Wednesday, 18 January 2017

కుళ్ళిన, ఎండిన గుమ్మంలోని గుమ్మడికాయను మార్చవచ్చా.............!!




సాధారణంగా హిందువులు గృహప్రవేశం రోజున గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. మరికొందరు ఇళ్ళకు, ఆఫీసుల గుమ్మాలకు గుమ్మడికాయ కడతారు. సాధారణంగా పధ్ధతి ప్రకారం చెప్పాలి అంటే కట్టిన గుమ్మడికాయ కుళ్ళకూడదు. గుమ్మడికాయ కుళ్ళిపోకుండా లోపలలోపల ముడుచుకుపోయి ఎండిపోతే చాలా మంచిది. అలా కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే, ఎండిపోతే తిరిగి కొత్తది కట్టుకోవచ్చు. కొత్త గుమ్మడికాయను ఏ రోజు పడితే ఆ రోజు కట్టకూడదు. ఆదివారం లేదా గురువారం కానీ కట్టాలి. ఎందుకంటే ఈ రెండు వారాలకు భూతప్రేత పిశాచాలను అరికట్టే వారాలు. కొత్త గుమ్మడికాయకు పసుపు కుంకుమ పెట్టి వాకిట్లో కట్టాలి. ఎందుకంటే ఇది సర్వబాదా నివృత్తి చేస్తుంది. ఎప్పుడూ గుమ్మడికాయ గుమ్మానికి కట్టి ఉంచడం చాలా అవసరం. ఏడాదికి ఒకసారి మార్చమని ఎక్కడా చెప్పలేదు.

No comments:

Post a Comment