Friday, 24 August 2018

శ్రావణ వరలక్ష్మి వ్రత విధానం



శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చును.

శ్రీ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామగ్రి :-
 పసుపు 100 గ్రాములు 
కుంకుమ100 గ్రాములు. 
ఒక డబ్బ గంధం 
విడిపూలు,
పూల దండలు - 6 
తమల పాకులు -30 
వక్కలు వంద గ్రాములు
ఖర్జూరములు 50 గ్రాములు 
అగరవత్తులు 
కర్పూరము - 50 గ్రాములు
 ౩౦ రూపాయి నాణాలు 
ఒక తెల్ల టవల్ 
జాకెట్ ముక్కలు 
మామిడి ఆకులు 
ఒక డజన్ అరటిపండ్లు
ఇతర ఐదు రకాల పండ్లు 
అమ్మవారి ఫోటో 
కలశం 
కొబ్బరి కాయలు 
తెల్లదారము లేదా పసుపు రాసిన కంకణం 
2 స్వీట్లు 
బియ్యం 2 కిలోలు 
కొద్దిగా పంచామృతం లేదా ఆవుపాలు 
దీపాలు 
గంట 
హారతి 
ప్లేటు 
స్పూన్స్ 
ట్రేలు 
ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనే, 
వత్తులు 
అగ్గిపెట్టె 
గ్లాసులు 
బౌల్స్



వ్రత విధానం :- 
 వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపంపై బియ్యపు పిండితో ముగ్గువేసి కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చుకోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరణాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచుకోవాలి. 
 కావలసినవి :- 
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు,కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు మొదలైనవి. 
 కంకణం ఎలా తయారుచేసుకోవాలి :- 
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి.ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. 
గణపతి పూజ:- 
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే 
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥ 
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥ 
గణపతిపై అక్షతలు చల్లాలి. 
యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి. 
ఓం సుముఖాయ నమః , 
ఓం ఏకదంతాయ నమః , 
ఓం కపిలాయ నమః , 
ఓం గజకర్ణికాయ నమః , 
ఓంలంబోదరాయ నమః ,
 ఓం వికటాయ నమః, 
ఓం విఘ్నరాజాయ నమః, 
ఓం గణాధిపాయ నమః, 
ఓంధూమకేతవే నమః, 
ఓం వక్రతుండాయ నమః, 
ఓం గణాధ్యక్షాయ నమః, 
ఓం ఫాలచంద్రాయ నమః, 
ఓం గజాననాయ నమః, 
ఓం శూర్పకర్ణాయ నమః, 
ఓం హేరంబాయ నమః, 
ఓం స్కందపూర్వజాయనమః, 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః 
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి. 
 ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. 
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి. 
 ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!! 
 నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... 
సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... 
ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, 
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి). 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, 
తాంబూలానంతరం అచమనంసమర్పయామి. 
 (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి) 
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామి
 నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి! 
అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీత సుప్రసన్న వరదాభవతు! 
మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!! 
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి.ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.
కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః 
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ: స్థితాః 
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా 
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః 
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః 
ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః 
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥ 
అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన పూజాద్రవ్యాలపైన పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి. 
అధాంగపూజ:- 
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి. 
చంచలాయై నమః - పాదౌ పూజయామి, 
చపలాయై నమః - జానునీ పూజయామి, 
పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి, 
మలవాసిన్యైనమః - కటిం పూజయామి, 
పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, 
మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి, 
కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, 
సుముఖాయైనమః - ముఖంపూజయామి, 
సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి, 
రమాయైనమః - కర్ణౌ పూజయామి, 
కమలాయైనమః - శిరః పూజయామి, శ్
రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి. 
(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి) 
 శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :- 
ఓం ప్రకృత్యై నమః 
ఓం వికృతై నమః 
ఓం విద్యాయై నమః 
ఓం సర్వభూత హితప్రదాయై నమః 
ఓం శ్రద్ధాయై నమః 
ఓం విభూత్యై నమః 
ఓం సురభ్యై నమః 
ఓంపరమాత్మికాయై నమః 
ఓం వాచ్యై నమః 
ఓం పద్మాలయాయై నమః 
ఓం శుచయే నమః 
ఓంస్వాహాయై నమః 
ఓం స్వధాయై నమః 
ఓం సుధాయై నమః 
ఓం ధన్యాయై నమః 
ఓంహిరణ్మయై నమః 
ఓం లక్ష్మ్యై నమః 
ఓం నిత్యపుష్టాయై నమః 
ఓం విభావర్యైనమః 
ఓం ఆదిత్యై నమః 
ఓం దిత్యై నమః 
ఓం దీప్తాయై నమః 
ఓం రమాయై నమః 
ఓం వసుధాయై నమః 
ఓం వసుధారిణై నమః
 ఓం కమలాయై నమః 
ఓం కాంతాయై నమః 
ఓంకామాక్ష్యై నమః 
ఓం క్రోధ సంభవాయై నమః 
ఓం అనుగ్రహ ప్రదాయై నమః 
ఓం బుద్ధ్యె నమః 
ఓం అనఘాయై నమః 
ఓం హరివల్లభాయై నమః 
ఓం అశోకాయై నమః 
ఓం అమృతాయై నమః 
ఓం దీపాయై నమః 
ఓం తుష్టయే నమః 
ఓం విష్ణుపత్న్యై నమః 
ఓం లోకశోకవినాశిన్యై నమః 
ఓం ధర్మనిలయాయై నమః 
ఓం కరుణాయై నమః 
ఓం లోకమాత్రే నమః 
ఓం పద్మప్రియాయై నమః 
ఓం పద్మహస్తాయై నమః 
ఓం పద్మాక్ష్యై నమః 
ఓం పద్మసుందర్యై నమః 
ఓం పద్మోద్భవాయై నమః 
ఓం పద్మముఖియై నమః 
ఓం పద్మనాభప్రియాయై నమః 
ఓం రమాయై నమః 
ఓం పద్మమాలాధరాయై నమః 
ఓం దేవ్యై నమః 
ఓం పద్మిన్యై నమః 
ఓం పద్మ గంధిన్యైనమః 
ఓం పుణ్యగంధాయై నమః 
ఓం సుప్రసన్నాయై నమః 
ఓం ప్రసాదాభిముఖీయై నమః 
ఓం ప్రభాయై నమః 
ఓం చంద్రవదనాయై నమః 
ఓం చంద్రాయై నమః 
ఓం చంద్రసహోదర్యై నమః 
ఓం చతుర్భుజాయై నమః 
ఓం చంద్ర రూపాయై నమః 
ఓం ఇందిరాయై నమః 
ఓం ఇందుశీతలాయై నమః 
ఓం ఆహ్లాదజనన్యై నమః 
ఓం పుష్ట్యెనమః 
ఓం శివాయై నమః 
ఓం శివకర్యై నమః 
ఓం సత్యై నమః 
ఓం విమలాయై నమః 
ఓం విశ్వజనన్యై నమః 
ఓం దారిద్ర నాశిన్యై నమః 
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః 
ఓం శాంత్యై నమః 
ఓం శుక్లమాలాంబరాయై నమః 
ఓం శ్రీయై నమః 
ఓం భాస్కర్యై నమః 
ఓం బిల్వ నిలయాయై నమః 
ఓం వరారోహాయై నమః 
ఓం యశస్విన్యైనమః 
ఓం వసుంధరాయై నమః 
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః 
ఓంహేమమాలిన్యై నమః 
ఓం ధనధాన్యకర్యై నమః 
ఓం సిద్ధ్యై నమః 
ఓం త్రైణసౌమ్యాయై నమః 
ఓం శుభప్రదాయై నమః 
ఓం నృపవేశగతానందాయై నమః 
ఓంవరలక్ష్మ్యై నమః 
ఓం వసుప్రదాయై నమః 
ఓం శుభాయై నమః 
ఓంహిరణ్యప్రాకారాయై నమః 
ఓం సముద్రతనయాయై నమః 
ఓం జయాయై నమః 
ఓంమంగళాదేవ్యై నమః 
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః 
ఓం ప్రసన్నాక్ష్యైనమః 
ఓం నారాయణసీమాశ్రితాయై నమః 
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః 
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః 
ఓం నవదుర్గాయై నమః 
ఓం మహాకాళ్యై నమః 
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః 
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః 
ఓం భువనేశ్వర్యై నమః 
కంకణపూజ :- 
కంకణాన్ని అమ్మవారి వద్ద పెట్టి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి. 
 కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి, 
రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి, 
 లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి, 
విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి, 
మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి, 
క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి, 
విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి, 
చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి, 
శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి. 
 ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి 
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే
వ్రత. కథా ప్రారంభం :-
 శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. 
అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. 
 వరలక్ష్మీ సాక్షాత్కారం :-
 వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.
శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు. 
మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.
ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. 
ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

Thursday, 16 August 2018

శ్రీ విధాత పీటంలో శ్రావణ పంచమి పూజ విశేషాలు

జ్యోతిర్వైద్యం-పక్షవాతం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

No automatic alt text available.




మానవశరీరంలో పక్షవాతం అనునది వాత దోషము వలన ఏర్పడు తీక్షణమైన వ్యాధి.శరారంలో రక్తప్రసరణ వ్యవస్థకు ఆటంకం కలుగడం వలన పక్షవాతం వస్తుంది...జ్యోతిష్యశాస్త్ర ప్రకారం నరాలకి అధిపతి బుధుడు కాబట్టి ఈ వ్యాధి కారక గ్రహం బుధుడు.
దీంతో జ్యోతిష్యపరంగా నిత్యం విష్ణుసహస్రనామం చేస్తున్నవారికి పక్షవాతం రాకుండా ఆ కారక గ్రహం (బుధుడు) కాపాడుతాడని చెప్పవచ్చు.

ఫెంగ్‌షుయ్: ఆరోగ్యానికి, సంతోషానికి 10 టిప్స్!


ఫెంగ్‌షుయ్ సూచించే 10 సూత్రాలను ఫాలో చేస్తే ఆరోగ్యమే కాకుండా.. సంతోషం కూడా సొంతం అవుతుందని ఆ శాస్త్ర నిపుణులు అంటున్నారు.
అవేంటో.. చూద్దాం.. 

1. పనికి రానివి ఏరేయండి. క్లీన్ హౌజ్ టు బి లక్కీ హోజ్ అనేది ఫెంగ్ షుయ్‌లో మొదటిది. కాబట్టి ఇంట్లో ఉన్న పనికి రాని, అనవసర వస్తువులను తీసేయండి.

2. ఇంట్లో ఏవైనా పగిలిన వస్తువులున్నా, అతికించినా ప్రయోజనం ఉండదని అనిపించిన వస్తువులను బయట పారేయండి.
3. వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోండి. కాంతి ఎక్కువగా ప్రసరిస్తే ఉత్సాహం ఎక్కువగా ప్రసరిస్తే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది.
4. వస్తువులకు పదునైన మూలలు ఉంటే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ పదునైన మూల మిమ్మల్ని గురిపెట్టినట్లుగా ఉన్నట్లైతే ఆ నెగటివ్ ఎనర్జీ నేరుగా మీకు చేరుతుంది.
5. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూసుకోండి. డ్రైనేజీ నీరు బయట పారిన చోట చెడు శక్తులు ఉంటాయి.
6. ఇంటికి బయట వైపు వేసే రంగులు మూడు రంగుల కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
7. ఇంట్లో పనిచేసుకునే సమయంలో ద్వారం వైపు ముఖం చేసి కూర్చోండి. రిలాక్స్‌గా, కంఫర్టబుల్‌గా ఫీలవుతారు.
8. పడకగదిలో టీవీ, కంప్యూటర్ ఉన్నట్లైతే వాటిని హాల్‌లోకి మార్చండి.
9. పడకగది దగ్గరగా బాత్ రూమ్ ఉన్నట్లైతే డోర్‌ను ఎప్పుడూ క్లోజ్ చేసి పెట్టండి.
10. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు మైండ్‌లో ఉండేలా చూసుకోండి.

Sunday, 12 August 2018

శ్రావణమాసం పండుగలు విశేష రోజులు

 ( 12 ఆగస్టు 2018 నుంచి 09 సెప్టెంబర్‌ 2018 వరకు)

ఆగస్టు 
12- చంద్రోదయం, 
14- నాగులచవితి, 
15- నాగ, గరుడ పంచమి, స్వర్ణ గౌరీవ్రతం, 
17- సూర్యషష్ఠి, సింహ మాసం, 
21- దధివ్రతారంభం, 
22- సర్వేషాం ఏకాదశి, 
23- దామోదర ద్వాదశి, 
24- వరలక్ష్మీవ్రతం, 
26- వరాహజయంతి, ఋగ్వేద ఉపాకర్మ, 
26- శ్రావణ పూర్ణిమ, రాఖీపూర్ణిమ, హయగ్రీవ జయంతి, యజుర్వేద ఉపాకర్మ, 
28- శ్రీ రాఘవేంద్ర ఆరాధన, 
29- సంకష్ఠహరి చతుర్ధి, శ్రీశీశీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెదజీయర్‌స్వామి తిరు, 

సెప్టెంబర్‌ 
2- స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, దశఫలశీతలావ్రతం, 
3- శ్రీ వైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, 
6- సర్వేషాం ఏకాదశి, 
8- మాసశివరాత్రి, 
9- పోలాల అమావాస్య

శ్రావణమాసం విశిష్టత



ఎంతో పవిత్రమైన విశేషమైన శ్రావణమాసం వచ్చేసింది. ఈ నెలరోజులు ఉదయం, సాయంత్రం ప్రతి ఇల్లు అందమైన రంగవల్లులతో, పచ్చటి మామిడి తోరణాలతో, భగవన్నామస్మరణతో, అమ్మవారి పూజలతో కలకలలాడుతుంది. మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది అయిన శ్రావణమాసం ఎంతో పవిత్రత కలిగినటువంటింది. ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది. ఆ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవికి ఈ మాసమంటే మహా ప్రీతికరం. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది. ఈ మాసంలో అనేక పూజలు చేస్తారు. ఎన్నో శుభకార్యాలు పెళ్ళిళ్ళు ,వ్యాపారాలు ,మంచి పనులు అన్నీ కూడా ఈ నెలలో చేయడం వలన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈ నెలలో అనేక వ్రతాలను చేస్తారు…

శ్రావణ సోమవారములు.

ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారుపండితులు. శివారాధన కూడా చాలా ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్నిస్తుందని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్ర వచనం. అంటే కాకుండాఅమ్మవారికి ఆమెను పూజించేకంటే ఆ పరమేశ్వరుని పూజిస్తేనే ఎక్కువమక్కువ అనిపెద్దలుచెపుతారు.

శ్రావణ శనివారములు.

ఈ శ్రావణమాసంలో ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రతి శనివారం రోజున అఖండ దీపంవెలిగించి, ఉపవాసముఉండి ఆ స్వామికి తమ భక్తిని తెలియచేస్తారు


మంగళ గౌరీ వ్రతం.

ఈ వ్రతాన్ని గురించి నారధుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లి అయిన వారు ఆచరించాలి. శ్రావణ మాసంలో అన్ని మంగళవారల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అనీ, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించి,ఈ నెలలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలోసుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి.


నాగపంచమి.

శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే పంచమిని నాగపంచమి అంటారు. ఈరోజున ఉదయాన్నే లేచి పాముపుట్టల వద్దకు వెళ్లి ఆ నాగేంద్రునికి పాలు పోస్తారు.


వరలక్ష్మీ వ్రతం.

శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణ మాసంలో వచ్చే మిగతా శుక్రవారాలలో ఏదైనా ఒకవారం ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకుని దానికి వరలక్ష్మీ దేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. ముత్తయిదువులు పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఈ పూజ వలన సౌభాగ్యం,సంతోషం, ధన దాన్యములతో వర్ధిల్లుతాము. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మాంగళ్య బలాన్ని వివరించినట్లు చెబుతారు.లక్ష్మీదేవికి శుభప్రదమైన శుక్రవారమంటే చాలాఇష్టం అని శ్రీ సూక్తం తెలియచేస్తోంది.


శుక్ల పక్ష పౌర్ణమి.

ఈ పౌర్ణమిని జంధ్యాల పౌర్ణమిమరియు రాఖీ పౌర్ణమి అంటారు. ఈ రోజున నూతన యజ్ఞోపవీతంధరిస్తారు, అంతేకాకుండా శ్రావణపౌర్ణమి, రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈ రోజు సోదర, సోదరీ సంబంధానికి సూచికగా రక్షబంధనం జరుపుకుం టాము.


కృష్ణాష్టమి

ఈమాసంలోనే శ్రీకృష్ణ జన్మాష్టమి. అందరూ ఎంతో భక్తిశ్రద్దలతో శ్రీకృష్ణుని పూజించి, చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణలు ధరించి ఉట్టికొట్టి ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటారు.


మతత్రయ ఏకాదశి.

శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు మహావిష్ణునువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది అని పురాణాలు చెపుతున్నాయి.
శ్రీ రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు కూడా ఈ మాసంలోనే ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.


పొలాల అమావాస్య 

ఈ వ్రతం శ్రావణ మాసం చివరి రోజున చేసుకుంటారు.ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల(శ్రేయస్సు)కోసంచేస్తారు శ్రావణ మాసం చివరగా వొచ్చే అమావాస్యరోజున జరుపుకుంటారు.పండగపూట కందమొక్కకు పూజ చేస్తారు.
ఇన్ని పండుగలు అన్ని ఈ మాసంలోనే వస్తాయి కాబట్టి శ్రావణమాసం అంటే సందడే సందడి. మనశక్తి ని బట్టి భక్తితో,మనసులో, మనస్పూర్తిగా ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ… వీలైనన్ని పూజలు చేసుకుని ఆ లక్ష్మీ దేవి అనుగ్రహం పొంది, అమ్మ ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు పొందుదాము.




సర్వేజనా సుఖినోభవంతు


Friday, 10 August 2018

నాగ పంచమి



ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు.

బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు 

అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ


దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ 

దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ 

లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

చలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , 

వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే 

విశిష్టమైన సంస్కుతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా 

పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు

 . వాసుకి పమేస్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు



 

నాగ జాతి జనము :




కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి ,



ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు ,

 హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా 

కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి 


గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన 

నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ 

విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప 


జేయడం తప్పు కదా ' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాడు . గరుడ 

మంత్రం చదివే వారిని , ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి 

.దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను 

నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా

ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా 

వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .


దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా 



ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి 

కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని 

పూజచేయడం మొదలు పెట్టారు .


వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు 



జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది . పుట్టలో ఆవుపాలు ,

 వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా 

సమర్పిస్తారు .


పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం 



జరిగినది .ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన 

చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా 

సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి 

రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, 

కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు 


పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల

 పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది 

పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని 

పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.


 


శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ 

వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే 

శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి 

చెందినదేనని పండితులు అంటున్నారు.

 


అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను 

పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస 

వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున 

సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం 

చేసుకోవాలి.


 


ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో 

అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం 

చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి 

తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా 

ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ 

విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు 

చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప 

భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.


 



నాగ పంచమి వ్రత కథ
 

 

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు 

అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తుదేవి , 

దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి 

ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు 

గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన 

నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం 

నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని 

చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . 

నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
 


ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ 

ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ 

పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విస్వాశము వారిది


 

మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో 

కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే,


 పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి 

విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి 

సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ 

పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో 


 ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా 

పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని 

రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా 

ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి 

పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా 

విషయాలు ఉన్నాయి.



స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో 


ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు

అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో 



ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ 

సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర 
సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే 


ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక 

పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.

నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో 


ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన 

దేవాలయాల్లో పాములన్నాయి. క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన 

కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన 

దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం 

ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన 

మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.



కాలసర్ప దోషం ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు 


విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్నవారికి అనేక కష్టాలు 

ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో 

ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. 

ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి 

కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, 

 కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, 

సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి.

నాగుల పంచమి పూజ ఎవరు చేయాలి ఎందుకు 

చేయాలి?

శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి జన్మించిది కనుక సర్పభయం లేకుండా ఉండడం కోసం ఈ రోజంతా నాగపూజలు చేస్తుంటారు. అలాగే ఇదే రోజున గరుడ పంచమిగా చెప్పబడుతున్న ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సోదరులు ఉన్న స్త్రీలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలనే నియమం ఉంది. 
 
సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలు అందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతోన్న ఈ వ్రతాన్ని పది సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవలసి ఉంటుంది. సాధారణంగా ఏ తల్లి అయినా తన కొడుకు తాను గర్వించేలా, లోకం మెచ్చేలా ఉండాలని అనుకుంటుంది.
 
అలా తన తల్లికి దాస్యం నుంచి విముక్తిని కలిగించడం కోసం గరుత్మంతుడు దేవలోకం నుంచి అమృత కలశం తీసుకువచ్చాడు. అందుకోసం దేవేంద్రుడితోనే పోరాడాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు అభినందనలను అందుకుని ఆయన వాహనంగా ఉండిపోయాడు. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలుగుతుందని చెప్పబడుతోంది.
 
 
 


కాల సర్ప యోగములు




                                    కాల సర్ప యోగ పలితాలు
1. జ్ఞాన దృష్టి లేకపోవటము లేక మెదడు సరిగా ఎదగక పోవడము  వల్ల అవమానాలు  ( లేక  ) అపార్ధాలు చేసుకోవడము.
2. జన్మించిన సంతానమునకు బుధి మాంద్యము కలుగుట.
3. గర్భములో శిశువు మరణించుట .
4. భార్య భర్తల మధ్య సక్యత లేకపోవుట ( లేక ) వైవాహిక జీవతం లో అసంతృప్తి.
5. మరణించిన శిశువు కలుగుట.
6. గర్భము నిలవకపోవడము, విచిత్రమయిన రోగములు కలగడము.
7. అంగ వైకల్యము సంతానము కలగడము, వాహన ప్రమాదాలు.
8. శస్త్ర చికిచలు విపలము అయి మరణించడం జరుగుతుంది.
9. వృషణముల వ్యాధులు , వ్యసనాలకు భానిసలు కావడము.
10. వీర్య కణములు నశించుట, నసుపుకత్వము ఏర్పడుట.
11. కాన్సర్, సిఫిలిస్ , హెర్నియా , ఎయిడ్స్ , ముత్ర సంబందమయిన రోగములు కలగడము.
12. వంశ వృది లేకపోవడము, కుటుంబములో ప్రేమ అభిమనములు తగిపోవడము.
13. శత్రువుల వలన మృతి చెందడము, సంతానము శత్రువులుగా మారడము.
14. మానసిక శాంతి లేకపోవడము, విష జంతువులవల్ల, జల ప్రమాదముల వల్ల మరణించడం.
15. అవమానాలు లేక అపనిందల వల్ల మరణించడం, పరస్రి సంపర్కము.
16. రునగ్రస్థులు అగుట హామీలు ఉండుట జరుగును.
జాతకుని జన్మ కుండలి లో రాహు కేతువుల మద్య మిగిలిన అన్ని గ్రహాలు వచ్చిన చొ దానిని కాల సర్ప యోగం అని అంటారు. దీనిలో చాల రకాలు వున్నాయి. వాటి వాటి స్తితులను బట్టి వాటికి పేర్లు నిర్ణయం చెయ్యటం జరుగుతుంది దాని ప్రకారమే కాలసర్ప యోగం వలన కలిగే ఫలితం కూడా నిర్ణయం చెయ్య బడుతుంది.
                       వివిధ రకాల కాల సర్ప యోగములు
1.)అనంత కాల సర్ప యోగము
2.)గుళిక కాల సర్ప దోషం
3.)వాసుకి  కాల  సర్ప  దోషం
4.)శంక పాల కాలసర్ప దోషం
5.)పద్మ కాలసర్ప దోషం
6.)మహా పద్మ కాలసర్ప దోషం
7.)తక్షక కాలసర్ప దోషం
8.)కర్కోటక కాలసర్ప దోషం
9.)శంఖచూడ కాలసర్ప దోషం
10.)  ఘటక కాలసర్ప దోషం
11.) విషక్త, లేక విష దాన కాలసర్ప దోషం
12.) శేషనాగ కాలసర్ప దోషం
                            అనంత కాల సర్ప యోగము
జన్మ లగ్నము నుండి సప్తమ స్థానము వరకు రాహు కేతు గ్రహముల మధ్య మిగతా గ్రహములు
( రవి ,చంద్ర ,కుజ ,బుధ ,గురు ,శుక్ర, శని ). వుంటే దీనిని అనంత కాల సర్ప యోగము అంటారు.
ఫలితాలు: కుటుంభ సమస్యలు, దీర్గ రోగాలు,  వైవాహిక జీవతం లో అసంతృప్తి, మానసిక శాంతి లేకపోవడము, రునగ్రస్థులు అగుట హామీలు ఉండుట జరుగును.
గుళిక కాల సర్ప దోషం:
 మాములుగా ఇది జాతక చక్రం లో రెండోవ ఇంట ప్రారంభం అయ్యి ఎనిమిదొవ ఇంట సంమప్తం అవుతుంది.
ఫలితాలు:ఆర్ధిక మరియు కుటుంభ ఇబ్బందులు, . భార్య భర్తల మధ్య సక్యత లేకపోవుట ( లేక ) వైవాహిక జీవతం లో అసంతృప్తి, మిత్రులవలన విరోదములు కలుగును.
వాసుకి  కాల  సర్ప  దోషం:
మూడోవ ఇంట మొదలయి తొమ్మిదొవ ఇంట సమాప్తం.
ఫలితాలు: అన్నదమ్ముల కలహాలు, సమస్యలు, బందువుల వలన సమస్యలు ఎకువగా వుంటాయి
ఉద్యోగములో బాధలు, పదోనతిలో ఆటంకాలు, ఉద్యోగము వుదిపోవటం జరుగును.
శంక పాల కాలసర్ప దోషం:
నాలుగోవ ఇంట మొదలయి పదవ ఇంట సమాప్తం.
ఫలితాలుతల్లి వలన లేదా తల్లికి సమస్య, వాహన గన్డం, నివాస స్తల సమస్యలు, విద్య లో ఆటంకములు, ఉద్యోగ, వ్యాపారములలో లాబములు లేకపోవుట.
పద్మ కాలసర్ప దోషం:
అయిదోవ ఇంట ప్రారంభమయి పదకొండవ ఇంట సమాప్తం.
ఫలితాలు: జీవిత భాగస్వామి తో కాని పిల్లలతో కాని సమస్యలు విచిత్ర వ్యాదులు రావడము, వ్యసనముల వల్ల భారి నష్టాలు రావడం, భార్య భర్తల మధ్య అనుమానాలు తలేతడం, ధనము ఖర్చుఅగుట, శత్రువుల వలన జైలుకు వెల్లడము, కష్టాలు కలుగును, బాల్యము నుండీ బాధలు కలుగును.
మహా పద్మ కాలసర్ప దోషం:
ఆరవ ఇంట ప్రారంభం అయ్యి పన్నెండవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఆరోగ్య సమస్య, అప్పుల బాధ, శత్రు బాధ, భార్య భర్తలు అనుకూలముగా లేకపోవడము, జీవితాంతము రోగముల వలన బాధ నిరాస యకువగా ఉండును. వ్రుధాప్యము లో కష్టాలు కలగడము, శత్రువులతో పోరాడటం, గృహము నందు అసంతృప్తి కలుగుతుంది.
తక్షక కాలసర్ప దోషం:
యేడవ ఇంట  ప్రారంభం లగ్నము ఇంట సమాప్తం.
ఫలితాలు:  వ్యాపారము లో చిక్కులు, పిత్రార్జితం ఖర్చు చేయడము, పుత్ర సంతానము లేదని బాధ పడటము, జీవిత భాగస్వామి తో సమస్యలు, పర శ్రీ సంగమము, శత్రు పీడా, అనారోగ్యం కలుగును.
కర్కోటక కాలసర్ప దోషం:
ఎనిమిదొవ  ఇంట  ప్రారంభం రెండోవ ఇంట సమాప్తం.
ఫలితాలువైవాహిక జీవతం లో అసంతృప్తి, అకాల మరణము, మోసములకు గురికావడము, దీర్గ రోగములు, ఆపరేషన్లు, ఎంత కష్టపడిన పలితము దక్కదు. జీవితములో అన్ని ఆలస్యముగా జరుగుతాయి, మంచి ఉద్యోగము దొరుకుట చాల శ్రమ చేయవలసి వస్తుంది, విపరీత ధన నష్టము జరుగును.
శంఖచూడ కాలసర్ప దోషం:
 తొమ్మిదొవ ఇంట  ప్రారంభం మూడోవ ఇంట సమాప్తం.
ఫలితాలు:  అత్యంత దురదృష్ట  స్తితి, దేవుని యందు భక్తి లేకపోవడము, తండ్రి, గురువులతో విరోధము, వ్యవసాయము నందు అధికముగా శ్రమించిన నష్టములు కలుగును. అవమానములు, బాధలు, ధనము నందు అసంతృప్తి కలుగును.
ఘటక కాలసర్ప దోషం:
 పదవ ఇంట  ప్రారంభం నాలుగోవ  ఇంట సమాప్తం.
ఫలితాలు: వ్యాపార మరియు ఉద్యోగ సమస్యలు, తల్లి తండ్రులకు దూరముగా నివసించదము, మిత్ర ద్రోహులు , వ్యాపార లావా దేవులలో నష్టము, సంతాన దోషములు కలుగును.
విషక్త, లేక విష దాన కాలసర్ప దోషం:
పదకొండవ  ఇంట  ప్రారంభం అయిదోవ ఇంట సమాప్తం.
ఫలితాలు:  ఆర్ధిక మరియు వ్యాపార కష్టాలు, నేత్ర సంబంధ రోగములు , సోదరులు , మిత్రులతో తగాదాలు, గృహమును విడచి పరదేశములో నివసించదము, కోర్టు వ్యవహారములలో తల దుర్చడం, రహస్య విషయాలు గోప్యముగా ఉంచడము జరుగును.
శేషనాగ కాలసర్ప దోషం:
 పన్నెండవ ఇంట  ప్రారంభం  ఆరవ ఇంట సమాప్తం.
ఫలితాలు: ఎక్కువ ఖర్చులు, శత్రు బాధలు కోర్టు వివాదాలు , అవమానాలు, ప్రాణభయము, అధిక ఖర్చులు.
ని సంతాన యోగములు

  1. కుజుడు పంచమములొ వుంది ఆ పంచమం శని రాశి గాని శని నవంసము గాని ఆ శనికి సప్తమా ద్రుష్టి కలిగి వుంటే సంతానము కలగదు.
  2. పంచమములొ శని లేక రాహువు వుంది పాప గ్రహ ద్రుష్టి వున్నచొ సంతానము కలగదు.
  3. పుత్ర స్థానమునందు రవి, కుజ రహువులు మరియు శని బలముగా వుంది పుత్ర కరక గ్రాహం బలహీనముగా వున్నా సంతానము కలగదు.
  4. పంచామదిపతి నీచలో వున్నా పంచమ స్థానము కర్కాటక రాశిలో కుజుడు వున్నా సంతానము కలగదు.
  5. పంచామదిపతి ఆస్థాన్గాతుడు అయి  వుంది బుధుడు సమ రాశిలో ఉన్తే  సంతానము కలగదు.
  6. గురువు, లగ్నాధిపతి , సప్తమాధిపతి, పంచామదిపతి నిబలురు అయిన ఆ జాతకులకు  సంతానము కలగదు.
  7. శని షష్టమాదిపతి 6 వ బావమునందు, చంద్రుడు సప్తమ భవమునన్దున్న జాతకులకు  సంతానము కలగదు
  8. మేష రాశి లో గురువు మరియు బుధుడు వుంది మేషరాసి పంచమ భావము అయినచో  సంతానము కలగదు.
  9. కుజుడు మరియు శని చతుర్ధము లో ఉంటే  సంతానము కలగదు.
  10. చంద్రుడు 10 లో శుక్రుడు 7 లో 4 లో పాపులు ఉన్నచో సంతానము నశించును.
  11. లగ్న , పంచమ, నవమదిపతులలో యవరికయినాను కుజ, శనుల సంబంధము, అష్టమాదిపతి సంబందము కుడా ఉన్నచో సంతాన నష్టము కలుగును.
  12. గురువు పంచమదిపతి పాపుల మధ్య నున్నను , సష్ట,వ్యమాది పతులు అప్తంగాతది దోషములు ఉన్నచో  సంతానము కలగదు.
  13. వృచిక  లగ్నమునందు గురు సుక్రులు లేక శని బుధులు ఉన్నచో  సంతానము కలగదు.
  14. పంచమ స్థానము నందు గురువు వుండి ఆ పంచమ స్థానము మేషము , కర్కాటక, మకర మరియు ధనుర్ లగ్నములు అయినచో సంతాన నష్టము కలుగును.
  15.   2, 5, 7 పతులు ఎవరయినా 6, 8, 12 స్థానములందు వుండి శత్రు గ్రహ మధ్య గతులయిన, పంచమధిపతి శత్రు, నీచ రాసులు అందుండగా మరియు 9 వ స్థానములో పాపులు వున్నాను  సంతానము కలగదు.

  16. సింహ , వ్రుచిక రాశుల వారికీ జన్మ లగ్న మునందు పాప గ్రహములు వుండి గురు, శుక్రులు కలసి వ్యయమునందు వున్నా  సంతానము కలగదు
  17. బుధుడు నుండి శని తను , పుత్ర , కళత్ర మరియు వ్యయభవములలొ ఉన్నచో  సంతానము కలగదు.
  18. పంచమది పతి వ్యయములో వుండి చతుర్ధ, దశమ భావదిపతులు తో సంబంధము యార్పడితే  సంతానము కలగదు.
  19. పంచమ స్థానములో రాహువు ఉంటే అల్ప సంతానము లేక సంతాన నష్టము లేక సంతానము లేకపోవడము జరుగును. శ్రీ సంతానము యకువగా ఉండును, మరియు రాహువు పయ్ పాపుల ద్రుష్టి వున్నా  సంతానము కలగదు.
  20. పంచమ స్థానములో కేతువు వున్నా పయ్ పలితములు కలుగును.
  21. శ్రీ జన్మ రాశికి పంచమ రాశి లో పురుషుడు జన్మించిన సంతాన నష్టము.
  22. పంచమదిపతి చంద్రుడు బుదునితో వ్యయము నందు గురువు అష్టమము నందు వున్నా  సంతానము కలగదు.
  23. అష్టమము నందు శని వుండి వాని దశ వచినపుడు పుత్ర నష్టము కలుగును.
  24. పంచమదిపతి శని, రవితో కలసి మేషము నందుండి పంచమము కుజుని ద్రుష్టి కలిగిన సంతానము కలగదు.
                                      సంతానము కలుగుట

  1. పంచమదిపతి లగ్నది పతి సుభులతో కూడిన కేంద్రములందు వుండి ధనాధిపతి బలము కలిగి ఉంటే పుత్ర సంతానము కలుగును.
  2.  లగ్నది పతి పంచమము భావములో వుండి నవమదిపతి సప్తమ స్థానములో వుండి ద్వితీయ అధిపతి మరియు ధనాధిపతి లగ్నములో ఉంటే  పుత్ర సంతానము కలుగును.
  3. నవములో గురువు, గురునికి కేంద్రమున శుక్రుడు ఉంటే లగ్నాధిపతి బలముగా ఉంటే చాల ఆలస్యముగా సంతానము కలుగును.
  4. పంచమదిపతి శని అయితే గురు, చంద్ర ద్రుష్టి ఉంటే స్వల్ప సంతానము కలుగును.
  5. పంచమదిపతి పంచమునన్దు గులికుడుంది ఆ స్థానాధిపతి పంచమములొ వున్తెయ్ కవలలు సంతానము కలుగును.
  6. ద్వితీయ , పంచామదిపతులకు కుజ, శని సంబందము ఉంటే సష్తమ స్థానము లందు గురువు ఉంటే శ్రీ సంతానము కలుగును.
  7. రవిగాని , శని గాని సి గ్రహ రాశి అంశాలలో వుండగా బుధ ద్రుష్టి ఉంటే శ్రీ సంతానము కలుగును.
  8. గురుని నవంసదిపతి కేంద్రములలో ఉంటే సంతానము కలుగును.
  9. శని, కుజులు కలసి 4 వ స్థానము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
  10. పంచమ భావము నందు శని, చంద్రుడు శని నవంసము నందు ఉంటే దత్తపుత్రులు కలిగి వుంటారు.
  11. లగ్న పంచామదిపతులకు పరస్పర ఒకరి రాశులందు ఒకరు వున్నాను జాతకుని పుత్రులు తండ్రి ఆజ్ఞను శిరసా వహిస్తారు.
  12. పంచమదిపతి , నవమధిపతి కలసి వుండి ధసమధి పతి మహర్ధస జరుగు చున్నపుడు  సంతానము కలుగును .
  13. పంచమము కర్కాటకము అయి అందు చంద్ర, గురువులు వున్నా శ్రీ సంతానము ఎకువ .
  14. లగ్న, పంచమది పతి , గురువు  ముగ్గురు కేంద్ర కోణములన్దునను జాతకుడికి పుత్ర సంతానము కలుగును..
  15. భాగ్యది పతి , భాగ్య మునందు వున్నాను సంతాన యోగము కలుగును .
  16. పంచమములొ చంద్ర, శుక్రులు వుండి ఆ శుక్రున కు  పంచమములొ బుధుడు వున్నా శ్రీ సంతానము అధికము.
  17. జన్మ లగ్నమునకు  పంచమమున గురువు , గురువునకు పంచమమున శని, శనికి పంచమమున రాహువు వున్నాను పుత్ర  సంతానము కలుగును
  18. నవమ స్థానములో గురువు వానికి పంచమ స్థానములో రవి ఆ రవికి సప్తమ స్థానములో కుజుడు వున్నా పుత్రా సంతానము కలుగును.
  19. చంద్రునకు పంచమమున గురువు ఆ గురువుకు పంచమమున సాని ఆ సానికి పంచమము నందు రాహువు వున్నా పుత్రా సంతానము కలుగును.
రాహువు కేతువులు సప్త గ్రహములతో కూడిన  పలితము
1)    రాహువుతో రవి లేక శుక్రులు లగ్నము నుండి ద్వితీయ భావములో ఉన్న లేక రాహువు ఉన్న నేత్ర సంబందమయిన వ్యాదులు కలుగును.
2)    ద్వితియములో రాహువు శుక్రులు వుంది అష్టమములో కేతువు శని గ్రహములు ఉన్న రాహువు శుక్రులకు  కేతువు, శనుల ద్రుష్టి ఉన్న ముత్ర సంబందమయిన లేక వృషణములు లకు వ్యాదులు మరియు గొంతు సంబందమయిన వ్యాదులు వచును.
3)    రాహువు గురువులు కలసియునచో దురాచారములకు లోను అగును. దైవముఫై నమ్మకము ఉండదు. కేతువు గురువు కలసివున్న   దైవ బక్తులు అగును.
4)    రాహువు అష్టమ బావములో  వుంది రాహువుకు రవి, కుజ, మరియు శని వీరిలో ఎవరి ద్రుష్టి తగిలిన వివాహములు ఆలస్యము అగును. బార్య లేక భర్తలలో మృతువు సంభవించును.
5)    రాహువు చంద్రునితో కలసి లగ్నమునందు వుండగా పంచమ, నవమ స్థానములు అనగా కొనములలో పాపులు ఉన్నచో మానసిక చంచలత్వము, మంద బుద్ది ఆత్మ హత్యలకు పాల్పడటము జరుగును.
6)    జన్మ లగ్నములో శని రహువులు కలసివున్న అనారోగ్యము నాల్గవ స్థానములో ఉన్న మాతృనష్టము, విద్య విగ్నములు కలుగును. ఏడవ స్తనమునందు ఉన్న పితృ సౌక్యము వుండదు. దశమ స్తానములో ఉన్న వృతిరీత్యా చికాకులు కలుగును.
7)    పంచమదిపతి అయిన చంద్రుడు శని కుజులతో రాహువు కలసివున్న సంతాన నష్టము కలుగును.
8)    శుక్రుడు కేతువు తో కలసి ఉన్న బార్య గయాళి, స్వల్ప సంతతి కలది, బార్య సహోదరులకు నష్టము కలుగును.
9)    శని, కేతువులు కలసి కేంద్రములలో ఉన్న రాజయోగము పట్టును.
7 లో శని, కుజ, మరియు రహువులతో కూడిన బ్రంహచార్యము , వివాహము అయిన దాంపత్య జీవితము వుండదు.
రాహువు విద్య స్తానములో ఉన్న విద్యబ్యాస కాలములో రాహువు దాస వచ్చినాచో వైద్య శాస్త్రము అబ్యాసిన్చును.
కేంద్రముల యందు రాహువు పాప గ్రహములతో కూడినను ఆ శిశువు సీగ్రముగా మరణించును.
4 వ అధిపతి రాహువుతో కలసి 6 నందు ఉన్న చోరుల వల్ల మరనింతురు.
6 వ బావము నందు చంద్రుడు లగ్నమునందు రాహువు వున్నాను అపస్మారక రోగము కలుగును.
 లగ్నము నందు గురువు, రాహువు ఉన్న దంత రోగములు కలుగును.
కారకాంస లగ్నము నుండి ద్వాదశ భావము నందు కేతువు వున్నాను మరణము అనంతరము బ్రంహా సానిద్యము పొందును.
ద్వితీయ భావములో కేతువు మరియు శుక్రుడు కలసిన పర శ్రీ లతో సంబందము కలిగి వుంటాడు.
కేతువుతో శని మరియు కుజులతో కలసి ద్వితియము లో వుంటే  వివాహము ఆలస్యము అగును.
బుధ, కేతువులు 3 భావము లో ఉన్న చెవి వ్యాదులు లేదా ఏదయినా అవయవ లోపము జరుగును.
3 వ భావములో కేతువు, శని కలసిన మంచి ఆరోగ్యము కలిగించును.
కేతువుతో కలసి శని 9 వ స్తానములో ఉంటే తండ్రికి అరిస్టములు కలుగును.
కేతువు, శుక్రులు కలసి 9 వ స్తానములో వుండిన బార్య లేదా భర్తకు నష్టము , స్థిర చర ఆస్తులకు నష్టములు కలుగును.
7 లో కేతువుతో శుక్ర, కుజులు కలసిన వ్యభిచారము చేయును.
7 లో కేతువు తో బుధుడు కలసిన వివాహ విషయములలో మోసము జరుగును.
7 వ భావములో రాహువుతో కుజుడుగాని, రావిగాని, శని గాని చేరిన నీచ శ్రిలతో సంబందము, వ్యభిచారము, భార్యను కోల్పోవడము జరుగును.
 7 లో రవి, రహువులు కలసిన సంతాన నష్టము కలుగును.
7 లో రాహువుతో గురు, శుక్రులు కలసిన విధవతో సంగమము జరుగును.
లగ్నము నందు శని పంచమములొ కుజ రహువులు వున్నాను సోదరులు వుండరు.
కుజ రహువులకు 6 వ అధిపతితో సంబందము ఉన్న గాయములు, లేక ఎవరయినా తుపాకితో కాల్చుట లేక కత్తితో పొడుచుట జరుగును.
కుజ రాహువుల కలయిక భు ఆక్రమణలు, కోల్పోవడము జరుగును.
లగ్నమున రవి, రహువులు వున్నాను శిరసు భినముగా ఉండును.
రవితో రాహువు లేక కేతువుతో సంబందము వుండి 8 లో వుంటే అవమానములు కలుగును.
శనితో రాహువు లేక కేతువు వుండి 7 లో ఉన్నచో వ్యభిచారము చేయును.
లగ్నము నందు రవి, 7 లో రాహువు వుంటే భార్య గర్భము ధరించదు.
7 లో రాహువు, 2 లో శని వుండిన ద్వికలత్ర యోగము కలుగును.
రాహు, శుక్రులు కలసిన చాకలి సంగమము జరుగును.