Saturday 13 April 2019

*శ్రీ రామ నవమి 13 లేదా 14 ఎప్పుడు జరుపుకోవాలో సందేహమా?*




శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ.
హిందువులు జరుపుకొనే అతి ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి ముఖ్యమైన పండుగ.
శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు.
అలాగే శ్రీరాముడు 14 సంవత్సరాల వనవాసం తర్వాత రావణ సంహారం అయ్యాక సీతాదేవితో కలిసి శ్రీరాముడు అయోధ్యలో అడుగు పెట్టిన రోజు కూడా చైత్ర మాసంలో శుద్ధ నవమి అని మన పెద్దలు చెప్పుతారు.
ఈ రోజే సీతారాముల కళ్యాణం చేస్తారు. ఆ రోజునే శ్రీరామనవమిగా జరుపుకుంటారు.
ఎందుకంటే చాలా మందిలో శ్రీరామనవమి 13 వ తేదీన జరుపుకోవాలా?లేదా 14 వ తేదీన జరుపుకోవాలా అనే సందేహం ఉంది. సాధారణంగా అందరూ క్యాలెండర్ లో భద్రాచలంలో శ్రీరామ కళ్యాణం ఎప్పుడు జరిగితే అప్పుడు శ్రీరామ నవమి పండుగను జరుపుకుంటూ ఉంటారు.
అయితే నవమి తిధి 13,14 తారీఖు రెండు రోజులు ఉండటంతో ఏ రోజు జరుపుకోవాలో అనే సందేహం చాలా మందిలో వచ్చింది.
ఏప్రిల్ నెలలో 13 వతేదీన నవమి తిధి 11.41 నిమిషాలకు ప్రారంభం అయ్యి మరుసటి రోజు అంటే ఏప్రిల్ 14 ఆదివారం 9. 35 నిమిషాలకు ముగుస్తుంది. నవమి తిధి 14 వ తారీఖు కన్నా 13 వ తారీఖునే ఎక్కువ సమయం ఉంది. కానీ 13 వ తారీఖున నవమి తిధి 11. 41 కి ప్రారంభం అవుతుంది.
మన హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యోదయం సమయంలో ఉండే తిది ప్రకారం ఆ తిధికి సంబందించిన పండుగలను జరుపుకుంటాం.
కాబట్టి 14 వ తారీఖు ఆదివారం రోజే శ్రీరామనవమి జరుపుకోవాలి.
శనివారం అంటే ఏప్రిల్ 13 న సూర్యోదయం సమయంలో నవమి తిధి లేదు. అంతేకాక 13 వ తారీఖున అష్టమితో కూడిన నవమి ఉంది కాబట్టి పంచరాత్ర ఆగమనం ప్రకారం 13 వ తారీఖున శ్రీరామనవమి చేసుకోకూడదు...
కాబట్టి 14 వ తారీఖున మాత్రమే శ్రీరామనవమి చేసుకోవాలి. బెల్లం, మరియు మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలా మందికి ప్రీతిపాత్రమైనది.🙏🌹

No comments:

Post a Comment