Tuesday, 31 January 2017

వసంత పంచమి




వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. శ్రీ పంచమి అని కూడా దీన్ని అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజచేస్తే సర్వ శుభాలు కలుగుతాయి. రతీ మన్మథులను పూజించి మహోత్సవం నిర్వహించాలని, దానం చేయాలని, దీని వల్ల మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. 'మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్ర శుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులకు సంతర్పణ చేయాలి' అని వ్రత చూడామణిలో ఉంది.

వసంత ఋతువు రాకను భారతదేశమంతటా వసంతపంచమి పండుగగా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమినాడు (జనవరి-ఫిబ్రవరి) వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి అధిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువులతల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికీ, స్ఫూర్తికీ కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సంప్రదాయం.


సరస్వతీం శుక్లవర్ణాం సుస్మితాం సుమనోహరామ్‌
కోటిచంద్ర ప్రభా ముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహమ్‌
వహ్ని శుధ్ధాంశుకాధానం వీణా పుస్తక ధారిణీమ్‌
రత్న సారేంద్ర నిర్మాణ నవ భూషణ భూషితామ్‌


జ్ఞానశక్తికి అధిష్టాన దేవత- సరస్వతీమాత. జ్ఞాన, వివేక, దూరదర్శిత్వ, బుద్ధిమత్తత, విచార శీలం తదితరాలను శ్రీవాణి అనుగ్రహిస్తుందంటారు. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవి పరమ సాత్వికమూర్తి. అహింసాదేవి. ఆమెకు యుద్ధంచేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణం సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటోంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీనురాలై ఉన్న వాగ్దేవి మందస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా, సరస్వతీ జయంతిగా జరుపుకొంటారు.

వసంత పంచమి నామాన్ని బట్టి దీన్ని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించాలి. మకర సంక్రమణం తరవాత, క్రమక్రమంగా వసంత ఋతువు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుకు స్వాగత గీతం ఆలపిస్తుంది. ఆ వసంత ఋతువు శోభకు 'వసంత పంచమి' వేడుక శ్రీకారం చుడుతుంది.

సరస్వతి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం చైతన్యానికి ప్రతీక. జలం జీవశక్తికి సంకేతం. నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది. ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదకశక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన, సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని.

కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభ సూచకమైతే, ఈ రోజున సరస్వతీ పూజను నిర్వహించుకోవడం సహేతుకం. శ్రీ అంటే సంపద. జ్ఞాన సంపత్ప్రద అయిన సరస్వతిని ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమినే రతి కామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమినాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగదేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరఢవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో ఆంతర్యాల సమ్మేళనం- వసంత పంచమి పర్వదినం.

వాహనాలకి ప్రమాదం జరగకుండా ఉండేందుకు





వాహనాలకి  ప్రమాదం జరగకుండా ఉండేందుకు వాహనం డిక్కి లో కాలాబాష్, మరియు 9 గురిగింజలు,9 తెల్ల మిరియాలు  కలిపి ఒక ఎర్రని వస్త్రం లో కట్టి వాహనంలో ఉంచాలి.వాహనం పైన "క్షేమంకర్యై నమః" అని రాయించాలి.

contact for kalabash 9000123129

Sunday, 29 January 2017

ముత్యపు శంఖం



Image may contain: night
ముత్యపు శంఖం తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ముత్యపు కాంతితో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ముత్యపు శంఖం మేరువు ఆకారంలో పైన సన్నగా ఉండి కిందవైపు ఉదరం ఉంటుంది. ముత్యపు శంఖాలు కొన్ని పైన కోన తేలి ఉంటాయి.మరికొన్ని రంధ్రంతో ఉంటాయి.రంధ్రంతో ఉన్న ముత్యపు శంఖాలతోటి ద్వని(ఊద) చేయవచ్చు.ముత్యపు శంఖాలని సోమవారం రోజు గాని ,శుక్రవారం రోజు గాని , దీపావళి,అక్షయతృతీయ రోజు పూజలు చేస్తారు.ముత్యపు శంఖం శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు
పూజా విధానం :- ముత్యపు శంఖాన్ని ముందుగా గంగాజలంతోగాని,పసుపు నీళ్ళతో గాని శుద్ది చేసుకోవాలి. ముత్యపు శంఖాన్ని తెల్లటి వస్త్రంపైన గాని ,బియ్యంపైన గాని ,అష్టలక్ష్మి పీటం పైనగాని ఉంచి పూజచేయాలి.గంధం,కుంకుమ,పసుపు ,అక్షితలు సమర్పించి అష్టోత్తర శతనామావళి పూజాచేయాలి..ధూప,దీప నైవేద్యాలు,తాంబూలం సమర్పించి బియ్యపు గింజలను శంఖం లోపల వేయాలి.
ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై
ధనధాన్య సమృద్ధిం దేహిదేహి నమః
అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరిస్తూ పూజించాలి.
కొన్ని శంఖాలు చెవి దగ్గర పెట్టుకుంటే ఓంకార నాదం వినిపిస్తుంది.శంఖం అనేది కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫేట్, కార్బొనేట్లతో తయారౌతుంది. ఈ ధాతువులు మన శరీరానికి చేసే మేలు చాలా ఉంది. కాల్షియం ఎముకల ఎదుగుదలకి, మెదడు చురుకుగా పని చేయడానికీ, శరీరంలోని మలినాలని తొలగించడానికీ, కండరాల సంకోచ వ్యాకోచాలకీ అవసరం.శంఖ భస్మము వల్ల అనేక రోగాలు కూడా నయము అగుచున్నవి.శంఖాన్ని పూరించుట వల్ల శ్వాశకోశ రోగాలు నశిస్తాయి, బాగా గాలి ప్రసరణ జరిగి చురుకుగా కూడా ఉంటాము
జాతకచక్రంలో చంద్రుడు నీచలో వున్నవారికి ,శత్రుక్షేత్రాలలో వున్నవారికి, అమావాస్య,పౌర్ణమి, రాహువుతో కలసిన చంద్రుడు ఉన్నవారు ముత్యపు శంఖాన్ని పూజించాలి.
ముత్యపు శంఖంలోనీటిని పోసి రోజు తాగిన వారికి చంద్రగ్రహ దోషాలవలన కలిగే అనారోగ్యాలు తగ్గుతాయి.జాతక చక్రంలో చంద్రుడు 8 వ స్ధానంలో ఉన్న వారికి బాలారిష్ట దోషం ఉంటుంది.ఇలాంటి వారు చంద్రుడు జాతకచక్రం లో సరిగా లేనివారు తప్పకుండా ముత్యపు శంఖాన్ని పూజించుకోవటం చాలా మంచిది.
పూజచేసిన శంఖాన్ని బీరువాలో ధనం,బంగారం ఉండే చోట ఉంచితే ధనాభివృద్ధి ఉంటుంది.
ప్రతి సోమవారం భార్యాభర్తలు ముత్యపు శంఖాన్ని పూజాచేసి శంఖంలో పోసిన నీటిని తీర్ధ ప్రసాదంగా స్వీకరిస్తే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొండటమే కాకుండా అన్యోన్నతని పొందుతారు.
వ్యాపారస్థలంలో ముత్యపు శంఖాన్ని తప్పకుండా పూజించుకున్న వారికి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది.బియ్యం వ్యాపారస్తులు,వాటర్ ప్లాంట్స్ ఉన్న వారు,హోటల్స్,మహిళా వృత్తులు చేసేవారు,ప్రజలకు ఉపయోగపడే వృత్తులు చేసే వారు ముత్యపు శంఖాన్ని పూజించాలి.
కవిత్వం వ్రాసేవారు,పాలు,నీటికి సంబందించిన వ్యాపారులు,ముత్యపు శంఖాన్ని పూజించటం మంచిది.మతిమరుపు ఉన్నవారు ముత్యపు శంఖంలో నీటిని పోసి తాగటం మంచిది.
హోటల్స్,పాలవ్యాపారం చేసేవారు లలితకళలు,కవులు,గాయకులు ముత్యపు శంఖాన్ని పూజించాలి.
మూర్ఛ వ్యాదిగ్రస్తులు,పూనకం సమస్యలు ఉన్నవారు ముత్యపు శంఖాన్ని పూజించిన,శంఖలో నీటిని తాగిన వ్యాధి సమస్యలు నిదానముగా దూరమవును.

contact 9000123129

తప్పులేకుండా కోర్ట్ కేసులలో ఇరుక్కుంటే




తప్పులేకుండా కోర్ట్ కేసులలో ఇరుక్కుంటే పుష్యమి నక్షత్రం ఉన్న రోజు దేశి గన్నేరు పువ్వుని కల్వంలో గోరోజనంతో కలిపి నూరి ఆ రసాన్ని సేకరించి దానిమ్మ పుల్లతో రోజు తిలకం గా ధరించాలి.త్వరగా బైటపడతారు.

సౌరమానం - చాంద్రమానం




ప్రకృతి సిద్దంగా మూడు రకాల కాలమానాలు కనిపిస్తునాయి
అవి 1) రోజు 2) నెల 3) సంవత్సరం,
వీటికి కారకులు సూర్యుడు , చంద్రుడు .రోజు ప్రమాణం సరాసరిగా 24 గంటలు అనేది అందరికి తెలిసిందే . అంటే సూర్యోదయం నుండి సూర్యోదయం . అమావాస్యకి ,అమావాస్యకి మద్య సరాసరి వ్యవధి 29.530 రోజులు ఇది చంద్రమానం . అలాగే సౌరమానం లో 30 రోజులు మాసము .
రెండు వసంత విషవత్తులు మద్య కాలం ఒక సాయన సంవత్సరము అంటే 365.242199 రోజులు . ఇవన్నీ పూర్ణ సంఖ్యలు కాకుండ భిన్నములు అవడంతో వీటి మద్య పొత్తు చాల కష్టసాద్యం .
1 సంవత్సరం అంటే 12 మాసాలు వుంటాయి . అలాకాక 12 చాంద్రమాసాలు అనుకుంటే మొత్తం లెక్కలన్నీ తేడా వస్తున్నాయ్ . వీటిని లెక్కించటానికి మూడు మార్గములు లేక పద్దతులు వున్నాయి.అవి :
1) చాంద్రమాన పద్ధతి 2) సౌరమానం 3) చాంద్ర , సౌర మన విధానం .

1) చాంద్రమాన పధ్ధతి : ప్రపంచమంతా అన్ని జాతుల వారు మొట్ట మొదట ఉపయోగించిన పధ్ధతి చాంద్రమానం . ఎందుకంటె చంద్ర కళలలో కనిపించినంత బేధము సూర్యునిలో కనిపించక పోవటమే .
ఈ విధంగా 12 చాంద్రమాన మాసాలు సంవత్సరం అనుకుంటే 12x 29.530 = 354 రోజులు . సౌర సంవత్సరం 365.2421 ( 6 1/4 గంటలు ) . దీనికి తేడా 11 1/4 రోజులు అంటే ఏడాదికి 11 1/4 రోజులు చంద్రుడు వెనుక పడిపోయాడు . ఋతువులు అన్ని సూర్యుడుని బట్టి ఏర్పడినవే . మానవుడి జీవన సరళి అంతా ఋతుచక్రం పైనే ఆధారపడి వుంది . అందువల్ల కేవలం చంద్రమానం మాత్రమే అనుసరించలేము .

2) సౌర పంచాంగం : చంద్ర కళల తో సంభంధం లేకుండా సౌరమానము అనుసరించడమే . సంవత్సరం పొడవును నిర్ణయించి దాని ఆధారంగా 12 మాసాలను నిర్ణయించు కోవటం . ఇందులో చంద్రునికి ఏ సంభంధం లేదు . ఇలా చేయటం వల్ల కొన్ని ప్రత్యెక దినాల్లో చేయవలసిన కార్యక్రమాలు,నియమాలు , పూర్వకాలంలో యజ్ఞయాగాది క్రతువులు జరగవు . ఎందుకంటె చంద్రునితో సంభంధం పెట్టుకోలేదు కనుక . కనుకనే దీనికి పూర్తి ప్రాధాన్యత లభించలేదు .
3) చాంద్ర , సౌర పంచాంగం : పై రెండు ఇబ్బందులను అధిగమించటానికి గాను చాంద్ర , సౌరమానాలను సమన్వయ పరచి తాయారు చేసినది ఇపుడు మనము ఉపయోగిస్తున్నది ఈ పంచాంగమే .
ఇందులో చంద్ర కళలను అనుసరించి మాసాలు (నెలలు) వుంటాయి . సూర్య గమనం ఆధారంగా సంవత్సరం వుంటుంది . వీటి మద్య సమన్వయ పరచటానికి అవసరం అయనప్పుడు అధిక మాసాలను , ఒక్కో సారి క్షయ మాసాలు ఏర్పరిచారు .

ఈ క్రింది వివరణతో మీకు సులువుగా అర్ధమవుతుంది :
చాంద్ర సంవత్సరానికి సౌర సంవత్సరానికి గల 11 1/4 రోజుల భేదమును 3 సంవత్సరాలలో 33 3/4 రోజులు అవుతుంది . అందువల్ల ప్రతి 3 సంవత్సరాలకు 1 నెల అధిక మాసం ఏర్పరిచారు . మిగిలిన 3/4 రోజులను 24 సంవత్సరాలు అయ్యేటప్పుటికి 1 నెల అవుతుంది . అపుడు మరొక అధికమాసం ప్రవేశపెడితే అది పూర్తవుతుంది. అధిక మాసం వచ్చిన నేలను అధిక మాసం అని తర్వాత వచ్చిన నేలను నిజ మాసం అని అంటారు .
క్షయ మాసం :
ఇలా అధిక మాసాలు చేర్చుకుంటూ వెళితే కొంత కాలానికి ఒక మాసంలో రెండు సంక్రాంతులు వస్తాయి . అప్పుడు ఆ మాసాన్ని తొలగిస్తారు . దీనినే క్షయ మాసం లేదా లుప్తమాసం అంటారు . ఆ లుప్త మాసాలు కార్తీక , మార్గశిర , పుష్యమాసాలలో వస్తాయి . ఎందుకంటే ఈ మాసాలలో భూమి అండవృత్తపు సమీపబిందువు వద్ద వుండి వేగంగా నడవడంతో సూర్యుడు ఒక్కొక రాశిని త్వరత్వరగా దాటేస్తాడు . కనుక ఈ రెండు నెలలలోనే సంక్రాంతులు వస్తాయి . క్షయ మాసానికి రెండువైపులా చెరో అధిక మాసం వస్తాయి . ఈలుప్త మాసాలు 141 సం.కు ఒక్కొకసారి 19 సంవత్సరాలకు , 122 ఏళ్ళకు వస్తాయి అని భాస్కరాచార్యులు అన్నారు .

Saturday, 28 January 2017

మాఘమాసం మహిమ


ఈ రోజు నుండే మాఘమాసం మొదలు అవుతుంది మాఘమాసం గురించి తెలుసుకొందాం.
చంద్రుడు మఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం. ‘మఘం’ అంటే యజ్ఞం. యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావించేవారు. ఈ మఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం గనుక మాఘమాసమైంది.
మాఘ స్నానం పవిత్రస్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం. మాఘస్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహాత్మ్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటోంది. మృకండుముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. మఘం అంటే యజ్ఞం. కల్యాణ కారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీస్నానాలు చేయడం మాఘమాస సంప్రదాయం.
మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్య కిరణాల్లో ఉండే అతినీల లోహిత, పరారుణ కిరణాల సాంద్రతల్లో మార్పులొస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20నుంచి మార్చి 30వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేసే స్నానాలు శ్రేష్ఠమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్ఠానదైవం సూర్య భగవానుడు. స్నానానంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం.
మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా ఆరు సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందంటారు. బావినీటి స్నానం పన్నెండేళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానం సహస్ర గుణం, త్రివేణీ సంగమ స్నానం నదీశతగుణఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. మాఘ స్నానంలో దివ్య తీర్థాలను స్మరించి పాపవినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ‘ప్రయాగ’ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం.
మాఘ పూర్ణిమను ‘మహామాఘం’ అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకమంటారు.

అఘము అనే పదానికి సంస్కృతంలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింప చేసేది అనే అర్థాన్ని పండితులు చెబుతున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడైనా, విష్ణువైనా, ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతుంటాయి.
మాఘ విశిష్టతను గురించి, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయటం ఓ వ్రతంగా ఉంది. మాఘంలోఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్ననీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అబ్బుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నదీ స్నానం చేయటం సర్వోత్తమం.
తిథులు:-
1. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియనాడు బెల్లం, ఉప్పు దానం చేయటం మంచిది. 2. శుద్ధ విదియ 3. శుద్ధ చవితి 4. శుద్ధ పంచమి 5. శుద్ధ షష్టి 6. శుద్ధ సప్తమి 7. అష్టమి 8. నవమి 9. ఏకాదశి 10. ద్వాదశి 11. త్రయోదశి 12. మాఘ పూర్ణిమ 13. కృష్ణపాడ్యమి 14. కృష్ణ సప్తమి 15. కృష్ణ ఏకాదశి 16. కృష్ణద్వాదశి 17. కృష్ణ చతుర్దశి 18. కృష్ణ అమావాస్య ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు, వివిధ దేవతలను ఉద్దేశించి జరపుకోవటం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళనుండి అంత విశిష్టత ఉంది.


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371


Friday, 27 January 2017

ఈ రోజు మౌని అమావాస్య 27-1-2017




ప్రతి సంవత్సరం సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించిన అనంతరం వచ్చే 

తొలి అమావాస్యను పుష్య అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అయితే జనవరి 27న రానున్న మౌని అమావాస్య, ఆ రోజు మాట్లాడకుండా ఉదయం 10-30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకైనా  మౌనంగా ఉండాలి.

ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న శనిగ్రహం 2017 అక్టోబర్‌ 26న సహజ గమనంతో ధనస్సు రాశిలోకి ప్రవేశించవలసి ఉందని, కానీ ఈ లోపే అతి గమనంతో హడావుడిగా జనవరి 26వ తేదీ రాత్రి 7-31 గంటలకు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తుందని శ్రీనివాస గార్గేయ చెప్పారు. ఇలా ప్రవేశించిన శని తిరిగి వృశ్చిక రాశిలోకి జూన్‌ 21వ తేదీకి చేరుకుంటుందని తెలిపారు. వృశ్చికరాశిలో కొంతకాలంపాటు ఉండి సహజ గమనంతో అక్టోబర్‌ 26న ధనస్సు రాశిలోకి తిరిగి ప్రవేశిస్తుందన్నారు. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ప్రత్యన్గిర దేవి హోమం, 
ఇష్ట దైవం మరియు ఓం నమశివాయ మంత్ర జపం   చెయ్యాలి.

వనమూలికలతో కూడిన దూపాన్ని ఇంట్లో వెయ్యండి. 

శుభమస్తు

Wednesday, 25 January 2017

శుక్రవారం నాడు వచ్చిన అమావాస్య రోజు చెయ్యాల్సిన విధి - యోగక్షేమ౦



పిప్పళ్ళు, ఎండు మిరపకాయలు, బొరుగులు, గులాబీ పువ్వులు, మిరియాలు, చెంగల్వకోష్టు,గుగ్గిలం ,మహిసాక్షి, సాంబ్రాణి ,మరియు ఇతర విశేష మూలికలతో కలిపినా పొడితో దూపం వెయ్యండి .దూపం వేసాక " ఓం ఐ౦ హ్రీం శ్రీం" అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అన్ని రకాల దృష్టులు, దోషాలు హరించబడి మీరు అనుకునే కార్యాలు త్వరగా దిగ్విజయమవుతాయి.

ఆర్దిక ఇబ్బందులు తొలగుటకు..........!!


ఆర్దిక ఇబ్బందులు తొలగుటకు, గుప్పెడు శనగలు నానబెట్టి మరుసటి రొజు వాటిని పక్షులకు తినిపించాలి ఇలా 41 రొజులు చెయటం వలన ఆర్దిక ఇబ్బందుల నుండి బయట పడగలరు.

Monday, 23 January 2017

ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారా?



ప్రమోషన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీరు తప్పక ఆచరించాల్సిన విధి ఒకటి ఉంది.11 గోమతి చక్రాలు తీసుకొని ఆవుపాలలో వేసి శివ లింగానికి ఆలయంలో కాని,గృహంలోకాని పౌర్ణమి నాడు అభిషేకించి ,ఆ గోమతి చక్రాలను స్వామి కే  సమర్పించి రావాలి.అభిషేకం చేస్తున్నప్పుడు మీ ప్రమోషన్ లో ఉన్న ఇబ్బంది స్వామికి విన్నవించాలి.


శుభమస్తు

శ్రీ పంచముఖ హనుమత్కవచం



శ్రీ సుదర్శన సంహితోక్తం

Image may contain: 1 person
శ్రీ గణేశాయ నమః ఓం శ్రీపంచవద నాయాంజనేయాయ నమః!
ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య బ్రహ్మో ఋషిః, గాయత్రీ చందః, పంచముఖ విరాట్ హనుమాన్ దేవతా, హ్రీం బీజం, శ్రీం శక్తి: క్రౌం కీలకం క్రూం కవచం, క్రైం అస్త్రాయ ఫట్ ఇతి
దిగ్బందః!! శ్రీ గరుడ ఉవాచ -
అథ ధ్యానం ప్రవక్ష్యామి - శృణు సర్వాంగసుందరి!
యత్కృతం దేవదేవేన - ధ్యానం హనుమతః ప్రియమ్!!
పంచవక్త్రం మహాభీమం - త్రిపంచనయనై ర్యుతం!
బాహుభి ర్దశభి ర్యుక్తం - సర్వకామార్థ సిద్ధిదమ్!!
పూర్వం తు వానరం వక్త్రం - కోటిసూర్య సమప్రభం!
దంష్ట్రాకరాళ వదనం - భృకుటీ కుటిలేక్షణమ్!!
అస్వైవ దక్షిణం వక్త్రం - నారసింహం మహాద్భుతం !
అత్యుగ తేజోవపుషం - భీషణం భయనాశనమ్!!
పశ్చిమం గారుడం వక్త్రం - వక్రతుండం మహాబలం !
సర్వనాగా ప్రశమనం - విషభూతాది కృంతనమ్!!
ఉత్తరం సౌకరం వక్త్రం - కృష్ణం దీప్తం సభోపమం!
పాతాళ సింహ బేతాళ - జ్వర రోగాడి కృన్తనమ్!!
ఊర్థ్యం హయాననం ఘోరం - దానవాంతకరం పరం !
యేన వక్త్రేణ విప్రేంద్ర - తారకాఖ్యం మహాసురమ్!!
జఘాన శరణం తత్స్యాత్సర్వ శత్రుహారం పరమ్!
ధ్యాత్వా పంచాముఖం రుద్రం - హనుమంతం దయానిధిమ్!!
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం - పాషా మంకుశ పర్వతం!
ముష్తిం కౌమోదకీం వృక్షం - ధారయన్తం కమండలుమ్!!
భిన్డి పాలం జ్ఞానముద్రాం - దశభి ర్మునిపుంగవం!
ఏతా న్యాయధజాలాని - ధారయన్తం భాజా మ్యహమ్!!
ప్రేతాస నోపవిష్టం తం - సర్వాభరణ భూషితం !
దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనమ్!!
సర్వాశ్చర్యమయం దేవం - హనుమ ద్విశ్వతోముఖం!
పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణం
వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యం
పీతాంబరాది ముకుటై రుపశోభితాంగం
పింగాక్ష మాద్య మనిశం మనసా స్మరామి!!
మర్కటేశ! మహోత్సాహ! సర్వశత్రు హరంపరం
శత్రుం సంహార మం రక్షా శ్రీమ న్నాపద ముద్ధర!!
ఓం హరిమర్కట మరకత మంత్ర మిదం
పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే
యది నశ్యతి నశ్యతి శత్రుకులం
యది ముంచతి ముంచతి వామలతా!!
ఓం హరిమర్కట మర్కటాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రు సంహారణాయ స్వాహా!
ఓం నమోభగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకల భూత ప్రమథనాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిశ హరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖ మాదివరహాయ సకలసంపత్కరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్థ్వముఖాయ హైగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా! ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః; అనుష్టుప్చందః; పంచముఖ వీరహనుమాన్ దేవతా! హనుమా నీతి బీజం' వాయుపుత్ర ఇతి శక్తి:' అన్జనీసుట ఇతి కీలకమ్; శ్రీరామదూత హనుమత్ర్పసాద సిద్ధ్యర్దే జపే వినియోగః!!
ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః!
ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః!
ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః!
ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః!
ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః!
ఓం పంచముఖ హనుమతే కరతల కరపృష్ఠాభ్యాం నమః!
ఏవం హృదయాదిన్యాసః!
పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్భంధః!
ధ్యానం :-
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!
అథ మంత్ర :-
శ్రీరామదూతా యాంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫల్గుణసఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నాయనా యామితవిక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవి తాంగద లక్ష్మణ మహాకపిసైన్య ప్రాణదాయ దశకంఠ విధ్వంసనాయ రామేష్టాయ మహాఫల్గుణసఖాయ సీతాసహిత రామ వరప్రదాయ, షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్రజపే వినియోగః!!
ఓం హరిమర్కట మర్కటాయ బం బం బం బం బం వౌషట్ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ఫం ఫం ఫం ఫం ఫం ఫం ఫట్ స్వాహా!
హరిమర్కట మర్కటాయ ఖేం ఖేం ఖేం ఖేం ఖేం మారణాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ లుం లుం లుం లుం లుం ఆకర్షిత సకలసంపత్కరాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ధం ధం ధం ధం ధం శత్రుస్తంభనాయ స్వాహా!
ఓం టం టం టం టం టం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!
ఓం కం ఖం గం ఘం జం చం ఛం జం ఝం ఇం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా! ఇతి దిగ్బందః!
ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే టం టం టం టం టం సకలశత్రు సంహారణాయ స్వాహా! ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలవదనాయ నరసింహాయ ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా! ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం మం మం మం మం సకలవిష హరాయ స్వాహా! ఓం ఉత్తరాముఖాయదివరహాయ లం లం లం లం లం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖ హనుమతే స్వాహా! ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుం రుం రుం రుం రుం రుద్రమూర్తయే సకల ప్రయోజన నిర్వాహకాయ స్వాహా! ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా! భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యన్తరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా! సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జం జం జం జం జం స్వాహా!
ఇతి శ్రీ సుదర్శనసంహితాయాం శ్రీరామచంద్ర సీతాప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం సంపూర్ణమ్!!

Sunday, 22 January 2017

జీవితాంతం ఆర్థిక సమస్యలు రాకుండ ఉండుటకు .........!!



ఎవరైతే ప్రతి శనివారం నాడు శ్రీ వేంకటేశ్వరస్వామివారికి  దీపారాధన చేసి తులసి దళాలతో మాలకట్టి హారంగా వేస్తారో వారికి జీవితాంతం ఆర్థిక సమస్యలు రావు.

Friday, 20 January 2017

రాజకీయముల లో గుర్తింపునకు............!!




రాజకీయముల లో గుర్తింపునకు చందనము ,కుంకుమపువ్వు ,చెంగలకోష్టు ,నల్ల తేగడ ,కురువేరు ,మాచిపత్రి ,దేవదారు ,సాంబ్రాణి కలిపి సభలయందు పొగవేసినచో జన సమూహము పెరిగి జనస్థంబన కలిగి పార్టీకి బలం చేకూరి పోటీచేసే అభ్యర్థి పదవికి తప్పక పొందగలరు .

ఆ అభ్యర్థి మెడలో తెల్ల గురిగింజ వేరు సంపాదించి తావీజు నందు బిగించి ధరించుట మంచిది .

contact for attraction doop and guriginja veru 9000123129

కోరుకున్న ప్రదేశం లో ఉద్యోగం రావడానికి




కోరుకున్న ప్రదేశం లో ఉద్యోగం రావడానికి నిద్రించేప్పుడు తల దగ్గర రాగి చెంబు తో నీళ్ళు పెట్టుకొని అందులో ౨ గోమతి చక్రాలు,తులసిఆకులు వేసి మూతమూసి పెట్టాలి.ఉదయం ఆ నీళ్ళని తాగాలి.ఇలా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నన్ని రోజులు చెయ్యాలి.కోరుకున్న ప్రదేశం లో ఉద్యోగం వస్తుంది.

Thursday, 19 January 2017

ఇక మన చెవులకి చాగంటి కంఠం వినపడదా!



 ఇది చాలా బాధాకరమైన విషయమే అయినా ఇది నిజమనే వార్తలే వస్తున్నాయి.
ఈ వార్త విన్నారా.
ఈ వార్త భారత్ టుడే లో ఇంకా అనేక ఛానల్స్ లో ప్రచారం అవుతోంది. ఆ వార్త యథాతధం గా మీకోసం.

ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన చాగంటి కోటేశ్వరరావు సంచలన నిర్ణయం తీసుకోనున్నారా? ఇకపై ఆయన ప్రవచనాలు చెప్పడం మానేస్తారా? అంటే అవుననే సందేహాలు కలుగుతున్నాయి. తనపై కేసులు పెట్టడంతో ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు మనస్తాపం చెందారని తెలుస్తోంది. దీంతో ప్రవచనాలు చెప్పడం మానెయ్యాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రవచనాలు చెబుతోంటే పదే పదే కేసులు వేస్తున్నారని చాగంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజుల క్రితం కృష్ణుడి గొప్పతనం వివరించే క్రమంలో చాగంటి చేసిన వ్యాఖ్యలు యాదవుల ఆగ్రహానికి కారణమయ్యాయి. దీంతో హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడ ఇలా తెలుగు రాష్ట్రాల నలుమూలలా తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ అఖిల భారత యాదవ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చాగంటి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నొచ్చుకున్న చాగంటి అసలు ప్రవచనాలే మానేస్తే ఈ బాధ ఉండదని భావిస్తున్నారట.
అసలు చాగంటి ఏం మాట్లాడారన్నది ఓసారి పరిశీలిస్తే, ఇటీవల ఆయన ఓ బహిరంగ వేదికపై ప్రవచనాలు చేస్తున్న వేళ, శ్రీకృష్ణుడి గురించి మాట్లాడారు. "ఆయన పశువుల కాపరి ఇంట్లో పుట్టాడు. ఓ మహా విజ్ఞానవేత్తో, చక్రవర్తి కడుపున పుట్టిన వాడో కాదు. ఇంకా రామచంద్రమూర్తి అయితే, దశరధ మహారాజు కుమారుడిగా పుట్టాడు. కృష్ణుడు... ఏమీ తెలియని వాడు, తలగడిగితే మొల కడగరు, మొల కడిగితే, తల కడగరు... అటువంటి గొల్ల వాళ్ల ఇంట్లో పుట్టాడు" అంటూ నోరు జారారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మండిపడుతున్న యాదవ సంఘాలు ఆయనపై కేసులు పెడుతున్నాయి.



ఇపుడు మేం చెప్పబోయే ఈ భావన ఏ ఒక్కరి మనోగతమో కాదు, మన హైందవ సోదరులందరి మనోవేదన.
ఎందుకయ్యా అర్థం చేసుకోకుండా అనవసర విషయాల పైన ఇలా చేసారు.


చాలా మంది క్రైస్తవులు యాదవ కుల దేవత అయిన శ్రీ కృష్ణ భగవానుడి గురించి అతి నీచాతి నీచంగా,
వ్యసన పరుడు అని వ్యభిచారి అని చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. అప్పుడు మనం జోక్యం చేసుకోలేదు.

టీవీ9 లో శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజునే శ్రీ కృష్ణుడు దేవుడా కాదా? అని live డిబేట్ పెట్టినప్పుడు ఎవ్వరికీ గుర్తుకు రాలేదు, 

మనం యాదవులం, మన కుల దేవత శ్రీకృష్ణ భగవానుడు అని.
క్రైస్తవ పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి శ్రీకృష్ణ భగవానుడి గురించి అసలు నోటితో చెప్పరాని విధంగా మాట్లాడినప్పుడు మనం ఏమీ చేయలేదు.


సమాజ హితం కోసం నాలుగు మంచి మాటలు చెప్పాలి అని ఒక్క పైసా ఆశించకుండా వేల సంఖ్యలో ప్రవచనాలు చేసినటువంటి వ్యక్తి
ఇలా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతారా? 


సంస్కత పురాణం లో ఉన్న విషయాన్ని యధాతథం గా చెప్పటం లో, అందరికీ అర్ధమయ్యే లా చెప్పాలన్న ఆతృత లో ఈ పొర పాటు జరిగి ఉండచ్చు కాని వారి మనస్సులో ఎటువంటి అన్యమైన భావన ఉండదు.

ఈ రోజుల్లో అసలు మనకు పురాణాలు, ధర్మ శాస్త్రాలు మరియు ప్రవచనాలు చేసే వారి సంఖ్య చాలా తక్కువ.
మీరు ఇంకా ఇలాంటి వారిని ఏదో విధంగా టార్గెట్ చేసి ఇలా చేస్తే వారు ప్రవచనాలు చెప్పడం మానేస్తారు ఇక నాకెందుకు వచ్చిన గొడవ అని. 


అయినా మనకు కులం అంటే ఇంత అభిమానం ఉంది కదా ఆ కులం హిందూ ధర్మం లోనిది అని తెలియదా?
ఈరోజు చాలా మంది చాలా సంస్థలు పని గట్టుకొని అనేక విధాలుగా హిందుత్వాన్ని తూలనాడుతుంటే మన మనోభావాలు ఎటు పోయాయి. 


మనం భారత దేశ పౌరులే కదా.
10 నిమషాల సమయమిస్తే హిందువల తలలన్నింటినీ నరుకుతా అని మీడియా ముందు సవాల్ చేసినప్పుడు ఎటుపోయాయి మన మనోభావాలు.

నా మెడ మీద కత్తి పెట్టినా కూడా నేను భారత్ మాతా కీ జై అనను అని చెప్పినప్పుడు ఎటువెళ్లాయి మన మనోభావాలు.
అక్రమంగా హిందూ దేవాలయాలను కూల్చుతున్నప్పుడు ఎటు వెళ్ళాయి మన మనోభావాలు. అప్పుడు ఏమి చేస్తున్నాం మనమంతా.
అంటే మనకు మన కులాలే కావాలి కానీ మన హిందూ ధర్మం, మన దేశం ఏమయి పోయినా పర్వాలేదా? ఇకనైనా మారదాం కాస్త. అనవసరపు వాటిపైన మాట్లాడటం ఆపి కాస్త ఇకనైనా దేశం కోసం, మన ధర్మం కోసం పని చేద్దాం. మనం చేయకపోయినా పర్వాలేదు కానీ, ఆవిధంగా పని చేసే వారిని చేయనిద్దాం. లేనట్లయితే మన ఉనికికే ప్రమాదం వస్తుంది.

ఏ మనిషికైనా రాగ ద్వేషాలు కోపావేశాలు సహజం.
మీకు కోపం రావటంలో కాని మీరు బాధ పడటం లో కాని తప్పు ఉందని నేను అనటం లేదు.


కాని వారు అన్న ఆ మాటలు పురాణ ప్రవచన సందర్భంలో యాదృచ్చికంగా దొర్లిన వే తప్ప వేరు కావు.
ఆయనకు మీ పట్ల ఎటువంటి చెడు భావన లేదు.


ఆయనకే కాదు ఈ దేశంలో సరిగ్గా హిందూ ధర్మాన్ని అర్ధం చేసుకున్న వారు ఎవరికైనా కూడా మీ పట్ల గౌరవ భావమే తప్ప వేరు ఆలోచన లేదు.


మనకు అన్ని కులాలు సమానమే,మనమంతా హిందువులమే.

అందువల్ల తెలిసో తెలియకో ఏదో జరిగి పోయింది,అయన అనటం మీరు అలగటం,
దానికి వారు చాలా పెద్ద మనసుతో మీ అందరినీ సంతోష పరచేలా మీరు కోరుకున్నట్లు గానే వారు ఉదాత్తంగా ప్రవర్తించటం జరిగాయికదా!


మీకు బాధ కలిగింది,అది మీరు వారిని ప్రశ్నంచారు,దానికి వారు మీపట్ల గౌరవంతో క్షమాపన పలికారు,
మీ ఆత్మ గౌరవం తృప్తి పడటానికి మీకు అది చాలదా!


కాని దానిని మీరు వీడీయోలు తీసి ఆడియోలు తీసి పబ్లిక్ మీడియా లో పెట్టి, ఆయనతో క్షమాపన చెప్పించుకున్నాం అని ఆయన పరువు తీసి,
ఆయనను వ్యక్తిగతంగా అంత మనఃక్షోభకు గురిచేయటం అంత అవసరమా.
మరి ఆ పరిస్థితులో ఇంత అవమానాలు పొందిన ఆయనకు ఈ ప్రవచనాలు నేను చెప్పాలా అని ఆయనకు అనిపించటం, సహజమేకదా!
భగవంతుడు తనకిచ్చిన ఙ్ఞానాన్ని ని స్వార్ధంగా పదిమందికి పంచాలకునే ఆ మహానుభావునికి,
ఎంత మన క్షోభ కలిగి ఉంటుదో తలుచుకుంటేనే మా గుండె బరువెక్కి పోతోంది.

కారణం ఏదైనా కానివ్వండి ఇపుడు వారు కనుక నిజంగానే ప్రవచనాలు మానుకుంటే కనక,
మీకు తెలియకుండానే మీ వల్ల ఈ తెలుగు రాష్ట్రాలకి,మన హిందూ ధర్మానికి తీరని అన్యాయం జరిగినట్లే.

Wednesday, 18 January 2017

కుళ్ళిన, ఎండిన గుమ్మంలోని గుమ్మడికాయను మార్చవచ్చా.............!!




సాధారణంగా హిందువులు గృహప్రవేశం రోజున గుమ్మానికి గుమ్మడికాయ కడతారు. మరికొందరు ఇళ్ళకు, ఆఫీసుల గుమ్మాలకు గుమ్మడికాయ కడతారు. సాధారణంగా పధ్ధతి ప్రకారం చెప్పాలి అంటే కట్టిన గుమ్మడికాయ కుళ్ళకూడదు. గుమ్మడికాయ కుళ్ళిపోకుండా లోపలలోపల ముడుచుకుపోయి ఎండిపోతే చాలా మంచిది. అలా కట్టిన గుమ్మడికాయ కుళ్ళిపోతే, ఎండిపోతే తిరిగి కొత్తది కట్టుకోవచ్చు. కొత్త గుమ్మడికాయను ఏ రోజు పడితే ఆ రోజు కట్టకూడదు. ఆదివారం లేదా గురువారం కానీ కట్టాలి. ఎందుకంటే ఈ రెండు వారాలకు భూతప్రేత పిశాచాలను అరికట్టే వారాలు. కొత్త గుమ్మడికాయకు పసుపు కుంకుమ పెట్టి వాకిట్లో కట్టాలి. ఎందుకంటే ఇది సర్వబాదా నివృత్తి చేస్తుంది. ఎప్పుడూ గుమ్మడికాయ గుమ్మానికి కట్టి ఉంచడం చాలా అవసరం. ఏడాదికి ఒకసారి మార్చమని ఎక్కడా చెప్పలేదు.

పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?




ఆ రాజ్యంలో రాజుగారు చాలా మంచి వాడు . ఆయన ప్రతి రోజూ పేద బ్రాహ్మణులకు మద్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు .
ఒక రోజు యధావిధిగా భోజనం వండించే ఏర్పాట్లు చేస్తున్నాడు . అదే సమయం లో ఆకాశం లో ఎగురుతున్న ఒక గద్ద కాళ్ళతో పట్టుకున్న పాము నోటినుండి విషం వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నం బేసిన్ లో పడింది . అది ఎవరూ గమనించలేదు
ఆభాగం ఒక బ్రాహ్మణుడు తిన్నాడు . అది తినడం వలన అతడు చనిపోయాడు . ఈ వార్త రాజుగారికి చేరింది . ఆయన చాలా దుఃఖించాడు . మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగింది అని ఆయన చింతించాడు .
.
.
ఇప్పుడు బ్రాహ్మణుడు చనిపోవడానికి కారణం ఎవరు ?

రాజా ? వంటవాడా ? పామా ? గద్దా ? వడ్డించిన వ్యక్తా ?
.
ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో వెయ్యాలి ?
.
.
వీరిలో ఎవరూ కావాలని ఆ బ్రాహ్మణుడిని చంపలేదు .
.
.
యమ ధర్మరాజును అడిగారు .
.
ఇది ఇలా ఉంటె మర్నాడు దారినే పోతున్న బ్రాహ్మణులు కొందరు అన్నదానం జరిగే చోటును చెప్పమని ఒక వనితను అడిగారు . ఆమె వారికీ దారిని చూపుతూ
“ బాబూ ! జాగ్రత్త మా రాజు గారికి బ్రాహ్మణులు అంటే పడదు . నిన్ననే ఒకాయనను విషం పెట్టి చంపేశారు” . మీ రోజులు బాగున్నాయో లేదో ? అంది .
.
ధర్మరాజు గారు
“ చిత్రగుప్తా ! మొత్తం పాపం అంతా ఈమె ఖాతాలో వెయ్యి .
యాదృచ్చికంగా జరిగే పనులకు వ్యక్తులను నిందించే వారికి ఆ మొత్తం కర్మ ఫలం కలుగుతుంది అని ధర్మం .” అన్నారు .
.
MORAL OF THE STORY ;

WHEN WE CRITICIZE OTHERS , WE TAKE UP THEIR KARMA .!!
BEAUTIFUL STORY FROM SRIMAD BHAGAVATA

Tuesday, 17 January 2017

వ్యాపారం లో చాలా నష్టాలొస్తుంటే....................!!




వ్యాపారం లో చాలా నష్టాలొస్తుంటే ఆంజనేయస్వామికి తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులు, పండ్లు, దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం బాగుపడుతుంది.

కుటుంబంలో ఎవరికైనా పదే పదే నరదిష్టి తగులుతుంటే..............!!




కుటుంబంలో ఎవరికైనా పదే పదే నరదిష్టి తగులుతుంటే ఒక పళ్ళెంలో నీళ్ళు తిసుకొని అందులో కుంకుమ , కొన్ని బియ్యం గింజలు ,ఒక చామంతి పువ్వు  వేసి ఆ నరదిష్టి తగిలిన వ్యక్తి 5 సార్లు చుట్టూ తిప్పి ఆ నీళ్లను ఎవరు తిరగని చోట పోయవలెను .ఇది ప్రాచీన నరదిష్టి కి మంచి పధ్ధతి .

Monday, 16 January 2017

ఈ రోజు యోగ క్షేమం ...సకల భాగ్యాలు వృద్దిచెందుటకు...


 

సకల  భాగ్యాలు వృద్దిచెందుటకు సోమవారం రోజు సాయంత్రం దేవాలయంలో లేదా మీ ఇంటిలో ఏ దైనా శివలింగానికి విభూది నీటితో మరియు దానిమ్మ పళ్ళ రసాలతో అభిషేకించి, బిల్వ దళాలతో పూజించి,  “ఓం నమః శివాయ” అనే పంచాక్షరీ మంత్రాన్ని  108 లేదా 1008 జపం చేయాలి. తరువాత సంకల్పం చెప్పుకొని హారతి ఇవ్వాలి. ఇలా చేస్తే మీకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం తో పాటు సకల  భాగ్యాలు వృద్దిచెందుతాయి.

Saturday, 14 January 2017

కనుమ


కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.

పశువుల పండుగ

సంక్రాంతి వరసలో వచ్చే చివరి పండగను కనుమ పండగ అంటారు దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు వెట్టి చాకిరి చేసిన మూగజీవాలైన పశువులకు ఈ రోజు పండుగే.
ఆ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది.. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా.
ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.

సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని "చిట్లా కుప్ప" అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్లను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి.. చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని" పొలి" అంటారు. ఆ "పొలి"ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో,చెరువుల్లో, బావుల్లో "పొలో.... పొలి" అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడా మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.

జల్లికట్టు

తమిళనాడు చిత్తూరు జిల్లాలలో ఈ రోజున "జల్లికట్టు" అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరం అయి నందున ప్రభుత్యం దీన్ని నిషేధించింది. వివిధ ప్రాంతాల్లో ఈ పండగను వివిధ పద్ధతులతో జరుపు కుంటుండొచ్చు . ముఖ్యంగా ఛిత్తూరు జిల్లా, అందులో పాకాల మండలం లోని వల్లివేడు గ్రామ పరిసర అన్ని పల్లెల్లో ఈ పండగ జరుపుకొనుటలో ఒక ప్రత్యేకత ఉంది.









Friday, 13 January 2017

మాస సంక్రాంతుల నిర్ణయం


No automatic alt text available.
రవి గోచారంలో ఒక్కొక్క రాశిలో ఒక నెల సంచరిస్తూ వుంటాడు . రవి ఏ రాశిలో సంచరిస్తుంటే ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు.

1. చైత్రం, 2.వైశాఖం, 3. జ్యేష్ఠం, 4. ఆషాడం, 5. శ్రావణం, 6. భాద్రపదం, 7. ఆశ్వీజం, 8. కార్తీకం, 9. మార్గశిరం, 10. పుష్యం, 11. మాఘం, 12. పాల్గుణం.

No automatic alt text available.
రవి మేష రాశి నందువున్న మేష సంక్రాంతి
రవి వృషభ రాశి నందువున్న వృషభ సంక్రాంతి
రవి మిధున రాశి నందువున్న మిధున సంక్రాంతి
రవి కర్కాటక రాశి నందువున్న కర్కాటక సంక్రాంతి
రవి సింహ రాశి నందువున్న సింహ సంక్రాంతి
రవి కన్య రాశి నందువున్న కన్య సంక్రాంతి
రవి తులా రాశి నందువున్న తులా సంక్రాంతి
రవి వృశ్చిక రాశి నందువున్న వృశ్చిక సంక్రాంతి
రవి ధనూ రాశిలో సంచరిస్తుంటే ధను సంక్రాంతి
రవి మకర రాశి నందువున్న మకర సంక్రాంతి
రవి కుంభ రాశిలో సంచరిస్తుంటే కుంభ సంక్రాంతి
రవి మిన రాశిలో సంచరిస్తుంటే మిన సంక్రాంతి


ఆంగ్ల మాస రీత్యా 13/14 తేదీల మద్య రావచ్చు

సంక్రాంతి ప్రత్యేకతలు.


ముగ్గులు

రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మధ్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇంకొక దృక్పథంలో గీతలు స్థితశక్తికి (స్టాటిక్‌ ఫోర్స్‌) ,చుక్కలు గతిశక్తి (డైనమిక్‌ ఫోర్స్‌)కు సంకేతాలని, మరియు ముగ్గులు శ్రీ చక్ర సమర్పనా ప్రతీకలని శక్తి తత్త్వవేత్తలు అంటారు[3]. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలు కూ సంకేతాలుగా చెప్పచ్చు.

రధం ముగ్గు

మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలి అనే సంకేతాలతో ఒక రధం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ పోతూంటారు.

గొబ్బెమ్మలు

పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలు తొ అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది.

భోగిమంట

మూడురోజులపాటు సాగే సంక్రాంతి పండుగలో మొదటి రోజున నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. అప్పటి నుండి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నడనే సంకేతం. దక్షణాయంలో ఉండే నిద్ర బద్దకంతో సహా దగ్ధం చేయాలనే సంకేతంతో చీకటితోనే బోగిమంట వేస్తారు. ఇంట్లో ఉండే పాత కలపసామానులు, వస్తువులు, ఎండుకొమ్మలు లాంటివి బోగి మంటలో వేసి తగులబెడుతారు. వీటన్నిటినీ దారిద్ర్య చిహ్నాలుగా బావించి తగులబెట్టాలంటారు. వేసవిలో వేడికి తగులబడే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగిఉంది.

భోగిపళ్ళు

భోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

తిల తర్పణం

సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.


సంకురుమయ / సంక్రాంతి పురుషుడు

మట్టి తో ఒక బొమ్మను (సంక్రాంతి పురుషుడు), తన వాహనాన్ని (ప్రతి సంవత్సరం వేరు వేరు వాహనాల పై పురుషుడు వస్తాడు. ఏ వాహనాన్ని ఎక్కితే ఆ వాహనానికి ఆ సంవత్సరం ఎక్కువ నష్టము అని ఒక నమ్మకం) , మేళ తారళాలను చేసి, సంక్రాంతి మూడు రోజుల్లో పూజలు చేస్తారు. నాల్గవ నాడు ఈ బొమ్మలను వాల్లాడిస్తారు.

గంగిరెద్దు

ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. "జుగోప గోరూప ధరామివోర్విం" దీని అర్ధం ఆ నేల ఆవుకి సంకేతం ఆనేలనుండి వచ్చిన పంటకు సంకేతం ముంగిట నిలిచిన వృషభం. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు వృషభసహిత శంకర పరివారం.



హరిదాసు

గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371