ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్ర గ్రహణం శుక్రవారం ఏర్పడనుంది. జులై 27 రాత్రి నుంచి జులై 28 వేకువజాము వరకు ఈ గ్రహణం కొనసాగనుంది. ఈ చంద్ర గ్రహణాన్ని భారత్‌లోనూ వీక్షించే వీలుంది. ఆ సమయంలో చంద్రుడు అరుణ వర్ణంలో కనువిందు చేయనున్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 11 గంటల 44 నిమిషాలకు గ్రహణం ప్రారంభం అవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఒంటి గంట సమయంలో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. దాదాపు 103 నిమిషాలపాటు సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. శనివారం వేకువ జామున 3.49 గంటల వరకు గ్రహణం కొనసాగుతుంది. 4.58 గంటలకు గ్రహణ ప్రభావం పూర్తిగా తొలుగుతుంది.
స్వస్తిశ్రీ విలంబి నామ సంవత్సరం ఆషాఢమాసం పూర్ణిమ రోజు 27 జూలై 2018 శుక్రవారంరోజు మకరరాశిలో ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలలో కేతుగ్రస్తంగా మేష,వృషభ,మిధున లగ్నాలలో చంద్రునికి తూర్పుభాగంలో గ్రహణం స్పర్శించి పిదప సంపూర్ణంగా చంద్ర గ్రహణం మనకు కనిపిస్తుంది.
భారతదేశ కాలమాన ప్రకారం సంపూర్ణ చంద్ర గ్రహణ సమయములు
చంద్ర గ్రహణ స్పర్శ : రాత్రి 11 గంటలు 54 నిమిషాలు
సంపూర్ణ స్థితికి గ్రహణం రాక : రాత్రి 01గంటలు 00 నిమిషాలు
చంద్ర గ్రహణ మధ్యకాలం : రాత్రి 01గంటలు 52 నిమిషాలు
సంపూర్ణ స్థితి నుండి విడుపు ప్రారంభం : రాత్రి 02 గంటలు 43 నిమిషాలు
చంద్ర గ్రహణ ముగింపు (మోక్షకాలం) : రాత్రి 03 గంటలు 49 నిమిషాలు
అద్యంత పుణ్యకాలం : 3 గంటల 55 నిమిషాలు ( మొత్తం 235 నిమిషాలు )
ఈ గ్రహణం భారత కాలమానానికి చూస్తే నిద్రించే సమయంలో ఉన్నది కనుక ఎక్కువ శాతం నిద్రలో ఉంటారు కాబట్టి చూడడానికి ఆసక్తి చూపరు.
ఈ చంద్ర గ్రహణానికి మరో విశిష్టత ఉంది. ఆ రోజు అంగారక గ్రహం భూమికి అత్యంత చేరువగా రానుంది. 2003 తర్వాత ఇంత దగ్గరగా వస్తుండటం ఇదే తొలిసారి. గతంలో సుదీర్ఘమైన చంద్ర గ్రహణం 1700 సంవత్సరాల కిందట వచ్చిందట. ఇప్పుడు మళ్లీ ఈ ఏడాదే ఎక్కువ సమయం పాటు చంద్ర గ్రహణం కొనసాగనుంది. గ్రహణం రోజున అంగారకుణ్ని వీక్షించే వీలుంది. చంద్ర గ్రహణాన్ని నేరుగా చూసినా ఇబ్బందేం ఉండదు.
ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి భయందోళన పడవలసిన అవసరం లేదు.లేని పోని
అనుమానలు పడవద్దు,అను మానాలు చెప్పే వారి మాటలను నమ్మవద్ధు.గర్భవతులు ఎవరైన
రాత్రి గ్రహణ సమయానికి మేలుకుని ఉంటే ప్రత్యక్షంగా చూడ కూడదు,కాని టివిలలో
చూడవచ్చు.
మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మీకు మరీ
మంచిది. గ్రహణ సమయంలో కదలకూడదు,మల,మూత్ర విసర్జన చేయకూడదు అనే అపోహలకు
బయపడకండి.మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రహణ సమయంలో కాలక్రుత్యాలు
చేసుకోవచ్చును.
గ్రహణ సమయానికి కనీసం 3 మూడు గంటల ముందుగా ప్రతి ఒక్కరు ఆహారం
స్వీకరించినచో,గ్రహణ ప్రారంభ సమయానికి తిన్న ఆహారం జీర్ణమగును. గ్రహణ పట్టు
,మధ్య , విడుపుస్నానాలు ఆచరించే వారు యాధావిధిగా స్నానం
ఆచరించి,మంత్రానుష్టానములను నిర్వహించుకొవచ్చును.
గ్రహణం మరసటి రోజు అనగా శనివారం నాడు ఇల్లు శుభ్రంగా తుడుచుకుని.స్నానం
చేసే నీళ్ళలో చిటికెడు పసుపు,రెండు హారతి కర్పూరం బిల్లలను చూర్ణం చేసుకుని
నీళ్ళలో వేసుకుని తప్పక అందరూ తల స్నానం చేసుకోవాలి.ఆ తర్వాత ఇంట్లో ఉన్న
పూజాగదిని శుభ్రపరచుకుని గాయత్రి ( జంజ్యం ) ని మార్చుకుని, దేవత
విగ్రహాలను,యంత్రాలను "పులికాపి" చేయాలి.
శుద్ధమైన నీళ్ళలో చిటికెడు పసుపు వేసి దేవుని విగ్రహాలు,యంత్రాలు ప్రోక్షణ
చేసి దీపారాధన అలంకరణం చేసి మహా నైవేద్యం కొరకు బెల్లంతో చేసిన మరమాన్నం
వండి దేవునికి నివేదన చేసి హారతి ఇచ్చి మనస్సును ప్రశాంతగా ఉంచుకుని మూడు
ప్రదక్షిణలు నిధానంగా చేసి మనస్సులో సమస్త గ్రహాదోశ నివారణ కలిగించమని
సాష్టాంగా నమస్కారం చేస్తూ విన్నవించుకోవాలి,ఆడవారు సాష్టాంగ నమస్కారం
ఎప్పుడు ,ఎక్కడ చేయకూడదు.ఆడవారు కేవలం మోకాళ్ల పైనే చేయాలి.ముఖ్యంగా
గర్భిణిలు నిలబడే నమస్కరించుకోవాలి,చాదస్తాలకు పోయి ఇబ్బంది పడకూడదు.
ఇంట్లో పూజ అయిన తర్వాతనే గుడికి,దైవ దర్శనాలకు వెళ్ళే వారు వెళ్ల
వచ్చును.మకరరాశి వారు తగు గ్రహాణ దోష పరిహార ప్రక్రియలను మీకు అనుకూలమైన
పండితులను సంప్రదించి దోష పరిహార జప,దానాదులను చేసుకోవాలి.ద్వాదశ రాశుల
వారు గోమాతకు బియ్యం,తోటకూర,బెల్లం కలిపి ఆవునకు తినిపించాలి.గోమాత మనం
పెట్టిన దాన్యం తినేప్పుడు మూడు ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు
తొలగిపోతాయి.ఈ విషయాలను శాస్త్రంపై నమ్మకం ఉన్నవారు ఆచరించండి.
నరదృష్టి కొరకు కట్టిన గుమ్మడి కాయ లేదా కొబ్బరి కాయలను గుమ్మంపై నుండి
తీసివేసి మళ్లి కొత్త వాటిని అనుభవజ్ఞులైన పండితులచే పూజించి
ఇంటికి,వ్యాపార సంస్థలకు కట్టుకోవాలి.గ్రహణం తర్వత మనం ఇంటి రక్షణ కోసం
కట్టిన గుమ్మడి,కొబ్బరి కాయలు శక్తి కోల్పోతాయి.నరదృష్టికి నాపరాయి కూడా
పగులుతుంది. కాబట్టి తిరిగి మనకు,మన కుంటుబ సభ్యుల కొరకు ,ఇంటికి,వ్యాపార
సంస్థల రక్షణ కొరకు తప్పక కట్టుకోవాలి.రోజు అగర్బత్తి,దూపం మొదలగునవి తప్పక
చూపించాలి.అందరు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు దర్భ కంకణాన్ని కట్టుకోవడం ఉత్తమం.
తిరుపతి వెంకన్న స్వామి ఆలయం జూలై 28 న ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయ
తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ,
కొలువు, పంచాంగశ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. కాగా ఉదయం
7.00 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది.
జూలై 27 తేదీ రోజు ఆర్జితసేవలు రద్దు చేయబడినవి.సంపూర్ణ చంద్ర గ్రహణం
కారణంగా జూలై 27వ తేదీ శుక్రవారం కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత
బ్రహ్మూత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను,పౌర్ణమి గరుడసేవను
చంద్రగ్రహణం కారణంగా టిటిడి రద్దు చేసింది. ఈ విషయాన్ని భక్తులు
గమనించగలరు.
ఇది ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాల్లో వస్తోన్న కేతుగ్రస్త చంద్ర గ్రహణం. గ్రహణం ముగిశాక స్నానం చేసి పూజాధికాలు, దానధర్మాలు చేయడం అందరికీ శుభం కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించుకోవాలి. మేష రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో పాదం, శ్రవణ, ధనిష్ఠ 1,2 పాదాలు, మకర రాశిలో జన్మించిన వారు ఈ గ్రహణాన్ని వీక్షించకపోవడం ఉత్తమం. 41 రోజుల్లోపు గ్రహణ జపం, శాంతి హోమం, దానం చేయించుకోవడం మంచిదని పండితులు సూచిస్తున్నారు.
మిథున, తుల, కుంభ రాశుల వారు ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాలి. గ్రహణం వీడిన 11 రోజుల్లోగా నవగ్రహ పూజ, శివుడికి అభిషేకం చేయించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలకు చెందిన గ్రహణానికి నాలుగు గంటల ముందే భోజనం చేయాలి. గ్రహణం విడిచిన తర్వాత స్నానం ఆచరించాలి. దీపారాధన చేసి భగవంతుణ్ని స్మరించాలి.
మేషం, సింహం, వృశ్చికం, మీన రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం అనుకూలంగా ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ధనయోగం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు గ్రహణ సమయంలో ఇష్టదైవాన్ని స్మరించాలి.
సుదీర్ఘ చంద్ర గ్రహణం.. ఈ ప్రాంతాల్లో స్పష్టంగా చూడొచ్చు!
మీరు కూడా ఆ అరుదైన సుదీర్ఘ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చు. ఇండియాలో జులై 27 (శుక్రవారం) రాత్రి సరిగ్గా 11.44 గంటలకు నుంచి చంద్ర గ్రహణం మొదలవుతుంది. సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడాలంటే అర్ధరాత్రి వరకు వేచి చూడాల్సిందే.
అర్ధరాత్రి 1.51 గంటలకు ఏర్పడే సంపూర్ణ చంద్ర గ్రహణం.. 2.43 గంటల వరకు కొనసాగుతుంది. అయితే, ఇండియాలో ఈ గ్రహణాన్ని స్పష్టంగా చూసేందుకు వీలున్నా.. కొన్ని ప్రాంతాల్లో దట్టమైన మేఘాల వల్ల ఆ అవకాశం దక్కకపోవచ్చు. ఢిల్లీ, పుణె, బెంగళూరు, ముంబయిలలో ఈ గ్రహణం స్పష్టంగా కనిపించనుంది.
మళ్లీ ఇలాంటి సుదీర్ఘ చంద్ర గ్రహణం 2123, జూన్ 9న ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏర్పడే గ్రహణాన్ని అస్సలు మిస్ కావద్దు. ఈ గ్రహణం దక్షిణ అమెరికా, తూర్పు ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియా దేశాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
చంద్రగ్రహణం ఎఫెక్ట్: ఏ రాశి వారిపై ఎలా? ఏం దానం చేస్తే ప్రయోజనకరం?
ఈ శతాబ్దిలోనే సుదీర్ఘమైన చంద్ర గ్రహణం శుక్రవారం రాబోతోంది. 103 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగనుంది. జనవరి 31న చంద్ర గ్రహణం రాగా.. ఈ ఏడాది ఇది రెండోది. గ్రహణం వేళ చంద్రుడు అరుణ వర్ణంలో మరింత పెద్దగా కనిపించనున్నాడు. ఈ కేతుగ్రస్త చంద్ర గ్రహణ ప్రభావం ఏ రాశులపై ఎలా ఉండనుంది? రాశులను బట్టి ఎలాంటి దానాలు చేయాలి? ఏయో జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
మేష రాశి:
చంద్ర గ్రహణం ప్రభావం మేషరాశిపై సానుకూలంగా ఉండనుంది. సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కాలం గడిచే కొద్దీ శుభ ఘడియలు రానున్నాయి. ఈ రాశివారు స్వీట్లు, ఎరుపు పుష్పాలు, ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయాలి. ఫలితంగా దోషాలు తొలగిపోయి, ప్రేమ బంధం మెరుగవుతుంది. పెళ్లిలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోతాయి.
వృషభం:
అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని అనిపిస్తే.. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలపండి. ఈ రాశివారు బియ్యం, పంచదార, పాలు, తెల్లటి పుష్పాలు దానం చేయాలి. వీరి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుబంధాలు బలపడతాయి.
మిథునం:
ఈ గ్రహణం మిథున రాశి వారికి అనుకూలం కాదు. దీంతో ఈ రాశి వారు వ్యక్తిగత సమస్యలతో సమతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్త వహించాలి. ఆకుపచ్చటి వస్త్రం, కూరగాయలు, ధాన్యాలు, చందనం దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, ఏకాగ్రత పెరిగి చదువుల్లో రాణిస్తారు.
కర్కాటకం:
ఈ చంద్ర గ్రహణం మీ జీవితంలో ప్రధాన మార్పులు తీసుకొస్తుంది. మీ జీవితంలోని ప్రతి అంశం మార్పునకు లోనవుతుంది. ఈ రాశివారు బియ్యం, వెండి పాత్రలు, పాల ఉత్పత్తులు దానం చేయాలి. దీని వల్ల వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. విదేశీ పర్యటనలకు ఆస్కారం ఉంటుంది.
సింహం:
ఈ రాశి వారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఎర్రటి వస్త్రాలు, సింధూరం, కొవ్వొత్తులు దానం చేయాలి. పేరు ప్రతిష్టలు, గుర్తింపు లభిస్తాయి.
కన్య:
గ్రహణం దశలో ప్రధాన రహస్యాలను ఎవరికీ చెప్పకుండా మీలోనే ఉంచుకోండి. ఇతరులకు చెబితే కోరి కష్టాలు తెచ్చుకున్న వారవుతారు. కూరగాయలు, పుస్తకాలు, రాగి, పువ్వులు, పెసర్లు, ఆహార ధాన్యాలు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల పనిలో విజయం, ఉన్నత చదువుల్లో సత్ఫలితాలు లభిస్తాయి.
తుల:
తులా రాశిలో జన్మించిన వారు గొడవలు, వివాదాలకు దూరంగా ఉండాలి. బియ్యం, పంచదార, గంధపు చెక్క దానం చేయాలి. ఫలితంగా ప్రేమ బంధం బలపడుతుంది, వివాదాలు సామరస్యంగా పరిష్కారం అవుతాయి.
వృశ్చిక:
ఈ గ్రహణం వల్ల మీరో శుభవార్త వింటారు. మీ టైం బాగుంటుంది. స్వీట్లు, ఎరుపు పుష్పాలు, ఊలు వస్త్రాలు దానం చేయాలి. జాతక దోషాలు తొలగి, కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరగడంతోపాటు క్రమశిక్షణ అలవడుతుంది.
ధనుస్సు:
మీ వృత్తిగత ఆకాంక్షలు, జనాల్లో గుర్తింపు నెరవరుతాయి. రొమాన్స్, సంపద పరంగా అనుకూలంగా ఉంటుంది. శనగ పప్పు, పసుపు, వంట సామాగ్రి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కెరీర్లో ప్రమోషన్, కాంపిటీటివ్ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి.
మకరం:
మెంటల్ టెన్షన్ పెరుగుతుంది. ధనం నష్టపోయే అవకాశాలున్నాయి. నూనె, నల్లటి వస్త్రాలు, ఐరన్, మినుములు దానం చేయాలి. ఇది ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. విజయాలు, ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది.
కుంభం:
ఈ రాశి వారు పైకి కనిపించని శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆహార ధాన్యాలు, పువ్వులు, బియ్యం, పప్పు, దుప్పట్లు దానం చేయాలి. ఇలా చేయడం వల్ల కోర్టు కేసుల్లో, శత్రువులపై విజయం సిద్ధిస్తుంది.
మీనం:
ఈ రాశి వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ఒకటి తొలగిపోతుంది. ధనం కలిసి వచ్చే అవకాశాలున్నాయి. పసుపు రంగు పూలు, పసుపు, వస్త్రాలు, టవల్ దానం చేయాలి. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు రావడానికి, మెరుగైన ర్యాంక్ రావడానికి తోడ్పడుతుంది.
ప్రత్యక్షంగా శివాభిషేకం, నవగ్రహపూజచేసుకోలేనివారు తమతమ పేర్లమీద ఆయా పూజలు చేయించుకోడానికి శ్రీ విధాత పీటం , ph.- 9000123129 లో సంప్రదించగలరు. పూజలో ఉంచిన దర్భ కంకణం కూడా పొందగలరు.
శుభం
శ్రీ విధాత పీటం
9000123129