Friday, 25 August 2017

గకార గణపతి అష్టోత్తర శతనామ స్తోత్రం


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ!
నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా!!
అస్య శ్రీ గణేశ అష్టోత్తర శతనామ స్తోత్ర మహామంత్రస్య గణక ఋషిః అనుష్టుప్ ఛందః గణాధీశో దేవతా శ్రీమహాగణపతి ప్రసాద సిద్ధ్యర్ధే సనాతన ధర్మ పరిరక్షణార్ధే మమ భారతదేశ సౌభాగ్య సిద్ధ్యర్ధే పాఠే వినియోగః
విఘ్నేశా విధివార్తాండ చంద్రేద్రోపేంద్ర వందితా!
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే!!
శ్రీ గణపతయే నమః! శ్రీ గణపతయే నమః! శ్రీ గణపతయే నమః!
గకారరూపో గంబీజో గణేశో గణవందిత!
గణనీయో గణో గణ్యో గణనాతీత సద్గుణః!
గగనాదికసృడ్ గంగాసుతో గంగాసుతార్చితః!
గంగాధర ప్రీతికరో గవీశేడ్యో గదాపహః!!
గదాధరనుతో గద్య పద్యాత్మక కవిత్వదః!
గజాస్యో గజలక్ష్మీవాన్ గజవాజిరథప్రదః!!
గంజానిరతశిక్షాకృద్ గణితజ్ఞో గణోత్తమః!
గండదానాంచితో గంతా గండోపలసమాకృతిః!!
గగనవ్యాపకో గమ్యో గమనాది వివర్జితః!
గండదోషహరో గండ భ్రమద్భ్రమరకుండలః!!
గతాగతజ్ఞో గతిదో గతమృత్యుః గతోద్భవః!
గంధప్రియో గంధవాహో గంధ సింధుర బృందగః!!
గంధాదిపూజితో గవ్యభోక్తా గర్దాది సన్నుతః!
గరిష్ఠో గరభిద్ గర్వహరో గరళిభూషణః!!
గవిష్ఠో గర్జితారావో గంభీరహృదయో గదీ!
గలత్ కుష్ఠహరో గర్భప్రదో గర్భార్భరక్షకః!!
గర్భాధారో గర్భవాసిశిశుజ్ఞాన ప్రదాయకః!
గరుత్మత్తుల్యజవనో గరుదధ్వజవందితః!!
గయేడితో గయా శ్రాద్ధ ఫలదశ్చ గయాకృతిః!
గదాధరావతారీ చ గంధర్వ నగరార్చితః!!
గంధర్వగాన సంతుష్టో గరుడాగ్రజ వందితః!
గణరాత్ర సమారాధ్యో గర్హణస్తుతి సామ్యధీః!!
గర్తాభనాభిః గవ్యూ(వ్యో)తిదీర్ఘతుండో గభస్తిమాన్!
గర్హితాచారదూరశ్చ గరుడోపలభూషితః!!
గజారివిక్రమో గంధమూషవాజీ గతశ్రమః!
గవేషణీయో గహనో గహనస్థమునిస్తుతః!!
గవయచ్ఛిద్ గండకభిద్ గహ్వరాపథవారణః!
గజదంతాయుధో గర్జద్ రిపుఘ్నో గజకర్ణికః!!
గజచర్మామయచ్ఛేత్తా గణాధ్యక్షో గణార్చితః!
గణికానర్తనప్రీతో గచ్ఛన్ గంధఫలీ ప్రియః!!
గంధకాదిరసాధీశో గణకానందదాయకః!
గర్తభాదిజనుర్హర్తా గండకీగాహనోత్సుకః!!
గండూషీకృతవారాశిః గరిమాలఘిమాదిదః!
గవాక్షవత్సౌధవాసీ గర్భితో గర్భిణీనుతః!!
గంధమాదన శైలాభో జ్గండభేరుండ విక్రమః!
గదితో గద్గదారావసంస్తుతో గహ్వరీపతిః!!
గజేడ్ గలీ(రీ)యాన్ గద్యేడ్యో గతభీర్ గదితాగమః!
గర్హణీయగుణాభావో గంగాదిక శుచిప్రదః!!
గణనాతీత విద్యా శ్రీ బలాయుష్యాదిదాయకః!
ప్రాచ్యాం రక్షతు హేరంబః ఆగ్నేయాం అగ్ని తేజసః!!
యామ్యాం లంబోదరో రక్షేత్ నైర్రుత్యాం పార్వతీ సుతః
ప్రతీచ్యాం వక్రతుండస్తు వాయవ్యాం వరదప్రభుః!!
ఉదీచ్యాం గణపః పాతు ఈశాన్యాం ఈశనందనః!
ఏవం దశదిశో రక్షేత్ హ్యవరం విఘ్ననాయకః
గణంజయో గణపతిః హేరంభో ధరణీధరః!!
మహాగణపతిః లక్షప్రదః క్షిప్రప్రసాదనః!
అమోఘసిద్ధిరమితో మంత్రశ్చింతా మణిర్నిధిః!!
సుమంగళో బీజమాషాపూరకో వరదశ్శివః!
కాశ్యపో నందనో వాచాసిద్ధో డుంఢివినాయకః!!
శ్రీ గణపతయే నమః!!

సంకట విమోచక గణపతి స్తోత్రం :






ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం
భక్తావాస స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే
ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం

లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ
సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తథాష్టమం
నవమం ఫాలచంద్రం చ దశమంతు వినాయకం
ఏకాదశం గణపతిం ద్వాదశాంతు గజాననం
ద్వాదశైతాని నామాని యః పఠేత్ శ్రుణుయాన్నిత్యం
నచ విఘ్నభయం తస్యసర్వసిద్ధికరం ప్రభోః
విద్యార్థీ లభతే విద్యా ధనార్థీ లభతే ధనం
పుత్రార్థీ లభేత్ పుత్రం మోక్షార్థీ లభేత్ గతిం
జపేద్గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్
సంవత్సరేణ సిద్ధించ లభతే నాత్ర సంశయః
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చః లిఖిత్వాయత్సమర్పయేత్
తస్య విద్యా భ వేత్సర్వా గణేశస్య ప్రసాదతః


Sunday, 6 August 2017

చూడామణి యోగం – సోమవారం – చంద్ర గ్రహణం – ఆది వారం - సూర్య గ్రహణం



చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై
నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు
జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలాసేపు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది.చంద్రగ్రహణమేర్పడే పరిస్థితిలో భూమిపైనున్నవారికి చంద్రగ్రహణం కనబడితే, అదే సమయంలో చంద్రుడిపైనుండి వీక్షిస్తే? సూర్యగ్రహణం కనబడుతుంది.సూర్యగ్రహణానికి చంద్ర గ్రహణానికి ఉన్న తేడా ఏమిటంటే, చంద్ర గ్రహణం నాడు చంద్రుడు కనపడనట్లే సూర్య గ్రహణం నాడు, సూర్యుడు కనపడడు. ఇది చంద్రుడు, సూర్యుడు మరియు భూమి మధ్యలోనుంచి ప్రయాణిస్తున్నపుడు ఏర్పడుతుంది.సూర్యగ్రహణం వలే కాకుండా చంద్ర గ్రహణాన్ని వీక్షించడం వలన కళ్ళకు ఎటువంటి హానీ జరగదు.రక్షణ కోసం ఎటువంటి కళ్ళజోడు అవసరం లేదు. టెలిస్కోప్ కూడా అవసరం లేదు. కేవలం రెండు కళ్ళతో కూడా వీక్షించవచ్చు. కాకపోతే
దూరదృశ్యాలను చూడడానికి ఉపయోగించే బైనాక్యులర్స్ను వాడితే చంద్ర గ్రహణాన్ని మరింత స్పష్టంగా వీక్షించవచ్చు. చంద్ర గ్రహణం సమయంలో గర్భవతులు బయట తిరిగితే కడుపులో శిశువుకు హాని జరుగుతుందని, ఏమీ తినకూడదని, గోళ్ళు
గిల్లుకోకూడదని, ఏమీ తినకూడదని పూర్వం నుండి భారతదేశంలో నమ్మకం ఉంది.
శ్లో:  రవి గ్రహస్సూర్యవారే సోమేగ్రహస్తదా!
చూడామణి ఖ్యాతః తత్రదత్తమనంతకం
వారేష్వన్యేషు యత్పుణ్యం గ్రహణే చంద్ర సూర్యయో:!
తత్పుణ్యమ్ కోటి యోగే చూడా మణౌ స్మృతం !!       
 — వ్యాసోక్తి – నిర్ణయసిందు
   
   ఆదివారం సూర్యగ్రహణం, సోమవారం చంద్ర గ్రహణం వచ్చుటను                “ చూడామణి యోగం ” అంటారు.
ఆ సమయంలో చేయబడిన దానం వలన అనంతఫలం వస్తుంది.
ఇతర వారాలోల సూర్య , చంద్ర గ్రహణాలు వస్తే చేసేదానం కంటే ఈ చూడామణి యోగం వచ్చునప్పుడు చేసేదానం  కోటి
రెట్లు అధిక ఫలమిస్తుంది.
07.08.2017 రోజున ఇదే “చూడామణియోగం” వస్తుంది
స్పర్షకాలం – రాత్రి. 10:56
మధ్యకాలం – రాత్రి. 11:54
మోక్షకాలం – రాత్రి.12:52
ఆద్యంతపుణ్యకాలం -01:56.


గ్రహణ సమయంలో ఏం చేయాలి
ఆచారపరులు గ్రహణ సమయాల్లో గ్రహణం పట్టేముందు పట్టు స్నాన్నాన, వీడే ముందు విడుపుస్నానాన్ని ఆచరించాలి. గ్రహణానికి సంబంధించిన అతి నీలలోహిత కిరణాలను నివారించే శక్తి కలిగిన ప్రకృతి ప్రసాదితమైన దర్బలను ఇళ్లల్లో ఉంచుకోవాలి. దేవతా గదుల్లో, ఆహార పదార్థాల్లో, నీటిలో వేసి ఉంచుకోవడం ద్వారా గ్రహణ కాంతులను ఈ దర్బలు (గరక) దరిచేరనియ్యవు. గ్రహణ సమయాల్లో చేసే జపాలు, అనుష్టానాలు కోటి రేట్లు ఫలితాన్నిస్తాయని, ఈ సమయంలో చేసే జపాలు, దానాలకు విశేష ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు. గ్రహణం ముగిసిన తర్వాత ఇంటితో పాటు పరిసర ప్రాంతాలు శుద్ధి చేసుకొని నిత్య దేవత ఆరాధన చేసి భోజనం చేయకుండా అల్పాహారం తీసుకుంటే మంచిది.

 చేయ వలసిన దానాలు నారికేళం,చంద్రుడి ప్రతిబింబాన్ని వెండితోగానీ బంగారంతో గానీ చేయించి బియ్యం, ఉల్వలు గ్రహణంలోపు దానం చేయాలి.



గ్రహణం వల్ల నష్టాలున్నాయా ?
ఈ భూమి, సూర్య, చంద్రుడు ఒకే సరళరేఖపై రావడం ద్వారా ఆ రాపిడి వల్ల కలిగే అతి నీలలోహిత కిరణాలు మానవులపై ప్రసరింపజేయడం ద్వారా మనకు కొన్ని అనారోగ్యాలు కలిగే ప్రమాదం లేకపోలేదు. ప్రధానంగా గర్భిణులపై ఈ గ్రహణ ప్రభావం పడుతుంది.గర్భంలోని పిండంపై త్వరితగతిన ప్రభావం చూపుతుంది. తద్వారా పుట్టబోయే సంతానం ఏదైనా లోపాలతో పుడతారని పెద్దలు చెబుతున్నారు. అందుకే ఈ ప్రభావం పడకుండా గ్రహణ వేద ప్రారంభం కాకముందే అంటే గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగా భోజనం చేయమని శాస్త్రం చెబుతుంది. అంటే తినే పదార్థానికి అరుగుదల కావడానికి సరైన సమయం అన్న మాట.
 
రాశుల వారీగా
ఆగస్టు 7, 2017 సోమవారం శ్రావణ నక్షత్రంలో చూడామణి అనే పేరిట కేతుగ్రస్త ఖండగ్రాస చంద్రగ్రహణం ఏర్పడుతుందని వేద ప్రముఖ పండితులు చెబుతున్నారు. మరి ఇలాంటి గ్రహణాల సమయంలో ప్రధానంగా 7వ తేదీ వచ్చే గ్రహణానికి శ్రావణనక్షత్రంలో, మకర రాశిలో చంద్రుడికి కేతుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. కాబట్టి చంద్ర గ్ర హణానికి సంబంధమైన రోహిణి, హస్త, శ్రావణం నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలని అదే విధంగా మకర రాశి వారు జాగ్రత్తగా ఉండాలని, మేష, సింహా, వృశిక, మీనరాశి వారికి శుభం, వృషభ, కర్కాటక, కన్య, ధనురాశి, వారికి మధ్యమం, మిథున, తుల, మకర, కుంభ రాశుల వారికి అరిష్టం.
 
ఆలయాలు మధ్యాహ్నం నుంచి మూసివేత
చంద్రగ్రహణం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 1:30 నుంచి ఆలయాలు మూసి వేసి మరుసటి రోజు అంటే 8వ తేదీ ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి మళ్లీ యథాతథంగా పూజలు నిర్వహిస్తారు.
 
ఉపాకర్మ :
ఉపాకర్మలు ఆచరరించే వారు గ్రహణ యుక్తమైన శ్రావణ పౌర్ణమి నాడు ఆచరరించరాదు.రుగ్, యజుర్, సామ అన్ని వర్గాలవారు బాద్రపద పౌర్ణమి నాడు ఉపాకర్మలు(జ్య౦ద్యాలు మార్చుకోవడం) ఆచరించవచ్చు.
 
 
 
ఛంద్ర గ్రహణ విశేషాలు,దానాల కొరకు మరియు ఇతర విషయాల కొరకు సంప్రదించండి 9000123129

రక్షా బంధన్‌ - చంద్ర గ్రహణం



రక్షా బంధన్‌కు చంద్ర గ్రహణం ఎఫెక్ట్!

 అన్నా చెళ్లుల్లు, అక్కా తమ్ముళ్లకు ఆత్మీయ పండుగ రక్షా బంధన్. ఈ పవిత్రమైన రోజున ఆడపడచులు వారి తమ్ముళ్లు, అన్నలకు రాఖీ కట్టి వారితో తమ అనుబంధాన్ని చాటుకుంటారు. అన్నా, తమ్ముళ్లు తమకు జీవితాంతం రక్షణగా ఉండాలని కోరుకుంటూ రాఖీ కట్టి దేవుణ్ని ప్రార్థిస్తారు. మరి ఇలాంటి పవిత్రమైన రోజున ఈసారి చంద్రగ్రహణం కూడా వస్తోంది. చంద్రగ్రహణం రోజు రాఖీ కట్టడం, కట్టించుకోవడం అరిష్టమని, మంచిది కాదని ఇప్పటికే రూమర్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై పండితులు కూడా తలోమాట చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే గ్రహణం సమయంలో మూడనమ్మకాల జోలికి వెళ్లొద్దని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

చంద్ర గ్రహణం సమయంలో సోదరులకు రాఖీ కట్టడం వల్ల ఎలాంటి దుష్ర్పభావం ఉండదని, అసలు గ్రహణానికి రక్షా బంధన్‌కు సంబంధమే లేదంటున్నారు. సోమవారం, మంగళవారం దేశ వ్యాప్తంగా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సోమవారం రాత్రి 9.18 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై మంగళవారం తెల్లవారుజామున 2.20 గంటలకు ముగుస్తుంది. అయితే రక్షాబంధన్‌కు గ్రహణానికి ఎలాంటి సంబంధంలేదు. ఇది కేవలం సోదరీ సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు మాత్రమే సంబంధించినడిది.

 

 

 

2017లో మొత్తం నాలుగు గ్ర‌హణాలు

2017లో మొత్తం   నాలుగు  గ్ర‌హణాలు ప్ర‌జ‌ల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌బోతున్నాయి. కాగా ఈ  నాలుగింటిలో రెండు సూర్యగ్ర‌హణాలు , రెండు చంద్ర‌గ్ర‌హ‌ణాలు ఉన్నాయి  అని  ఉజ్జ‌యినిలోని జివాజీ ప‌రిశోధ‌న సంస్థ పేర్కొంది.
అయితే  ఇందులో రెండు చంద్ర‌గ్ర‌హ‌ణాలు మాత్ర‌మే భార‌త్‌ దేశంలో క‌నువిందు చేయ‌నున్నాయి. సూర్య గ్ర‌హణాలు భార‌త్‌లో క‌నిపించ‌వ‌ని పేర్కొన్నారు.
ఒకే నెలలో   ఫిబ్ర‌వ‌రి 11న చంద్ర‌గ్ర‌హ‌ణం, అదే నెల 26న సూర్య‌గ్ర‌హ‌ణం రావడం జరిగింది  , మిగిలిన రెండు గ్రహాలు కూడా మలీ ఒకే నెల లో  ఆగ‌స్టు 7న పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం, అదే నెల 21న సంపూర్ణ సూర్య‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డతాయని ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.
ఏ సమయములో ఈ గ్రహణాలు ఏర్పడతాయి ?
పిబ్రవరి లో వచ్చే చంద్ర గ్రహనం 10, 11 తేదిల్లో  ఏర్పడుతోంది. అయితే ఈ గ్రహణాన్ని భారత్తో పాటు యూరప్ ఆసియా,ఆఫ్రికా ఉత్తర ఆమెరికా, దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్టాంటిక్ ,హిండూ మహాసముద్రం, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పాక్షికంగా కన్పిస్తోంది.
ఇండియాలో ఐతే  ఈ చంద్ర గ్రహణం  ఫిబ్రవరి 11వ తేది ఉదయం 4 గంటల 4 నిమిషాల 14 సెకన్లకు ప్రారంభం అవుతుంది. పూర్తిస్థాయిలో గ్రహణం 6 గంటల 13 నిమిషాల 49 సెకన్లకు కన్పిస్తోంది. అనగా  చంద్ర గ్రహణం అదే రోజు 8 గంటల 23 నిమిషాల 25 సెకన్లకు పూర్తిఅవుతుంది అన్న మాట .
పిబ్రవరి లోనే వచ్చే  సూర్య గ్రహణం  ఫిబ్రవరి 26వ తేదిన  ఏర్పడనుంది  . ఈ గ్రహణం పాక్షికంగా దక్షిణ, పశ్చిమ ఆఫ్రికాలో కన్పిస్తోంది. ఫసిఫిక్, అట్టాంటిక్, హిందూ మహసముద్రం, అంటార్కిటికా ప్రాంతాల్లో కన్పిస్తోంది.
ఈ గ్రహణం ఫిబ్రవరి 26వ తేది సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు ప్రారంభం   కాగా , పూర్తి స్థాయిలో మాత్రం  సాయంత్రం 6 గంటల 45 నమిషాలకు ఏర్పడతుంది. ఈ గ్రహణం రాత్రి పూట 11 గంటల 5 నిమిషాలకు పూర్తి కానుంది.
ఆగస్టు లో వచ్చే చంద్ర గ్రహనం   ఆగష్టు 7 లేదా 8వ, తేదిల్లో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఈ గ్రహాణాన్ని యూరప్ తో పాటు ఆసియా అస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని తూర్పు ప్రాంతాల ప్రజలు ఫసిఫిక్ , అట్లాంటిక్ , హిందూ మహాసముద్రం, అర్కిటిక్ ప్రాంతాల్లో కన్పిస్తోంది.
ఇండియాలో ఐతే  ఈ గ్రహణం సుమారు 5 గంటల 1 నిమిషం పాటు ఉంటుంది. ఈ గ్రహణం పాక్షికంగా 1గంట 53 నిమిషాల సేపు ఉంటుంది.
ఆగష్టులో  21 వ, తేదిన పూర్తిస్థాయిలో సూర్య గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహాణాన్ని యూరప్, ఉత్తర, తూర్పు ఆసియా, నార్త్, పశ్చిమ అఫ్రికా, నార్త్ అమెరికా,దక్షిణ అమెరికా, ఫసిఫిక్, అట్లాంటిక్, ఆర్కిటిక్ లలో కన్పిస్తోంది. ఇంకో విశేషము ఏమిటంటే  ఈ గ్రహణం తొలిసారిగా అమెరికాలో కన్పిస్తోంది. గతంలో అమెరికాలో 1979 లో ఈ గ్రహణం పూర్తిస్థాయిలో కన్పించింది.
ఈ సూర్యగ్రహణం 5గంటల 18 నిమిషాల పాటు ఉంటుంది. అయితే గ్రహణం మాత్రం 3 గంటల 13 నిమిషాల పాటు ఉండనుంది. ఆగష్టు 21వ, తేది రాత్రి తొమ్మిది గంటల 16 నమిషాలకు ఈ  గ్రహణం ప్రారంభం అవుతుంది.

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలోని చంద్ర గ్రహణములు

2017 - 2018 శ్రీ హేమలంబ నామ సంవత్సరంలోని చంద్ర గ్రహణములు

శ్రీ హేమలంబ నామ సంవత్సరంలో చంద్ర గ్రహణములు రెండు పర్యాయములు కలవు.
  •  7 - ఆగష్టు - 2017 , శ్రీ హేమలంబ నామ సంవత్సర శ్రావణ మాస పౌర్ణమి సోమవారం శ్రవణా నక్షత్రమందు రాత్రి 10.52 నుండి రాత్రి 12.48 వరకూ కేతుగ్రస్త పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడును. శ్రవణా నక్షత్ర జాతకులు, మకర రాశి వారు గ్రహణ శాంతి జరిపించుకోనవలెను.
  • 31 - జనవరి - 2018 , శ్రీ హేమలంబ నామ సంవత్సరం మాఘ మాస పౌర్ణమి బుధవారం పుష్యమే ఆశ్లేష నక్షత్రములందు సాయంత్రం 5.12 నుండి రాత్రి 8.52 వరకూ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడును. పుష్యమీ, ఆశ్లేష నక్షత్ర జాతకులు, కర్కాటక రాశీ వారు గ్రహణ శాంతి జరిపించుకోవలెను.