🌹భాద్రపద శుక్ల షష్ఠ్యాం సూర్యపూజా కార్యా|
సా పరవిద్ధా గ్రాహ్యా|
షణ్మున్వోరితి యుగ్మాగ్నివాక్యాత్|
తథా చోక్తం వ్రతచంద్రికాయామ్ -
భాద్రే శుక్లషష్ఠ్యాం వై సూర్యం సమ్పూజయేన్నృప|ఇతి|
🌹భాద్రపద శుద్ధ షష్ఠియందు సూర్యపూజను చేయవలెను. దీనిని పరవిద్ధగా గ్రహించవలెను.
'షణ్మున్వో'రనియుగ్మాగ్నివాక్యములిట్లు చెప్పినవి. వ్రతచంద్రిక కూడా ఇట్లే చెప్పినది.
🌹భాద్రపద శుద్ధ షష్టి అయిన ఈరోజు సూర్య ఆరాధన చేయాలని శాస్త్ర వచనం. ఈరోజు అందరూ విధిగా సూర్య నమస్కారాలు ఆదిత్యహృదయం పారాయణము చేయడం మంచిది.
🌹భాద్రపద శుద్ద షష్ఠి /సూర్య షష్ఠి, సప్తమి కలసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం, ఈ రోజున సూర్యుడిని ఆవుపాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం తో ప్రాశనం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని పెద్దలు చెబుతారు.
షష్ఠితో కూడిన సప్తమి కనుక ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైన నశిస్తాయి.
1. ఓం హ్రాం ఓం మిత్రాయ నమ:
2. ఓం హ్రీం ఓం రవయే నమః
3. ఓం హృం ఓం సూర్యాయ నమః
4. ఓం హ్రైం ఓం భానవే నమః
5. ఓం హ్రౌం ఓం ఖగాయ నమః
6. ఓం హ్రా: ఓం పూష్ణే నమః
7. ఓం హ్రాం ఓం హిరణ్యగర్భాయ నమః
8. ఓం హ్రీం ఓం మరీచయే నమః
9. ఓం హృం ఓం ఆదిత్యాయ నమః
10. ఓం హ్రైం ఓం సవిత్రే నమః
O11. ఓం హ్రౌం ఓం అర్కాయ నమః
12. ఓం హ్రా: ఓం భాస్కరాయ నమః
No comments:
Post a Comment