుతూనే ఉంటుందని చెపుతుంటారు ఇక్కడి అర్చకులు. అలాంటి సమయంలో స్వామివారిని చూడటానికి భక్తులు తండోపతండాలుగా కదిలి వస్తుంటారట. ఇలా కదిలిన శివలింగంలోని కదలిక ఆగిపోయాక ఎవరు ఎంత కదిపినా ఒక్క అంగుళం కూడా కదలదట.
ఈ లింగం భూమి లోపలకి ఎంత లోతు వరకు ఉన్నాదో తెలుసుకోవటానికి ఎంత త్రవ్వినా ఆ జాడ కూడా తెలియకపోవటంతో విఫలమయ్యారట.చూసే అదృష్టం ఉండాలేగాని ఇలాంటి అబ్బురపరిచే దేవాలయాలు ఎన్నున్నాయో మన దేశంలో కదండీ!
గోమాత - భారతీయ సనాతన ధర్మంలో దైవంగా భావిస్తాము.



శ్లో || నమో దేవ్యై మహా దేవ్యై సురబ్యైచ నమో నమః |
గావం బీజ స్వరూపాయ నమస్తే జగదంబికే ||

మన పూర్వీకులు గోవును పవిత్రతకు శుభానికి చిహ్నంగా భావించేవారు. ఉదయం ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంబించటం ఎంతో శుభశకునంగా భావించేవారు. సాక్షాత్ శ్రీ మహా విష్ణువు తన కృష్ణ అవతారం లో గోపాలకునిగా వ్యవహరించాడని పురాణాలు చెబుతున్నవి. హైందవ ధర్మంలో అంతటి ప్రాశస్త్యం వున్నా గోమాత యొక్క పాలు మాత్రమే కాదు పేడ మరియు మూత్రము కూడా పవిత్రమైనవే.
ఆవు పాల లోని వివిధ రకాల ఔషధ గుణాల కారణంగా ఆవుపాలను అమృతం తో పోలుస్తారు. ఆవు పేడ లోని ఔషద గుణాల వలన పూర్వం ఆవు పేడతో ఇంటిని అలికేవారు తత్ ద్వారా ఇంటిలోకి పురుగులు, కీటకాలు రాకుండా ఉండేవి. పొద్దున్నే ఆవుపేడ కలిపినా నీళు కల్లాపిగా ఇంటి ముందు చల్లటం వలన ఎటువంటి పరాన్నజీవులు ఇంటిలోకి రాకుండా ఉండేవి. ఆవు మూత్రాన్ని మన పురాణాల్లో ప్రత్యేకమైనటువంటి పూజలలో సైతం వాడుతారు. గొప్పఆయుర్వేద ఔషధ గుణాలు కలిగిన గోరోజనము ఆవు నుదిటి భాగంలో ఓ సంచి లాంటి దానిలో వుంటుంది. ఇంతటి మహత్వం కలిగిన గోవును పూజించటం మన కర్తవ్యంగా భావించిన మహర్షులు గోపూజ విధానన్ని కూడా మనకు సూచించారు.

Saturday, 28 May 2016

శనిదోషాలు - నివారణ.........!!


శనిగ్రహం అన్న పేరు వింటేనే ప్రజలు బెంబేలెత్తుతారు. శనిగ్రహం రాశిలో మార్పు చెందితే ప్రజలు మరీ ఆందోళనలో పడిపోతుంటారు. శనిదేవుడు ఎలాంటి విపత్తులు సృష్టిస్తారోనని దిగులు పడిపోతుంటారు. ముఖ్యంగా చాలామందికి తమ తమ జన్మ కుండలి తెలీదు. అలాంటి వారు తమ జన్మకుండలిలో శనిదోషాన్ని గుర్తించడమెలాగో తెలుసుకోవాలను కుంటుం టారు. శనిగ్రహం మంచి చేస్తుందా లేక చెడు చేస్తుందా అనేది ఓ పెద్ద ప్రశ్నగా ఉంటుంది. శని ప్రతికూల పరిస్థితులు మన దినచర్యల్లో మార్పులు తీసుకు వస్తాయి. వీటిని గుర్తుంచుకుని వ్యవహరించాల్సివుంటుంది.
* ఒకవేళ మీ శరీరం తరచూ అలసటకు గురవుతుంటే లేదా నిస్సహాయంగా మారిపోతుందేమో గుర్తించండి.
* నిత్యకృత్యాలు జరుపడంలో ఇష్టం కలగకపోవడం లేక స్నానం చేసే తీరిక కలగకపోవడం.
* కొత్త దుస్తులు కొనడం లేదా తొడుక్కునే అవసరం రాకపోవడం.
* నూతన వస్త్రాలు లేదా మేజోళ్ళు (చెప్పులు) త్వరగా పాడైపోవడంకాని, చిరిగిపోవడం కాని జరుగుతుంటే...
* ఇంట్లో నూనె, పప్పుదినుసులు నష్టపోతుంటే లేదా చేతిలోనుంచి జారిపోతుంటే.
* మీ ఇంట్లోని అలమారా అస్తవ్యస్తంగా ఉంటే.
* భోజనం చేయాలంటే ఇష్టం కలగకపోవడం.
* తల, కాలిపిక్కలు, నడుములో నొప్పి అలాగే ఉంటే.
* కుటుంబంలో తండ్రితో పొరపొచ్చాలు ఏర్పడితే.
* చదువు పట్ల, ప్రజలను కలిసేందుకు మనసు అంగీకరించకపోతే, చిరాకుగా ఉంటే.
ఒకవేళ ఈ లక్షణాలు మీరు స్వయంగా అనుభవిస్తుంటే, శనిగ్రహం మీ జన్మకుండలిలో ఉన్నట్లు లెక్క. 


దీని నివారణోపాయం ఇలా ఉంటుంది. చేసి చూడండి...

నూనె, సన్న ఆవాలు, ఉద్దిపప్పును దానం చేయండి.


రావిచెట్టును పెంచండి. ఆ చెట్టువద్ద దీపాలు వెలిగించండి.
హనుమంతుడుని ఆరాధించండి. 
మాంసం, మద్యపానం అలవాటుంటే వాటిని త్యజించండి. 
పేదవారికి సహాయం చేయండి. 
నల్లటి వస్త్రాలు ధరించకండి. 
నల్లటి వస్తువులు దానం చేయండి.

Friday, 27 May 2016

అష్టాదశ శక్తిపీఠాలు:


లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే
అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా
ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే
హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా
వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్
సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

అంటూ ఆదిశంకరాచార్యులవారు చెప్పిన శ్లోకాన్నే అష్టాదశ శక్తిపీఠాల విషయంలో ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆదిశంకరులు ఈ పద్దెనిమిది క్షేత్రాలనూ దర్శించి శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. వీటిలో నాలుగు శక్తిపీఠాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి, అవి శ్రీశైలం, అలంపురం, పిఠాపురం, ద్రాక్షారామం. మిగిలిన వాటిలో పన్నెండు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉండగా దేశం వెలుపల కూడా మరో రెండు శక్తిపీఠాలున్నాయి. అందులో ఒకటి శ్రీలంకలోనూ మరొకటి ప్రస్తుత పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోనూ ఉంది. ఈ పద్దెనిమిది శక్తిపీఠాల్లో మూడు గయాక్షేత్రాలూ(గయ-శిరోగయ, పిఠాపురం-పాదగయ, జాజ్‌పూర్‌-నాభిగయ) రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలూ (శ్రీశైలం, ఉజ్జయిని) ఉండటం మరో విశేషం.
 ఆ క్షేత్రాల గురించిన వివరాలు...

1.శాంకరీదేవి
లంకాయాం శాంకరీదేవి అంటే...మునులూ రుషుల లెక్కప్రకారం ఈ క్షేత్రం శ్రీలంకలో కాదు, భూమధ్యరేఖకు సున్నాడిగ్రీల వద్ద ఉండేదట ఒకప్పుడు. ప్రస్తుతం ట్రింకోమలీ (శ్రీలంక)లోని ఒక కొండపై ఉండే శిథిల ఆలయాన్నే శాంకరీదేవి కొలువైన చోటుగా భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ శిథిలాలయం కూడా లేదు. 17వ శతాబ్దంలో పోర్చుగీసువారు దండయాత్ర చేసి ఈ గుడిని కూలగొట్టేశారని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడొక స్తంభం మాత్రమే ఉంటుంది.





2.కామాక్షి

సతీదేవి వీపుభాగం పడినట్టుగా చెప్పే చోటు కాంచీపురం. ఇక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా కొలువై ఉంది. పాశాంకుశాలూ చెరకుగడ, భుజంపై చిలుకతో పద్మాసనస్థితయై కొలువుండే ఈ అమ్మవారిని పూజిస్తే సకల సిరిసంపదలూ కలుగుతాయని ప్రతీతి. స్థలపురాణం ప్రకారం... మహిషాసురుణ్ని సంహరించిన చాముండేశ్వరీదేవి ఆ పాపాన్ని తొలగించుకునేందుకు ఏంచేయాలని శివుణ్ని అడగ్గా నేటి కంచి ప్రాంతంలో అన్నపూర్ణగా వెలసి అన్నదానంతో ఆ పాపాన్ని తొలగించుకోమని చెప్పాడట. అలా ఆ దేవి కంచిలో తొలిసారి అడుగుపెట్టిన చోట అమ్మవారిని ఆదిపీఠ పరమేశ్వరిగా కొలుస్తారు భక్తులు. ఆ అమ్మవారు ఇసుకతో శివలింగాన్ని తయారుచేసి అర్చించి ఆ పుణ్యంతో కామాక్షిదేవిగా అవతరించి శివుణ్ని వివాహం చేసుకుందని ప్రతీతి. ఈ నేపథ్యంలో... ఆదిపీఠ పరమేశ్వరి ఆలయాన్ని ఆ ఆదిపరాశక్తి యోగపీఠంగానూ కామాక్షీదేవి ఆలయాన్ని భోగపీఠంగానూ భావిస్తారు భక్తులు.



3.శృంఖల

అమ్మవారి ఉదర భాగం పడిన చోటు ప్రద్యుమ్నం. ఈ క్షేత్రం గుజరాత్‌లో ఉన్నదని కొందరూ కోల్‌కతకు దగ్గరలో ఉన్నదని మరికొందరూ అంటారు. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు సమీపాన ఉన్న సురేంద్రనగర్‌లో కొలువై ఉన్న 'చోటిల్లామాత'ను అక్కడివారు శృంఖలా(శృంగళా)దేవిగా భావిస్తారు. కానీ... పశ్చిమబెంగాల్‌లో ఉన్న 'పాండువా'నే అసలైన శక్తిక్షేత్రం అని అత్యధికులు విశ్వసిస్తారు. అయితే, పాండువా గ్రామంలో ఒకప్పుడు శృంఖలాదేవి ఆలయం ఉన్నదని చెప్పే ప్రదేశంలో ప్రస్తుతం ఒక మసీదు మినారు కనిపిస్తుంది. పురాతత్వశాస్త్రవేత్తల అధీనంలో ఉన్న ఆ ప్రాంగణంలోకి సామాన్యులకు ప్రవేశం నిషిద్ధం. ఏటా మాఘమాసంలో మాత్రం అక్కడ 'మేళతాళ' పేరుతో ఉత్సవం నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో హిందూముస్లింలు కలిసే పాల్గొనడం విశేషం.






4.చాముండి

హరుని రుద్రతాండవంలో అమ్మవారి కురులు వూడి ప్రస్తుత మైసూరు ప్రాంతంలోని చాముండి పర్వతాలపై పడ్డాయని స్థలపురాణం. ఈ ప్రాంత ప్రజలను హింసిస్తున్న మహిషాసురుడిని సంహరించడానికి సతి శక్తి చాముండేశ్వరిగా అవతరించిందని దేవీభాగవతం చెబుతోంది. ఈ ఆలయంలో అమ్మవారు స్వర్ణవిగ్రహ రూపంలో కొలువై భక్తుల పూజలందుకుంటోంది.





5.జోగులాంబ

మనరాష్ట్రంలోని నాలుగు శక్తిపీఠాల్లో వెుదటిది ఈ క్షేత్రం. సతీదేవి ఖండితాంగాలలో పైవరుస దంతాలు/దవడ భాగం పడినట్టు చెప్పే చోటు. ఈ దేవి కొలువైన ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో ముస్లిం రాజులు కూల్చేశారు. అప్పట్లో అక్కడివారు అమ్మవారి విగ్రహాన్ని బాలబ్రహ్మేశ్వర ఆలయంలో ఉంచారట. 2004లో కొత్తగా గుడికట్టి జోగులాంబాదేవిని అక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం చుట్టూ ఒక నీటిగుండం ఉంటుంది. జోగులాంబ ఉగ్రస్వరూపిణి కాబట్టి ఆ తల్లిని శాంతింపజేసేందుకే ఈ ఏర్పాటు అని చెబుతారు స్థానికులు. ఆలయంలోని గర్భగుడిలో ఆసీనముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ. ఆ తల్లి సమక్షంలో సప్తమాతృకలు, వీణాపాణి (సరస్వతీదేవి), వీరభద్రుల విగ్రహాలు ఉంటాయి.






6.భ్రమరాంబిక

విష్ణుచక్రభిన్న అయిన సతి మెడ భాగం పడిన చోటు శ్రీశైల క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా అయిన శ్రీశైలాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని ప్రతీతి. అరుణాసురుడనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలకూ మునులకూ కంటకుడుగా తయారయ్యాడట. రెండు, నాలుగు కాళ్ల జీవులతో మరణం లేకుండా వరం పొందిన అతణ్ని సంహరించేందుకు... ఇక్కడ కొలువైన సతి 'శక్తి' భ్రమర(తుమ్మెద) రూపంలో అవతరించిందట. అసురవధ అనంతరం భ్రమరాంబికగా ఈ క్షేత్రంలోనే మల్లికార్జునస్వామి గుడి వెనుక భాగంలో కొలువై ఉందని స్థలపురాణం. శంకరాచార్యులవారు ఈ క్షేత్రానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని శ్రీచక్ర ప్రతిష్ఠాపన చేసి, భ్రమరాంబాష్టకం రచించారు. శ్రీశైలక్షేత్రంలోనే ఆయన 'సౌందర్య లహరి' కూడా రచించారని చెబుతారు.




7.మహాలక్ష్మి

రజోగుణ సంపన్నురాలైన ఆదిపరాశక్తి 'అంబాబాయి'గా కొల్హాపూర్‌ క్షేత్రంలో కొలువై ఉందని ప్రతీతి. ఇక్కడ సతీదేవి నేత్రాలు పడ్డాయని చెబుతారు. కొల్హాపూర్‌ వాసులు ఈ అమ్మవారిని భవానీమాతగానూ కరవీరవాసినిగానూ కొలుస్తారు. కొల్హాపురీ మహాలక్ష్మి విగ్రహం ఒక ప్రశస్తమైన మణిశిల. అమ్మవారి తలపై ఆదిశేషుడు తన ఐదుపడగలతో ఛత్రం పడుతున్నట్టుగా ఉంటాడు. నల్లని ముఖంతో దివ్యాభరణాలతో వెలిగిపోయే ఈ దేవిని చూడటానికి రెండు కన్నులు సరిపోవంటారు భక్తులు. మహాప్రళయకాలంలిో కూడా లక్ష్మీదేవి ఈక్షేత్రాన్ని వీడదని పురాణప్రతీతి. అందుకే కొల్లాపూర్‌ను 'అవిముక్త క్షేత్రం'గా వ్యవహరిస్తారు.





8.ఏకవీరాదేవి

మహారాష్ట్రలోని నాందేడ్‌ సమీపంలోని మాహోర్‌ క్షేత్రంలో వెలసిన తల్లి ఏకవీరికాదేవి. దత్తాత్రేయుని జన్మస్థలం కూడా ఇదేనని నమ్మిక. దక్షయజ్ఞంలో తనువు చాలించిన పార్వతీదేవి కుడిచేయి ఇక్కడ పడి ఏకవీరా దేవిగా భక్తుల పూజలందుకుంటోందని చెబుతారు. ఈ క్షేత్రంలో మూడు కొండలుంటాయి. అందులో ఒకదానిపై దత్తాత్రేయుని తల్లిదండ్రులైన అత్రిమహర్షి, అనసూయాదేవిని ప్రతిష్ఠించారు. మరొక కొండపై దత్తాత్రేయుడి ఆలయం ఉంటుంది. మరో కొండపై రేణుకాదేవి కొలువై ఉంది. అయితే, ఈ రేణుకాదేవినే ఏకవీరాదేవిగా పొరబడతారు బయటి నుంచి వచ్చే భక్తులు. అసలైన ఆలయం మాహోర్‌కు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ గుడిలో పెద్దపెద్ద కన్నులతో గర్భగుడి పైకప్పును తాకేంత భారీగా ఉండే శిరోభాగం మాత్రమే ఉంటుంది. ఆ తల్లినే ఏకవీరికాదేవిగా కొలుస్తారు స్థానికులు.



9.మహాకాళి

సప్త వోక్షదాయక పట్టణాల్లో ఒకటైన ఉజ్జయినీ నగరంలో సతీదేవి పై పెదవి పడిందని దేవీ భాగవతం చెబుతోంది. ఆ శక్తి మహంకాళిగా రూపుదాల్చి ఆ నగరాన్ని రక్షిస్తోందని ప్రతీతి. ఈ ఆలయంలో అమ్మవారు మహాలక్ష్మి, మహాసరస్వతుల నడుమ కొలువై ఉంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధభూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థలపురాణం. స్థానికులు ఈ దేవిని గ్రహకాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది ఈ తల్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జయినీ మహానగరం ద్వాదశ జ్యోతిర్లింగక్షేత్రం కూడా.



10.పురుహూతిక

పురాణ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం పిఠాపురం. పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి. ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.



11.గిరిజాదేవి

గిరిజాదేవి అంటే ఒరిస్సాలోని జాజ్‌పూర్‌ జిల్లాలో కొలువైన తల్లి. ఇక్కడ అమ్మవారి నాభిభాగం పడిందని ప్రతీతి. గిరిజాదేవిని స్థానికులు బిరిజాదేవి, విరజాదేవి అనేపేర్లతో కొలుస్తారు. అమ్మవారి ముఖం మాత్రమే కనిపించేలా మిగతా విగ్రహాన్ని పూలదండలతోనూ బంగారు ఆభరణాలతోనూ అలంకరిస్తారు. సర్వాలంకృతయై మందస్మిత వదనంతో కనిపించే గిరిజాదేవిని ఎంతసేపు చూసినా తనివితీరదంటారు భక్తులు. ఇది నాభిగయా క్షేత్రం కూడా కాబట్టి ఇక్కడికొచ్చే భక్తుల్లో చాలామంది ఆలయప్రాంగణంలోని ఒక బావి దగ్గర పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. ఈ గుడికి సమీపంలోనే వైతరణీనది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది ఒడ్డునే యమధర్మరాజు ఆలయం ఉంటుంది. ఇంకొంచెం దూరంలో శ్వేతవరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది.



12.మాణిక్యాంబ

సతీదేవి ఖండితాంగాలలో ఎడమ చెంప పడినట్టు చెప్పే ప్రదేశం ద్రాక్షారామం. దక్షవాటికగా వ్యవహరించే ఈ గ్రామం పంచారామక్షేత్రం కూడా. సతీదేవి తండ్రి అయిన దక్షప్రజాపతి రాజ్యంలోని దక్షిణభాగమే ఈ ప్రాంతమనీ ఆ చక్రవర్తి కొన్నాళ్లు ఇక్కడ ఉన్నాడనీ స్థలపురాణం. ఒకసారి వ్యాసమహర్షి కాశీకి వెళ్తే శివుడు ఆయన్ని పరీక్షించదలచి తిండి దొరక్కుండా చేశాడట. అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీ పట్టణాన్ని శపించబోగా అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై ఆయనకూ ఆయన పరివారానికీ అన్నం పెట్టిందట. శివుడు మాత్రం వ్యాసుడిపై కోపంతో ఆయన్ను కాశీవిడిచిపెట్టి వెళ్లమన్నాడనీ అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాసుణ్ని ద్రాక్షారామంలో కొంతకాలం ఉండమని చెప్పిందనీ పురాణప్రతీతి. ఉత్తరాది నుంచి వింధ్యపర్వత శ్రేణులు దాటి దక్షిణాదికి వచ్చిన అగస్త్య మహర్షి కూడా కొన్నాళ్లు ఈ క్షేత్రంలో ఉన్నాడని విశ్వసిస్తారు భక్తులు.




13.కామాఖ్య

అసోం రాజధాని గౌహతిలోని నీలాచల పర్వతశిఖరంపై సతీదేవి యోనిభాగం పడిందనీ అందుకే ఈ అమ్మవారిని కామాఖ్యాదేవిగా కొలుస్తారనీ స్థలపురాణం. అందుకు నిదర్శనమా అన్నట్టు ఈ గుడిలో విగ్రహం ఉండదు. గర్భగుడిలో యోనిభాగాన్ని తలపించే రాతి నిర్మాణం ఉంటుంది. సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ భాగం నుంచి నీరు వూటలా స్రవిస్తూ ఉంటుంది. ఏటా వేసవికాలంలో మూడురోజులపాటు ఆ నీరు ఎర్రగా ఉంటుంది. ఈ సమయం దేవికి రుతుస్రావ సమయంగా పరిగణిస్తారు భక్తులు. ఈ ఆలయం కూచ్‌బేహార్‌ సంస్థానం పరిధిలోకి వస్తుంది. కానీ ఆ సంస్థానానికి చెందిన రాజవంశీకులు ఎవరూ తన ఆలయంలోకి రాకుండా అమ్మవారు శపించిందని ఒక కథనం. అందుకే ఆ వంశానికి సంబంధించిన వారెవరూ కామాఖ్యాదేవి గుడిలో అడుగుపెట్టరు. కనీసం అమ్మవారి ఆలయాన్ని తలెత్తి కూడా చూడరు.





14.మాధవేశ్వరి

అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు. దేవగురువైన బృహస్పతి కృతయుగంలో బిందుమాధవీ దేవిని అమృతంతో అభిషేకించాడని ప్రతీతి. అందుకే ప్రయాగను అమృత తీర్థమనీ... సూర్యుడు అమ్మవారిని ఆరాధించిన క్షేత్రం కాబట్టి భాస్కరక్షేత్రమనీ వ్యవహరించడం కద్దు.






15.సరస్వతి

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.





16.వైష్ణవీదేవి


అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు. మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.




17.మంగళగౌరి

సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు. ఇక... పురాణాల ప్రకారం గయాసురుడి తలభాగం ఉండేచోటుగా భావించే ఈ క్షేత్రాన్ని శిరోగయగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడి తీర్థం ఫల్గుణీనది. ఆ నదిలో స్నానం చేసి, గయలో పితృదేవతలకు పిండప్రదానం చేసి నచ్చిన పదార్థాలను విడిచిపెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది వైష్ణవ క్షేత్రం కూడా. మంగళగౌరీదేవిని విష్ణుమూర్తి చెల్లెలుగా పరిగణిస్తారు భక్తులు.






18.విశాలాక్షి
సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.



ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు' అని చెబుతోంది దేవీభాగవతం.

కాని సతీ వియోగదుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్ధనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు. సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి. ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని(శివుని)తోడుగా దర్శనమిస్తుంది.