Tuesday, 15 October 2019

నేను రోజు పూజించే దేవుడి దగ్గర నాకు మాట్లాడే అవకాశం దొరికింది....



దేవుడా! నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగవచ్చా!
దేవుడు: అడుగు.
నేను : మీరు నేను అడిగే ప్రశ్నలకి కోపం తెచ్చుకోకుండా జవాబులు ఇస్తారా?
దేవుడు : ఇస్తాను
నేను : ఈ రోజు నాకు ఎందుకు చాల చెడ్డ రోజుని ఇచ్చావు ?
దేవుడు : ఎందుకని నువ్వు అలా చెప్తున్నావు
నేను : ఎప్పుడు సరైన సమయానికే నిద్ర లేచే నేను ఈ రోజు చాలా ఆలస్యంగా లేచాను.
దేవుడు : అవును.హడావిడిలో నాకు నమస్కారం కూడా చేయకుండా వెళ్ళావు.
నేను : నేను లేటుగా ఆఫీసుకి బయలుదేరాను దారిలో నా బండి పంచర్ అయింది.
దేవుడు : అవును ! నాకు తెలుసు .
నేను : సరే ! పోనీ బస్సులో వెళ్ళాదము అని బస్సు ఎక్కా, మధ్యలో యాక్సిడెంట్ అయింది, ట్రాఫిక్ జామ్ లో ఒక గంట ఆఫీసుకి లేట్ అయింది .
దేవుడు: అవును ! తెలుసు .
నేను: మధ్యాహ్నం భోజనానికి లేట్ అయింది ,ఈ లోపు క్యాంటీన్లో భోజనం అయిపోయింది. కొట్టుకి వెళ్లి ఎదో ఒకటి తిని వచ్చా .
దేవుడు : అవును ! అది కూడా నాకు తెలుసు .
నేను : బ్యాంకు లో పర్సనల్ లోన్ కోసం అప్లై చేశాను దాని విషయమై ఒక వ్యక్తి నుంచి ఫోన్ రావటం కోసం ఎదురుచూశాను. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో అతని వద్ద నుంచి ఫోన్ వచ్చింది బ్యాటరీలో ఛార్జ్ అయిపోయినందువల్ల ఆ సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది.
దేవుడు : అవును ! తెలుసు
నేను : ఎలాగో ఓలాగా ఇంటికి చేరా ! కొద్దిసేపు AC రూంలో కూర్చొని TV చూస్తూ విశ్రాంతి తీసుకుందాం అనుకున్నా కానీ AC పని చేయలేదు .ఈ రోజు నాకు ఒక పని కూడా సరిగ్గా జరగలేదు.
ఒక రోజు నీకు దండం పెట్టకుండా వెళ్లినందుకు నాకు ఇన్ని కష్టాలా !
(దేవుడు పెద్దగా నవ్వి కొన్ని సెకన్ల తర్వాతా మాట్లాడటం మొదలు పెట్టాడు.)
దేవుడు: నీ కర్మ ప్రకారం ఈ రోజు నీకు అంతా చెడుగా జరిగింది. ఈ రోజు ప్రొద్దున నువ్వు హాయిగా నిద్రపోతున్న సమయంలో యమధర్మరాజు నీ వైపు వస్తూ ఉన్నాడు. అతనితో వాగ్వాదం చేసి నిన్ను కాపాడటానికి నిన్ను కొంచెం ఎక్కువ సేపు నిద్రలో ఉంచాను.
నేను : ఆశ్చర్యంతో ! ఓ దేవుడా !
దేవుడు: నీ బైక్ ని పంచేర్ చేశాను ఎందుకంటే నువ్వు ఆఫీసుకి వెళ్లి దారిలో బ్రేక్ ఫెయిల్ అయిపోయిన ఒక వ్యాన్ నీ వైపుగా వచ్చి నిన్ను గుద్దేలా ఉంది. ఆ వ్యాన్ యాక్సిడెంట్ అయి ట్రాఫిక్ ఆగింది నువ్వు బైక్ లో వెళ్లి ఉంటే ఆ వ్యాన్ యముడి లెక్క ప్రకారం నిన్ను గుద్ది ఉండేది .
నేను: (మౌనంతో ) ఊ....
దేవుడు: మధ్యాహ్నం నీకు భోజనం దొరక్కపోయిన కారణం చివర్లో ఉన్న ఆహారంలో ఎలుకలకు పెట్టిన మందు భోజనంలో కలిసింది, అది ఎవ్వరు గమనించలేదు దాన్ని నువ్వు తింటే ఏం అయి ఉండేది .
నేను: ( కళ్ళలో భయంతో ) ఊ ఊ ....
దేవుడు: సాయంత్రం నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన కారణం ఆ వ్యక్తి నీకు తప్పుడు సమాచారం ఇచ్చి నిన్ను ఇరికించాలి అని అనుకున్నాడు, దాని నుంచి నిన్ను కాపాడటానికి నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను.
నేను: ఊ ఊ ...
దేవుడు: తర్వాత ఆ AC మెషిన్ కి ఎర్త్ రిపేర్ వచ్చి కరెంటు ఎక్కువగా పాస్ అవుతుంది, ఒక వేళా నువ్వు ఎప్పటిలాగే ముఖం కడుక్కొని తడి చేతితో స్విచ్ ఆన్ చేస్తే నీకు కరెంటు షాక్ కొట్టి ఎగిరి పడతావు అని AC పని చేయకుండా చేశాను.
నువ్వు నాకు దండం పెట్టడం మర్చిపోయినందుకే నీకు ఇన్ని కష్టాలు వచ్చాయని నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావు కానీ నువ్వు నన్ను ప్రతి రోజు పూజిస్తూనే ఉన్నావు, ఒక్క రోజు నన్ను పూజించటం మర్చిపోయినా కూడా నేను నిన్ను కాపాడటం మర్చిపోలేదు.
నేను: ఇప్పుడు అర్ధం అయింది దేవుడా ! నువ్వు నా మీద పెట్టుకున్న ప్రేమని, నేను అర్ధం చేసుకోకుండా అపార్ధం చేసుకున్నాను . నన్ను క్షమించు .
దేవుడు: క్షమించు అని అడగవద్దు. నువ్వు ఎటువంటి కష్ట సమయంలో ఉన్నా నా పై నమ్మకం ఉంచు అది చాలు.
నేను : ఖచ్చితంగా!
దేవుడు : నువ్వు నీ గురించి వేసే అంచనాలకన్నా నేను నీ గురించి వేసే అంచనాలే సరిగ్గా ఉంటాయి .
నేను: ఇంకెప్పుడు నేను నీ విషయంలో సందేహపడను స్వామి , నేను నీ శక్తిని కూడా సందేహించను. మా కనురెప్పల వాలే ప్రతిక్షణం నువ్వు మమల్ని కాపాడుతున్నావు అని తెలుసుకున్నాను.
దేవుడు: నన్ను నమ్మిన వారి చేతిని నేను ఎప్పుడు విడిచిపెట్టాను.

No comments:

Post a Comment