Thursday, 26 October 2017

శివనామావల్యష్టకం


హే చంద్రచూడ మదనాంతక శూలపాణే – స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో |
భూతేశ భీతభయసూదన మామనాథం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౧ ||
హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే – భూతాధిప ప్రమథనాథ గిరీశచాప |
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౨ ||
హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర – లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ |
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౩ ||
హే విశ్వనాథ శివ శంకర దేవదేవ – గంగాధర ప్రమథనాయక నందికేశ |
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౪ ||
వారాణసీపురపతే మణికర్ణికేశ – వీరేశ దక్షమఖకాల విభో గణేశ |
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౫ ||
శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో – హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ |
భస్మాంగరాగ నృకపాలకలాపమాల – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౬ ||
కైలాసశైలవినివాస వృషాకపే హే – మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస |
నారాయణప్రియ మదాపహ శక్తినాథ – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౭ ||
విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప – విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ |
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో – సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౮ ||
గౌరీవిలాసభవనాయ మహేశ్వరాయ – పంచాననాయ శరణాగతకల్పకాయ |
శర్వాయ సర్వజగతామధిపాయ తస్మై – దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ || ౯ ||

Monday, 23 October 2017

శివుడికి ఇవి సమర్పిస్తే 1000 జన్మల పుణ్యం..




నందీశ్వరుడు,నటరాజ స్వామి,ముక్కంటి,త్రినేత్రుడు ఇలా చెప్పుకుంటూ పోతే మహా శివుడికి ఎన్నో పేర్లు అయితే పరమేశ్వరుడికి బోళ శంకరుడు అని కూడా పేరు ఉంది.
శివుడు నిష్కల్మషమైన భక్తిని కోరతాడు అనేది జగం ఎరిగిన సత్యం,మన భక్తిని చాటుకోవడానికి మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము,అందులో అభిషేకాలు,ఉపవాసాలు,దూప దీప నైవేద్యాలు,జాగరణలు ఇలా ఎన్నో అయితే శివుడికి ఇవ్వన్ని ఎంతో ఇష్టమైనవి అనేది వాస్తవం అయితే,మరి అన్నిటికన్నా శివుడు మెచ్చే నివేదన ఏమిటో తెలుసా?
శివుడు మెచ్చే నివేదన ఏమిటి?
శివుడు నిరాడంబరుడు అందుకే అయన కోరేది నీరు.అవును మీరు చదివింది నిజమే కార్తిక మాసం లో దీపం నిత్యం ఆయనకి నీరు సమర్పిస్తే శివుడికి అనుగ్రహం పొంది కోరిన కోరికలు తీరుస్తాడు.
నిరు ఎలా సమర్పించాలి?
శివుని ఫోటో లేదా లింగమ్ దగ్గర రాగి లేదా వెండి పాత్రలో శుభ్రమైన నీరు ఉంచాలి,అది రోజు పూజకు ముందు మార్చాలి,ఆ నిరుని మనం తీసుకోవచ్చు లేదా మొక్కలకు కూడా వేయచ్చు
శివుడికి ఇవి సమర్పిస్తే 1000 జన్మల పుణ్యం.

ఓంకారేశ్వరస్తుతి

 ఓంకారేశ్వరుని గూర్చి బ్రహ్మ చేసిన స్తుతి 


౧. నమః ఓంకార రూపాయ నమో౭క్షర వపుర్ధృతే
నమో౭కారాది వర్ణానాం ప్రభవాయ సదాశివ!!
౨. అకారస్త్వముకారస్త్వం మకారస్త్వమనాకృతే!
ఋగ్యజుస్సామ రూపాయ రూపాతీతాయ తే నమః!!
౩. నమో నాదాత్మనే తుభ్యం నమో బిందు కళాత్మనే!
అలింగ లింగ రూాయ సర్వరూప స్వరూపిణీ!!
౪. నమస్తే ధామనిధయే నిథనాది వివర్జిత!
నమో భవాయ రుద్రాయ శర్వాయ చ నమోస్తుే!!
౫. నమ ఉగ్రాయ భీమాయ పశూనాం పతయే నమః!
నమస్తారస్వరూపాయ సంభవాయ నమోస్తుతే!!
౬. అమాయాయ నమస్తుభ్యం నమఃశివతరాయ తే!
కపర్దినే నమస్తుభ్యం శితికంఠ నమోస్తుతే!!
౭. మీఢష్టమాయ గిరీశ శిపివిష్టాయ తే నమః!
నమోహ్రస్వాయ ఖర్వాయ బృహతే వృద్ధరూపిణే!!
౮.కుమారగురవే తుభ్యం కుమార వపుషే నమః!
నమః శ్వేతాయ కృష్ణాయ పీతాయారుణమూర్తయే!!
౯. ధూమ్రవర్ణాయ పింగాయ నమః కిర్మీర వర్చసే!
నమః పాటల వర్ణాయ నమో హరిత తేజసే!!
౧౦. నానావర్ణ స్వరూపాయ వర్ణానాం పతయే నమః!
నమస్తే స్వూపాయ నమోవ్యంజన రూపిణే!!
౧౧. ఉదాత్తాయానుదాత్తాయ స్వరితాయ నమోనమః!
హ్రస్వదీర్ఘ ప్లుతేశాయ సవిసర్గాయ తే నమః!!
౧౨. అనుస్వార స్వరూపాయ నమస్తే సానునాసిక!
నమో నిరనునాసాయ దంత్యతాలవ్య రూపిణే!!
౧౩. ఓష్ఠ్యోరస్య స్వరూపాయ నమ ఊష్మస్వరూపిణే!
అంతస్థాయ నమస్తుభ్యం పంచమాయ పినాకినే!!
౧౪. నిషాదాయ నమస్తుభ్యం నిషాదపతయే నమః!
వీణావేణుమృదంగాది వాద్యరూపాయ తే నమః!!
౧౫. నమస్తారాయ మంద్రాయ ఘోరాయాఘోర మూర్తయే!
నమస్తానస్వరూపాయ మూర్ఛనాపతయే నమః!!
౧౬. స్థాయిసంచారి భేదేన నమో భావస్వరూపిణే!
తాళప్రియాయ తాళాయ లాస్య తాండవ జన్మనే!!
౧౭. తౌర్యత్రిక స్వరూపాయ తౌర్యత్రిక మహాప్రియ!
తౌర్యత్రికకృతాం భక్త్యా నిర్వాణ శ్రీప్రదాయక!!
౧౮. స్థూల సూక్ష్మ స్వరూపాయ దృశ్యాదృశ్య స్వరూపిణే!
అర్వాచీనాయ చ నమః పరాచీనాయ తే నమః!!
౧౯. వాక్ ప్రపంచ స్వరూపాయ వాక్ప్రపంచ పరాయ చ!
ఏకాయానేక భేదాయ సదసత్పతయే నమః!!
౨౦. శబ్ద బ్రహ్మ నమస్తుభ్యం పరబ్రహ్మ నమోస్తుతే!
నమోవేదాంత వేద్యాయ వేదానాం పతయే నమః!!
౨౧. నమో వేద స్వరూపాయ వేదగోచరమూర్తయే!
పార్వతీశ నమస్తుభ్యం జగదీశ నమోస్తుతే!!
౨౨. నమస్తే దేవదేవేశ దేవ దివ్య పదప్రద!
శంకరాయ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర!!
౨౩. నమస్తే జగదానంద నమస్తే శశిశేఖర!
మృత్యుంజయ నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తే త్ర్యంబకాయ చ!!
౨౪. నమః పినాకహస్తాయ త్రిశూలాయుధధారిణే!
నమ స్త్రిపురహంత్రేచ నమోంధక నిషూదన!!
౨౫. కందర్పదర్పదళన నమో జాలంధరారయే!
కాలాయ కాలాలాయ కాలకూట విషాదినే!!
౨౬. విషాదహంత్రే భక్తానాం భక్తైక విషాదద!
జ్ఞానాయ జ్ఞాన రూపాయ సర్వజ్ఞాయ నమోస్తుతే!!
౨౭. యోగసిద్ధి ప్రదోసి త్వం యోగినాం యోగసత్తమ!
తపసాం ఫలదోసి త్వం తపస్విభ్యస్తపోధన!!
౨౮. త్వమేవ మంత్రరూపోసి మంత్రాణాం ఫలదభవాన్!
మహాదాన ఫలం త్వం వై మహాదానప్రదో భవాన్!!
౨౯. మహాయజ్ఞ స్త్వమేవేశ మహాయజ్ఞ ఫలప్రద!
త్వం సర్వః సర్వగస్త్వం వై సర్వదః సర్వదృక్ భవాన్!!
౩౦. సర్వభుక్ సర్వకర్తా త్వం సర్వసంహారకారక!
యోగినాం హృదయాకాశకృతాలయ నమోస్తుతే!!
౩౧. త్వమేవ విష్ణురూపేణ శంఖచక్రగదాధర!
త్రిలోకీం త్రాయసే త్రాతః సత్త్వమూర్తే నమోస్తుతే!!
౩౨. త్వమేవ విదధాస్యేతద్ విధిర్భూత్వా విధానవిత్!
రజోరూపం సమాలంబ్య నీర జస్కపదప్రద!!
౩౩. త్వమేవహి మహారుద్రస్త్వం మహోగ్రో భుజంగభృత్!
త్వమేవహి మహాభీమో మహాపితృవనేచర!!
౩౪. తామసీం తను మాశ్రిత్య త్వం కృతాంత కృతాంతక!
కాలాగ్ని రుద్రో భూత్వాన్తే త్వం సంవర్త ప్రవర్తకః!!
౩౫. త్వం పుంప్రకృతి రూపాభ్యాం మహదాద్యఖిలం జగత్!
అక్షిపక్ష్మ సముత్ క్షేపాత్ పునరావిష్కరోష్యజ!!
౩౬. ఉన్మేష వినిమేషౌ తే సర్గాసర్గైక కారణమ్!
కపాలమాలా ఖేలోయం భవతః స్వైరచారిణః!!
౩౭. త్వత్కంఠే నృకరోటీయం ధూర్జటే యా విభాసతే!
సర్వేషామంతదగ్ధానాం సా స్ఫుటం బీజమాలికా!!
౩౮. త్వత్తః సర్వమిదం శంభో త్వయి సర్వం చరాచరం!
కస్త్వాం స్తోతుం విజానాతి పురావాచా మగోచరమ్!!
౩౯. స్తోతా త్వంహి స్తుతి స్త్వంహినిత్యం స్తుత్యః త్వమేవచ!
వేద్మ్యోంన్నమః శివాయేతి నాన్యద్వేద్మ్యేవ కించన!!
౪౦. త్వమేవహి శరణ్యంమే త్వమేవహి గతిఃపరా!
త్వామేవ ప్రణమామీశ నమస్తుభ్యం నమోనమః!!

ఫలశృతి:
బ్రహ్మ నేటికీ తాను రచించిన ఈబ్రహ్మస్తవముతో స్తుతించుచూ ఓంకారేశ్వరుని పూజించును. ఈస్తవమును జపించుట వలన మర్త్యుడు పాపవిముక్తుడై, పరిపూర్ణుడై, పమోత్తమ జ్ఞానమును పొందుదురు. ఈబ్రహ్మస్తవమును ఒక సంవత్సరము త్రికాలములందు జపించువారు అంతకాలమునందు జ్ఞానమును పొంది సంసార బంధముల నుండి విముక్తులగుదురు.

Sunday, 22 October 2017

శ్రీ సర్పరాజ దండకము


శ్రీసర్పరాజ! ఫణీశా! మహాదేవభూషా! స్వభక్తాళిపాషా! అఘధ్వాంతభాస్వత్ర్వదీపా! విరూపాక్ష! దేహాధివాసా! మహావిష్ణు పర్యంక! సర్వంసహా భారవాహా! మహాభక్తచింత్తాంతరంగా! శుభాంగా! ఖలస్వాంతశిక్షా! సుచిత్తాఢ్య దీనాళి రక్షా! స్వపాదాబ్జ సంపూజనాసక్త దేవాళిరక్షా సుదక్షా! త్రిలోక ప్రభూ! యక్ష గంధర్వ గుహ్యోరగాద్యర్చితా! నిత్యపూతా! విరాగాంచిత స్వాంతమౌనీశ సౌలభ్యరూపా! సరాగాంచితస్వాంతమర్త్యాళికిన్ దుర్లభంబైన రూపంబునన్ సర్వకాలంబులందొక్కరీతి వెలుగొందు సర్వస్వరూపా! మహావిశ్వరూపా! “మహాదేవ శ్రీమల్లవార్యాఖ్యగ్రామే నివాసాయ, బ్రహ్మణ్యదేవాయ, బ్రహ్మ స్వరూపాయ, శ్రీ అలవిల్లీ నివాసాయ, తుభ్యం నమోదేవ! యంచెల్లకాలంబులన్నిన్ను ప్రార్థించుచుందున్ ఫణీశా నమస్తే, నమస్తే, నమస్తే నమః
శ్లో!! సర్పరాజ! తవరూప మజస్రం
యేస్మరంతి మనుజా భువి నిత్యం!
శ్రీ మతాంచ విదుషాంధురిగణ్యా
స్తే భవంతి నహితత్ర విచారః!!
శ్లో!! దేవరాజ తనుజాప్రియ! స్వామిన్!
నిత్యమంగళ విధాత నిధాన!
షణ్ముఖేశ తవపాద పయోజం
మానసే మమ సదాస్తు పరేశ!!
శ్లో!! త్వదీయం చరిత్రం పవిత్రం సుచిత్రం
స్వభక్తాళిభిర్గీత మాద్యంత హీనం!
నిరస్తాఘమార్త్యేస్సుపూజ్యం సుపుణ్యం
సదాసేవయే దేవ! రమ్యం సుశాంతం!!
శ్లో!! శబరేశ సుతాహృదయాంబుజ భా
స్కర! పాకహరార్చిత పాద! విభో!
సురనాథ సుతాప్రియ! తారక రా
క్షాస నాశకరాయ నమో గురవే!!

ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం




సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ |
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే || ౧ ||
శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ |
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ || ౨ ||
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ |
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ || ౩ ||
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే || ౪ ||
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ |
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి || ౫ ||
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః |
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే || ౬ ||
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః |
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే || ౭ ||
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే |
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే || ౮ ||
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః |
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి || ౯ ||
యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ |
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి || ౧౦ ||
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాప
బృందమ్ |
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే || ౧౧ ||
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ |
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే || ౧౨ ||
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ |
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ||

Saturday, 21 October 2017

కార్తీక మాసంలో ఉపవాసాల వల్ల ప్రయోజనం


ప్రతీ మాసంలోనూ ఏవో కొన్ని పండుగలు రావడం సహజం. కానీ కార్తీక మాస విశిష్ఠత ఏమిటంటే, ఇందులో ప్రతి రోజూ ఒక పండుగే! జపతపాలతో, ఉపవాసాలతో, దీపదానాలతో, కార్తీకస్నానాలతో, వ్రతాలతో… కార్తీక మాసమంతా దైవనామస్మరణతో మార్మోగిపోతుంటుంది. కార్తీక మాసంలో భగవంతుని పూజించేందుకు పెద్ద క్రతువులేమీ చేయనవసరం లేదు. కోరి ఖర్చుపెట్టాల్సిన అవసరమూ లేదు. కావల్సిందల్లా నిష్ఠ! పాటించవలసిందల్లా నియమం! అలాంటి ఒక నియమమైన ఉపవాసం గురించి…
కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారంనాడూ ఉపవాసాన్ని ఆచరించి, రాత్రి నక్షత్ర దర్శనానంతరమే భోజనాన్ని చేసినవారు శివసాయుజ్యాన్ని పొందుతారని `కార్తీక మహాపురాణం` చెబుతోంది. ఆధ్యాత్మికంగానూ, ఆరోగ్యపరంగానూ మన పెద్దలు ఉపవాసానికి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఎలాగైతే వారం వారం మనం సెలవు తీసుకుంటామో, అలాగే మన జీర్ణవ్యవస్థకు కూడా వారానికి ఒక రోజు సెలవు ప్రకటించమని ప్రకృతి వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు.
వారానికి ఓసారి ఉపవాసం ఉంటే మన జీర్ణవ్యవస్థ తిరిగి శక్తిని పుంజుకునేందుకు తగిన అవకాశాన్ని ఇచ్చిన వారవుతాము. అంతేనా! మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకునేందుకే శరీరం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకున్న వెంటనే మగతగా అనిపించడానికి ఇదే కారణం! అలా కాకుండా ఒక రోజంతా కనుక శరీరాన్ని తన మానాన వదిలేస్తే… దానికి ఉన్న రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఆ సమయాన్ని వినియోగించుకుంటుంది. శరీరంలోని మూలమూలలా ఉన్న దోషాలను ఎదుర్కొని, అవి రుగ్మతలుగా మారకుండా చూస్తుంది.
మన శరీరానికి తనకు తానుగా స్వస్థత పరచుకునే గుణం ఉంటుంది. ఇన్ఫెక్షన్లు ఏర్పడినప్పుడు శరీరం వాటిని ఎదుర్కొనే యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేయగల్గుతుంది. అయితే దానికి అంత అవకాశం ఇచ్చే ఓపిక తీరిక మనకి ఉండవు. పైగా ఏ చిన్న రోగం ఎక్కడికి దారి తీస్తుందో అన్న భయం ఒకటి ఎప్పుడూ మనల్ని వెన్నాడుతూనే ఉంటుంది. అందుకే ఠక్కున మందుబిళ్లలు వేసేసుకుంటాం. కానీ మన పెద్దలు అలా భయపడేవారు కాదు. అజీర్ణం చేసినా, జ్వరం వచ్చినా… ఉపవాసం ఉండి, శరీరానికి తగిన అవకాశాన్ని ఇచ్చేవారు. అందుకే ఆయుర్వేదంలో `లంకణం పరమౌషధం` అని చెప్పారు. బ్రౌన్‌ నిఘంటువులో `A day passed without eating any food when one is attacked with fever and other diseases.` అని లంకణానికి నిర్వచనం కనిపిస్తుంది.
ఉపవాసానికి ఆరోగ్యపరంగా ఉన్న ప్రాముఖ్యతని అలా ఉంచితే, మానసికంగా కూడా దాని ప్రభావం అమోఘం. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్నీ, మనసునీ కూడా ప్రభావితం చేస్తుందని ప్రాచీన వైద్యం చెబుతోంది. ఒక రకంగా చెప్పాలంటే… మనం తినే ఆహారమే మన ఔషధం! విపరీతమైన కారం తింటే ఒకరకమైన ఆలోచన కలుగుతుంది, విపరీతమైన పులుపు తింటే మరోరకమైన ఆలోచనలకు ప్రోత్సహం ఉంటుంది. అందుకే మనస్ఫూర్తిగా దైవాన్ని తల్చుకునేందుకు, అన్ని మతాలవారూ ఉపవాసాన్ని ప్రోత్సహించారు. కడుపులో ఎలాంటి ఆహారమూ లేనప్పుడూ, భగవన్నామస్మరణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. హైందవ ఆచారాలలో కూడా ఏదో ఒక సందర్భంగా ఉపవాసాలని జోడిస్తూనే వచ్చారు. కనీసం పదిహేను రోజులకి ఒకసారన్నా ఉపవాసం ఉండేలా ఏకాదశినాడు ఉపవాసం ఉండమని సూచించారు. అదీ ఇదీ కాదంటే కనీసం కార్తీక సోమవారాలలో అన్నా ఉపవాసం ఉండమని చెబుతున్నాయి మన శాస్త్రాలు.
ఇక ఉపవాసాల కోసం కార్తీకమాసాన్నే ఎంచుకోవడంలో మరో ఔచిత్యం ఉంది. బయట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మన శరీరం త్వరగా అలసిపోతుంది. అలాగని చలి మరీ ఎక్కువగా ఉంటే, శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించేందుకు కూడా ఎంతో కొంత శక్తి అవసరం అవుతుంది. నవంబరు మాసంలో ఉండే ఉష్ణోగ్రతలు మరీ అసాధారణంగా లేకుండా ఉపవాసానికి తగినట్లుగా ఉంటాయి. ఇక శరీరాన్ని అదుపులో ఉంచేందుకు, మనసుని శివపరం చేసుకునేందుకు కార్తీకమాస ఉపవాసాలని మించి ఏముంటాయి.



ర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

 

Sunday, 15 October 2017

గోమతిచక్రాలు


గోమతిచక్రాలు అరుదైన సహజసిధ్ధంగా లభించే సముద్రపు ఉత్పత్తి. గోమతిచక్రాలు గుజరాత్ రాష్ట్రం నందు ద్వారకలోని గోమతి నది నందు లభిస్తాయి.చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో సోడియం లేదా కాల్షియం లేదా కర్బనపు అణువుల సహాయంతోఇవి రూపు దిద్దుకుంటాయి.ఈరెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం.ఈశుక్రుడు భార్గవునికి జన్మించిన లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన ఈ చక్రాల ఉపయోగం అనేకం అనంతం అని చెప్పవచ్చును. 

గోమతిచక్రం శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది.దీనినే "నాగ చక్రం" అని "విష్ణు చక్రం" అని కూడ అంటారు. ఇది నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది.అందువల్ల దీనిని "నత్త గుళ్ళ " స్టోన్ అని కూడ అంటారు.గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం ప్లాట్ గాను ఉంటుంది.గోమతిచక్రం ముందుభాగం తెల్ల గాను,కొన్ని ఎర్ర గాను ఉంటాయి.

తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకి,సకల కార్యసిధ్ధికి,ఆరోగ్య సమస్యలకి,ధరించటానికి ఉపయోగపడతాయి.ఎర్రగా ఉన్న గోమతిచక్రాలు వశీకరణానికి,శత్రునాశనానికి,క్షుద్రప్రయోగాలకి,తాంత్రిక ప్రయోగాలకి మాత్రమే ఉపయోగించాలి.గోమతిచక్రాలలో ఆరు,తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉన్నాయి . సంఖ్యాశాస్త్రంలో ఆరు శుక్ర గ్రహానికి,తొమ్మిది కుజ గ్రహానికి చెందుతాయి.జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు ఉండే  దోషాలు  గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి.

గోమతి చక్రాలను సిధ్ధం చేసుకున్న తరువాత వాటిని ముందుగా గంగాజలం నీళ్ళతో గాని పసుపు నీళ్ళతో గాని కడిగి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి.గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి.గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకొని మనకు కావలసిన సమయాలలో వీటిని ఉపయోగించుకోవచ్చు.పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి మనకు అవసరమైనప్పుడు వాటిని తీసి ఉపయోగించుకోవచ్చు. గోమతిచక్రాలను ఎప్పుడు ఎర్రని బట్టలో గాని,హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి.గోమతిచక్రాలను పిరమిడ్ లో గాని వెండి బాక్స్ లో గాని ఉంచి కొద్దిగా హనుమాన్ సింధూరం లేదా కుంకుమతో పాటు ఉంచాలి.గోమతిచక్రాలు శుక్ర గ్రహానికి ప్రతీక.


1)ఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది.


2)గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది.బాలారిష్ట దోషాలు కూడ పోతాయి .



3)రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు.


4)రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.


5)మూడు గోమతిచక్రాలను బ్రాస్ లెట్ లాగా చేసుకొని చేతికి ధరిస్తే జనాకర్షణ,కమ్యూనికేషన్,సహాకారం లభిస్తుంది.


6)మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద అతని పేరు వ్రాసి నీటిలో వేయటం గాని వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది.ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది.

7)నాలుగు గోమతిచక్రాలు పంట భూమిలో పొడిచేసి గాని మాములుగా గాని చల్లటం వలన పంట బాగా పండుతుంది

8)గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు భూమిలో స్ధాపించటం వలన ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని అందులో నివసించే వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి ఉందురు.

9)నాలుగు గోమతిచక్రాలను వాహానానికి కట్టటం వలన వాహాన నియంత్రణ కలిగి వాహాన ప్రమాదాలనుండి నివారించబడతారు.

10)ఐదు గోమతిచక్రాలు తరుచు గర్భస్రావం జరుగుతున్న మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుంది.


11)ఐదు గోమతిచక్రాలు లేదా గోమతి చక్ర ట్రీ పిల్లలు చదుకొనే బుక్స్ దగ్గర ఉంచటం వలన చదువులో ఏకాగ్రత కలుగుతుంది.తరుచు ఆలోచనా విధానంలో మార్పులు ఉంటాయి.

12)పుత్రప్రాప్తి కోసం 5 గోమతిచక్రాలను నది లోగాని జలాశయంలో గాని విసర్జితం చేయాలి.

13)ఆరు గోమతిచక్రాలు అనారోగ్యం కలిగిన రోగి మంచానికి కట్టటం వలన తొందరగా ఆరోగ్యం కుదుటపడుతుంది.శత్రువులపై విజయం సాదించవచ్చును.కోర్టు గొడవలు ఉండవు.విజయం సాదించవచ్చును.


14)పది గోమతిచక్రాలు ఆఫీసులో ఉండటం వలన ఆ సంస్ధకి అమితమైన గుర్తింపు లభిస్తుంది.ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి.మరియు వారు సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలతో గుర్తించబడతారు.

15)పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు ,శల్యదోషాలు ఉండవు.

16)13 గోమతిచక్రాలను శివాలయంలో దానం చేసిన ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది.

17)27 గోమతిచక్రాలని వ్యాపార సముదాయములలో ద్వార బందానికి కట్టి రాకపోకలు ఆద్వారం గుండా చేస్తే వ్యాపారం దినదినాభివృద్ధి అవుతుంది.

18) జాతకచక్రంలో నాగదోషం,కాలసర్పదోషం ఉన్నవారు పంచమస్ధానంలో ఉన్న రాహువుకి పాపగ్రహాల దృష్టి గాని,సాంగత్యం గాని ఉన్న సంతాన దోషం ఉంటుంది.దీనినే నాగదోషం అంటారు.జాతకచక్రంలో రాహు కేతువుల మద్య అన్నీ గ్రహాలు ఉన్నప్పుడు దానిని కాలసర్పదోషం అంటారు. ఈ రెండు దోషాలు ఉన్నవారు గోమతి చక్రాలను పూజచేయటం గాని,దానం చేయటం గాని, గోమతిచక్రాన్ని మెడలో లాకెట్ లాగా ధరించటం గాని చేయాలి.


contact for items 9000123129







దీపరాధన ఎలా చెయ్యాలి ?



దీపరాధన చేసేముందు వత్తి వేసి తరువాత నూనె పొస్తూంటారు కాని అది పద్దతి కాదు, దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి తర్వాత వత్తులు వేయాలి.
వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి. మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు. స్టీలు కుందుల్లో దీపారాధన చేయరాదు. కుందులను కూడా రోజు శుభ్రంగా కడిగి ఉపయోగించాలి. అంతేగాని శుభ్రపరచకుండా వత్తులను మార్చడం పద్దతి కాదు.
కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు అవకాశం ఉంటే రాగి ప్రమిదలో నిర్వహిస్తే చాలా మంచిది. సర్వరోగాలు, దోషాలు పరిపూర్ణంగా నశిస్తాయి.
కుందుని ఒక పళ్ళెం లో కాని తమలపాకు మీద కాని పెట్టాలి. కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.
దీపారాధన చేసేముందు దేవుడి ముందు పెట్టే కుందుల్లో నూనె, 2 వత్తులు వేసుకొని ఉంచుకోవాలి. అగ్గిపుల్లతో నేరుగా వత్తులని వెలిగించకూడదు. అందుకు మీరు ముందుగా ఏకహారతిలో ( హారతి ఇచ్చే వస్తువు) కర్పూరం వెలిగించి దానితో కాని లేకపోతే ఒక అడ్డవత్తిని ఏకహారతిలో వేసి వెలిగించి దాని సహాయంతో దీపారాధనని చేయాలి. అగరొత్తులు, ఏకహరతి, కర్పూర హారతి ఇవ్వవలసి వచ్చినప్పుడు దీపారాధన నుండి వెలిగించకూడదు.
దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. దీప పీఠభాగము బ్రహ్మాతో సమానం. స్ధంబము విష్ణురూపము, ప్రమిద పరమేశ్వరుడు, దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగుశక్తి స్వరూపం.
ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏక వత్తి అశుభ సందర్భంలో మాత్రమే వెలిగిస్తారు.
అమ్మవారిముందు బియ్యంపోసి దానిమాద వెండి కుందిలో దీపారాధన చేసి, తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి, సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది. తులసి కోట ముందు మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఇంట్లోకి దుష్ట శక్తులు రావు.
దీపారాధనలో ఆవు నెయ్యి శ్రీమహాలక్ష్మి కి , నువ్వుల నూనె శ్రీమహావిష్ణువు, శ్రీసుబ్రహ్మణ్యస్వామి, కొబ్బరి నూనె శ్రీమహాగణపతి కి ముఖ్యము. అలాగే ఆవు నెయ్యి, విప్పనూనె, వేపనూనె, ఆముదం, కొబ్బరి నూనెలు పరాశక్తి కి చాలా ముఖ్యము.
ఆవు నెయ్యి గాని, నువ్వుల నూనె గాని, ఆముదం గాని ఏదో ఒక తైలము శ్రేష్ఠము. ఎట్టి పరిస్ధితులలో శనగనూనె వాడరాదు.
నెయ్యి ——–మహాలక్ష్మి కటాక్షం (ఆవు నెయ్యి, విప్పి నూనె, వేప నూనె కలిపి దీపారాధన చేయుట మంచిది.)
ఆముదం ——కష్టాలు తొలుగుట, ఏకాగ్రత ,కీర్తి ప్రతిష్టలు పొందుతారు
నువ్వులనూనె —— మద్యమం(దుష్ట శక్తి , శతృ బాధలు తొలుగుతాయి)

దీపం కొండెక్కింది అనాలి. దీపారాధన పూర్తయింది, ఆరిపోయింది అని అనకూడదు.
తెల్లవారుఝామునే లేచి స్నానాదులు ముగించుకొని దైవారాధన చేయాలి. తెల్లారి 5 గంటల లోపు స్నానం చేస్తే దానిని బుషిస్నానం, 5-6 గంటల వేళ స్నానం చేస్తే దైవస్నానం, 6-7 గంటల మధ్య చేస్తే మానవ స్నానం అంటారు. (ఇప్పుడు మిట్టమధ్యాహ్నం వరకు స్నానాదులు చేయకుండా మిగిలిన పనులు పూర్తిచేస్తున్నారు. అది ఇంటికి, మనకి కూడా మంచిది కాదు.)

Friday, 6 October 2017

"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?

No automatic alt text available.
"ఓం" అనే ఏకాక్షర మంత్రం ఎంత శక్తివంతమైందో తెలుసా?
"ఓం" అనే ఏకాక్షర మంత్రం... చాలా శక్తివంతమైంది. దీనినే ప్రణవమని అంటారు. ఓం, ఓమ్, లేదా ఓంకారము త్రిమూర్తి స్వరూపముగా చెప్పబడుతోంది. అకార, ఉకార, మకార శబ్దములతో ఓంకారం ఏర్పడింది. ఓంకారమ్ శభ్ధాలలో మొదటిది. పరమాత్మకు శబ్దరూప ప్రతీక.
మంత్రోచారణం అనేది జీవునికి, పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే సాధనం. ఇందులో ఓంకారానికి అత్యంత ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఓం కారము పరబ్రహ్మ స్వరూపము. ఆ ఓంకారము నుంచే యావత్తు జగము ఉద్భవించింది. వేదముల యొక్క సారము ఓంకారము.
`ఓం' అంటే ప్రారంభాన్ని తెలుపునది. ఓకాక్షర మంత్రము, భగవంతుని ముఖ్యనామమైన `ఓం'కు అనేక అర్థాలు కలవు. బ్రహ్మనాదము ఓంకారము. ఆత్మ ఓంకార మంత్ర స్వరూపము ప్రణవ నాదమే ప్రాణము. ప్రధమ నాదము ఓంకారము. అకార, ఉకార, మకారములను మూడు అక్షరముల కలయిక వలన ఓంకారము ఉద్భవించినదని పండితులు చెబుతున్నారు

జంబుద్వీపం అంటే ఏమిటి?


No automatic alt text available.
 

జంబుద్వీపే భరతవర్షే భరతఖండే,అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?






No automatic alt text available.







  సంకల్ప మంత్రంలో వచ్చే పదాలు “జంబుద్వీపే భరతవర్షే భరతఖండే” అనేవి మనమందరం వినే ఉంటాము. మన హిందు ఆచారాలలో ఈ సంకల్ప మంత్రం ఒక అంతర్భాగం.

అసలు జంబుద్వీపం అంటే ఏమిటి?


జంబుద్వీపం అంటే కేవలం భారత ఉపఖండమే కాదు. జంబుద్వీపంలో ఆసియా, ఐరొపా,ఆఫ్రికా, ఉత్తర అమెరికా ఉండేవి. జంబుద్వీపాన్ని 9 వర్షాములుగా(భౌగోళిక ప్రాంతాలు) విభజించారు. వాటిలో మన భరతవర్షం ఒకటి. మిగిలిన 8 వర్షములు ఇవి:


1) కేతుముల వర్ష 2) హరి వర్ష 3) ఇలవ్రిత వర్ష 4) కురు వర్ష 5) హిరణ్యక వర్ష
6) రమ్యక వర్ష 7) కింపురుష వర్ష 8 ) భద్రస్వ వర్ష


పూర్వం భరతవర్షంగా పిలవబడిన మన భారతదేశం ఈజిప్టు, ఆఫ్ఘనిస్తాన్, బలుచిస్తాన్, ఇరాన్, సుమేరియా, క్యాస్పియన్ సముద్రం(ఒకప్పుడు కష్యప సముద్రం) వరకు వ్యాపించి ఉండేది. ఈ భరతవర్షంలో ఉండే భరత ఖండం(ప్రస్తుతం కోట్ల మంది భారతీయులు నివసిస్తున్న దేశం) వైదిక సంస్కృతి/నాగరికత కు ఆత్మ వంటిది. పాశ్చాత్యులు సృష్టించిన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం అబద్ధం అనడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఆధారాలు ఉన్నాయి. మనల్ని తక్కువ చేయడానికి ఈ సిద్ధాంతాన్ని సృష్టించారు. ఈ సిద్ధాంతంలో చెప్పిన అన్నీ ప్రాంతాలు భరత వర్షంలో ఉన్నాయి. కాబట్టి ఆర్యులనే వారు ఎవరు దండయాత్ర చేయలేదు.


ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటంటే మన పూర్వీకులకు ప్రపంచ భూగోళ శాస్త్రం గురించి బాగా తెలుసు.


మనం గమనించాల్సింది ఇంకొకటి ఉంది. అప్పుడు చాలా వరకు దక్షిణ అమెరికా ఖండం, ఆఫ్రికా ఖండంలొ దక్షిణ భాగంలో సగం, మరియూ ఆస్ట్రేలియా మొత్తం నీటి కింద ఉండేవి. ఇంకొకవైపు ఇప్పుడు అట్లాంటిక్ మహా సముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం గా పిలవబడేవి సముద్ర మట్టానికి పైన ఉండేవి.

No automatic alt text available.

దీన్ని బట్టి నిరూపితమైనది ఏమిటంటే వైదిక సంస్కృతి కేవలం 5000 సంవత్సరాల క్రితమే పుట్టిందని, కురుక్షేత్రం కేవలం కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పేవారివి తప్పుడు ప్రచారాలు మరియు పచ్చి అబద్ధాలు. ఆస్ట్రేలియా నీటి కింద ఉన్నపుడే వైదిక నాగరికత ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనది ఎంత పురాతనమైన నాగరికత అని !