Monday 26 September 2022

ఆశ్వీయుజ మాసం అమ్మ స్వరూపం!


(నేటి నుండి ఆశ్వీయుజమాసం)
ఆశ్వీయుజమాసం .. అంటే చాలు ప్రసన్నమైన శరత్‌కాలం. మనస్సును పరవశింపచేసే కాలం. వర్షాకాలం వెళ్లి శీతాకాలం ప్రారంభమయ్యే వేళ ఇది. ఈ సమయంలో శక్తి స్వరూప ఆరాధన చాలా ముఖ్యం.

సనాతన ధర్మం ఆశ్వీయుజమాసాన్ని శక్తి ఆరాధనకు కీలకంగా పేర్కొంది. శక్తి అంటే లక్ష్మీ, పార్వతీ, కాళీ, సరస్వతి.. ఇలా ఏ పేరున పిల్చినా పలికే అమ్మ..

శ్రీ లలితా సహస్రనామంలో పేర్కొన్నట్లు అమ్మ.. శ్రీమాతా, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరీ.

అంటే సృష్టి, స్థితి, లయకారిణి ఆమ్మే. త్రిమూర్తులకు.. దశావతారాలకు అన్నింటికి మూలం అమ్మే. ఆ పరాశక్తిని ఉపాసన చేస్తూ నిర్వహించే కార్యక్రమాలే దసరా ఉత్సవాలుగా ప్రాచుర్యం పొందాయి.

ఆశ్వియుజ మాసానికి 'ఇష' మాసం అనే పేరు ఉంది. అశ్వనీ నక్షత్రంతో కూడిన పూర్ణిమ వచ్చే మాసాన్ని ఆశ్వయుజ మాసం అంటారు.


శరదృతువు

ఆశ్వీయుజమాసం శరదృతువులో వస్తుంది. ఈ కాలంలో వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టి ప్రకృతి కొత్త శోభను సంతరించుకుంటుంది. ఈ మాసంలో వెన్నెల అత్యధికంగా కాస్తుంది. శరత్కాలంలోని తొలి పదిరాత్రులు జరుపుకొనే దేవీనవరాత్రులు అనేక రుగ్మతలను నివారిస్తాయి. విజయాన్ని చేకూరుస్తాయని పురాణాలు చెపుతాయి.

శరన్నవరాత్రుల విశేషాలు

ఆశ్వీయుజ పాడ్యమి నుంచి మహర్నవమి వరకు నవరాత్రులు నిర్వహించి దశమినాడు పూర్తి చేస్తారు.

దీనిలో మొదటి మూడు రాత్రులు పార్వతి, మధ్య మూడు రోజులు లక్ష్మీదేవి, చివరి మూడు రోజులు సరస్వతిని ఆరాధిస్తారు.

ప్రకృతి నియమాలను అనుసరించి ఈ శరత్కాలం సంధికాలం. ప్రజలకు అనారోగ్యాన్ని కలిగించి, వారి ప్రాణాలను హరించే శక్తి ఈ కాలానికి ఉంటుంది. బాధలకు లోనుకాకుండా జగన్మాతను వేడుకుంటూ చేసే ఉత్సవమే నవరాత్రి ఉత్సవం.

హస్తా నక్షత్రంతో కూడిన ఆశ్వీయుజ దశమికి 'దశహరా' అనే పేరు ఉంది. పది జన్మల పాపాలను, పది రకాలైన పాపాలను పొగొట్టేది అనే అర్థం కూడా ఉంది.

రాత్రి అంటే తిథి అనే అర్థం ఉంది. దీని ప్రకారం ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవాలే నవరాత్రి ఉత్సవాలు. తొమ్మిది రోజుల పాటు నియమాల ప్రకారం అర్చనలు చేయలేని వారు చివరి మూడు రోజులు అంటే అష్టమి, నవమి, దశమి రోజుల్లో అయినా దుర్గాదేవిని అర్చిస్తే, అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రవచనం.

మూలా నక్షత్రంతో కూడిన షష్ఠి లేదా సప్తమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు. ఈ రోజున పుస్తకదానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.
దశమి రోజున వేద పండితులను, బ్రాహ్మణులను, మహిళలను సత్కరించటం చేస్తే అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారని శాస్త్ర ప్రవచనం.

..................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/...
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
whatsapp group
Follow this link to join my WhatsApp group:
https://chat.whatsapp.com/B57snQO4QZ7KI1EH7p2qi5
టెలిగ్రామ్
t.me/Sree_vidhatha_peetam
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........



No comments:

Post a Comment