Thursday, 19 January 2017

ఇక మన చెవులకి చాగంటి కంఠం వినపడదా!



 ఇది చాలా బాధాకరమైన విషయమే అయినా ఇది నిజమనే వార్తలే వస్తున్నాయి.
ఈ వార్త విన్నారా.
ఈ వార్త భారత్ టుడే లో ఇంకా అనేక ఛానల్స్ లో ప్రచారం అవుతోంది. ఆ వార్త యథాతధం గా మీకోసం.

ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన చాగంటి కోటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ఇకపై ఆయన ప్రవచనాలు చెప్పడం మానేస్తారా? అంటే అవుననే సందేహాలు కలుగుతున్నాయి. తనపై కేసులు పెట్టడంతో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు మనస్తాపం చెందారని తెలుస్తోంది. దీంతో ప్రవచనాలు చెప్పడం మానెయ్యాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రవచనాలు చెబుతోంటే పదే పదే కేసులు వేస్తున్నారని చాగంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం కృష్ణుడి గొప్పతనం వివరించే క్రమంలో చాగంటి చేసిన వ్యాఖ్యలు యాదవుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చాగంటి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నొచ్చుకున్న చాగంటి అసలు ప్రవచనాలే మానేస్తే ఈ బాధ ఉండదని భావిస్తున్నారట.
అసలు చాగంటి ఏం మాట్లాడారన్నది ఓసారి పరిశీలిస్తే, ఇటీవల ఆయన ఓ బహిరంగ వేదికపై ప్రవచనాలు చేస్తున్న వేళ, శ్రీకృష్ణుడి గురించి మాట్లాడారు. "ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఓ మహా విజ్ఞానవేత్తో, చక్రవర్తి కడుపున పుట్టిన వాడో కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే, దశరధ మహారాజు కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు... ఏమీ తెలియని వాడు, తలగడిగితే మొల కడగరు, మొల కడిగితే, తల కడగరు... అటువంటి గొల్ల వాళ్ల ఇంట్లో పుట్టాడు" అంటూ నోరు జారారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతున్న యాదవ సంఘాలు ఆయనపై కేసులు పెడుతున్నాయి.



ఇపుడు మేం చెప్పబోయే ఈ భావన ఏ ఒక్కరి మనోగతమో కాదు, మన హైందవ సోదరులందరి మనోవేదన.
ఎందుకయ్యా అర్థం చేసుకోకుండా అనవసర విషయాల పైన ఇలా చేసారు.


చాలా మంది క్రైస్తవులు యాదవ కుల దేవత అయిన శ్రీ కృష్ణ భగవానుడి గురించి అతి నీచాతి నీచంగా,
వ్యసన పరుడు అని వ్యభిచారి అని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అప్పుడు మనం జోక్యం చేసుకోలేదు.

టీవీ9 లో శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజునే శ్రీ కృష్ణుడు దేవుడా కాదా? అని live డిబేట్ పెట్టినప్పుడు ఎవ్వరికీ గుర్తుకు రాలేదు, 

మనం యాదవులం, మన కుల దేవత శ్రీకృష్ణ భగవానుడు అని.
క్రైస్తవ పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి శ్రీకృష్ణ భగవానుడి గురించి అసలు నోటితో చెప్పరాని విధంగా మాట్లాడినప్పుడు మనం ఏమీ చేయలేదు.


సమాజ హితం కోసం నాలుగు మంచి మాటలు చెప్పాలి అని ఒక్క పైసా ఆశించకుండా వేల సంఖ్యలో ప్రవచనాలు చేసినటువంటి వ్యక్తి
ఇలా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతారా? 


సంస్కత పురాణం లో ఉన్న విషయాన్ని యధాతథం గా చెప్పటం లో, అందరికీ అర్ధమయ్యే లా చెప్పాలన్న ఆతృత లో ఈ పొర పాటు జరిగి ఉండచ్చు కాని వారి మనస్సులో ఎటువంటి అన్యమైన భావన ఉండదు.

ఈ రోజుల్లో అసలు మనకు పురాణాలు, ధర్మ శాస్త్రాలు మరియు ప్రవచనాలు చేసే వారి సంఖ్య చాలా తక్కువ.
మీరు ఇంకా ఇలాంటి వారిని ఏదో విధంగా టార్గెట్ చేసి ఇలా చేస్తే వారు ప్రవచనాలు చెప్పడం మానేస్తారు ఇక నాకెందుకు వచ్చిన గొడవ అని. 


అయినా మనకు కులం అంటే ఇంత అభిమానం ఉంది కదా ఆ కులం హిందూ ధర్మం లోనిది అని తెలియదా?
ఈరోజు చాలా మంది చాలా సంస్థలు పని గట్టుకొని అనేక విధాలుగా హిందుత్వాన్ని తూలనాడుతుంటే మన మనోభావాలు ఎటు పోయాయి. 


మనం భారత దేశ పౌరులే కదా.
10 నిమషాల సమయమిస్తే హిందువల తలలన్నింటినీ నరుకుతా అని మీడియా ముందు సవాల్ చేసినప్పుడు ఎటుపోయాయి మన మనోభావాలు.

నా మెడ మీద కత్తి పెట్టినా కూడా నేను భారత్ మాతా కీ జై అనను అని చెప్పినప్పుడు ఎటువెళ్లాయి మన మనోభావాలు.
అక్రమంగా హిందూ దేవాలయాలను కూల్చుతున్నప్పుడు ఎటు వెళ్ళాయి మన మనోభావాలు. అప్పుడు ఏమి చేస్తున్నాం మనమంతా.
అంటే మనకు మన కులాలే కావాలి కానీ మన హిందూ ధర్మం, మన దేశం ఏమయి పోయినా పర్వాలేదా? ఇకనైనా మారదాం కాస్త. అనవసరపు వాటిపైన మాట్లాడటం ఆపి కాస్త ఇకనైనా దేశం కోసం, మన ధర్మం కోసం పని చేద్దాం. మనం చేయకపోయినా పర్వాలేదు కానీ, ఆవిధంగా పని చేసే వారిని చేయనిద్దాం. లేనట్లయితే మన ఉనికికే ప్రమాదం వస్తుంది.

ఏ మనిషికైనా రాగ ద్వేషాలు కోపావేశాలు సహజం.
మీకు కోపం రావటంలో కాని మీరు బాధ పడటం లో కాని తప్పు ఉందని నేను అనటం లేదు.


కాని వారు అన్న ఆ మాటలు పురాణ ప్రవచన సందర్భంలో యాదృచ్చికంగా దొర్లిన వే తప్ప వేరు కావు.
ఆయనకు మీ పట్ల ఎటువంటి చెడు భావన లేదు.


ఆయనకే కాదు ఈ దేశంలో సరిగ్గా హిందూ ధర్మాన్ని అర్ధం చేసుకున్న వారు ఎవరికైనా కూడా మీ పట్ల గౌరవ భావమే తప్ప వేరు ఆలోచన లేదు.


మనకు అన్ని కులాలు సమానమే,మనమంతా హిందువులమే.

అందువల్ల తెలిసో తెలియకో ఏదో జరిగి పోయింది,అయన అనటం మీరు అలగటం,
దానికి వారు చాలా పెద్ద మనసుతో మీ అందరినీ సంతోష పరచేలా మీరు కోరుకున్నట్లు గానే వారు ఉదాత్తంగా ప్రవర్తించటం జరిగాయికదా!


మీకు బాధ కలిగింది,అది మీరు వారిని ప్రశ్నంచారు,దానికి వారు మీపట్ల గౌరవంతో క్షమాపన పలికారు,
మీ ఆత్మ గౌరవం తృప్తి పడటానికి మీకు అది చాలదా!


కాని దానిని మీరు వీడీయోలు తీసి ఆడియోలు తీసి పబ్లిక్ మీడియా లో పెట్టి, ఆయనతో క్షమాపన చెప్పించుకున్నాం అని ఆయన పరువు తీసి,
ఆయనను వ్యక్తిగతంగా అంత మనఃక్షోభకు గురిచేయటం అంత అవసరమా.
మరి ఆ పరిస్థితులో ఇంత అవమానాలు పొందిన ఆయనకు ఈ ప్రవచనాలు నేను చెప్పాలా అని ఆయనకు అనిపించటం, సహజమేకదా!
భగవంతుడు తనకిచ్చిన ఙ్ఞానాన్ని ని స్వార్ధంగా పదిమందికి పంచాలకునే ఆ మహానుభావునికి,
ఎంత మన క్షోభ కలిగి ఉంటుదో తలుచుకుంటేనే మా గుండె బరువెక్కి పోతోంది.

కారణం ఏదైనా కానివ్వండి ఇపుడు వారు కనుక నిజంగానే ప్రవచనాలు మానుకుంటే కనక,
మీకు తెలియకుండానే మీ వల్ల ఈ తెలుగు రాష్ట్రాలకి,మన హిందూ ధర్మానికి తీరని అన్యాయం జరిగినట్లే.

No comments:

Post a Comment