Thursday, 27 October 2022

జీవుల కర్మఫలప్రధాత - శనీశ్వరుడు



కర్మ సిద్ధాంతం ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. దీనిని అందజేసేది శనీశ్వరుడు 


భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.


సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు. 

నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. 

అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.


స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడి.. *‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు. ‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’ అని చెప్పిన శని.. పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానని అన్నాడు.శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.


మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు.. ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు


శ్లో|| నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం,

ఛాయా మార్తాండ సంభూతం తంనమామి శనైశ్చరం


అర్థం: నీలం రంగులో ఉండే కాటుక కొండలాంటి ఆకారంలో కాంతితో ఉండేవాడు, సూర్యకుమారుడు, యముని సోదరుడు, ఛాయాదేవికి సూర్యభగవానునికి పుట్టిన వాడు ఐన ఓ శనీశ్వరా! నీకు నమస్కారము.


ప్రతీదైవానికీ ఒక తిథిని, ఒక నక్షత్రాన్ని, ఒకవారాన్ని, ఒక హోరాకాలన్ని ,కొన్ని ప్రీతికర వస్తువులని పెద్దలు నిర్దేశించారు. ఆయా సమయాలలో ఆయాగ్రహాలకి పూజ చేసినా దానం ఇచ్చినా జపంచేసినా ఆయా గ్రహాలా పీడ పరిహరించ తగ్గుతుంది.

అలాగే శని గ్రహానికి కూడా కొన్ని చెప్పబడ్డాయి.

శనికి త్రయోదశి తిథి, శనిహోరాకాలం, తిలాతైలాదుల దానం, ఇలాంటివి చెప్పబడ్డాయి.


శనిపీడాఫలాలు

డబ్బుదుబారా, అపనింద, నపుంసకత్వం, మాటవిలువ తగ్గటం,జీర్ణ సంబంధరోగాలు, వెన్నినొప్పు, పొట్టరావడం, కొవ్వుబద్దకం, అలసట, అతినిద్ర, పైవారిఒత్తిడి, నీచస్త్రీపురుషులతో సాంగత్యం, వ్యసనాల అలవాటుపడటం, ఉద్యోగం పోవటం, ఉద్యోగం దొరకకపోవటం, అందం తగ్గటం, వంటివి ముఖ్య ఫలాలు.

ఈసారి విశేషంగా ఒకే నెలలో రెండుసార్లు శనిత్రయోదశి వచ్చింది.  శనివారం రోజు.

పుణ్యకాలం,

ప్రతీ శనివారం శని హోరాకాలలలో చేస్తేమంచిది. ఉదయం 6-7మధ్యకాలం, మధ్యాహ్నం 1-2 మధ్యకాలం, రాత్రి 8-9 మధ్యకాలంమంచిది. ఐతే శనిత్రయోదశి నాడు రోజంతా పుణ్యకాలమే.

శనిత్రయోదశి నాడు మనం చేయదగ్గవి


నూనె ఒంటికి అంటుకొని, తలస్నానంచేయడం, ప్రాణాయమం చేయడం, శనికోసం చెప్పిన మంత్రాలు, శ్లోకాలు చదవటం. ఉపవాసం.

శనికి చేయదగ్గపూజలు

శనికి తైలాభిశేకం, శనికిరుద్రాభిశేకం, నవగ్రహాలలో శనికి అష్టోత్తరనామాలు చదువుతూ పూలతో పూజించడం. శని ప్రదక్షిణలు చేయడం.

చదవదగ్గవి

శని అష్టోత్తర శతనామాలు, దశరథకృత శనిస్తోత్రం, విష్ణు సహస్రనామస్తోత్రం, శివపురాణం నలున్ని శని పీడించిన కథ మంచివి.

శనికి ప్రీతిగా ఇవ్వదగ్గదానాలు

నువ్వులు, నువ్వుల ఉండలు, అన్నిరకాల నూనెలు నీలంరంగు పంచెలు (బ్రాహ్మణులకి) ఇనుప వస్తువులు, పనివారికి, యాచకులకి - పాతబట్టలు దానంచేయాలి. నేరేడు పండ్లు, సిమెంట్‌ ఇనుము వంటివి, తగినవారికి తగినరీతిలో శక్తి వంచనలేకుండా చేయడం మంచిది.

శనికి సంబంధించి శాంతి చేసుకోవలసినవారు

మామూలుగా మిథున కర్కాటక, తుల వృశ్చిక రాశులవారు చేసుకోవాలి

విశేషంగా జాతకంలో శని పాప సంబంధంగా ఉన్నవారు, పాప స్థానాలలో ఉండేవారు, శనిదశ నడుస్తున్నవారు, చేయాలి.



సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

ఆకాశదీప మహాత్మ్యం



కార్తీకమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు , చంద్రుడు , నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తీకమాసం ప్రారంభం దేనితో మొదలు ? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు ? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి , గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ , భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా , ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో , వత్తులో ఇస్తూ ఉంటారు.

ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని ?

ఆ దీపం ధ్వజస్తభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే , పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీకమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం , తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం ? నాకు ఉన్న గౌరవం ఏమిటి ? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి ? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను.🙏

ఏమిటి చేయగలను ? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ , దామోదరమావాహయామి అనిగాని , త్రయంబకమావాహయామి అనిగాని అని , ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి.

కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః
జలేస్థలే… ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి , కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు ‘కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’ కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అది వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు వూడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప , దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను , ఈ దీపం దీపం కాదు , ఇది త్రయంబకుడు , ఇది దామోదరుడు , కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే కీటాఃపతంగాః మశకాశ్చ , కీటకములు: పురుగులు , పతంగాలు , మశకాశ్చ: దోమలు , వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి , పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి , కొమ్మలిస్తాయి , రెమ్మలిస్తాయి , కలపనిస్తాయి , ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా , ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా , ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసి కొమ్మలన్నీ వొంచేస్తున్నా , గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా , ఒక్క అడుగు ఇలా తీసి , అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు , కర్మ లేనపుడు , దానికి కర్మాధికారం ఏది ? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా ! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే ! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే ! అది అభ్యున్నతిని పొందాలి.
🙏నీటిలో ఉండే చేపలుంటాయి , కప్పలుంటాయి , తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు , నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా ? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు , కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక ! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక ! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడు కూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైన బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక ! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా , నీ యందు త్రయంబకుణ్ణి , దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.🙏అందుకే కార్తీక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తీక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తీకపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి

సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888
YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

 కార్తీక పురాణం - 3️⃣0️⃣ అధ్యాయాలు -వివరాలు


1 . వ అధ్యాయం - కార్తీక మాసం మహత్యం


2 . వ అధ్యాయం - సోమవార వ్రత మహిమ


3 . వ అధ్యాయం - కార్తీక మాస స్నాన మహిమ


4 . వ అధ్యాయం - దీపారాధన మహిమ


5 . వ అధ్యాయం - వనభోజన మహిమ


6 . వ అధ్యాయం - దీపదానవిధి - మహత్యం


7 . వ అధ్యాయం - శివకేశవార్చన విధులు


8 . వ అధ్యాయం - శ్రీహరి నామస్మరణా ధన్యోపాయం


9 . వ అధ్యాయం - విష్ణు పార్శద , యమ దూతల వివాదము


10 . వ అధ్యాయం - అజామీళుని పూర్వజన్మ వృత్తాంతము


11 . వ అధ్యాయం - మంథరుడు - పురాణ మహిమ


12 . వ అధ్యాయం - ద్వాదశి ప్రశంస


13 . వ అధ్యాయం - కన్యాదాన ఫలము


14 . వ అధ్యాయం - ఆబోతును అచ్చుబోసి వదలుట (వృషోత్సర్గము)


15 . వ అధ్యాయం - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మస్మృతితో నరరూపమందుట


16 . వ అధ్యాయం - స్తంభ దీప ప్రశంస


17 . వ అధ్యాయం - అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము


18 . వ అధ్యాయం - సత్కర్మానుష్టాన ఫల ప్రభావము


19 . వ అధ్యాయము - చతుర్మాస్య వ్రత ప్రభావనిరూపణ


20 . వ అధ్యాయము - పురంజయుడు దురాచారుడగుట


21 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట


22 . వ అధ్యాయము - పురంజయుడు కార్తీక పౌర్ణమీ వ్రతము చేయుట


23 . వ అధ్యాయము - శ్రీ రంగక్షేత్రమున పురంజయుడు ముక్తినొందుట


24 . వ అధ్యాయము - అంబరీషుని ద్వాదశీవ్రతము


25 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట


26 . వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ


27 . వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట


28 . వ అధ్యాయం - విష్ణు సుదర్శన చక్ర మహిమ


29 . వ అధ్యాయం - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి పారణము


30 . వ అధ్యాయం - కార్తీకవ్రత మహిమ్నా ఫలశ్రుతి

సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888
YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw
Printerest
https://in.pinterest.com/vastronume.../sree-vidhatha-peetam/
Twitter
https://twitter.com/VidhathaAstrolo
Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/
Blog
https://vidhaathaastronumerology.blogspot.com/
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

కార్తీక పురాణ శ్రవణం వల్ల కలిగే ఫలితం ఏమిటి ?



కొన్ని మంచి మాటలు వింటేనే జీవితం సన్మార్గంలో నడుస్తుంటుంది. అప్పుడప్పుడన్నా అలాంటి మంచి మాటలను యధాలాపంగానైనా వినటం అవసరం. ఈ సత్యాన్ని తెలియచేస్తున్నట్లు ఉంటుంది. కార్తీక పురాణ శ్రవణ ఫలం. శ్రవణమంటే వినటం అని అర్థం. పూర్వం తండ్రి చెప్పిన మాట వినకుండా ఆ తండ్రి కోపానికి గురై ఎలుకగా జన్మించిన ఓ కుర్రాడి కథ ఇక్కడ ప్రస్తావితమవుతోంది. స్కంద పురాణం అంతర్గతంగా ఉన్న కార్తీక పురాణం అయిదో అధ్యాయంలో ఇదంతా కనిపిస్తుంది. జనక మహారాజుకు వశిష్ఠుడు సర్వపాప క్షయకరమైన కార్తీక మాస విశేషాలను వివరించసాగాడు. కార్తీక మాసంలో శ్రీమహా విష్ణువు సన్నిధిలో భగవద్గీత పారాయణ చేయడం ఎంతో శుభప్రదం.

భగవద్గీతలో ఉన్న విభూతి , విశ్వరూప , సందర్శనాధ్యాయాలను పారాయణ చేయాలి. అలా చేయటం వల్ల వైకుంఠ వాసార్హత లభిస్తుంది. శ్రీమహా విష్ణువును తులసీ దళాలతోనూ , తెల్లనివి , నల్లనివి అయిన అవిశ పూలతోనూ , గన్నేరు పూలతోనూ పూజించటం ఎంతో మేలు. ఈ మాసంలో హరి సన్నిధిలో కార్తీక పురాణంలోని ఒక శోక్లాన్ని విన్నా లేదా ఒక శ్లోక పదాన్ని చెప్పినా , విన్నా కర్మ బంధ విముక్తి లభిస్తుంది. అలాగే కార్తీక శుక్ల పక్షంలో వన భోజనం కూడా పాపనాశకరమే. ఈ మాసంలో చేసే జపాలు , హోమాలు అన్నీ రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయి. సర్వపాపాలనూ నశింపచేస్తాయి. వన భోజనం విషయంలో ముందుగా వనంలో ఉన్న ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని ఉంచి గంధ పుష్పాదులతో పూజించి భక్తితో ముందుగా వేద పండితులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత మిగిలిన వారు భోజనం చేయాలి.


శ్రవణ ఫలం


పూర్వం కావేరీ తీరంలో దేవశర్మ అనే వేద వేదాంగ పండితుడు ఉండేవాడు. అయితే ఆయనకు జన్మించిన కుమారుడు మాత్రం తండ్రి మాట వినకుండా తిరుగుతూ ఉండేవాడు. ఓ సంవత్సరం కార్తీకం ప్రవేశించగానే ఆ మాస పవిత్రతను చెప్పి వ్రతాన్ని ఆచరించమన్నాడు దేవశర్మ. కానీ , కుమారుడు తండ్రి మాటను తిరస్కరించటమే కాక నాస్తిక ధోరణిలో తండ్రిని ఎదిరించాడు. దాంతో తండ్రికి కోపం మితిమీరి ఎలుకగా పుట్టమని శపించాడు. అప్పటికి ఆ కుమారుడికి జ్ఞానోదయమైంది. తప్పు క్షమించమని తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. తండ్రి కరుణించి ఎప్పుడు కార్తీక మహాత్మ్యాన్ని (కార్తీక పురాణాన్ని) వింటావో అప్పుడు పాప విమోచనం కలుగుతుందని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సమయానికే దేవశర్మ కుమారుడు ఎలుకగా మారి సమీప అరణ్యంలో ఉన్న ఓ చెట్టు తొర్రలో నివసించసాగాడు.
ఇంతలో ఓ రోజున విశ్వామిత్రుడు తన శిష్యులతో కలిసి ఆ పరిసరంలో ఉన్న కావేరీ నదిలో స్నానమాడటానికి వచ్చాడు. ఆ తర్వాత ఎలుక ఉన్న చెట్టు దగ్గరకొచ్చి తన శిష్యులతో కార్తీక మహాత్మ్యాన్ని చెప్పటానికి , హరి పూజకు సంసిద్ధుడయ్యాడు. ఇంతలో ఓ దారి దోపిడీ వేటగాడు అక్కడున్నది సామాన్య మునులనుకొని వారిని బాధించి , వారి దగ్గరున్న వస్తువులను తీసుకెళ్ళటానికి వచ్చాడు. కానీ , ఆ సజ్జన దర్శనంతో అతడిలోని పాపపు ఆలోచనలన్నీ పోయి సాత్వికుడిగా మారి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడ్డాడు. తనలో ఏదో తెలియని మార్పు వచ్చిందని , అది తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని కనుక తనకు ఇంకా ఏదైనా మంచి విషయాన్ని బోధించి ముక్తి లభించేలా చేయమని ప్రార్థించాడు.
విశ్వామిత్రుడు వెంటనే కార్తీక వ్రత మహాత్మ్యాన్ని గురించి చెప్పి కార్తీక పురాణాన్ని వినిపించాడు. జరుగుతున్నదంతా చెట్టు తొర్రలో నుంచి చూస్తున్న ఎలుకకు శాప విముక్తి కలిగి అసలు రూపం లభించింది. అప్పుడు ఆ దేవశర్మ కుమారుడు విశ్వామిత్రుడి కాళ్ళమీద పడి విషయమంతా చెప్పి ఆయన ఆశీర్వాదం పొంది ఇంటికి తిరిగి వెళ్ళాడు. బోయ కూడా ఆనాటి నుంచి పూర్తిగా హింసకు దూరమై అత్యంత కాలంలో ముక్తిని పొందాడు. ఇదంతా పూజ , వ్రతం , పురాణ కథ అని కొట్టి పారేయనక్కరలేదు. తల్లితండ్రులను ఎదిరించిన వాడు కష్టాల పాలవుతాడని సజ్జన దర్శనం , సాంగత్యం మనిషిలో మంచి మార్పును తెస్తాయని చెప్పే సందేశాన్ని గమనించి ఆచరించవచ్చు.


సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page
https://www.facebook.com/vidhathaastornumerology/?view_public_for=1712439968969888

YouTube
https://www.youtube.com/channel/UCuppmXZZ8x1HI5rrVbCoJsw

Printerest
https://in.pinterest.com/vastronumerology/sree-vidhatha-peetam/

Twitter
https://twitter.com/VidhathaAstrolo

Instagram
https://www.instagram.com/sreevidhathapeetam/

Blog
https://vidhaathaastronumerology.blogspot.com/


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

కార్తీక మాసంలో తప్పకుండా చేయాల్సిన పూజలు

 

Tuesday, 18 October 2022

శ్రీ విధాత పీఠం లో దీపావళి మరియు కార్తీక మాస ఉత్సవాలు :



భగవత్ భందువులందరికిీ,
శ్రీ విధాత పీఠంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధనత్రయోదశి , దీపావళి, మరియు కార్తీక మాస ఉత్సవాలు యధాతదంగా పీఠం లో హవనిజా గారి ఆధ్వర్యంలో జరుగును.
పూజ వివరాలు ఈ క్రింది విధంగా కలవు.
22 అక్టోబర్ 2022 , ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధనత్రయోదశి రోజు
విశేష శ్రీ చక్రార్చన 516/-,
108 కలశపూజ 516/- ,
విశేష కు౦కుమార్చన 116/-
పైవన్నీ కలిపి 1116/-
24 అక్టోబర్ 2022 దీపావళి రోజు ,లక్ష్మి దేవికి
సహస్ర గోమతి చక్ర పూజ 1116/- ,
సహస్ర కుంకుమార్చన 1116/-,
సహస్ర హరిద్రార్చన 316/- ,
కుబేర హోమం 516/-
పైవన్నీ కలిపి 2116/-
కార్తీకమాసం ప్రతి రోజు
ఒక రోజుకి రుద్రాభిషేకం 116/-
30 రోజులకి 1116/-
ప్రతి కార్తీక సోమవారం
మహా రుద్రాభిషేకం 1116/- ,
బిల్వార్చన 116/-,
రుద్ర హోమం 516/- ,
సహస్ర లింగార్చన 516/-,
అష్టోత్తర కలాశాభిషేకం 316/-
ఆద్రోత్సవం 516/-
పైవన్నీ కలిపి 2116/-
కార్తీక పౌర్ణమి రోజు
ఏకాదశ రుద్రాభిషేకము 1116/-,
పురుష సూక్త , అఘోర పాశుపత సూక్త రుద్ర హోమము 2116/-,
విశేష రుద్రాక్షార్చన 1116/-,
ఉమా మహేశ్వర వ్రతం516/-,
సత్యనారాయణ వ్రతం 516/-
పైవన్నీ కలిపి 3116/-
ధనత్రయోదశి నుండి కార్తీక మాసం మొత్తం అన్నీ పూజలు కలిపి 5116/-
భక్తులు ఎవరైనా తమ పేర్ల మీద పూజలు చేయిన్చుకోగోరు వారు Ph. no: 9666602371
నంబరు లో సంప్రదించ గలరు.
అన్ని కార్య క్రామాల అనంతరం అమ్మవారికి అర్చించిన గోమతి చక్రాలు, శివార్చన కావించిన రుద్రాక్షలు భక్తులకు ఉచితగా వితరణ కావిన్చబడును. గురుబలo కోసం , శుభకార్యాలలో జాప్యం నివారణ కోసం హరిదరార్చనలో తమవంతు భాగస్వామ్యం కాదలచినవారు శ్రేష్టమైన పసుపుకొమ్ములు లేదా వాటి నిమిత్తము ధనము అయిన పంపవచ్చును.ధన,వాస్తు రూపేణా తమవంతు సాయం అందించి పై కార్యక్రమములలో పాల్గొనగలరు.
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

గ్రహణము వివరములు



అక్టోబ‌రు 25న సూర్యగ్రహణం, న‌వంబరు 8న చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా ఆయా రోజుల్లో 12 గంట‌ల పాటు ఆల‌య త‌లుపులు మూసివేస్తారు.
అక్టోబర్ 24న 2022 సోమవారం దీపావళి అమావాస్య పూజలు చేసుకోవచ్చు అక్టోబ‌రు 25న 2022 మంగ‌ళ‌వారం సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు
నవంబర్ 7 సోమవారం కార్తీక పౌర్ణమి పూజలు చేసుకోవలెను
న‌వంబ‌రు 8న మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 2.39 గంట‌ల నుండి సాయంత్రం 6.27 గంట‌ల వ‌ర‌కు చంద్ర‌గ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8 నుండి రాత్రి 7 గంట‌ల‌కు ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు.
చాలామంది భక్తులు వరుసుగా ఫోన్ కాల్స్ చేస్తూ అడుగుతుండడం వల్ల ముందుగా ఈ విషయాన్ని తెలియజేయడమైనది.
..................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........

Saturday, 8 October 2022

"ఓం శ్రీం శ్రీయై నమః "నామ స్మరణ


"ఓం శ్రీం శ్రీయై నమః "నామ స్మరణ

24 అక్టోబర్ ,2022 సంవత్సరం దీపావళి పూజా మహోత్సవాలలోగా
_శతకోటి పర్యాయాలు సామూహికంగా " ఓం శ్రీం శ్రీయై నమః "నామాన్ని స్మరింప జేయాలనే సంకల్పంతో ప్రారంభించిన గ్రూప్ ఇది. టైం తక్కువ ఉంది . టార్గెట్ ఎక్కువ ఉంది
కావున దయచేసి ఈ యొక్క ఇన్వైట్ లింక్ ద్వారా ఆధ్యాత్మిక చింతన గల మీరు మీ స్నేహితులు బంధువులు ఈ గ్రూపులో జాయిన్ అయి ఓం శ్రీం శ్రీయై నమః అని రోజుకి కనీసం 108 పర్యాయాలు తక్కువ కాకుండా స్మరించి ఆ రోజు స్మరించిన ఆ యొక్క విలువైన కౌంట్ సాయంత్రం 4గంటల నుండి రాత్రి 9గంటల మధ్యలో ఈ గ్రూపులో పోస్ట్ చేయండి. మీరు ఇంతకు ముందే శ్రీ విధాత పీఠం ఏదైనా గ్రూప్ లో భాగస్వాములై ఉన్నట్లయితే , ఈ కొత్త గ్రూప్ లో చేరనవసరంలేదు. ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములైన వారి పేర్ల మీద దీపావళి పూజలలోప్రత్యేకంగా జరిగే మహాలక్ష్మి హోమం లో పేర్ల మీద చేయించబడును.
ఈ మహత్తర కార్యక్రమంలో మీరు కూడా భాగస్తులై అమ్మ వారి అనుగ్రహాన్ని పొందండి.
https://chat.whatsapp.com/KHjW840nSpx1gefglqHk5k
మీ
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA /హవానిజా గురుజి
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No photo description available.