Wednesday 28 February 2018

శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు జయేంద్ర సరస్వతి స్వామి వారు

Image may contain: 1 person, smiling, standing
ఆదిశంకర భగవద్పాదులు వారు ఒక దివ్యమైన తేజస్సుతో లోకానికి శంకరులై సనాతనధర్మ పరిరక్షణకై ఉద్యమించి ఆయన పెట్టిన వ్యవస్థ ఇప్పటికి అఖండంగా సాగుతోంది, వారి యొక్క దివ్య గురుతేజస్సు ఏదో ఒక రూపంలో సమస్త భారతావనిని తద్వారా ప్రపంచాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది , అలా వచ్చిన ఒక ఆదిశంకర గురు తేజస్సు 82 ఏళ్ళు ఈ భూమి పై సంచరించి తిరిగి ఆ జగద్గురువు తేజస్సులో లీనమయ్యింది..ఇటువంటి సందర్భం లో వారి యొక్క దివ్య స్మృతికి మనం శ్రద్ధాంజాలి ఘటించుకుంటూ శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇవాళ పరమేశ్వర ఐక్యం పొందారు. అయితే అటువంటి వారి విషయం లో మనం మాట్లాడేటప్పుడు వారి ఆత్మకు శాంతి కలగాలి అనేటటువంటి మాట చాలా దారుణం. ఆ మాట అనరాదు.ఎవరి దగ్గర ఏమి అనాలో మనం తెల్సుకోవాలి.వారు శాంత్యాత్ములే! భూమిపై సంచరించినప్పుడే శాంత్యాత్ములు వారు, అయితే తన యొక్క భౌతిక కాయాన్నీ ఆ మహానుభావులు పరిత్యజించి సిద్ధిని పొందారు. అటువంటి వారి విషయం లో సిద్ధిని పొందారు అనాలి. అయితే జీవన్ముక్తులైన వారు ఇప్పుడు విదేహ కైవల్యం పొందారు .., అటువంటి మహానుభావులు వారు, ఎవరి ద్వారా తీసుకురాబడ్డారు అంటే సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క స్వరూపం అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేన్ద్ర సరస్వతి మహాస్వామి వారు, ...వారు గుర్తించి స్వీకరించి దీక్షనిచ్చినటువంటి మహాత్ములు వారు, ఆయన జీవిత కాలం లో అతి బాల్యం ని విడిచిపెడితే యతి స్వరూపంగానే ఆయన సంచరించారు, ఆ మహత్ముని ద్వారా సామాన్యూలకు సైతం సనాతన ధర్మం తీసుకురావలని ఆయన ఉద్యమించి....మొత్తం భారత దేశం అంతా ఆ సేతు హిమాచల అంతా పరివ్రాజిక ధర్మం తో పర్యటించి అనేక చోట్ల ఎన్నో విధాలుగా సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసారు.వారి చరిత్రయే ఒక అద్భుతమైన గురు తేజస్సు. అంతే కాకుండా ఆ మహాత్ములు విశేషించి ధర్మాన్ని ఙ్ఞానాన్ని పరివ్యాప్తి చెయడంలో, దివ్యమైనటువంటి స్థలములలో దేవాలయాలను నిర్మించడంలో వారు అధిక ప్రాముఖ్యతను ఇచ్చారు. ముఖ్యం గా కాలడిలో శంకర మందిరాన్ని నిర్మాణం చేసారు. ఆలాగే నేపాల్ మొదలైనటువంటి ప్రాంతల్లో పర్యటించారు, అటువంటి మహాత్ములు సామాజికంగా కూడా సనాతాన ధర్మం ఎంత గొప్పదో ఋజువు చేస్తూ వైద్య సంస్థలు, విద్యా సంస్థలు ఎన్నిటినో నెలకొల్పారు, వారి యొక్క దివ్యమైన తేజస్సు మళ్ళీ అఖండంగా ఆ పీఠం ద్వారా కొనసాగుతూ ఉంటుంది. బ్రహ్మీ భూతులు అయినటువంటి ..ఆ మహాత్ములు యొక్క అనుగ్రహం తో సనాతన ధర్మం వర్ధిల్లు గాక. అంటువంటివారి పాదపద్మాలను స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఉన్నాం., అదే సమయంలో పీఠాదీశ్వరులైనటువంటి శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు మన అందరికీ ఒక ఆదేశాన్ని అందించారు. జగద్గురువులు రేపటి రొజున ఉదయం7:30 నుండి ఎవరికి వారు ఉన్నచోటు నుండి విష్ణుసహస్రనామం చదవమని ఆదేశించారు . మనమంతా జగద్గురువుల ఆదేశాన్ని పాటిద్దాం సనాతన ధర్మం యొక్క రక్షణని కాంక్షిద్దాం

No comments:

Post a Comment