వసిష్ఠ మహాముని ఇలా చెబుతున్నారు . ’ ఓ జనక మహారాజా! విను. కార్తీక మహాత్మ్యమును ఇంకా వివరిస్తాను . ప్రసన్న చిత్తుడవై విను. కార్తిక మాసములో ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజిస్తారో , వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యమూ నివాసముంటుంది .
ఈ మాసములో భక్తితో, తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ , చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమిమీద జన్మించడు. ఈ మాసమున మారేడుదళములతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి ఈ భూమిమీద జన్మించడు.
కార్తీక మాసములో భక్తితో పండ్లను దానమిచ్చిన వానిపాపములు సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి . వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు కన్నెత్తి చూసే సాహసమైనా చేయజాలడు .
కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసలో బ్రాహ్మణులతోకూడా వనభోజన మాచరించు వాని మహాపాతకములన్నీ నశిస్తాయి . బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందగలడు .
కార్తీక మాసములో భక్తితో శ్రీ హరి ఆలయములో మామిడి ఆకులతో తోరణము కట్టినవానికి మోక్షము దొరుకుతుంది . శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి, పూజించిన వానికి వైకుంఠములో చిరకాలవాసము కలుగుతుంది . ఈ కార్తీక మాసములో ఒక్కసారైనా హరి ముందు సాష్ఠాంగ ప్రమాణము చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగఫలాన్ని పొందగలరు .
హరి ఎదుట జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణములతో సహా వైకుంఠానికి వెళ్ళగలరు . ఈ మాసము స్నానము చేసి, తడిబట్టతో ఉన్నవానికి వస్త్రదానము చేసినవాడు పదివేల అశ్వమేధయాగములు చేసిన ఫలాన్నిపొందుతాడు .
కార్తీక మాసములో విష్ణువుయొక్క ఆలయ శిఖరముపై ధ్వజారోహణము చేసిన వాని పాపములు గాలికి కొట్టుకొని పోయిన ధూళి లాగా నశించి పోతాయి . ఈ మాసములో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసిపువ్వులతో శ్రీ హరిని పూజిస్తే , పదివేల యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది . ఈ మాసములో బృందావనముని ఆవు పేడతో అలికి, రంగవల్లులలో శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరికి ప్రియురాలు కాగలదు .
కార్తీక మాసమున విష్ణుభగవానుని ఎదుట నందాదీపము అర్పించిన ఫలాన్నీ వర్ణించడం బ్రహ్మకు కూడా శక్యము కాదు. (నందా దీపము అంటే, ప్రతిపత్తిథి, షష్ఠీ తిథి, ఏకాదశీ తిథులలో సమర్పించే దీపము). ఈ నందాదీపము ఆచరించని వారు వ్రతభ్రష్టులనిపించుకుంటారు . కాబట్టి నువ్వులతో, ధాన్యముతో, అవిసి పువ్వులతో కలిపి నందాదీపమును శ్రీ హరికి సమర్పించాలి . కార్తీక మాసములో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలము జీవించి చివరకు మోక్షమును పొందగలడు.
కార్తీక మందు విష్ణ్వాలయములోని మంటపంను భక్తితో అలంకరించేవారు హరిమందిర స్థాయిని పొందగలరు . ఈ మాసములో మల్లెపూవులతో శ్రీ హరిని పూజించువాని పాపములు సూర్యోదయానంతరం చీకట్లలాగా నశిస్తాయి . తులసీ గంధముతో సాలగ్రామమును పూజించినవాని పాపములు దద్గమై , విష్ణులోకాన్ని చేరగలడు.
హరి సన్నిధిలో స్త్రీగానీ, పురుషుడుగానీ నాట్యము చేసినట్టయితే, పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడ నశిస్తాయి . ఈ మాసంలో భక్తితో అన్నదానమాచ రించువాని పాపములు గాలికి కొట్టుకుపోయిన మబ్బులలాగా తేలిపోతాయి .
కార్తీక మాసములో తిలాదానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము అన్నదానము అనే నాలుగు ధర్మములు ఆచరించాలి . ఈ మాసములో దానము, స్నానము యథాశక్తిగా చేయనివాడు నూరు జన్మలు కుక్కగా పుట్టి తరవాత చండాలుడవుతాడు . స్త్రీగానీ, పురుషుడుగానీ కార్తీక వ్రతమాచరించనివాడు గాడిదగా ముందు జన్మించి తరవాత నూరు మార్లు కుక్కగా జన్మిస్తాడు .
కార్తీక మాసములో కడిమి పువ్వులతో శ్రీ హరిని పూజించిన వారు సూర్య మండలమును దాటి స్వర్గలోకమునకు చేరుకుంటారు . మొగలి పువ్వులతో పూజించిన వాడు ఏడుజన్మలు వేద వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడై జన్మిస్తాడు . ఈ మాసములో పద్మములతో శ్రీ హరిని పూజించిన వారు సూర్యమండలమందు చిరకాలవాసి కాగలడు . అవిసెపువ్వుల మాలను ధరించి శ్రీ హరినీ అవిసెపువ్వుల మాలికలతో పూజించేవాడు స్వర్గాధిపత్యాన్ని పొందగలడు.
స్త్రీలు మాలలచేత కానీ తులసీదళాల చేతకానీ, ఈ మాసమందులో హరిని పూజించినట్టయితే, పాపవిముక్తులై వైకుంఠమును పొందుతారు . ఈ మాసంలో ఆదివారం స్నానం చేసినట్టయితే, మాసమంతా స్నానమాచరించిన పుణ్యము కలుగుతుంది .
ఈ మాసములో శుక్ల ప్రతిపత్తిథినాడు, పూర్ణిమనాడు అమావాస్యనాడు ప్రాతఃస్నానమాచరించిన అశక్తులు పూర్ణఫలము పొందగలరు. అందుకు కూడా శక్తిలేని వారు కార్తీక మాసములో నెలరోజులూ కార్తీక మాహాత్మ్యము వింటే స్నానఫలము కలిగి పాపములు నశిస్తాయి
ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు కూడా ఏ సందేహములేకుండా నశించిపోతాయి . ఇతరులకు హరిపూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందుతాడు . ఈ మాసంలో భక్తితో గంధ పుష్ప ధూప దీపాదులచేత హరిని పూజించివాడు వైకుంఠాన్ని చేరుకుంటాడు .
స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, ఏడవ అధ్యాయము - ఏడవ రోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,
ఆర్దికలావాదేవీలు,ETC), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు
సంప్రదించండి.
FOLLOW US :
PLZ LIKE , SHARE , FOLLOW AND SUBSCRIBE
FACEBOOK PAGE
HTTPS://WWW.FACEBOOK.COM/VIDHATHAASTORNUMEROLOGY/?
VIEW_PUBLIC_FOR=1712439968969888
FACEBOOK GROUP :
(20+) VIDHATHA ASTRO NUMEROLOGY | FACEBOOK
YOUTUBE
HTTPS://WWW.YOUTUBE.COM/CHANNEL/UCUPPMXZZ8X1HI5RRVBCOJSW
PRINTEREST
HTTPS://IN.PINTEREST.COM/VASTRONUMEROLOGY/SREE-VIDHATHA-PEETAM/
TWITTER
HTTPS://TWITTER.COM/VIDHATHAASTROLO
INSTAGRAM
HTTPS://WWW.INSTAGRAM.COM/SREEVIDHATHAPEETAM/
BLOG
HTTPS://VIDHAATHAASTRONUMEROLOGY.BLOGSPOT.COM/
WHATSAPP GROUP
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP:
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GQ72L3U0MNF4ZKKIECPG9Y
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/BR5VHG7L4L8HHQ1UUWLDUI
FOLLOW THIS LINK TO JOIN MY WHATSAPP GROUP: HTTPS://
CHAT.WHATSAPP.COM/GMBYOVWRJ8MDJTJKFBOSKM
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, విశిష్ట ఆచార్య, వాస్తు విశారద
HAVANIJAAA / హవనిజా
( B.ed, MCA, M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం/ SREE VIDHATHA PEETAM
Ph. no: 9666602371
No comments:
Post a Comment