Wednesday, 28 February 2018

హోలీ/వసంతోత్సవ పండుగ


హోలీ అనేది రంగుల పండుగ, హిందువుల వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారత దేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ మరియు ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోలీ పండుగను బ్రాజ్ ప్రాంతంలో భగవంతుడైన కృష్ణునికి సంబంధిత ప్రదేశాలైన మథుర, బృందావనం, నందగావ్ మరియు బర్సానాలలో ఘనంగా జరుపుకుంటారు. హోలీ పండుగ సందర్భంగా ఈ ప్రదేశాలు 16 రోజులు పాటు పర్యాటక కేంద్రాలుగా సందర్శకులతో చాలా రద్దీగా ఉంటాయి
దుల్‌‌‌హేతి, ధులండి మరియు ధులెండి అని కూడా పిలిచే ముఖ్యమైన రోజు హోలీ ఉత్సవ రోజున, ప్రజలు రంగుల పొడిని మరియు రంగు నీళ్ళను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ముందు రోజున హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి బొమ్మకు నిప్పంటిస్తారు. దీనిని హోలిక దహన్ (హోలికను కాల్చడం) లేదా చోటీ హోలీ (చిన్న హోలీ) అని అంటారు. హిరణ్యకశిపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి ప్రహ్లాదుడిని మంటలలో వేసినప్పుడు దైవలీలతో తప్పించుకుంటాడు అందుకే భోగి మంటలు అంటిస్తారు. హోలిక ఈ మంటలలో దహనమయ్యింది కానీ విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు, అతని అపార భక్తితో ఎటువంటి గాయాలు లేకుండా తప్పించుకుంటాడు. ఆంధ్ర ప్రదేశ్లో హోలిక దహన్‌ను కామ దహనం అని అంటారు.
ఇది సాధారణంగా శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలల తదుపరి వారాల్లో వచ్చే చివరి ఫాల్గుణమాసము (ఫిబ్రవరి/మార్చి) (ఫాల్గుణ పూర్ణిమ), పౌర్ణమి రోజున జరుపుకుంటారు. కొన్ని రోజుల తరువాత, ఫాల్గుణ బహుళ పంచమి (పౌర్ణమికి ఐదవ రోజు) న పండుగ ముగింపున సూచిస్తూ రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రాముఖ్యత

వైష్ణవములో, రాక్షసులకు రాజైన హిరణ్యకశ్యపుడు, చాలా కాలం తపస్సు చేసి, తనను చంపడం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడిని "పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన, జంతువుల వలన, అస్త్రములు, శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్ళని ఆరాధించడం మాని, తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు.
దీనికి విరుద్ధంగా, హిరణ్యకశ్యపుడి సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు, భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశ్యపుడు పలు మార్లు బెదిరించినప్పటికి, ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుని ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే, అది అమృతంగా మారింది. ఏనుగులచే తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలున్న గదిలో ఉంచినప్పటికీ జీవించ గలిగాడు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. చివరిగా, ప్రహ్లాదుడిని హిరణ్యకశ్యపుడి యొక్క సోదరి అయిన హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించడం వలన ఆమెకి ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువును వేడుకుంటాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తుండగానే హోలిక శాలువా ఎగిరి పోవడం వలన ఆమె దహనం అవుతుంది ఆ శాలువా ప్రహ్లాదుడిని కప్పడం వలన అతడికి ఎటువంటి హాని జరగదు. హోలిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోలీను జరుపుకుంటున్నాము.
రాధ మరియు గోపికల హోలి.
 
తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో (సగం మనిషి మరియు సగం సింహం) వచ్చి హిరణ్యకశ్యపుడిని సంధ్యా సమయంలో (పగలు లేదా రాత్రి కాని) అతని ఇంటి గడప మెట్లపై (లోపల లేదా ఇంటి బయట కాదు) తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని (ఆకాశంలో లేదా భూమి పైన కాదు) మరియు తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు (అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా).
ఈ పండుగను భగవంతుడైన కృష్ణుడి పెరిగిన ప్రాంతాలైన మథుర మరియు బృందావనంలలో 16 రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు (ప్రతి సంవత్సరం రంగపంచమి రోజున భగవంతుడైన కృష్ణుడికి రాధపై ఉన్న ప్రేమను కొనియాడతారు). భగవంతుడైన కృష్ణుడు గోపికలతో తన చేష్టల ద్వారా ఈ పండుగ ప్రసిద్ధికెక్కేలా చేశాడని నమ్ముతారు. కృష్ణుడు తన తల్లితో అతని యొక్క నల్లని శరీర రంగు మరియు రాధ యొక్క శరీర రంగు మధ్య వ్యత్యాసం గురించి ఫిర్యాదు చేశాడని నమ్ముతారు. కృష్ణుడి తల్లి రాధ యొక్క ముఖానికి రంగు పూయాలని నిర్ణయించుకుంది. అధికారికంగా ఈ ఉత్సవాలు వసంతఋతువులో అంటే ప్రేమ వికసించే మాసంలో జరుపుకుంటారు.
హోలీ పుట్టుక వివరాల గురించి వేరొక కథ ఉంది. ఈ కథ ప్రేమ దేవుడైన కామదేవుడు గురించి తెలుపుతుంది. పార్వతి శివుణ్ణి పెళ్లి చేసుకోవడానికి సహాయంగా శివుని తపస్సును భంగ పరచడానికి అతనిపై పూల బాణం వదిలిన కామదేవుని శరీరాన్ని శివుడు నాశనం చేసాడు. తరువాత శివుడు, తన త్రినేత్రాన్ని తెరిచి, కామదేవుని శరీరాన్ని బూడిద చేశాడు. కామదేవుని యొక్క భార్య రతి కోరిక మేరకు శివుడు కామదేవుడిని మరలా బ్రతికిస్తాడు కానీ భౌతిక కామం కంటే నిజమైన ఉద్రేక పూరిత ప్రేమ ఆధ్యాత్మికతను తెలియజేసే మానసిక ప్రతిరూపంగా మాత్రమే బ్రతికిస్తాడు. ఈ సంఘటన వలన హోలీ రోజున భోగి మంటలు వేసి ఘనంగా జరుపుకొంటారు.
హోలీ విశ్వ వ్యాప్తంగా ప్రకాశించే పండుగ. ఈ పండుగ రోజున, తేజం యొక్క వివిధ తరంగాలు విశ్వవ్యాప్తంగా పయనిస్తాయి, అక్కడ వివిధ రంగులు ఉత్పత్తి అయ్యి వృద్ది పొంది మరియు వాతావరణంలో ధాతువు పూర్తి సంపూర్ణ ధర్మాన్ని కలిగి ఉంటాయి.

హోలీ ఆచారాలు

ప్రాథమిక పరిశోధనల ప్రకారం 7వ శతాబ్దంలో రత్నావళి అనే సంస్కృత నాటకం వలన హోలీ పండుగ ఉత్సవాలు జరుపుకొన్నారని తెలిసింది. వాస్తవంగా హోలీ పండుగకు సంవత్సరం పొడవునా ఆచారాలు ఉంటాయి, మొదటగా రంగు పొడిని ఒకరికొకరు పూసుకుంటారు మరియు పొడవైన చిమ్మే గొట్టాలు లేదా చిమ్మే తుపాకుల నుండి రంగు నీటిని జల్లుకుంటారు. ఈ పండుగను చాలా రోజుల ముందుగానే 'హోలీ మిలన్' లేదా బైతక్స్ ద్వారా జరుపుకొన్నారు, సంగీత కచేరీల ద్వారా అనగా పండుగకు సంబంధించిన పాటలను మరియు రాధా మరియు కృష్ణ పురాణ ప్రేమ కథ గురించి పాటలు పాడేవారు; ముఖ్యంగా జానపద పాటలు అనగా "హోరి" పాటలను పాడేవారు. కొన్ని సంప్రదాయక జానపద పాటలు ఆజ్ బిరాజ్ మే హోలీ రే రాసియా కొన్ని తరాల నుండి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి.
ఆహార తయారీ చాలా రోజుల ముందు నుండే ప్రారంభిస్తారు, హోలీ పండుగ సమయాన వచ్చిన అతిథులకు గుజియా అప్పడాలు, కంజి మరియు మల్పాస్, మథిరి, పురాన్ పొలి, దాహి బదాస్ వంటి వివిధ రకాలైన ఫలహరాలను వడ్డిస్తారు. హోలీ రోజు రాత్రి, గంజాయిని (కేనబిస్) తీసుకొని మైకంతో ఊగుతారు.

హోలిక దహన్: హోలీ భోగి మంటలు

ఉదయపూర్ లో హోళీ మంటలు.
 
ఈ పండుగ యొక్క ప్రధాన ఘట్టం మండుచున్న హోలీ మంటలు లేదా హోలీక. అంతేకాక కొందరి ఉద్దేశ్యం ప్రకారం రాక్షసి హోలిక, హోలక మరియు పూతన వంటి రాక్షసుల దహనం లేదా మదన్‌ను దహనం అని సంప్రదాయ హోలీ మంటల మూలాన్ని తెలుపుతాయి.
హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదున్ని చంపడానికి ప్రయత్నం చేసిన హిరణ్యకశ్యపుని చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా సంప్రదాయ భోగి మంటలను నిర్వహిస్తారు.
ఎలాగంటే విజయదశమి రోజున రావణుడిని ప్రతిమను దహనం చేసినట్లుగా ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు, ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతం అయిందని దీని అర్థం, ఈ విధంగా ప్రతిమలను దహనం చేయడం ప్రస్తుతం కనిపించడం లేదు కొంత మంది ఏదో సూచనప్రాయంగా చేస్తున్నారు, కానీ ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాలు మినహా బ్రజ ప్రాంతాలలో, కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తారు. సంప్రదాయమైన పూజలు అయిన తరువాత ప్రజలు మంటలకు ప్రదక్షిణ లు చేస్తారు.తరువాత రోజు ఈ విజయాన్ని దుల్‍‌హెండి రోజుగా ఘనంగా జరపుకొంటారు.

దుల్‍‌హెండి

ముఖ్యముగా సంబరాలను అబీర్ మరియు గులాల్‌లను లాంటి సాధ్యమైన అన్ని రంగులతో జరుపుకొంటారు.తరువాత రంగు నీటిని చిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు జల్లుకొంటారు. ఈ రంగు నీటిని తెసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు, దీనిని మొదటగా వృక్షం నుండి సేకరిస్తారు, ఎండలో ఎండబెడతారు మరియు వాటిని నూరిన తరువాత నారింజ-పసుపు రంగులోకి మారుటకు నీరుని కలుపుతారు. ఇప్పుడు మరో సంప్రదాయకమైన హోలీ పండుగను తరచుగా చూస్తున్నాము, ఎరుపు రంగు పొడితో ఉన్న గోళాకార వస్తువును విసురుకుంటారు, అది వారికి తగిలిన వెంటనే పగిలి, వారిపై పొడి వెదజల్లుతుంది.

ప్రాంతీయ ఆచారాలు మరియు ఉత్సవాలు

దోల్-పూర్ణిమ (రంగ్ పంచమి) రంగుల యొక్క పండుగను విందులతో ఉల్లాసంగా జరుపుకొంటారు. ఆ రోజు, ప్రజలు తెల్లని దుస్తులను ధరించి బయటికి వస్తారు మరియు ఏ ప్రదేశములో అయితే ఆడాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి అందరూ వచ్చి ఉల్లాసంగా గడుపుతారు.

భారత దేశం

ఆంధ్రప్రదేశ్
పట్టణాలలో స్వల్పస్థాయిలో జరుపుకుంటారు
తెలంగాణ
హైదరాబాదు మరియు ఇతర జిల్లాలో ఇది ప్రముఖంగా జరుపుకుంటారు.
పంజాబ్
పంజాబ్‌లో సిక్కులు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. ఇక్కడ హోలీని హోలా మోహల్లా అంటారు.ఈ పండుగను భారీ ఎత్తున జరుపుకొంటారు. వాస్తవానికి, భారత దేశ మొత్తంలో ఆనంద్‌పూర్ సాహిబ్ లో జరిగే హోలీ ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుండి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి వారి సంప్రదాయ పద్ధతిలో హోలీ పండుగను జరుపుకొంటారు.
ఉత్తర్ ప్రదేశ్
హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి.ఇక్కడ రాధా రాణి ఆలయంలో లాత్ మార్ హోలీ అనే క్రీడను ఆడతారు. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలు పురుషులను కర్రలతో కొడతారు మరియు హోలీ పాటలను పాడుకుంటూ, పెద్దగా శ్రీ రాదే లేదా శ్రీ కృష్ణ అంటూ పాడతారు. పరిశుద్ధమైన బ్రజ్ బాషలో బ్రజ్ మండలం హోలీ పాటలను పాడతారు.
బర్సానాలో హోలీ రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. తరువాత స్త్రీలు కోపంతో వెళ్లి పురుషులను లాఠీలు అనే పొడవైన కర్రలను ఉపయోగించి కొడతారు పురుషులు వారితో ఉన్న డాలుతో కాపాడుకొంటారు. యు.పి సుల్తాన్పూర్‌లో హోలీ సరదాగా ఉంటుంది. అన్ని గ్రామాలు కలసి ఉత్సాహాంగా జరుపుకొంటారు.
భగవంతుడైన కృష్ణుడి జన్మ స్థలం అయిన మథురలో మరియు బృందావన్లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు మరియు పండుగ చివరి 16 రోజులు, సంప్రదాయక పద్ధతులలో ఆచార వ్యవహారాలతో భగవంతుడైన కృష్ణుడిని పూజిస్తారు.మథుర, బృందావన్, బర్సానాలలో హోలీ జరుపుకొన్నట్లు బ్రజ్ ప్రాంతంలో మరియు దాని సమీప ప్రాంతాలైన హత్రాస్, ఆలీగర్, ఆగ్రాలలో కూడా కొంచెం అదేవిధంగా జరుపుకొంటారు.
ఉత్తరప్రదేశ్‌కు ఉత్తర తూర్పు జిల్లా గోరఖ్‌పూర్‌లో, హోలీ రోజు ఉదయాన ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు.హోలీ రోజును సంతోషకరమైన మరియు సంవత్సరంలో సౌభాగ్యవంతమైన దినంగా ప్రజలు భావిస్తారు. దీనినే హోలీ మిలన్ అని అంటారు.ఈ రోజు ప్రజలు ప్రతి ఇంటిని దర్శించి, హోలీ పాటలను పాడుతూ మరియు రంగు పొడిని (అబీర్) పూస్తూ వారి కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటారు. హోలీ హిందూ పంచాంగ నెల ఫాల్గునం చివరి రోజన వస్తుంది కాబట్టి దీన్ని సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. ప్రజలు క్రొత్త సంవత్సర హిందూ పంచాంగం (పంచాంగ్) ప్రకారం హోలీ రోజు సాయంకాలమే రాబోవు సంవత్సరములో హోలీ కొరకు ప్రణాళికలను ప్రారంభిస్తారు.
హోలీని పుష్కర్, రాజస్థాన్ లలో జరపుకుంటారు
బీహార్
బీహార్‌లో కూడా ఉత్తర భారత దేశం జరుపుకున్నట్లు హోలీని అదే స్థాయిలో మరియు మనోహరంగా జరుపుకొంటారు. ఇక్కడ కూడా, హోలిక పురాణం ప్రబలమైనది.ఫాల్గున పూర్ణిమ పర్వ దినానికి ముందు రోజు, ప్రజలు పెద్ద మంటలను వెలిగిస్తారు.వారు పేడ పదార్థాలను, ఆరాడ్ మరియు రెడి చెట్ల యొక్క కలప మరియు హోలీక చెట్టు, పంటలను కోసిన తరువాత మిగిలిన పొట్టును మరియు అవసరం లేని కలపను పెద్ద మంటలలో వేస్తారు. సంప్రదాయం ప్రకారం ఈ రోజు ప్రజలు వారి గృహాలను శుభ్రముగా ఉంచుకొంటారు.
ప్రజలందరు హోలీక సమయమప్పుడు మంటల దగ్గరికి వస్తారు. ప్రజలందరి సమక్షములో పురోహితుడు మంటను ఆరంభిస్తాడు.తరువాత ఇతడు ఇతరులకు రంగును పూసి ఒక సూచనా ప్రాయంగా శుభాకాంక్షలు తెలుపుతాడు.తరువాత రోజు ఈ పండుగను రంగులతో ఉల్లాసముగా జరుపుకుంటారు. ఈ పండుగను పిల్లలు మరియు యువకులు చాలా ఆనందముగా జరుపుకొంటారు.ఈ పండుగను సాధారణంగా రంగులతో ఆడుకుంటారు, కొన్ని ప్రదేశాలలో ప్రజలు హోలీ పండుగను బురదతో కూడా ఆడుకొంటారు.హోలీ రోజున మంచి శృతితో జానపద పాటలను పాడతారు మరియు ప్రజలు డోలక్ యొక్క శబ్దానికి నాట్యం చేస్తారు.పండుగ సందర్భముగా మైకాన్ని కలుగజేసే గంజాయినే కాక వైవిధ్యమైన పకోరాస్ మరియు తండైలను కూడా తీసుకొంటారు.
బెంగాల్
డోల్ పూర్ణిమ ఉదయం వేళలలో, విద్యార్థులు కుంకుమ పువ్వు రంగు దుస్తులను మరియు పరిమళము వెదజల్లే పూల దండలను ధరిస్తారు.వారు పాటలు పాడతారు మరియు సంగీత పరికరాల అయిన ఎక్‌తార, డుబ్రి, వీణా మొదలగువాటి శ్రుతికి తగ్గట్టు నృత్యం చేస్తారు. వీక్షించే వారు కూడా ఉల్లాసంగా ఊగుతారు మరియు కొన్ని సంవత్సరాల వరకు గుర్తుండిపోతుంది. హోలీ పండగను 'డోల్ జాత్ర', 'డోల్ పూర్ణిమ' లేదా 'స్వింగ్ పండుగ' అని కూడా అంటారు.ఈ పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు, పట్టణాల్లోని ముఖ్యమైన వీధులలో లేదా పల్లెల్లో కృష్ణుడి మరియు రాధా ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు.ఆడవాళ్లు ఊగుతూ నాట్యం చేస్తున్నప్పుడు భక్తులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ భక్తి పాటలను పాడతారు.అప్పుడు పురుషులు రంగు నీటిని మరియు రంగు పొడి అబీర్ జల్లుకొంటారు.
కుటుంబ పెద్దలు భగవంతుడైన కృష్ణుడిని మరియు అగ్నిదేవుడిని ప్రార్ధిస్తాడు. మరియు సాంప్రదాయకంగా కృష్ణుడి ప్రతిమలకు గులాల్ రంగు పూసి భోగ్‌ను అర్పిస్తారు. శాంతినికేతన్‌లో, హోలీ ఒక ప్రత్యకమైన సంగీత అభిరుచి కలిగి ఉంటుంది.సంప్రదాయమైన వంటకాలు మల్పోయే, కీర్ సందేష్, బాసంతి సందేష్ (సాఫ్రన్ యొక్క), సాఫ్ఫ్రన్ పాలు, పాయసం మొదలైనవి.
ఒడిషా
ఒడిషా ప్రజలు కూడా హోలీని ఇదే విధంగా జరుపుకొంటారు కానీ కృష్ణ మరియు రాధా విగ్రహాలకు బదులుగా పూరీలో ఉన్న జగన్నాధుడి విగ్రహాలను పూజిస్తారు.
గుజరాత్
భారత దేశంలోని గుజరాత్ రాష్ట్రంలో రంగుల పండుగ హోలీని శోభాయమానంగా జరుపుకుంటారు. ఫాల్గుణ నెలలో పౌర్ణమి రోజున వచ్చే హోలీ ముఖ్యముగా హిందువుల పండుగ, వ్యవసాయములో రబీ పంటలకు ఇది ఒక సూచనా ప్రాయముగా ఉంటుంది.
పల్లెల యొక్క కూడళ్ళలో, కాలనీలలో మరియు వీధులలో భోగీ మంటలను వేస్తారు. ప్రజలు భోగీ మంటల ముందు ప్రార్థనలు చేస్తారు మరియు వారు అలా నృత్యం చేయటం మరియు పాటలు పాడటం వల్ల చెడు మన దరి చేరదని సూచనప్రాయంగా విశ్వసిస్తారు. గుజరాత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన వారు అందరు హోలీ పండుగ రోజున అధిక ఉత్సాహముతో మంటల చుట్టూ నాట్యము చేస్తారు.
దక్షిణ భారత దేశంలో, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక కుండలో మజ్జిగను వేసి వీధిలో వ్రేలాడదీస్తారు మరియు యువకులు ఆ కుండను పగులగొట్టడానికి ప్రయత్నిస్తారు అదేసమయములో వారిని ఆపుటకు అమ్మాయిలు వారిపై నీళ్ళను విసురుతారు, ఎందుకంటే కృష్ణుడు మరియు అతని స్నేహితులు వెన్నె దొంగతనము చేస్తున్నప్పుడు వారిని 'గోపికలు' ఆపినట్లు ఆపుతారు. కృష్ణుడు వెన్నె దొంగతనం చేయడానికి వస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండే వారిని ఎగతాళి చేస్తూ రంగులతో తడిసిన పురుషులు వీధులలో పెద్ద ఊరేగింపు నిర్వహిస్తారు. చివరికి ఏ యువకుడైతే ఆ కుండను పగులగొడతాడో అతడిని హోలీ రాజుగా కిరీటాన్నిస్తారు.
కొన్ని ప్రదేశములలో, హిందూవుల ఆచారం ప్రకారం అమ్మాయిలు చీరను తాడుగా చేసి బావలను కొడుతూ రంగులను పూస్తూ ఆటపట్టిస్తారు, ఆమె కొరకు బావ ఆ రోజు సాయంకాలం తీపి తినుబండారాలను తీసుకొని వస్తాడు.
మహారాష్ట్ర
మహారాష్ట్రలో, హోలీ ముఖ్యముగా హోలీక యొక్క మంటలతో అనుసంధానమై ఉంది. హోలీ పౌర్ణిమను షింగా వలె కూడా జరపుకొంటారు. పండుగకు ఒక వారం ముందు, యువకులు చుట్టుప్రక్కల ప్రదేశాలలో ఉన్న కలపను తీసుకువచ్చి అందరి ఇంటికి వెళ్లి డబ్బును పోగు చేస్తారు.హోలీ రోజున, ఒక ప్రదేశములో మంటకు చెక్కను పెద్ద కుప్పగా పోగు చేస్తారు. సాయంత్రం మంటలను వెలగిస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు తిను బండారాలను మరియు భోజనం అర్పిస్తారు. పూరణ్ పోలి అనేది రుచికరమైన తినుబండారం మరియు పిల్లలు "హోలీ రే హోలీ పురాణచి పోలి" అని పాడతారు.షింగా దౌర్భాగ్యాలన్నింటిని తొలగిస్తుందని ప్రజలు విశ్వసిస్తారు.ఉత్తర భారత దేశంలో వలె రెండవ రోజు జరుపుకోకుండా సంప్రదాయంగా రంగపంచమి రోజున ఉత్సాహంగా రంగులతో ఆడుకొంటారు.
మణిపూర్
భారత దేశానికి ఈశాన్య దిశలో ఉన్న మణిపూర్‌లో హోలీ పండుగను ఆరు రోజులు జరుపుకొంటారు. 18వ శతాబ్దంలో వైష్ణవులు ప్రారంభించినా, ఇది కొన్ని శతాబ్దాల నుండి యోసంగ్ పండుగతో విలీనమైపోయింది.సంప్రదాయంగా, యువకులు రాత్రి వేళల్లో ఫాల్గునమాసము పౌర్ణమి రోజున 'తాబల్ చోంగ్‌‌బా' జానపద నృత్యాలతో జానపద పాటలతో అద్భుతముగా డోలును వాయిస్తారు.ఎలాగైతేనేమి, వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు మరియు ప్రతిదీప్తి దీపం (ఫ్లోరిసెంట్ దీపాలు) ను ఉపయోగిస్తారు మరియు భోగీ మంటలకు ఎండు గడ్డిని మరియు రెమ్మలను ఉపయోగిస్తారు.బాలురు అమ్మాయిలకు తమతో 'గులాల్' ఆట ఆడమని డబ్బు ఇస్తారు.కృష్ణుడి గుడిలో, భక్తులు దేవుడి పాటలను పాడతారు, సంప్రదాయక పద్ధతిలో తెలుపు మరియు పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు.పండుగ చివరి రోజు, కృష్ణుడి గుడి ఆవరణలో ఇంఫాల్ దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, ఊరేగింపు చేస్తారు.
దక్షిణ భారత దేశం
కొచి ప్రాంతములోని మటన్‌చెర్రీలో, సామరస్యంతో జీవిస్తున్న 22 సంఘాల వారు ఉన్నారు. అంతేకాకుండా, దక్షిణ కొచి ప్రదేశమైన చెర్‌లై ప్రాంతములో కొంకణి భాష మాట్లాడే గౌడ్ సరావత్ బ్రాహ్మణులు (జిఎస్‌బి) కూడా హోలీ పండుగను ఘనంగా జరుపుకొంటారు. వారిని స్థానికంగా కొంకణి భాషలో ఉక్కులి అని లేదా మలయాళంలో మంజల్ కూలి అని పిలుస్తారు.ఇది ముఖ్యముగా కొంకణి గుడిలో జరగును దీనిని గోశ్రీపురం తిరుమల గుడి అని అంటారు.2008వ సంవత్సరం చెర్‌లైలో ఉక్కలి పండుగను మార్చి 23న జరుపుకొంటారు.భగల్‌కోట్ లో కూడా హోలీని భారీ ఎత్తున జరుపుకొంటారు.పాఠశాలలు మరియు కళాశాలలు హోలీ రోజున సెలవు ప్రకటిస్తాయి మరియు బెంగుళూరులో 2009 సంవత్సరంలో కొన్ని బహు‌ళదేశ కంపెనీలు అనగా టాటా కన్సల్‌టెన్సీ సర్వీసెస్ మరియు కాగ్నిజెంట్ టెక్నోలాజీ సొల్యూషన్స్ హోలీ సందర్భముగా సెలవు ప్రకటిస్తాయి.పిల్లలు, పెద్దలు అందరు కలసి హోలీ ఆడతారు.
కాశ్మీర్
కాశ్మీర్‌లో పౌరులు మరియు భారత రక్షక దళ అధికారులు కూడా హోలీ సంబరాలను జరుపుకుంటారు. హోలీని ఎండ కాలమునకు ప్రారంభములో పంటలు కోయు సమయానికి సూచన, ఒకరిపై ఒకరు రంగు పొడిని మరియు రంగు నీళ్ళను విసురుకుంటూ, పాటలు పాడుకుంటూ, నృత్యము చేస్తూ, అధిక ఉత్సాహముతో పండుగను జరపుకొంటారు.
న్యూ మెక్సికో యొక్క యునివర్సిటీ వద్ద భారతీయ విద్యార్థులు సంఘం హోలీ వేడుకలను జరపుకుంటారు
హర్యానా, గ్రామీణ ఢిల్లీ & పశ్చిమ యూపి
ఈ ప్రాంతములో కూడా హోలీ ప్రత్యమైన పద్ధతిలో వాళ్ళ సంప్రదాయం ప్రకారం జరపుకొంటారు, ఈ పండుగను ఆనందముగా మరియు అత్యుత్సాహముతో జరపుకుంటారు.

నేపాల్

హోలీక దహన్, కాఠ్మండు, నేపాల్.
 
నేపాల్‌లో, పండుగలలో ఒక గొప్ప పండుగగా హోలీని పరిగణిస్తారు. నేపాల్‌లో 80 శాతం ప్రజలు హిందువులు ఉన్నారు, చాలా వరకు హిందువుల పండుగలను జాతీయ పండుగలుగా జరుపుకొంటారు మరియు దాదాపుగా ప్రతి ఒక్కరు ప్రాంతీయ భేదం లేకుండా జరుపుకొంటారు చివరికి ముస్లిములు కూడా ఘనంగా జరుపుకొంటారు. కొందరు క్రైస్తవులు ఉత్సవాల్లో పాలుపంచుకున్నా ఉపవాస దినాల్లో రావడం వలన చాలా మంది హోలీ పండుగ వేడుకల్లో పాలుపంచుకోలేరు. నేపాల్‌లో హోలీ పండుగ రోజు జాతీయ సెలవు దినం.
హోలీ పండుగను ప్రజలు తమ చుట్టుప్రక్కల వారిపై రంగులను జల్లుకుంటూ రంగు నీరును పోసుకుంటారు.అధిక ముఖ్యమైన ఘట్టం ఒకరిపై ఒకరు రంగు నీళ్ళను పోసుకోవటాన్ని లోలా ( నీటి బుడగ అని అర్థం) అని కూడా అంటారు. శివరాత్రి రోజులా చాలా మంది ప్రజలు వారి పానీయాల్లో మరియు ఆహారంలో గంజాయి కలుపుకొంటారు. వివిధ రంగులతో ఆడుకోవటం వల్ల వారి యొక్క బాధలు తొలగిపోయి, రాబోయే జీవితం ఆనందముగా ఉంటుందని నమ్ముతారు.

భారత దేశ ప్రవాసులు

సంవత్సరాలు గడుస్తున్నకొద్ది, ప్రవాసభారతీయులు ఉంటున్న చాలా ప్రాంతాలలో అనగా ఆఫ్రికా, ఉత్తర అమెరికాలో, ఐరోపా మరియు దక్షిణ ఆసియాకు దగ్గర ఉన్న ప్రాంతాలలో హోలీ పండుగను ఘనంగా జరపుకుంటారు.

సంప్రదాయక హోలీ

సంప్రదాయమైన రంగులను తయారుచేయుటకు మోదుగ పుష్పములను ఉపయోగిస్తారు

వసంత కాలంలో వాతావరణములో మార్పూలు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం: సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ లను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు.
కొన్నిసార్లు గంజాయిను బట్టి కెనబిస్ సెటైవా ఒక ముఖ్యమైన పానీయము తండై లేదా భంగ్ను తయారుచేస్తారు. తడిగా రంగుల కొరకు, మోదుగ పుష్పములు రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలగి ఉంటుంది. దురదృష్టకరంగా కొందరి వ్యాపార లాభాల కోసం పెరుగుతున్న రసాయన రంగుల ఉపయోగం హానికరంగా తయారయ్యింది.

రసాయన రంగులు


వసంత కాలములో రంగులను ఇచ్చిన వృక్షాలు చనిపోతే వాటికి ప్రత్యామ్నాయంగా భారత దేశంలోని పట్టణ ప్రాంతాలలోని ప్రజలు రసాయనాలు ఉపయోగించి తయారుచేసే రంగులను వినియోగిస్తున్నారు. 2001వ సంవత్సరం ఢిల్లీలోటాక్సిక్స్ లింక్ మరియు వాతావరణ్ సంస్థలు పండుగ కోసం వాడే రసాయన రంగులను పేర్కొంటూ ఒక శ్వేత పత్రమును ప్రచురించారు.హోలీ రంగులను సురక్షితముగా మూడు రూపాలలో ఉత్పత్తి చేసుకోవచ్చునని తెలిపారు:: అవి ముద్దగా, నిస్సారమైన రంగులు మరియు నీళ్ళ రంగులతో.
ముద్దలపై పరిశోధన జరిపిన తరువాత, వారు టాక్సిక్ రసాయనాలు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని కనుగొన్నారు. ఈ నల్లని ముద్దలు లెడ్ ఆక్సైడ్ కలిగి ఉండి మూత్రపిండాలను పాడు చేస్తాయి. క్యాన్సర్‌ను కలగజేసే పదార్థములు రెండు రంగులను వెండి రంగులో అల్యూమినియం బ్రోమైడ్ ను మరియు ఎరుపులో మెర్క్యురి సల్ఫేట్ ను కనుగొన్నారు. నీలం ముద్దలో చర్మ వ్యాధులకు కారణమయ్యే ప్రూసియన్ నీలాన్ని ఉపయోగించడం వల్ల, కాపర్ సల్ఫేట్ ఆకు పచ్చగా ఉండి కంటి ఎలర్జీకి కారణం అవుతుంది అంతేకాకుండా ఉబ్బినట్లు ఉండి తాత్కాలికముగా గ్రుడ్డి తనం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పొడిగా ఉన్న రంగులను వివిధ రంగులతో ఉపయోగించడమును గులాల్స్ అని అంటారు, ఇది మైకము కలగజేసే, ఆస్తమా, శరీరమునకు సంబంధించిన వ్యాధులకు, తాత్కాలిక గ్రుడ్డితనమునకు కారణం అవుతుందని కనుగొన్నారు. ఈ రెండు యాస్బెస్టోస్ లేదా సిలికా సాధారణముగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో ఉపయోగిస్తారు.
పొడిగా ఉన్న రంగులు జెంటియన్ వైలెట్ రంగును ఉపయోగించడం వలన శరీర వివార్ణముకు మరియు చర్మ వ్యాధులకు దారి తీస్తాయని వీరు నివేదించారు. కొరత ఏర్పడటం వలన నాణ్యత అదుపు తప్పింది మరియు ఇటువంటి రంగుల విషయం ఒక సమస్యగా మారింది, వారు తరచుగా వారికి ఎక్కడి నుండి వస్తున్నాయో తెలియకుండా విక్రేతలు అమ్ముతున్నారు.
హోలీ యొక్క సంబరాలలో సాధారణముగా ప్రజలందరు ఒకరిపై ఒకరు రంగులను జల్లుకుంటారు. అభివృద్ధి ప్రత్యామ్నాయంగా ఢిల్లీ మరియు కల్పవృక్షలలో, ఈ రెండు  పూణే మరియు పరిశుభ్ర ఇండియా ప్రచారంలో చిన్నపిల్లలకు హోలీ రోజు కోసం వారే స్వంతగా సురక్షితమైన, సహజమైన వస్తువులతో రంగులను చేసుకోవడాన్ని నేర్పి సహాయపడ్డారు. అంతలో కొన్ని వాణిజ్య సంస్థలు మరియు జాతీయ వృక్షసంబంధిత పరిశోధన సంస్థ మార్కెట్‌లో ఔషధ రంగులను ప్రవేశపెట్టింది, ఇవి ప్రమాదకరమైన ప్రత్యామ్నాయం కంటే ఖర్చుతో కూడుకున్నవి అయినప్పటికీ, ఇది భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో కాక ఇతర ప్రాంతాలలో సాధారణ రంగులుగా (మరియు పండుగలో వాడే రంగులుగా) అందుబాటులో ఉండటం గమనించవచ్చు.
హోలీని జరుపుకోవడం వలన సంప్రదాయమైన హోలీక దహన్ భోగి మంటలకు పర్యావరణానికి సంబంధం ఉంది, ఇవి అడవిని నిర్మూలించుటకు కారణమవుతున్నాయని చెప్పుకుంటారు. ఒక ఋతువుకు 30,000 భోగీ మంటలకు ప్రతి మంటకు సుమారుగా 100 కిలోల కలపను కాలుస్తున్నట్లు వారు ప్రచురించారు.ఈ విధంగా కలపను వినియోగించడం నిరోధించుట కొరకు వివిధ పద్ధతులు ప్రవేశ పెట్టారు అవసరం లేని కలప సామగ్రి లేదా వివిధ చిన్న మంటల కన్నా ఒక వర్గానికి ఒక మంటను మాత్రమే అనే నియమాన్ని ప్రవేశపెట్టారు. అయినప్పటికీ, కొన్ని సార్లు సంస్కృతులను మరియు సంప్రదాయాలను దెబ్బతీసే అవకాశం ఈ నియమాలవలన కలుగుతున్నది.




సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు జయేంద్ర సరస్వతి స్వామి వారు

Image may contain: 1 person, smiling, standing
ఆదిశంకర భగవద్పాదులు వారు ఒక దివ్యమైన తేజస్సుతో లోకానికి శంకరులై సనాతనధర్మ పరిరక్షణకై ఉద్యమించి ఆయన పెట్టిన వ్యవస్థ ఇప్పటికి అఖండంగా సాగుతోంది, వారి యొక్క దివ్య గురుతేజస్సు ఏదో ఒక రూపంలో సమస్త భారతావనిని తద్వారా ప్రపంచాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది , అలా వచ్చిన ఒక ఆదిశంకర గురు తేజస్సు 82 ఏళ్ళు ఈ భూమి పై సంచరించి తిరిగి ఆ జగద్గురువు తేజస్సులో లీనమయ్యింది..ఇటువంటి సందర్భం లో వారి యొక్క దివ్య స్మృతికి మనం శ్రద్ధాంజాలి ఘటించుకుంటూ శ్రీ శ్రీ శ్రీ జగద్గురువు జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇవాళ పరమేశ్వర ఐక్యం పొందారు. అయితే అటువంటి వారి విషయం లో మనం మాట్లాడేటప్పుడు వారి ఆత్మకు శాంతి కలగాలి అనేటటువంటి మాట చాలా దారుణం. ఆ మాట అనరాదు.ఎవరి దగ్గర ఏమి అనాలో మనం తెల్సుకోవాలి.వారు శాంత్యాత్ములే! భూమిపై సంచరించినప్పుడే శాంత్యాత్ములు వారు, అయితే తన యొక్క భౌతిక కాయాన్నీ ఆ మహానుభావులు పరిత్యజించి సిద్ధిని పొందారు. అటువంటి వారి విషయం లో సిద్ధిని పొందారు అనాలి. అయితే జీవన్ముక్తులైన వారు ఇప్పుడు విదేహ కైవల్యం పొందారు .., అటువంటి మహానుభావులు వారు, ఎవరి ద్వారా తీసుకురాబడ్డారు అంటే సాక్షాత్తు దక్షిణామూర్తి యొక్క స్వరూపం అయినటువంటి శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేన్ద్ర సరస్వతి మహాస్వామి వారు, ...వారు గుర్తించి స్వీకరించి దీక్షనిచ్చినటువంటి మహాత్ములు వారు, ఆయన జీవిత కాలం లో అతి బాల్యం ని విడిచిపెడితే యతి స్వరూపంగానే ఆయన సంచరించారు, ఆ మహత్ముని ద్వారా సామాన్యూలకు సైతం సనాతన ధర్మం తీసుకురావలని ఆయన ఉద్యమించి....మొత్తం భారత దేశం అంతా ఆ సేతు హిమాచల అంతా పరివ్రాజిక ధర్మం తో పర్యటించి అనేక చోట్ల ఎన్నో విధాలుగా సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసారు.వారి చరిత్రయే ఒక అద్భుతమైన గురు తేజస్సు. అంతే కాకుండా ఆ మహాత్ములు విశేషించి ధర్మాన్ని ఙ్ఞానాన్ని పరివ్యాప్తి చెయడంలో, దివ్యమైనటువంటి స్థలములలో దేవాలయాలను నిర్మించడంలో వారు అధిక ప్రాముఖ్యతను ఇచ్చారు. ముఖ్యం గా కాలడిలో శంకర మందిరాన్ని నిర్మాణం చేసారు. ఆలాగే నేపాల్ మొదలైనటువంటి ప్రాంతల్లో పర్యటించారు, అటువంటి మహాత్ములు సామాజికంగా కూడా సనాతాన ధర్మం ఎంత గొప్పదో ఋజువు చేస్తూ వైద్య సంస్థలు, విద్యా సంస్థలు ఎన్నిటినో నెలకొల్పారు, వారి యొక్క దివ్యమైన తేజస్సు మళ్ళీ అఖండంగా ఆ పీఠం ద్వారా కొనసాగుతూ ఉంటుంది. బ్రహ్మీ భూతులు అయినటువంటి ..ఆ మహాత్ములు యొక్క అనుగ్రహం తో సనాతన ధర్మం వర్ధిల్లు గాక. అంటువంటివారి పాదపద్మాలను స్మరించుకుంటూ నమస్కరించుకుంటూ ఉన్నాం., అదే సమయంలో పీఠాదీశ్వరులైనటువంటి శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు మన అందరికీ ఒక ఆదేశాన్ని అందించారు. జగద్గురువులు రేపటి రొజున ఉదయం7:30 నుండి ఎవరికి వారు ఉన్నచోటు నుండి విష్ణుసహస్రనామం చదవమని ఆదేశించారు . మనమంతా జగద్గురువుల ఆదేశాన్ని పాటిద్దాం సనాతన ధర్మం యొక్క రక్షణని కాంక్షిద్దాం

Tuesday, 13 February 2018

ద్వాదశ జ్యోతిర్లింగాలు




అన్ని మతము లలోను దేవుడు , దేవుని ఆరాధన ఉన్నది ... సంప్రదాయాలు , కొలిచే విధానాలు వేరువేరు గా ఉన్నాయి కాని మూలము , అర్ధము , పరమార్ధము , ఒక్కటే ...దేవుడు ఉన్నాడా? లేడా? అన్నది ఎవరికీ తెలీదు . అది ఒక నమ్మకము మాత్రమే . పూర్వము ఆదిమానవుడు ప్రకృతి లో ఉండే భీబత్సవాలు ... ఉరుములు , మెరుపులు , గాలివానలు , సునామీలు , వరదలు , చీకటి , వెలుతురు , చలి , ఎండా, వాన లన నుండి భయపడి అప్రయత్నముగా " అమ్మో , నాన్నో " అని అరిచేవాడు ... చనిపోయిన అమ్మ , నాన్న లను తలచుకొని ధైర్యం తెచ్చుకునేవాడు .. ఆ ధైర్యం తోనే జీవము గడిపేవాడు , రక్షణ కోసము ఏ చెట్టునో ,రాయినో , పుట్టనో ఆశ్రయించేవాడు ... తనకు రక్షణ నిచ్చే ఆ చెట్టును , రాయిని , పుట్టను తనను కాపాడే శక్తి / దేవుడు గా భావించేవాడు . పూజించేవాడు . ఆమ్మ నుండే పుట్టినది 'అమ్మోరు ' , నాన్న నుండి పుట్టినదే 'నారాయణ ' , చెట్టే అమ్మోరు .. పుట్టే నారాయణుడు . దేవుడు లేడని మానవుని నమ్మకాన్ని వమ్ము చేయకూడదు , ఆత్యాద్మికత ఉంటేనే జీవితానికి ఆశ కలుగుతుంది . నమ్మకమే జీవిత నావకు దిక్చూచి . ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనషులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. అవి ఎలా ఉద్భవించాయి ? అస్సలు ఎందుకు ఉద్భవించాయి అనేది ఎవరికీ తెలియదు . ప్రతి వస్తువుకి జీవము ఉంటుంది ... కొన్నింటికి అంతర్గతముగాను కొన్నింటికి బహిర్గతము గాను , అంతర్గతం గా జీవమున్న వస్తువులను మనిషి జీవము లేనివిగా భావిస్తాడు .... ఎందుకంటే తానూ బహిర్గతముగా జీవము ఉన్నవాడు అయినందున. ఇక్కడ మనము -- ద్వాదశ జ్యోతిర్లింగాలు -- గురించి తెలుసుకొని ఆనందించి జీవన విధి-విధానం లో మన పాత్రేమిటో తెలుసుకుందాం .
శైవులు శివున్ని మూర్తి రూపములో మరియు లింగరూపములోనూ పూజిస్తారు. కానీ లింగ రూపమే అందులో ప్రధానమైనదిగా భావిస్తారు. ప్రతి లింగములో శివుని యొక్క జ్యోతి స్వరూపము వెలుగుతుంటుందని శైవుల నమ్మకం. అయితే వీటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అని పిలువబడే పన్నెండు లింగాలు అత్యంత ముఖ్యమైనవిగా అనాది నుండి భావించబడుచున్నది.
నీ పుట్టుకే నీకు తెలియనివాడివి, నా పుట్టుకకు నీవు కారకుడివా..!? కానేకావు. నాకు నేను స్వయంగా అవతరించాను. నాపై నీ ఆధిపత్యం చెల్లదు. నేనే నీక న్నా అత్యధికుడిని అంటూ బ్రహ్మ వాదులాడసాగాడు. విష్ణువు ఎన్నివిధాల నచ్చజెప్ప ప్రయత్నించినప్పటికీ... బ్రహ్మ వినకుండా నేనే అధినాథుడను... ఈ విశ్వానికి నేనే అధినాథుడను అంటూ పెడబొబ్బలు పెట్టసాగాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఫెళఫెళమంటూ విశ్వమం తా కంపించిపోయింది. ఆ ఆర్భాటాలకి హేతువేమిటో తెలియక బ్రహ్మ విష్ణువులు విస్మయం చెందుతూ అటూ ఇటూ చూడసాగారు.
లింగోద్భవం: ఆ సమయంలో ఓంకారనాదం ప్రతిధ్వనిస్తుండగా... జ్వాలా స్తంభం ఒకటి వారిరువురి మధ్య ఆవిర్భవించింది. సహస్రాధిక యోజనాల పొడ వుగా ఉద్భవించింది ఆ స్తంభం. అగ్నిజ్వాలలు విరజి మ్ముతున్న ఆ జ్యోతిర్లింగం ఆది మూలమెక్కడో, తుది యేదో... ఎక్కడున్నదో కూడా వారికి అర్థం కాలేదు. ఆ జ్వాలా స్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోగలిగిన వాడే తమలో అధికుడని వారిరువురూ నిశ్చయించుకు న్నారు. ఆ నిర్ణయానుసారం బ్రహ్మ హంసరూపం దా ల్చి జ్యోతిర్లంగం తుది భాగాన్ని కనుక్కోవడానికి పైకెగి రి వెళ్లాడు. విష్ణువు ఆ లింగం అడుగు భాగాన్ని కను క్కోవడానికి యజ్ఞ వరాహరూపం ధరించి లింగం ప్రక్క నుంచి భూమిని తొలుచుకుంటూ అడుగు భాగానికి ప్రయాణం ఆరంభించాడు. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు.
ఆ జ్యోతిర్లింగం అడుగు భాగాన్ని కను క్కోవడం తనకు సాధ్యం కాదని గ్రహించి వెనుదిరిగి యథాస్థానానికి వచ్చి బ్రహ్మకోసం నిరీక్షించసాగాడు. బ్రహ్మ పైకి ఎన్ని యోజనాలు ప్రయాణించినా ఆ లిం గం తుది భాగాన్ని కనుక్కోలేక నిరాశ చెందాడు. ఆ స మయంలో విష్ణువు దేవాదిదేవా..! ఆద్యంతాలు లేని ఈ జ్వాలా లింగాన్ని అభిషేకించడం, అర్చించడం మాకు సాధ్యం కాదు. కావున, నీవు ఈ జ్వాలా స్వరూపాన్ని ఉపసంహరించుకొని, మా పూజలందుకోవడానికి అర్హమైన రూపంతో అవ తరించు అని ప్రార్థించాడు. విష్ణువు ఆ ప్రార్థనతో శాంతించిన పరబ్రహ్మ తన జ్వాలా స్తంభరూపాన్ని ఉపసంహరించుకున్నాడు.
మరుక్షణమే ఆ ప్రదేశం లో మొట్టమొదటి శివలింగం అవతరించింది. లింగో ద్భవం జరిగిన ఆ సమయమే ‘మహాశివరాత్రి’ పర్వది నం అయింది. శివలింగరూపంలో అవతరించిన పర మేశ్వరుణ్ణి పవిత్ర జలంతో అభిషేకించి..శివనామస్మ రణతో పంచాక్షరీ మహామంత్రంతో అర్చించారు బ్ర హ్మ, విష్ణువులు. వారి భక్తి ప్రపత్తులకు సంతోషిం చి ఆదిదేవుడు ఆ లింగాకార మధ్యభాగంలో ప్రత్యక్ష మై దర్శనమిచ్చి వారిని ఆశీర్వదించి అనుగ్రహించాడు.
ద్వాదశ జ్యోతిర్లింగాలు: లింగమనగా... ‘లీయతేగమ్యతే ఇతి లింగః’...
‘లిం’ లీయతి, ‘గం’ గమయతి... అనగా ఈ
జగత్తు దేనియందు సంచరించి, దేనియందు
లయం చెందుతుందో అదే ‘లింగము’ అని అర్థం.
ఆద్యంతాలు లేనిదే లింగము. లింగతత్త్వమే ఆత్మ. కనుక ప్రతి దేహంలో ఆత్మ అనే లింగము ఉంటున్నది. ఆ లింగస్వరూపుడే శివుడు.
అగమ్యము, అగోచరమైన దివ్య తత్త్వమును మానవులు గ్రహిచటానికి నిదర్శనముగా లింగము ఉద్భవించుచున్నది. లింగము అనంత నిరాకార పరబ్రహ్మమునకు చిహ్నం. ఈ సత్యాన్ని చాటడానికి ఆ పరబ్రహ్మ తొలుత లింగరూపుడై ఉద్భవించి బ్రహ్మ, విష్ణువులకు దర్శనమిచ్చాడు. అనంతరం లింగాకారుడై ముల్లోకాలలోనూ వెలసి నిత్యాభిషేక అర్చనలు అందుకుంటున్నాడు. భక్తులు, సర్వజీవుల హృదయాలలో ఆత్మరూపుడై నివశించే శివుడు ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కరూ తనని పూజించడానికి వీలుగా కోటానుకోట్ల శివలింగాలై వెలసి ఉన్నాడు. ఇట్టి అనేకానేక శివలింగాలలో దాదాపుగా అన్ని ప్రతిష్ఠించినవి కాగా... కొన్ని మాత్రమే ఆ శివుడు తనకుతానుగా స్వయంగా లింగరూపుడై వెలిసినవి. వాటిలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవే ద్వాదశ జ్యోతిర్లింగాలు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల చరిత్ర ‘లింగపురాణం’లో వ్యాసమహర్షి వివరించాడు.
అవి -->
రామనాథస్వామి లింగము - రామేశ్వరము, మల్లికార్జున లింగము - శ్రీశైలము, భీమశంకర లింగము - భీమా శంకరం, ఘృష్టీశ్వర లింగం - ఘృష్ణేశ్వరం, త్రయంబకేశ్వర లింగం - త్రయంబకేశ్వరం, సోమనాథ లింగము - సోమనాథ్, నాగేశ్వర లింగం - దారుకావనం (ద్వారక), ఓంకారేశ్వర-అమలేశ్వర లింగములు - ఓంకారక్షేత్రం, మహాకాళ లింగం - ఉజ్జయని, వైధ్యనాథ లింగం - చితా భూమి (దేవఘర్), విశ్వేశ్వర లింగం - వారణాశి, కేదారేశ్వర - కేదారనాథ్.
1 . గుజరాత్‌లో శ్రీ సోమనాథేశ్వరుడు
గుజరాత్‌ రాష్ట్రంలోని సౌరాష్ట్ర జిల్లాలో సోమనాథేశ్వర క్షేత్రం ఉంది. ఈ క్షేత్రాన్ని దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలతో వెలిగించిన దీపం నేటికీ ప్రజ్వరిల్లుతుండడం ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ ఉన్న చంద్రకుండంలో స్నానం చేసి సోమ నాథేశ్వరుడిని దర్శిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుడిని ప్రతిష్ఠించినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి.
2 . శ్రీశైల మల్లికార్జునేశ్వరుడు
మన రాష్ట్రంలోని కర్నూలు జిల్లా దోర్నాల్‌ రైల్వేస్టేషన్‌ నుంచి 52 కిలోమీటర్ల, హైదరాబాద్‌కు 230 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. పరమేశ్వరుడు భార్య గౌరీదేవితో కలిసి స్వయంభువుగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడుగా వెలిశాడు. భూ ప్రదక్షిణ ఎవరు ముందు చేస్తే వారికే గణాధిపత్యం అన్న మాట విని బయలుదేరిన షన్ముఖుడికి ప్రతీచోట వినాయకుడే ముందుగా కనిపిస్తాడు. పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వల్లే ఇలా కనిపిస్తున్నాడని నందీశ్వరుడు చెప్పగా విన్న కుమారస్వామి అలిగి క్రౌంచ పర్వతంపైకి వెళ్లిపోయి కార్తీకుడిగా వెలిశాడు. తన తప్పిదం వల్ల ఇలా జరిగిందని తెలుసుకున్న నందీశ్వరుడు కృష్ణానదీ తీరం శ్రీశైల శిఖరంలో తప్పస్సు చేయగా పార్వతీ పరమేశ్వరులు భ్రమరాంబ సహిత మల్లిఖార్జునులుగా వెలిశారు. శ్రీరాముడు తన వనవాస సమయంలో ప్రతిష్ఠించిన వేయి లింగాలు, పాండవులు వనవాస సమయంలో ప్రతిష్ఠించిన అయిదు లింగాలు ఇక్కడే కొలువు తీరినట్లు చెబుతారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివానందాలహరి రాసారని ప్రతీతి.
3 . శ్రీ మహా కాళేశ్వరుడు
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఉజ్జయినీ పట్టణంలో శ్రీ మహా కాళేశ్వరాలయం ఉంది. క్షిప్ర నదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణాభిముఖంగా, గర్భగుడి శ్రీచక్రయంత్రం తిరగవేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఐదు అంతస్తుల్లో ఉన్న ఆలయంలో మహా కాళేశ్వరుడికి పాతఃకాలం భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు.
4 . శ్రీ ఓంకారేశ్వరుడు
మధ్యప్రదేశ్‌ రాష్ట్రం వింద్య పర్వత సానువుల్లో నర్మదానది తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృత ఓం ఆకారంలో వెలసిన ఈ క్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వర లింగం పక్కపక్కనే ఉండడం విశేషం.
5 . శ్రీవైద్యనాథేశ్వరుడు
జార్ఖండ్‌ రాష్ట్రంలో జేసిడీ కూడలి దగ్గర శ్రీవైద్యనాథేశ్వరాలయం ఉంది. పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్రలో కట్నీపూర్‌ దగ్గర పెద్ద శివాలయాన్ని కూడా శ్రీవైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తున్నారు. ఈ రెండింటి నేపథ్యమూ రామాయాణాంతర్గత రావణాసురిడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజిస్తే వారికి వ్యాధులు నయం మవుతుండడం వల్ల శ్రీవైద్యనాథేశ్వరుడిగా పిలుస్తారని ప్రతీతి.
6 . శ్రీభీమేశ్వరుడు
మహారాష్ట్రలో సహ్యాద్రి పర్వతఘాట్‌లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఉపనది భీమనది ఉద్భవ ప్రాంతంలో భీమశంకర జ్యోతిర్లింగంగా వెలసింది. కుంభకర్ణుని కుమారుడు రాక్షస భీముని నాశనం చేసే ఈశ్వరుడి రూపంలో ఈ లింగం ఉంటుంది. ఈ జ్యోతిర్లింగం అర్థనాథేశ్వర రూపంలో భక్తులు కోర్కెలు తీర్చేదిగా ప్రతీతి. ఇక్కడ శివలింగం నుంచి నిత్యం నీరు ప్రవహిస్తుండడం ఓ ప్రత్యేకత. శివుని రౌద్రరూపం నుంచి వచ్చిన చెమట బిందువులు భీమనదిగా మారిందని స్థల పురాణం.
7 . శ్రీరామేశ్వరుడు
తమిళనాడు రాష్ట్రంలో శ్రీ రామేశ్వరాలయం ఉంది. పురాణగాథ ప్రకారం రావణవధ అనంతరం శ్రీరామచంద్రమూర్తి సేతువును దాటి భారతదేశానికి వస్తాడు. బ్రహ్మ హత్యాపాతకాన్ని తొలగించుకునేందుకు శ్రీరాముడు కాశీ నుంచి శివలింగం తెమ్మని హనుమకు ఆజ్ఞాపిస్తాడు. సుముహూర్త సమయం దాటిపోతుండడంతో సీతాదేవి సముద్రతీరంలో ఇసుకతో లింగం చేసి ప్రతిష్ఠించింది. ఇంతలో కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చిన ఆంజనేయుడు ఇసుక లింగాన్ని తోకతో లాగేయాలని ప్రయత్నించినా రాలేదు. గర్వభంగమైన ఆంజనేయుడు శివునికి పక్కనే తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తాడు. రామేశ్వరంలో రెండు లింగాలు మనం గమనిస్తాం. రాముడు ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా ప్రసిద్ధి. రామేశ్వరంలోని నూతుల్లో నీటితో స్నానమాచరిస్తే సమస్త బాధలు పోతాయని భక్తుల విశ్వాసం.
8 . శ్రీనాగనాథేశ్వరుడు
మహారాష్ట్ర ప్రభాస రైల్వేస్టేషన్‌కు సమీపంలో శ్రీనాగనాథేశ్వర ఆలయం ఉంది. పాండవులు అరణ్యవాసంలో భాగంగా దారుకా వనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఆలయం నిర్మించినట్లు పురాణ గాథ. మొగల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినపుడు శరీరం నిండా పాములు, చేతుల్లో త్రిశూలాలు ధరించిన నగ్నకాపాలికులు వారిని తరిమికొట్టినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి.
9 . శ్రీవిశ్వనాథేశ్వరుడు
శ్రీ విశ్వనాథేశ్వరుడి జ్యోతిర్లింగం వారణాసిగా జగత్‌ప్రసిద్ధి చెందిన కాశీక్షేత్రంలో ఉంది. దేవతలు నివసించే పుణ్యక్షేత్రం కాశీపట్టణం. గంగానది తీరంలో బౌద్ధ, జైన మతాలవారు, హైందవులు అనేకమంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా నిలిచే విశ్వేశ్వరాలయం బంగారు శిఖరాలను కలిగి ఉంది. విశ్వనాథ దేవాలయం సన్నిధిలో విశాలాక్ష్మి శక్తిపీఠం ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నాన, దాన, హోమం చేసిన వారికి ఈశ్వర వరప్రసాదంతో మరుజన్మ ఉండదని ప్రతీతి.
10 . శ్రీత్రయంబకేశ్వరుడు
మహారాష్ట్రలోని నాసిక్‌కు 30 కిలోమీటర్ల దూరంలో శ్రీ త్రయంబుకేశ్వరాలయం ఉంది. బ్రహ్మవిష్ణువుల ప్రార్థనలతో స్వయంభువుగా వెలసి బ్రాహ్మతో త్రయంబకేశ్వరుడిగా కీర్తనలందుకొన్న త్రయంబకేశ్వర క్షేత్రం గురించి రెండు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
11 . శ్రీ కేధారేశ్వరుడు
ఉత్తరాంచల్‌ రాష్ట్రంలో కేదారేశ్వలయం ఉంది. హిమాలయశిఖరం మందాకిని నదీతీరంలో సముద్ర మట్టానికి 3585 మీటర్ల ఎత్తులో ఎద్దుమూపుర ఆకారంలో ఉందీ జ్యోతిర్లింగం. గౌరీకుండ నుంచి 14కిలోమీటర్ల దూరం గుర్రాలుపై గానీ, డోలీలో గానీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ నుంచి నవంబరు నెల వరకే ఈ ఆలయం తెరుస్తారు. విష్ణుమూర్తి నరనారాయణులుగా కొన్ని వేల సంవత్సరాలు శివుని ధ్యానించి తపస్సు చేసి లోక కల్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ కథ. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారని ప్రతీతి. అంతరాలయంలో నేటికీ పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆదిదంపతుల కళ్యాణసమయంలో హోమగుండం, నేటికీ దర్శించవచ్చు. హరిద్వార్‌ నుంచి గౌరీకుండ్‌ వరకు బస్సు మార్గం ఉంది.
12 .శ్రీ ఘృష్ణేశ్వరుడు
మహారాష్ట్ర ఔరంగబాద్‌ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో శ్రీవిఘ్నేశ్వరాలయం ఉంది. అజంతా ఎల్లోరా గ్రామంలో ఘృష్ణేశ్వర ఆలయం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు, ప్రపంచ ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు, దేవగిరి కొండపై ఘృష్ణేశ్వరుని ఆలయం వెలిసింది.

Monday, 12 February 2018

మాఘపురాణం - 21వ అధ్యాయము


దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట
దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు, మహేశ్వరుల యొక్క అంశమున జన్మించిన ఆడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి వున్నారు.
దత్తాత్రేయుని కాలంలో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని యాశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి “గురువర్యా! మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకొని వుంటిని. మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు. గాన మాఘమాసముయొక్క విశిష్టతను గురించి మాఘ స్నాన ఫలము గురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను” అని దత్తాత్రేయుని కోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికను మన్నించి యీ విధంగా వివరించిరి.
“భూపాలా! భరత ఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నప్పుడు ఆయా నదులకు పుష్కరారంభమగును. గనుక అటువంటి నదులయందు స్నానం చేసి దాన పుణ్యము లాచరించినయెడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకు కూడా సాధ్యం కాదు. అందునూ మాఘమాసమందు నదిలో స్నానం చేసిన గొప్ప ఫలితం కలుగుటయే గాక జన్మరాహిత్యం కలుగును. గనుక ఏ మానవుడైననూ మాఘమాసములో నదీస్నానం తప్పకుండా చేయవలెను. అటుల చేయని యెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము అనుభవించక తప్పదు.
మాఘమాసంలో సూర్యుడు మకరరాశియందుండగా మాఘ స్నానంబు చేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడైననూ ముక్తి నొందగలడు. అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునునకు ఈవిధముగా చెప్పుచున్నాను.
పూర్వకాలమున గంగా నదీతీరమున ఉత్తర భాగమున భాగ్యపురమను పట్టణము కలదు. అందు నివసించు జనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి దానం సంపాదించి అపర కుబేరుని వలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలదీ ఉన్నవాడు.
మరికొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రి ఆస్తిని భాగములు వేసి పంచుకొని ఇష్టమొచ్చినటుల పాడుచేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులు అయి ఉండిరి. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరచుటచే నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆవిధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపొయినారు.
యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్ళిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు.
“అయ్యా, మేమిద్దరమూ ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒకేవిధంగానే పాపములు చేసియున్నాము. అయినా అతనికి నరకమేల? నాకు స్వర్గమేల? ప్రాప్తించును!” అని అడిగెను. ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ, వైశ్యపుత్రా! నీవు నీ మిత్రుని మిత్రుని కలుసుకొనుటకు ప్రతీదినము గంగానది దాటి ఆవలి గట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసంలో నదిని దాటుచుండగా కెరటాలు జల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన నీవు పవిత్రుడవైనావు. మరొక విషయమేమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాతకములు కూడా నశించును. గాన విప్రుని చూచుటవలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియును గాక, ఆ బ్రాహ్మణుడు పఠించు గాయత్రీ మంత్రమును కూడా నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరం మీద పడినది గనుక నీ పాపములు నశించునందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను. అని చిత్రగుప్తుడు వివరించెను.
“ఆహా! ఏమి నా భాగ్యం! గంగాజలము నామీద పడినంత మాత్రముననే నా కింతటి మోక్షం కలిగినదా” అని వైశ్య కుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

మాఘపురాణం - 20వ అధ్యాయము


భీముడు ఏకాదశీ వ్రతము చేయుట
పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు. భోజనప్రియుడు. ఆకలికి ఏమాత్రం ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశీ వ్రతము చేయవలయునని కుతూహలం పుట్టెను. కానీ ఒక విషయంలో బెంగతో ఉండెను. అదేమందువా? ఏకాదశినాడు భోజనం చేయకూడదు కదా! భోజనం చేసిన ఫలం దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకు పోయి ‘ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమ పుణ్య దినమని అనెదరు గదా! దాని విశిష్టత ఏమి అని భీముడు అడిగెను.
“అవును భీమసేనా! ఆరోజు అన్నిదినముల కంటెను ప్రశస్తమయినది. శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతుల వారును ఏకాదశీవ్రతం చేయవచ్చును” అని పాండవ పురోహితుడు అగు ధౌమ్యుడు పలికెను.
“సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజన ప్రియుడనన్న సంగతి జగద్వితమే కదా! ఒక ఘడియ ఆలస్యమైన నేను ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశి నాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రత ఫలము దక్కులాగున నాకు వివరింపుము అని భీముడు పలికెను.
భీమసేనుని పలుకులకు ధౌమ్యుదు చిరునవ్వు నవ్వి “రాజా! ఏకాదశీ వ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏకార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో ఆకలి కలుగదు. రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహా శ్రేష్ఠమయినది. దానికి మించిన పర్వదినం మరియొకటి లేదు. ఒక్కొక్క సమయంలో మాఘ ఏకాదశీ రోజు పుష్యమీ నక్షత్రముతో కూడినదై యుండును. అటువంటి ఏకాదశికి సమానమగునది మరి ఏదియు లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువది నాల్గు ఏకాదశులలో మాఘశుద్ధ ఏకాదశీ మహా పర్వదినము గాన ఆ దినము ఏకాదశీ వ్రతం ఆచరింపుము. ఆకలి గురించి దిగులు పడకుము. ‘నియమము’ తప్పకూడదు. అని ధౌమ్యుడు భీమునకు వివరించెను.
ధౌమ్యుని వలన తన సంశయం నెరవేరుటకు మాఘశుద్ధ ఏకాదశి నాడు అతి నిష్ఠతో వ్రతం చేసి ఉపవాసముండెను. అందులకే మాఘ శుద్ధ ఏకాదశి “భీమ ఏకాదశి” అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు, అత్యంత ప్రీతికరమగు శివరాత్రి కూడా మాఘమాసమునందే వచ్చును. గాన మహా శివరాత్రి మహాత్మ్యమును గురించి కూడా వివరించెదను. శ్రద్ధాళుడవై ఆలకింపుము” అని వశిష్ఠుల వారు దిలీప మహారాజుతో ఇటుల పలికిరి.
శివరాత్రి మహాత్మ్యము
ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదేవిధంగా మాఘచతుర్దశీ అనగా శివ చతుర్దశి. దీనినే ‘శివరాత్రి’యని అందురు. ఈశ్వరునికి అత్యంత ప్రీతివంతమయిన దినము. ఇది మాఘమాసామునందు వచ్చు అమావాస్యకు ముందురోజు దానినే “మహాశివరాత్రి”యని అందరూ పిలిచెదరు. ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతి మాసమందు వచ్చు మాస శివరాత్రి కన్నా మాఘ మాస కృష్ణ పక్షంలో వచ్చు మహాశివరాత్రి పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలో గాని, తటాకమందుగాని, లేక నూతివద్ద గాని స్నానం చేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్వ పత్రములతో పూజించవలయును. అటుల పూజించి శివప్రసాడం సేవించి ఆ రాత్రి అంతయు తప్పనిసరిగా జాగరణ వుండి మరునాడు అమావాస్య స్నానం కూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగి ఉన్ననూ అవన్నియు వెంటనే హరించుకు పోయి, కైలాస ప్రాప్తి కలుగును. శివపూజా విధానంలో శివ రాత్రి కంటే మించినది మరియొకటి లేదు. గనుక మాఘమాసం కృష్ణ పక్షంలో వచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. గాన శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతి బేధములతో నిమిత్తం లేక అందరూ శివరాత్రి వ్రత మాచరించి జాగరణ చేయవలయును.
“మున్ను శబరీ నదీ తీరమందున్న అరణ్యంలో కులీనుడను బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసించుచుండెను. తనకు వేట తప్ప మరొక ఆలోచన లేదు. కడు మూర్ఖుడు. వేటకు పోవుట, జంతువులను చంపి, వాటిని కాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుట తప్ప మరేదియు తెలియదు. జంతువులను వేటాడుటలో నేర్పు గలవాడు, క్రూర మృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.
ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను. ఆనాడు జంతులేమియు కంటపడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సు అంగీకరించనందున పొద్దు గుంకి పోయిననూ అక్కడున్న మారేడు చెట్టుపైకెక్కి జంతువు కొరకు ఎదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలిఎక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకు లాగి వాటితో తన శరీరాన్ని కప్పుకొనుచుండెను. ఆ కొమ్మలకున్న ఎండుటాకులు రాలి చెట్టుక్రింద వున్నా శివలింగము మీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణతో వున్నాడు. తనకు తెలియక పోయిననూ మారేడు పత్రములు శివలింగముపై పడినవి ఇంకేమున్నది? శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్వ పత్రములు పడుట తిండిలేక ఉపవాసం ఉండుట ఇవన్నీ ఆ బోయవానికి మేలు చేసినవి.
జరామరణము లకు హెచ్చు తగ్గులు గాని, శిశువృద్ధులు గాని లేవు. పూర్వ జన్మలో చేసుకున్న పాప పుణ్యములను బట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.
మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యం కలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవుచుండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో నున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేసేది లేక యమునితో చెప్పిరి. యముడు కొంత తడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.
శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది తుంబుర నారద గణాలతో కొలువుతీర్చుకున్న సమయంలో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమాపతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలడిగి వచ్చిన కారణమేమిటని ప్రశ్నించెను.
అంతట యముడు మహేశా! చాలా దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నారాకకు కారణమేమనగా ఇంతకుముందు మీ దూతలు తీసుకువచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు. దయా దాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేసియున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆరాత్రి చలిబాధకు తట్టుకొనలేక బిల్వ పత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా ఉన్నాడు. కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొని వచ్చుట భావ్యమా? అంత మాత్రమున అతనికి కైవల్యము దొరుకునా” అని యముడు విన్నవించుకున్నాడు.
యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్వ పత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీ బోయవాడు కూడా పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడా ఆ వ్రత ఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి వ్రతమహిమ వలన ణా సాయుజ్యం ప్రాప్తమయినది అని పరమేశ్వరుడు యమునికి వివరించెను. యముడు చేసినది లేడి చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను

శివరాత్రి నాడు శివలింగాన్ని ఇలా పూజించండి








https://www.youtube.com/watch?v=kVrIr_k5IAA
https://www.youtube.com/watch?v=kVrIr_k5IAA

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Sunday, 11 February 2018

మహాశివరాత్రికీ




భగవత్భందువులందరికి,
ఎప్పటిలానే మహాశివరాత్రి పర్వదినం నాడు జరిగే వివిధ విశేష పూజలు మరియు ,హోమం, అభిషేకాలు,అర్చనలు,రుద్రాక్షలచే అర్చన,శత ఘటాభిషేకం, మొదలగు వాటిలో పాల్గొనదలచిన వారు 96666౦2371 నంబరు కు ఫోన్ చేసిసంప్రదించగలరు.ఏ పూజలో పాల్గొన్న వారైన అందరికి రుద్రాక్ష ఇవ్వబడును.
శుభమస్తు
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

Thursday, 8 February 2018

మాఘ పురాణం – 19 వ అధ్యాయం


గంగాజల మహాత్మ్యము
ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమహాత్మ్యమును
గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు
సముద్రంపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి
వారధిని దాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు సముద్రమును దాటునపుడు
శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును
దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో
ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును
చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ
 పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం
విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు
అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలంలో స్నానం చేసినచో మహాపాపములు సైతం
హరించిపోవును. గాన గంగాజలమునకు అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలం
గురించి చెప్పబోవునది ఏమనగా ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని
స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ! అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున
నీళ్ళు జల్లుకొనినచో అది గంగాజలంతో సమానమయినదగును. గంగాజలం విష్ణుమూర్తి
ప్రతిరూపం గనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూ లేదు. అని
గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.