Friday, 25 May 2018

భగవన్నామస్మరణ





 మానవ దేహమనే మర్రి చెట్టు కొమ్మలమీద కామ క్రోధ లోభ మోహ, లోభ మద మాత్సర్యాలనబడే అరిషడ్వర్గాలనే పక్షులు కూచుంటాయి. మనసుని కల్లోల పరుస్తుంటాయి. మనిషిని అరుపులు శబ్దాలతో పీడిస్తుంటాయి. అపుడు భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ, తాళాలతో తాళం వేస్తూ రెండు చేతులతో చప్పట్లు చరుస్తూ, గొంతార గానం చేస్తే, ఆ గుడికి, భగవన్నామ ప్రభావానికి మనలో వాలిన అరిషడ్వర్గాలనే పక్షులు ఎగిరిపోతాయి. అదీ భజన విశిష్టత. భగవత్ గాన విశేషత. అయితే ఒకాయనకి ఓ సందేహం వచ్చి పడింది. మనమీంచి ఎగిరిపోయిన అరిషడ్వర్గాలనే పక్షులు మళ్లీ ఎక్కడికి వెళ్తాయి అని గురువుని అడిగాడు. ఆ గురువు ఎంతో చమత్కారంగా సమాధానమిచ్చేరు. ‘‘ఆ ఎగిరిపోయిన అరిషడ్వర్గాలు అనే పక్షులు భజనలు చేయని, నామస్మరణ చేయని వాళ్ళ భుజాలమీద వాలతాయి. కాకపోతే నెత్తిన వాల్తాయి’’ అని గమ్మత్తుగా గురువు చెప్పేరు. భజనకి, నామస్మరణకి వున్న ప్రాముఖ్యాన్ని వివరించే అద్భుతమైన చమక్కుతో కూడుకున్న బోధ అది. భగవత్ సాక్షాత్కారం కోరేవానికి నామస్మరణకు మించిన ఔషధం లేదు.

No comments:

Post a Comment