Friday, 30 March 2018

మార్చి 31, 2018 పంచాంగం


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
మార్చి 31, 2018
శనివారం (స్థిర వాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : పౌర్ణమి సా5.50
తదుపరి బహుళ పాడ్యమి
నక్షత్రం : ఉత్తర ఉ6.06
తదుపరి హస్త తె5.57
యోగం : వృద్ధి ఉ7.05
తదుపరి వ్యాఘాతం
కరణం :భద్ర/విష్ఠి ఉ6.25
తదుపరి బవ సా5.50
ఆ తదుపరి బాలువ తె5.28
సూర్యరాశి : మీనం
చంద్రరాశి :సింహం
సూర్యోదయం :6.00
సూర్యాస్తమయం :6.09
రాహుకాలం :9.00 - 10.30
యమగండం : ఉ00 - 7.30
వర్జ్యం : మ2.27 - 4.02
దుర్ముహూర్తం:ఉ6.00 -7.37
అమృతకాలం:రా11.59-1.34
మహా చైత్రీ
మదన పూర్ణిమ
విశ్వ కర్మ వ్రతము

శుభమస్తు🙏🏻

Monday, 26 March 2018

అందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు














మార్చి 26, 2018 పంచాంగం




ఓం శ్రీ గురుభ్యోనమ:🙏🏻
మార్చి 26, 2018
సోమవారం (ఇందువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : దశమి రా2.49
నక్షత్రం : పునర్వసు మ12.19
తదుపరి పుష్యమి
యోగం : అతిగండ రా8.36
తదుపరి సుకర్మ
కరణం :తైతుల సా4.00
తదుపరి గరజి రా2.49
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : కర్కాటకo
సూర్యోదయం : *6.04
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం :ఉ7.30 - 9.00
యమగండం : ఉ10.30 - 12.00
వర్జ్యo : రా7.46 - 9.16
దుర్ముహూర్తం: మ12.30 - 1.18 & మ2.54 - 3.42
అమృతకాలం: ఉ10.05 - 11.34 & తె4.43నుండి
భద్రాచలం లో శ్రీ సీతారామ కల్యాణం
ధర్మరాజ దశమి
శుభమస్తు

Sunday, 18 March 2018

మార్చి 19, 2018 పంచాంగం




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
మార్చి 19, 2018
సోమవారం(ఇందువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం
వసంత ఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి : విదియ సా5.58
తదుపరి తదియ
నక్షత్రం : రేవతి రా8.21
తదుపరి అశ్వని
యోగం : బ్రహ్మం సా5.38
తదుపరి ఐంద్రం
కరణం : బాలవ ఉ6.10
తదుపరి కౌలవ సా5.58 ఆ తదుపరి తైతుల తె5.31
సూర్యరాశి :మీనం
చంద్రరాశి : మీనం
సూర్యోదయం : 6.10
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం :ఉ7.30 -9.00 యమగండం: ఉ10.30-
12.00
వర్జ్యం : ఉ8.15 - 9.52
దుర్ముహూర్తం:మ12.32-1.20 & మ2.56 - 3.44
అమృతకాలం:సా5.56-7.32
శుభమస్తు

అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు







మార్చి 18, 2018 పంచాంగం


ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
మార్చి 18, 2018
ఆదివారం (భాను వాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
చైత్ర మాసం శుక్ల పక్షం
తిధి :పాడ్యమి సా6.23
తదుపరి విదియ
నక్షత్రం: ఉత్తరాభాద్ర రా8.10 తదుపరి రేవతి
యోగం : శుక్లం రా7.26 తదుపరి బ్రహ్మం
కరణం : కింస్తుఘ్నం ఉ7.12
తదుపరి బవ సా6.23
ఆ తదుపరి బాలవ తె6.10
సూర్యరాశి : మీనం
చంద్రరాశి :మీనం
సూర్యోదయం : 6.10
సూర్యాస్తమయం : 6.06
రాహుకాలం :సా4.30 -6.00
యమగండం:మ12.00 -1.30
వర్జ్యం : ఉ.శే.వ7.01వరకు
దుర్ముహూర్తం:సా4.31-5.18
అమృతకాలం:మ3.13-4.52
ఉగాది-నూతన సంవత్సరాది
వసంత నవరాత్రి ప్రారంభం
మీకు,మీ కుటుంబ సభ్యులకు
ఉగాది శుభాకాంక్షలు
శుభమస్తు

Friday, 2 March 2018

ఘంటానాద శ్రవణంతో శుభకరాల ప్రాప్తి

No automatic alt text available.

నిత్యం ఆలయాలకు వెళ్లేవారందరూ దైవదర్శనం చేసుకుంటూ ఆలయంలో ఉండే ఘంటను మ్రోగిస్తుంటారు. కొంతమంది దైవ దర్శనం చేసుకోవటానికి ముందుగాను, మరికొంతమంది ప్రార్ధన చేయుటకు సంకల్పించినప్పుడు మ్రోగిస్తుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే మరి.
ఆలయాలలోని ఈ ఘంటానాదం కొన్ని ప్రత్యేకమైన వారాలలో, ప్రత్యేక నక్షత్రాలు కలసి వచ్చినప్పుడు ఆలయానికి వెళ్లి ఆ ఘంటానాదాన్ని వింటే శుభకరాలు ప్రాప్తిస్తాయి. మరి శుభకరంగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాలు గడిచి పోవాలంటే ఏ ఏ రోజులలో ఈ ఘంటానాదాన్ని ఏ విధంగా శ్రవణం చేయాలో తెలుసుకుందాం.
ఆదివారాలలో అశ్వని, మూల నక్షత్రాలు వచ్చివున్నచో ఆనాటి రాహుకాలమైన సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు ఘంటానాదాన్ని వినాలి. ఆరుద్ర, స్వాతి, శతభిషం వచ్చిన సోమవారాలలో ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు గల రాహుకాల సమయంలోనే ఘంటానాదాన్ని శ్రవణం చేయాలి. పుష్యమితో కూడిన గురువారాలలో మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటల వరకు గల రాహుకాల సమయంలోను, హస్తా నక్షత్రంతో కలసిన శుక్రవారం ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకు గల రాహుకాల సమయంలోను, చివరిగా రేవతి, రోహిణి నక్షత్రాలు వచ్చిన శనివార రాహుకాలమైన ఉదయం 9.00 నుంచి 10.30 లోపు సమయంలోనే శుభకరాలను అందించే ఘంటానాదాన్ని విని శుభకర జీవితాన్ని సొంతం చేసుకోండి.
పైన చెప్పిన వారాలలో, ఆయా నక్షత్రాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండవలసిన అవసరం లేదు. కేవలం ఆనాటి రాహుకాల సమయంలో మాత్రమే ఆ నక్షత్రం ఉంటే చాలు. అయితే పై వారాలతో కూడిన నక్షత్రాలు గల రోజు శుక్ల పక్ష పాడ్యమి నుంచి శుక్ల చతుర్దశి వరకు వస్తే ఘంటానాదం మీకు ఎడమవైపున వినపడాలి. అనగా మీ ఎడమచెవి పై భాగాన ఘంట ఉండేలా నిలబడి ఆలయంలో ఉన్న మూర్తి స్వరూపాన్ని నమస్కరించుకోండి. ఆ ధ్వని సహజంగా రెండు చెవులకు సోకుతుంది. కాని ఎడమ చెవి వైపున ఘంట ఉండేలా శుక్ల పక్షంలో ఆచరించాలి.
పై వారాలతో కూడిన నక్షత్రాలు గల రోజు బహుళ పక్ష పాడ్యమి నుంచి బహుళ చతుర్దశి వరకు వస్తే ఘంటానాదం మీకు కుడి వైపున వినపడాలి. అనగా మీ కుడి చెవి పై భాగాన ఘంట ఉండేలా నిలబడి ఆలయంలో ఉన్న మూర్తి స్వరూపాన్ని నమస్కరించుకోండి. ఆ ధ్వని సహజంగా రెండు చెవులకు సోకుతుంది. కాని కుడి చెవి వైపున ఘంట ఉండేలా బహుళ పక్షంలో ఆచరించాలి.
అలాకాక పై వారాలలో ప్రత్యేక నక్షత్రాలు వచ్చిన సమయంలో పూర్ణిమ తిథి కనుక వస్తే... ఘంటకు మీరు కుడి వైపున గాని లేక ఎడమ వైపున గాని.... ఎటువైపునైననూ వినవచ్చును. అతి ముఖ్యంగా గుర్తుంచుకొనవలసిన విషయం ఏమిటంటే పై వారాలలో ప్రత్యేక నక్షత్రాలు వస్తున్న రాహుకాల సమయాలలో అమావాస్య తిథి జరుగుతుంటే విసర్జించండి. ఒకవేళ ఆ సమయంలో ఆలయంలోకి వెళ్ళవలసిన అవసరం ఏర్పడితే ఘంటను మ్రోగించటానికి ముందు మనసులో ఓమారు మీకిష్టమైన పితృదేవతలను (ఈ సమయంలో వారిని శోభనా దేవత అని అనుకోవాలి) తలుచుకొని ఆపైన ఘంటను మ్రోగించండి.
ఫలానా దైవానికి సంబంధించిన ఆలయంలోనే ఘంటానాదం వినాలనే నియమం ఏమి లేదు. ప్రత్యేక నియమాలు లేవు. ఉపవాసములు, నివేదనలు లేవు. స్త్రీ, పురుషులలో ఎవరైననూ వినవచ్చును. కాల పరిమితి ఏమి లేదు. కనుక ఆది, సోమ, గురు, శుక్ర , శని వారాలలో వచ్చే పైన పేర్కొన్న తొమ్మిది నక్షత్రాలు వస్తే, ఆనాటి రాహు కాలాలలో శుభకర ఘంటానాద శ్రవణంతో శుభకర జీవితాన్ని కైవసం చేసుకోండి.