Sunday, 22 October 2017

శ్రీ సర్పరాజ దండకము


శ్రీసర్పరాజ! ఫణీశా! మహాదేవభూషా! స్వభక్తాళిపాషా! అఘధ్వాంతభాస్వత్ర్వదీపా! విరూపాక్ష! దేహాధివాసా! మహావిష్ణు పర్యంక! సర్వంసహా భారవాహా! మహాభక్తచింత్తాంతరంగా! శుభాంగా! ఖలస్వాంతశిక్షా! సుచిత్తాఢ్య దీనాళి రక్షా! స్వపాదాబ్జ సంపూజనాసక్త దేవాళిరక్షా సుదక్షా! త్రిలోక ప్రభూ! యక్ష గంధర్వ గుహ్యోరగాద్యర్చితా! నిత్యపూతా! విరాగాంచిత స్వాంతమౌనీశ సౌలభ్యరూపా! సరాగాంచితస్వాంతమర్త్యాళికిన్ దుర్లభంబైన రూపంబునన్ సర్వకాలంబులందొక్కరీతి వెలుగొందు సర్వస్వరూపా! మహావిశ్వరూపా! “మహాదేవ శ్రీమల్లవార్యాఖ్యగ్రామే నివాసాయ, బ్రహ్మణ్యదేవాయ, బ్రహ్మ స్వరూపాయ, శ్రీ అలవిల్లీ నివాసాయ, తుభ్యం నమోదేవ! యంచెల్లకాలంబులన్నిన్ను ప్రార్థించుచుందున్ ఫణీశా నమస్తే, నమస్తే, నమస్తే నమః
శ్లో!! సర్పరాజ! తవరూప మజస్రం
యేస్మరంతి మనుజా భువి నిత్యం!
శ్రీ మతాంచ విదుషాంధురిగణ్యా
స్తే భవంతి నహితత్ర విచారః!!
శ్లో!! దేవరాజ తనుజాప్రియ! స్వామిన్!
నిత్యమంగళ విధాత నిధాన!
షణ్ముఖేశ తవపాద పయోజం
మానసే మమ సదాస్తు పరేశ!!
శ్లో!! త్వదీయం చరిత్రం పవిత్రం సుచిత్రం
స్వభక్తాళిభిర్గీత మాద్యంత హీనం!
నిరస్తాఘమార్త్యేస్సుపూజ్యం సుపుణ్యం
సదాసేవయే దేవ! రమ్యం సుశాంతం!!
శ్లో!! శబరేశ సుతాహృదయాంబుజ భా
స్కర! పాకహరార్చిత పాద! విభో!
సురనాథ సుతాప్రియ! తారక రా
క్షాస నాశకరాయ నమో గురవే!!

No comments:

Post a Comment