Friday, 2 April 2021

ఏప్రిల్ మాసంలో 6 గ్రహాల స్థానచలనం.. 6 రాశుల వారికి సానుకూల ఫలితాలు

 



ఏప్రిల్లో 6 గ్రహాలు తమ రాశిస్థానాన్ని మార్చుకోనున్నాయి. గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు, గ్రహాలకు సేనాధిపతి అయిన అంగారకుడు మిథునంలోకి ప్రవేశించనున్నారు. ఇవికాకుండా ఏప్రిల్లో అతిపెద్ద మార్పు గురుడి స్థానచలనం. ఈ నేపథ్యంలో 6 రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది.


జ్యోతిషశాస్త్రం ప్రకారం 2021 ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకమైందిగా పరిగణిస్తున్నారు. ఈ నెల ప్రారంభంలోనే బుధుడు రాశి పరివర్తనం చెందుతున్నాడు. అయితే బుధుడు మాత్రమే కాకుండా ఈ మాసంలో మొత్తం 6 గ్రహాలు తమ రాశిస్థానాన్ని మార్చుకోనున్నాయి. గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు, గ్రహాలకు సేనాధిపతి అయిన అంగారకుడు మిథునంలోకి ప్రవేశించనున్నారు. ఇవికాకుండా ఏప్రిల్లో అతిపెద్ద మార్పు గురుడి స్థానచలనం. శుక్రుడు కూడా ఈ మాసంలో మేషంలో సంచరించనున్నాడు. ఈ గ్రహాల మార్పు కారణంగా రాశిచక్రంపై ప్రభావం పడుతుంది. కొన్ని రాశులపై సానుకూలం ప్రభావం పడితే.. మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ మాసంలో 6 గ్రహాల రాశిపరివర్తనం కారణంగా అనుకూలం ప్రభావముంటే రాశులెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

​వృషభం..

ఏప్రిల్ మాసంలో వృషభ రాశి ప్రజలకు సానుకూల ఫలితాలుంటాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రకమైన గ్రహమార్పులు వీరి జీవితంలో ప్రతిరంగంలోనూ విజయంవంతం చేస్తాయి. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. మీ సంపద కూడా పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపార ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మీరు ఉద్యోగ మార్పు గురించి ఆలోచన చేస్తుంటే నిర్ణయం తీసుకోవడానికి ఇదే సరైన సమయం. ఈ సమయంలో చేసిన ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయి. వ్యాపార పర్యటనలు లేదా కుటుంబంతో కలిసి యాత్రలు చేయాలనుకుంటే మీకు శుభఫలితాలు అందుతాయి.

​మిథునం..

బుధుడు ఈ రాశి ఆగమనం చెందుతున్న కారణంగా వీరికి ప్రత్యేక ప్రయోజనాలుంటాయి. ఏప్రిల్ ఆరు నుంచి గురుడు అదృష్ట పాదంలోకి రావడం వల్ల వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యక్రమాల గురించి చర్చ ఉంటుంది. అంతేకాకుండా అది ఈ సమయంలో ధ్రువీకరించబడుతుంది. ఇంట్లో ఆనందం ఉంటుంది. మీకు ఈ సమయంలో పనిప్రదేశంలో ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో లాభం ఉంటుంది. పెట్టుబడుల్లో ప్రయోజనాలు అందుకుంటారు. ఉద్యోగస్తులు పదోన్నతులు సాధిస్తారు.

​తుల..

జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏప్రిల్ మాసంలో గ్రహాల మార్పులు వల్ల తులా రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాలతో శుభఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. కుటుంబంలో మీ బాధ్యత పెరిగింది. బంధువుల నుంచి మీకు అన్ని రకాల మద్ధతు లభిస్తుంది. మీరు పూర్తిగా అంకితభావం, సామర్థ్యంతో ఆగిపోయిన పనులు పూర్తి చేస్తారు. డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది. శుభకరమైన ఖర్చులు ఉంటాయి. సంతానానికి సంబంధించి బాధ్యతలను కూడా బాగా నిర్వహిస్తారు.

​ధనస్సు..

సూర్యుడు రాశి అయిన ధనస్సు ప్రజలకు ఈ సమయంలో ప్రత్యేక ఫలితాలు ఉంటాయి. మీ సంపద పెరుగడం వల్ల ప్రయోజనం పొందుతారు. అంతేకాకుండా కొన్ని శుభవార్తలు అందుకుంటారు. సమాజంలో మీ ప్రభావం పెరుగుతుంది. నూతన ప్రణాళికలు ప్రారంభించుకుంటారు. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేసుకుంటారు. గ్రహాల శుభప్రభావం వల్ల ధనస్సు రాశి వారితి అనుకూలంగా ఉంటుంది. మీరు సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు.

​కుంభం..

గ్రహాల మార్పుల వల్ల కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలున్నాయి. ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా వ్యాపారం నుంచి లబ్ది పొందుతారు. నూతన పని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తారు. వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో లాభదాయకమైన ఒప్పందం కుదుర్చుకుంటారు. మీరు పెట్టుబడిలో లాభం పొందాలని భావిస్తే అందులో విజయం సాధించవచ్చు. అంతేకాకుండా జీవితంలో నూతన అవకాశాలు సిద్ధిస్తాయి.

​మీనం..

గ్రహాల రాజు అయిన మీన రాశి ప్రజలు ధనవంతులు అవుతారు. అంతేకాకుండా మీకు అదృష్టం కలిసి వస్తుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. మీ ధైర్యం, విశ్వాసంతో పనిలో పురోగతి సాధిస్తారు. మీ అధికార పరిధి కూడా పెరుగుతుంది. పనిప్రదేశంలో మీ ప్రభావం పెరుగుతుంది. చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాల్లో అన్ని రకాల ప్రజల నుంచి మద్దతు ఉంటుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు చేరడానికి అవకాశం లభిస్తుంది.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371

No comments:

Post a Comment