జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు, అంగారకుడు ఇద్దరూ శక్తిమంతమైన, అగ్నితత్వాన్ని కలిగి ఉన్న గ్రహాలు. ఈ రెండు గ్రహాలు కన్యా రాశిలో కదులుతున్నాయి. సెప్టెంబరు 17 నుంచి కన్యా రాశిలో ఈ రెండు గ్రహాలు కలయిక ఏర్పడింది. అక్టోబరు 17 వరకు ఈ రాశిలో సూర్యుడు, అంగారకుడు ఈ రాశిలో సంచరిస్తారు. ఈ రెండు గ్రహాల కలయిక అన్ని రాశులపై కొంత ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని రాశులకు కోపం అధింకగా ఉంటుంది. నియంత్రించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది.
సూర్యుడు, అంగారకుడు సంయోగానికి అర్థం..
సూర్యుడు ప్రభుత్వ పనులు, వేగం తదితర కారణమైన గ్రహంగా పరిగణిస్తారు. అయితే అంగారకుడు ధైర్యం, శక్తి మొదలైనవాటికి కారక గ్రహంగా భావిస్తారు. ఈ రెండు గ్రహాలు సంయోగంలో ఉన్నప్పుడు లేదా ఒకే రాశిలో ఉంటే అది వారికి కోపం తెప్పిస్తుంది. ఫలితంగా రాశులపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో అంగారకుడు, సూర్యుడు సంయోగంతో ఏయే రాశుల వారికి ప్రతికూలంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
మేషం..
మీ రాశి నుంచి ఏడో పాదంలో ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. ఈ కారణంగా మీ రాశి వారికి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అంతేకాకుండా మీ జీవిత భాగస్వామితో సంభాషించేటప్పుడు చాలా జాగ్రత్తగా పదాలను ఉపయోగించాలి. లేకుంటే చిన్న వివాదం కూడా పెద్ద గొడవకు దారితీస్తుంది. దీంతో పాటు మీరు మీ కోపాన్ని కూడా నియంత్రించుకోవాలి.
కర్కాటకం..
మీ రాశి నుంచి నాలుగో పాదంలో సూర్యుడు, అంగారకుడి కలయిక జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా మీరు కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు కుటుంబంలో ఏ సభ్యుడితోనైనా గందరగోళ సంబంధాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈ కారణంగా పరిస్థితి మరింత దిగజారుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు అనవసరమైన వాదనలకు దిగకుండా ఉంటే మంచిది. అది మీకు మాత్రమే హాని చేస్తుందని సూచించారు. అధిక కోపం కారణంగా మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులు కూడా ఈ సమయంలో దూరంగా ఉండవచ్చు.
కన్య..
మీ రాశి నుంచి రెండో పాదంలో సూర్యుడు, అంగారకుడు కలయిక ఉంటుంది. ఈ సంయోగం కారణంగా మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. మీరు మీ కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను మాటలతో బాధపెట్టే అవకాశముంది. సూర్యుడు-అంగారకుడు కలయిక కారణంగా మీలో అధిక కోపం కనిపిస్తుంది. ఈ కోపం వల్ల మీ సన్నిహితులు మీకు దూరమయ్యే ప్రమాదముంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. యోగా, ధ్యానం చేయడం మంచిది.
No comments:
Post a Comment