Friday 10 August 2018

కాల సర్ప యోగములు




                                    కాల సర్ప యోగ పలితాలు
1. జ్ఞాన దృష్టి లేకపోవటము లేక మెదడు సరిగా ఎదగక పోవడము  వల్ల అవమానాలు  ( లేక  ) అపార్ధాలు చేసుకోవడము.
2. జన్మించిన సంతానమునకు బుధి మాంద్యము కలుగుట.
3. గర్భములో శిశువు మరణించుట .
4. భార్య భర్తల మధ్య సక్యత లేకపోవుట ( లేక ) వైవాహిక జీవతం లో అసంతృప్తి.
5. మరణించిన శిశువు కలుగుట.
6. గర్భము నిలవకపోవడము, విచిత్రమయిన రోగములు కలగడము.
7. అంగ వైకల్యము సంతానము కలగడము, వాహన ప్రమాదాలు.
8. శస్త్ర చికిచలు విపలము అయి మరణించడం జరుగుతుంది.
9. వృషణముల వ్యాధులు , వ్యసనాలకు భానిసలు కావడము.
10. వీర్య కణములు నశించుట, నసుపుకత్వము ఏర్పడుట.
11. కాన్సర్, సిఫిలిస్ , హెర్నియా , ఎయిడ్స్ , ముత్ర సంబందమయిన రోగములు కలగడము.
12. వంశ వృది లేకపోవడము, కుటుంబములో ప్రేమ అభిమనములు తగిపోవడము.
13. శత్రువుల వలన మృతి చెందడము, సంతానము శత్రువులుగా మారడము.
14. మానసిక శాంతి లేకపోవడము, విష జంతువులవల్ల, జల ప్రమాదముల వల్ల మరణించడం.
15. అవమానాలు లేక అపనిందల వల్ల మరణించడం, పరస్రి సంపర్కము.
16. రునగ్రస్థులు అగుట హామీలు ఉండుట జరుగును.
జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మద్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చిన చొ దానిని కాల సర్ప యోగం అని అంటారు. దీనిలో చాల రకాలు వున్నాయి. వాటి వాటి స్తితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చెయ్యటం జరుగుతుంది దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయం చెయ్య బడుతుంది.
                       వివిధ రకాల కాల సర్ప యోగములు
1.)అనంత కాల సర్ప యోగము
2.)గుళిక కాల సర్ప దోషం
3.)వాసుకి  కాల  సర్ప  దోషం
4.)శంక పాల కాలసర్ప దోషం
5.)పద్మ కాలసర్ప దోషం
6.)మహా పద్మ కాలసర్ప దోషం
7.)తక్షక కాలసర్ప దోషం
8.)కర్కోటక కాలసర్ప దోషం
9.)శంఖచూడ కాలసర్ప దోషం
10.)  ఘటక కాలసర్ప దోషం
11.) విషక్త, లేక విష దాన కాలసర్ప దోషం
12.) శేషనాగ కాలసర్ప దోషం
                            అనంత కాల సర్ప యోగము
జన్మ లగ్నము నుండి సప్తమ స్థానము వరకు రాహు కేతు గ్రహముల మధ్య మిగతా గ్రహములు
( రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని ). వుంటే దీనిని అనంత కాల సర్ప యోగము అంటారు.
ఫలితాలు: కుటుంభ సమస్యలు, దీర్గ రోగాలు,  వైవాహిక జీవతం లో అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడము, రునగ్రస్థులు అగుట హామీలు ఉండుట జరుగును.
గుళిక కాల సర్ప దోషం:
 మాములుగా ఇది జాతక చక్రం లో రెండోవ ఇంట ప్రారంభం అయ్యి ఎనిమిదొవ ఇంట సంమప్తం అవుతుంది.
ఫలితాలు:ఆర్ధిక మరియు కుటుంభ ఇబ్బందులు, . భార్య భర్తల మధ్య సక్యత లేకపోవుట ( లేక ) వైవాహిక జీవతం లో అసంతృప్తి, మిత్రులవలన విరోదములు కలుగును.
వాసుకి  కాల  సర్ప  దోషం:
మూడోవ ఇంట మొదలయి తొమ్మిదొవ ఇంట సమాప్తం.
ఫలితాలు: అన్నదమ్ముల కలహాలు, సమస్యలు, బందువుల వలన సమస్యలు ఎకువగా వుంటాయి
ఉద్యోగములో బాధలు, పదోనతిలో ఆటంకాలు, ఉద్యోగము వుదిపోవటం జరుగును.
శంక పాల కాలసర్ప దోషం:
నాలుగోవ ఇంట మొదలయి పదవ ఇంట సమాప్తం.
ఫలితాలుతల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గన్డం, నివాస స్తల సమస్యలు, విద్య లో ఆటంకములు, ఉద్యోగ, వ్యాపారములలో లాబములు లేకపోవుట.
పద్మ కాలసర్ప దోషం:
అయిదోవ ఇంట ప్రారంభమయి పదకొండవ ఇంట సమాప్తం.
ఫలితాలు: జీవిత భాగస్వామి తో కాని పిల్లలతో కాని సమస్యలు విచిత్ర వ్యాదులు రావడము, వ్యసనముల వల్ల భారి నష్టాలు రావడం, భార్య భర్తల మధ్య అనుమానాలు తలేతడం, ధనము ఖర్చుఅగుట, శత్రువుల వలన జైలుకు వెల్లడము, కష్టాలు కలుగును, బాల్యము నుండీ బాధలు కలుగును.
మహా పద్మ కాలసర్ప దోషం:
ఆరవ ఇంట ప్రారంభం అయ్యి పన్నెండవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ, భార్య భర్తలు అనుకూలముగా లేకపోవడము, జీవితాంతము రోగముల వలన బాధ నిరాస యకువగా ఉండును. వ్రుధాప్యము లో కష్టాలు కలగడము, శత్రువులతో పోరాడటం, గృహము నందు అసంతృప్తి కలుగుతుంది.
తక్షక కాలసర్ప దోషం:
యేడవ ఇంట  ప్రారంభం లగ్నము ఇంట సమాప్తం.
ఫలితాలు:  వ్యాపారము లో చిక్కులు, పిత్రార్జితం ఖర్చు చేయడము, పుత్ర సంతానము లేదని బాధ పడటము, జీవిత భాగస్వామి తో సమస్యలు, పర శ్రీ సంగమము, శత్రు పీడా, అనారోగ్యం కలుగును.
కర్కోటక కాలసర్ప దోషం:
ఎనిమిదొవ  ఇంట  ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలువైవాహిక జీవతం లో అసంతృప్తి, అకాల మరణము, మోసములకు గురికావడము, దీర్గ రోగములు, ఆపరేషన్లు, ఎంత కష్టపడిన పలితము దక్కదు. జీవితములో అన్ని ఆలస్యముగా జరుగుతాయి, మంచి ఉద్యోగము దొరుకుట చాల శ్రమ చేయవలసి వస్తుంది, విపరీత ధన నష్టము జరుగును.
శంఖచూడ కాలసర్ప దోషం:
 తొమ్మిదొవ ఇంట  ప్రారంభం మూడోవ ఇంట సమాప్తం.
ఫలితాలు:  అత్యంత దురదృష్ట  స్తితి, దేవుని యందు భక్తి లేకపోవడము, తండ్రి, గురువులతో విరోధము, వ్యవసాయము నందు అధికముగా శ్రమించిన నష్టములు కలుగును. అవమానములు, బాధలు, ధనము నందు అసంతృప్తి కలుగును.
ఘటక కాలసర్ప దోషం:
 పదవ ఇంట  ప్రారంభం నాలుగోవ  ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు, తల్లి తండ్రులకు దూరముగా నివసించదము, మిత్ర ద్రోహులు , వ్యాపార లావా దేవులలో నష్టము, సంతాన దోషములు కలుగును.
విషక్త, లేక విష దాన కాలసర్ప దోషం:
పదకొండవ  ఇంట  ప్రారంభం అయిదోవ ఇంట సమాప్తం.
ఫలితాలు:  ఆర్ధిక మరియు వ్యాపార కష్టాలు, నేత్ర సంబంధ రోగములు , సోదరులు , మిత్రులతో తగాదాలు, గృహమును విడచి పరదేశములో నివసించదము, కోర్టు వ్యవహారములలో తల దుర్చడం, రహస్య విషయాలు గోప్యముగా ఉంచడము జరుగును.
శేషనాగ కాలసర్ప దోషం:
 పన్నెండవ ఇంట  ప్రారంభం  ఆరవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు కోర్టు వివాదాలు , అవమానాలు, ప్రాణభయము, అధిక ఖర్చులు.
ని సంతాన యోగములు

  1. కుజుడు పంచమములొ వుంది ఆ పంచమం శని రాశి గాని శని నవంసము గాని ఆ శనికి సప్తమా ద్రుష్టి కలిగి వుంటే సంతానము కలగదు.
  2. పంచమములొ శని లేక రాహువు వుంది పాప గ్రహ ద్రుష్టి వున్నచొ సంతానము కలగదు.
  3. పుత్ర స్థానమునందు రవి, కుజ రహువులు మరియు శని బలముగా వుంది పుత్ర కరక గ్రాహం బలహీనముగా వున్నా సంతానము కలగదు.
  4. పంచామదిపతి నీచలో వున్నా పంచమ స్థానము కర్కాటక రాశిలో కుజుడు వున్నా సంతానము కలగదు.
  5. పంచామదిపతి ఆస్థాన్గాతుడు అయి  వుంది బుధుడు సమ రాశిలో ఉన్తే  సంతానము కలగదు.
  6. గురువు, లగ్నాధిపతి , సప్తమాధిపతి, పంచామదిపతి నిబలురు అయిన ఆ జాతకులకు  సంతానము కలగదు.
  7. శని షష్టమాదిపతి 6 వ బావమునందు, చంద్రుడు సప్తమ భవమునన్దున్న జాతకులకు  సంతానము కలగదు
  8. మేష రాశి లో గురువు మరియు బుధుడు వుంది మేషరాసి పంచమ భావము అయినచో  సంతానము కలగదు.
  9. కుజుడు మరియు శని చతుర్ధము లో ఉంటే  సంతానము కలగదు.
  10. చంద్రుడు 10 లో శుక్రుడు 7 లో 4 లో పాపులు ఉన్నచో సంతానము నశించును.
  11. లగ్న , పంచమ, నవమదిపతులలో యవరికయినాను కుజ, శనుల సంబంధము, అష్టమాదిపతి సంబందము కుడా ఉన్నచో సంతాన నష్టము కలుగును.
  12. గురువు పంచమదిపతి పాపుల మధ్య నున్నను , సష్ట,వ్యమాది పతులు అప్తంగాతది దోషములు ఉన్నచో  సంతానము కలగదు.
  13. వృచిక  లగ్నమునందు గురు సుక్రులు లేక శని బుధులు ఉన్నచో  సంతానము కలగదు.
  14. పంచమ స్థానము నందు గురువు వుండి ఆ పంచమ స్థానము మేషము , కర్కాటక, మకర మరియు ధనుర్ లగ్నములు అయినచో సంతాన నష్టము కలుగును.
  15.   2, 5, 7 పతులు ఎవరయినా 6, 8, 12 స్థానములందు వుండి శత్రు గ్రహ మధ్య గతులయిన, పంచమధిపతి శత్రు, నీచ రాసులు అందుండగా మరియు 9 వ స్థానములో పాపులు వున్నాను  సంతానము కలగదు.

  16. సింహ , వ్రుచిక రాశుల వారికీ జన్మ లగ్న మునందు పాప గ్రహములు వుండి గురు, శుక్రులు కలసి వ్యయమునందు వున్నా  సంతానము కలగదు
  17. బుధుడు నుండి శని తను , పుత్ర , కళత్ర మరియు వ్యయభవములలొ ఉన్నచో  సంతానము కలగదు.
  18. పంచమది పతి వ్యయములో వుండి చతుర్ధ, దశమ భావదిపతులు తో సంబంధము యార్పడితే  సంతానము కలగదు.
  19. పంచమ స్థానములో రాహువు ఉంటే అల్ప సంతానము లేక సంతాన నష్టము లేక సంతానము లేకపోవడము జరుగును. శ్రీ సంతానము యకువగా ఉండును, మరియు రాహువు పయ్ పాపుల ద్రుష్టి వున్నా  సంతానము కలగదు.
  20. పంచమ స్థానములో కేతువు వున్నా పయ్ పలితములు కలుగును.
  21. శ్రీ జన్మ రాశికి పంచమ రాశి లో పురుషుడు జన్మించిన సంతాన నష్టము.
  22. పంచమదిపతి చంద్రుడు బుదునితో వ్యయము నందు గురువు అష్టమము నందు వున్నా  సంతానము కలగదు.
  23. అష్టమము నందు శని వుండి వాని దశ వచినపుడు పుత్ర నష్టము కలుగును.
  24. పంచమదిపతి శని, రవితో కలసి మేషము నందుండి పంచమము కుజుని ద్రుష్టి కలిగిన సంతానము కలగదు.
                                      సంతానము కలుగుట

  1. పంచమదిపతి లగ్నది పతి సుభులతో కూడిన కేంద్రములందు వుండి ధనాధిపతి బలము కలిగి ఉంటే పుత్ర సంతానము కలుగును.
  2.  లగ్నది పతి పంచమము భావములో వుండి నవమదిపతి సప్తమ స్థానములో వుండి ద్వితీయ అధిపతి మరియు ధనాధిపతి లగ్నములో ఉంటే  పుత్ర సంతానము కలుగును.
  3. నవములో గురువు, గురునికి కేంద్రమున శుక్రుడు ఉంటే లగ్నాధిపతి బలముగా ఉంటే చాల ఆలస్యముగా సంతానము కలుగును.
  4. పంచమదిపతి శని అయితే గురు, చంద్ర ద్రుష్టి ఉంటే స్వల్ప సంతానము కలుగును.
  5. పంచమదిపతి పంచమునన్దు గులికుడుంది ఆ స్థానాధిపతి పంచమములొ వున్తెయ్ కవలలు సంతానము కలుగును.
  6. ద్వితీయ , పంచామదిపతులకు కుజ, శని సంబందము ఉంటే సష్తమ స్థానము లందు గురువు ఉంటే శ్రీ సంతానము కలుగును.
  7. రవిగాని , శని గాని సి గ్రహ రాశి అంశాలలో వుండగా బుధ ద్రుష్టి ఉంటే శ్రీ సంతానము కలుగును.
  8. గురుని నవంసదిపతి కేంద్రములలో ఉంటే సంతానము కలుగును.
  9. శని, కుజులు కలసి 4 వ స్థానము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
  10. పంచమ భావము నందు శని, చంద్రుడు శని నవంసము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
  11. లగ్న పంచామదిపతులకు పరస్పర ఒకరి రాశులందు ఒకరు వున్నాను జాతకుని పుత్రులు తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తారు.
  12. పంచమదిపతి , నవమధిపతి కలసి వుండి ధసమధి పతి మహర్ధస జరుగు చున్నపుడు  సంతానము కలుగును .
  13. పంచమము కర్కాటకము అయి అందు చంద్ర, గురువులు వున్నా శ్రీ సంతానము ఎకువ .
  14. లగ్న, పంచమది పతి , గురువు  ముగ్గురు కేంద్ర కోణములన్దునను జాతకుడికి పుత్ర సంతానము కలుగును..
  15. భాగ్యది పతి , భాగ్య మునందు వున్నాను సంతాన యోగము కలుగును .
  16. పంచమములొ చంద్ర, శుక్రులు వుండి ఆ శుక్రున కు  పంచమములొ బుధుడు వున్నా శ్రీ సంతానము అధికము.
  17. జన్మ లగ్నమునకు  పంచమమున గురువు , గురువునకు పంచమమున శని, శనికి పంచమమున రాహువు వున్నాను పుత్ర  సంతానము కలుగును
  18. నవమ స్థానములో గురువు వానికి పంచమ స్థానములో రవి ఆ రవికి సప్తమ స్థానములో కుజుడు వున్నా పుత్రా సంతానము కలుగును.
  19. చంద్రునకు పంచమమున గురువు ఆ గురువుకు పంచమమున సాని ఆ సానికి పంచమము నందు రాహువు వున్నా పుత్రా సంతానము కలుగును.
రాహువు కేతువులు సప్త గ్రహములతో కూడిన  పలితము
1)    రాహువుతో రవి లేక శుక్రులు లగ్నము నుండి ద్వితీయ భావములో ఉన్న లేక రాహువు ఉన్న నేత్ర సంబందమయిన వ్యాదులు కలుగును.
2)    ద్వితియములో రాహువు శుక్రులు వుంది అష్టమములో కేతువు శని గ్రహములు ఉన్న రాహువు శుక్రులకు  కేతువు, శనుల ద్రుష్టి ఉన్న ముత్ర సంబందమయిన లేక వృషణములు లకు వ్యాదులు మరియు గొంతు సంబందమయిన వ్యాదులు వచును.
3)    రాహువు గురువులు కలసియునచో దురాచారములకు లోను అగును. దైవముఫై నమ్మకము ఉండదు. కేతువు గురువు కలసివున్న   దైవ బక్తులు అగును.
4)    రాహువు అష్టమ బావములో  వుంది రాహువుకు రవి, కుజ, మరియు శని వీరిలో ఎవరి ద్రుష్టి తగిలిన వివాహములు ఆలస్యము అగును. బార్య లేక భర్తలలో మృతువు సంభవించును.
5)    రాహువు చంద్రునితో కలసి లగ్నమునందు వుండగా పంచమ, నవమ స్థానములు అనగా కొనములలో పాపులు ఉన్నచో మానసిక చంచలత్వము, మంద బుద్ది ఆత్మ హత్యలకు పాల్పడటము జరుగును.
6)    జన్మ లగ్నములో శని రహువులు కలసివున్న అనారోగ్యము నాల్గవ స్థానములో ఉన్న మాతృనష్టము, విద్య విగ్నములు కలుగును. ఏడవ స్తనమునందు ఉన్న పితృ సౌక్యము వుండదు. దశమ స్తానములో ఉన్న వృతిరీత్యా చికాకులు కలుగును.
7)    పంచమదిపతి అయిన చంద్రుడు శని కుజులతో రాహువు కలసివున్న సంతాన నష్టము కలుగును.
8)    శుక్రుడు కేతువు తో కలసి ఉన్న బార్య గయాళి, స్వల్ప సంతతి కలది, బార్య సహోదరులకు నష్టము కలుగును.
9)    శని, కేతువులు కలసి కేంద్రములలో ఉన్న రాజయోగము పట్టును.
7 లో శని, కుజ, మరియు రహువులతో కూడిన బ్రంహచార్యము , వివాహము అయిన దాంపత్య జీవితము వుండదు.
రాహువు విద్య స్తానములో ఉన్న విద్యబ్యాస కాలములో రాహువు దాస వచ్చినాచో వైద్య శాస్త్రము అబ్యాసిన్చును.
కేంద్రముల యందు రాహువు పాప గ్రహములతో కూడినను ఆ శిశువు సీగ్రముగా మరణించును.
4 వ అధిపతి రాహువుతో కలసి 6 నందు ఉన్న చోరుల వల్ల మరనింతురు.
6 వ బావము నందు చంద్రుడు లగ్నమునందు రాహువు వున్నాను అపస్మారక రోగము కలుగును.
 లగ్నము నందు గురువు, రాహువు ఉన్న దంత రోగములు కలుగును.
కారకాంస లగ్నము నుండి ద్వాదశ భావము నందు కేతువు వున్నాను మరణము అనంతరము బ్రంహా సానిద్యము పొందును.
ద్వితీయ భావములో కేతువు మరియు శుక్రుడు కలసిన పర శ్రీ లతో సంబందము కలిగి వుంటాడు.
కేతువుతో శని మరియు కుజులతో కలసి ద్వితియము లో వుంటే  వివాహము ఆలస్యము అగును.
బుధ, కేతువులు 3 భావము లో ఉన్న చెవి వ్యాదులు లేదా ఏదయినా అవయవ లోపము జరుగును.
3 వ భావములో కేతువు, శని కలసిన మంచి ఆరోగ్యము కలిగించును.
కేతువుతో కలసి శని 9 వ స్తానములో ఉంటే తండ్రికి అరిస్టములు కలుగును.
కేతువు, శుక్రులు కలసి 9 వ స్తానములో వుండిన బార్య లేదా భర్తకు నష్టము , స్థిర చర ఆస్తులకు నష్టములు కలుగును.
7 లో కేతువుతో శుక్ర, కుజులు కలసిన వ్యభిచారము చేయును.
7 లో కేతువు తో బుధుడు కలసిన వివాహ విషయములలో మోసము జరుగును.
7 వ భావములో రాహువుతో కుజుడుగాని, రావిగాని, శని గాని చేరిన నీచ శ్రిలతో సంబందము, వ్యభిచారము, భార్యను కోల్పోవడము జరుగును.
 7 లో రవి, రహువులు కలసిన సంతాన నష్టము కలుగును.
7 లో రాహువుతో గురు, శుక్రులు కలసిన విధవతో సంగమము జరుగును.
లగ్నము నందు శని పంచమములొ కుజ రహువులు వున్నాను సోదరులు వుండరు.
కుజ రహువులకు 6 వ అధిపతితో సంబందము ఉన్న గాయములు, లేక ఎవరయినా తుపాకితో కాల్చుట లేక కత్తితో పొడుచుట జరుగును.
కుజ రాహువుల కలయిక భు ఆక్రమణలు, కోల్పోవడము జరుగును.
లగ్నమున రవి, రహువులు వున్నాను శిరసు భినముగా ఉండును.
రవితో రాహువు లేక కేతువుతో సంబందము వుండి 8 లో వుంటే అవమానములు కలుగును.
శనితో రాహువు లేక కేతువు వుండి 7 లో ఉన్నచో వ్యభిచారము చేయును.
లగ్నము నందు రవి, 7 లో రాహువు వుంటే భార్య గర్భము ధరించదు.
7 లో రాహువు, 2 లో శని వుండిన ద్వికలత్ర యోగము కలుగును.
రాహు, శుక్రులు కలసిన చాకలి సంగమము జరుగును.  

No comments:

Post a Comment