చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై
నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు
జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? సూర్యగ్రహణం కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే
దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు
గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది.
శ్లో: రవి గ్రహస్సూర్యవారే సోమేగ్రహస్తదా!
చూడామణి ఖ్యాతః తత్రదత్తమనంతకం
వారేష్వన్యేషు యత్పుణ్యం గ్రహణే చంద్ర సూర్యయో:!
తత్పుణ్యమ్ కోటి యోగే చూడా మణౌ స్మృతం !!
— వ్యాసోక్తి – నిర్ణయసిందు
ఆదివారం సూర్యగ్రహణం, సోమవారం చంద్ర గ్రహణం వచ్చుటను “ చూడామణి యోగం ” అంటారు.
ఆ సమయంలో చేయబడిన దానం వలన అనంతఫలం వస్తుంది.
ఇతర వారాలోల సూర్య , చంద్ర గ్రహణాలు వస్తే చేసేదానం కంటే ఈ చూడామణి యోగం వచ్చునప్పుడు చేసేదానం కోటి
రెట్లు అధిక ఫలమిస్తుంది.
07.08.2017 రోజున ఇదే “చూడామణియోగం” వస్తుంది
స్పర్షకాలం – రాత్రి. 10:56
మధ్యకాలం – రాత్రి. 11:54
మోక్షకాలం – రాత్రి.12:52
ఆద్యంతపుణ్యకాలం -01:56.
గ్రహణ సమయంలో ఏం చేయాలి
ఆచారపరులు
గ్రహణ సమయాల్లో గ్రహణం పట్టేముందు పట్టు స్నాన్నాన, వీడే ముందు
విడుపుస్నానాన్ని ఆచరించాలి. గ్రహణానికి సంబంధించిన అతి నీలలోహిత కిరణాలను
నివారించే శక్తి కలిగిన ప్రకృతి ప్రసాదితమైన దర్బలను ఇళ్లల్లో ఉంచుకోవాలి.
దేవతా గదుల్లో, ఆహార పదార్థాల్లో, నీటిలో వేసి ఉంచుకోవడం ద్వారా గ్రహణ
కాంతులను ఈ దర్బలు (గరక) దరిచేరనియ్యవు. గ్రహణ సమయాల్లో చేసే జపాలు,
అనుష్టానాలు కోటి రేట్లు ఫలితాన్నిస్తాయని, ఈ సమయంలో చేసే జపాలు, దానాలకు
విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటితో
పాటు పరిసర ప్రాంతాలు శుద్ధి చేసుకొని నిత్య దేవత ఆరాధన చేసి భోజనం
చేయకుండా అల్పాహారం తీసుకుంటే మంచిది.
చేయ వలసిన దానాలు నారికేళం,చంద్రుడి ప్రతిబింబాన్ని వెండితోగానీ బంగారంతో గానీ చేయించి బియ్యం, ఉల్వలు గ్రహణంలోపు దానం చేయాలి.
గ్రహణం వల్ల నష్టాలున్నాయా ?
ఈ
భూమి, సూర్య, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడం ద్వారా ఆ రాపిడి వల్ల కలిగే అతి
నీలలోహిత కిరణాలు మానవులపై ప్రసరింపజేయడం ద్వారా మనకు కొన్ని అనారోగ్యాలు
కలిగే ప్రమాదం లేకపోలేదు. ప్రధానంగా గర్భిణులపై ఈ గ్రహణ ప్రభావం
పడుతుంది.గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుంది. తద్వారా
పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ
ప్రభావం పడకుండా గ్రహణ వేద ప్రారంభం కాకముందే అంటే గ్రహణ సమయానికి ఆరు గంటల
ముందుగా భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అంటే తినే పదార్థానికి అరుగుదల
కావడానికి సరైన సమయం అన్న మాట.
రాశుల వారీగా
ఆగస్టు
7, 2017 సోమవారం శ్రావణ నక్షత్రంలో చూడామణి అనే పేరిట కేతుగ్రస్త ఖండగ్రాస
చంద్రగ్రహణం ఏర్పడుతుందని వేద ప్రముఖ పండితులు చెబుతున్నారు. మరి ఇలాంటి
గ్రహణాల సమయంలో ప్రధానంగా 7వ తేదీ వచ్చే గ్రహణానికి శ్రావణనక్షత్రంలో, మకర
రాశిలో చంద్రుడికి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి చంద్ర గ్ర
హణానికి సంబంధమైన రోహిణి, హస్త, శ్రావణం నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలని అదే
విధంగా మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలని, మేష, సింహా, వృశిక, మీనరాశి
వారికి శుభం, వృషభ, కర్కాటక, కన్య, ధనురాశి, వారికి మధ్యమం, మిథున, తుల,
మకర, కుంభ రాశుల వారికి అరిష్టం.
ఆలయాలు మధ్యాహ్నం నుంచి మూసివేత
చంద్రగ్రహణం
సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి ఆలయాలు మూసి వేసి మరుసటి రోజు
అంటే 8వ తేదీ ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి మళ్లీ యథాతథంగా
పూజలు నిర్వహిస్తారు.
ఉపాకర్మ :
ఉపాకర్మలు ఆచరరించే వారు గ్రహణ యుక్తమైన శ్రావణ పౌర్ణమి నాడు ఆచరరించరాదు.రుగ్, యజుర్, సామ అన్ని వర్గాలవారు బాద్రపద పౌర్ణమి నాడు ఉపాకర్మలు(జ్య౦ద్యాలు మార్చుకోవడం) ఆచరించవచ్చు.
ఛంద్ర గ్రహణ విశేషాలు,దానాల కొరకు మరియు ఇతర విషయాల కొరకు సంప్రదించండి 9000123129
No comments:
Post a Comment