Sunday 29 April 2018

బుద్ద పౌర్ణిమ




బుద్ద పౌర్ణిమ లేదా బుద్ధ జయంతి అనేది బుద్ధుడి జయంతిని సూచించే పర్వదినం. దీన్ని సర్వసాధారణంగా వైశాఖ పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఇది హిందూ కేలండర్ ప్రకారం ఏప్రిల్ లేదా మేనెల మొదట్లో వస్తుంటుంది. బుద్ద పూర్ణిమ బౌద్ధులకు ముఖ్యమైన పర్వదినం. బుద్ధుడు క్రీస్తు పూర్వం 560లో జన్మించి 80 ఏళ్ల వయసులో క్రీస్తుపూర్వ 480లో పరమపదించాడు. తన మరణానంతరం భారత ఉపఖండంలో బౌద్ధమతం బహుళ ప్రజాదరణ పొంది విదేశాల్లో కూడా పలుకుబడి సంపాదించుకుంది. బుద్ధ పౌర్ణమి రోజున బుద్ధుడు జీవితానికి సంబంధించి పంచసూత్రాలను, సత్యానికి సంబంధించిన అష్టాంగ మార్గాలను బోధించిన అనంతరం జ్ఞానోదయం పొందాడు. బుద్ధుడు సరిగ్గా తన జన్మదినం రోజే నిర్వాణం పొందాడు. లేదా ప్రపంచాన్ని వదలి వెళ్లిపోయాడు.

ఈ విధంగా బుద్ధ జయంతి గౌతమబుద్ధుడి జీవితంలోని మూడు కీలకమైన ఘటనలను వర్ణిస్తుంది. ప్రపంచం నలుమూలలనుంచి బౌధ్దులు బుద్ధ జయంతిరోజు భారత్ లోని బోధ్ గయకు వచ్చి బుద్ధ పౌర్ణమి సంబరాల్లో పాలు పంచుకుంటారు. ఈ సందర్భంగా వారు బుద్ధ చిత్రాలను చిత్రిస్తారు. సామూహిక ధ్యానంలో పాల్గొంటారు. బౌధ్ద విగ్రహానికి పూజలు చేస్తారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వైశాఖ పూర్ణిమ లేదా బుద్ధ పూర్ణిమను నేపాల్, సింగపూర్, వియత్నా, థాయ్‌లాండ్, కాంబోడియా, మలేసియా, శ్రీలంక, మయన్మార్, ఇండోనేషియా, పాకిస్తాన్, భారత్ వంటి దక్షిణాసియాల ఆగ్నేయాసియా దేశాల్లోని బౌద్ధులు జరుపుకుంటారు. పేరుకు ఇది బుద్ధ జయంతి అని పిలువబడినప్పటికీ బుద్ధుడు జన్మించింది, జ్ఞానోదయం పొందిందీ, నిర్వాణం పొందిందీ ఒకే రోజున కావడంతో ఇది విశేషంగా గుర్తింపు పొందింది. మహాయాన బౌద్ధ సంప్రదాయాల ప్రకారం ఈ పర్వదినాన్ని వైశాఖ పర్వదినంగా పిలుస్తుంటారు. భారత్‌లో దీన్ని మే 9న బుద్ధ జయంతి లేదా బుద్ధ పూర్ణిమ పేరుతో పిలుస్తుంటారు. నెలలో పౌర్ణమి రోజున జరుపుకుంటూ ఉండటంతో దీనికి బుద్ధ పూర్ణిమ అని కూడా పేరు పడింది.

వైశాఖపూర్ణిమ



వైశాఖపూర్ణిమను మహా వైశాఖి అని అంటారు. ఈ రోజున సముద్ర స్నానం చెయ్యాలని శాస్త్ర వచనం. స్నానతరం విష్ణుమూర్తికి తులసీ దళాలతో పూజలు చేసి,అశ్వత్థవృక్షానికి ప్రదక్షిణాలు చేసి నమస్కరించాలి. ఈ రోజున చేసే దానాలు వలన అనంత ఫలితాలను పొందుతాము అని ప్రతీతి. ఈ రోజున భ్రమాండపురాణం దానం చేస్తే బ్రహ్మలోకప్రాప్తి అని పెద్దలు అంటారు. ఈ వైశాఖ పూర్ణిమనాడే సుభ్రమణ్యజననం అని కూడా కొందరి విశ్వాసం . అలాగే వైశాఖ పౌర్ణమి నాడే శివుడు శరభ రూపాన్ని ధరించాడు అని అంటారు.

తాళ్ళపాక అన్నమాచార్యులు



అన్నమయ్య లేదా తాళ్ళపాక అన్నమాచార్యులు (మే 9, 1408 - ఫిబ్రవరి 23, 1503),వైశాఖ మాసం పౌర్ణమి రోజున ఆయన జన్మించారు. తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు . అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉన్నది. దక్షిణాపథంలో భజన సాంప్రదాయానికి, పదకవితాశైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ని, అహోబిలము లోని నరసింహ స్వామి ని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32వేలకు పైగా కీర్తనలు రచించాడు . అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, సంగీతం, శృంగారం, భావలాలిత్యం పెనవేసికొని ఉంటాయి.
కన్నడ వాగ్గేయకారుడు పురందరదాసు అన్నమయ్యను శ్రీనివాసుని అవతారంగా ప్రశంసించాడంటారు. (సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది. ). త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంకీర్తనాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమై పోయినాయి; జనాల నోళ్ళలో నాటుకొని పోయినాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ళ పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు - ఇలా మొత్తము ముప్పై రెండు వేల పాటలు వ్రాసాడు. అన్నమయ్య మనుమడు తాళ్ళపాక చిన్నన్న అన్నమాచార్య చరితము అన్న ద్విపద కావ్యములో అన్నమయ్య జీవిత విశేషాలను పొందుపరచాడు. ఈ గ్రంథం 1948లో లభ్యమై ముద్రింపబడింది.

అన్నమయ్య జీవితం గురించి మనకు తెలిసిన వివరాలకు ఈ రచనే మౌలికాధారం.
నందవరీకులు క్రీ.శ. 10వ శతాబ్ధంలో కాశినుండి ఆంధ్ర దేశానికి వలస వచ్చిన శుద్దవైదిక బ్రాహ్మణులని పరంపరాయాత ప్రతీత.
నేటి కర్నూలు జిల్లాలోని "నందవరం" అనే గ్రామాన్ని నందుడనే రాజు పాలించేవాడు. ఈ రాజు కాశియాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరీ ఉపాసకులు పరిచయం అయ్యారని, ఆ సమయంలో వారణాసిలో క్షామం రాగా ఆ బ్రహ్మణ కుటుంబాలు కొన్ని ఆంధ్రదేశానికి వలసివచ్చి నంద రాజు ఆశ్రయంలో స్ధిరపడ్డారనీ, నందరాజుచే తీసుకొని రాబడిన వైదికిలు కావడంచే నందవైదికులుగా ప్రచారం పొందారని జనవాక్యం. కాలక్రమాన వీరు నేటి కర్నూలు, కడప జిల్లాలో స్ధిరపడ్డారని పరిశోధకులు అభిప్రాయం.

తాళ్ళపాక గ్రామ నామం అన్నమయ్య వంశస్ధులకు ఇంటిపేరుగా నిలిచినది. అన్నమయ్య కూడా నందవరీకుడే. ద్విపద కావ్యం ప్రకారం అన్నమయ్య తాత నారాయణయ్య. చదువు అబ్బక, గురువులు పెట్టే హింసలు భరించలేక నారాయణయ్య చనిపోవాలని అనుకొన్నాడట. వూరిలో గ్రామ దేవత చింతలమ్మ గుడివద్ద విషసర్పం పుట్టలో చేయి పెట్టాడట. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై అతని వంశంలో మూడవతరంలో హరి అంశతో ఒకబాలుడు జన్మిస్తాడని చెప్పింది అని ప్రతీతి. కడప జిల్లా రాజంపేట తాలూకా పొత్తిపి నాడు మండలం నడిబొద్దున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది.
ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశవస్వామి, సిద్ధేశ్వరస్వామి కరుణాకటాక్షములతో ఆ గ్రామజనులు సుఖవంతులై జీవనం సాగించేవారు. ఇచ్చట చెన్నకేశవస్వామి విగ్రహాన్ని ప్రతిష్ట చెసాడు. సస్యశ్యామలమై విరాజిల్లే ఈ గ్రామం సన్మునులకు, అఖిల దేవతలకు నిజవాసమై వుండేదని అంటారు స్థలగ్యులు.ఈ చెన్నకేశవస్వామిని దేవతలు, ఋషులు, సిద్దులు ప్రతి రోజు పూజిస్తారు. ఈ చెన్నకేశవస్వామి గుడిని ఆశ్రయించుకొని కొన్ని బ్రాహ్మణ కుటుంబాలు జీవించేవి. ఆ గ్రామ వాసులు తలపక ఇందిరారమణపదైక మానసులుగా జీవనం సాగించేవారు. వాళ్లల్లొ నారాయణయ్య చాల ప్రసిద్దుడు. ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య వుండేవాడు. అన్నమయ్య పిత్రు పితామహులు నారాయణయ్య, విఠలయ్యలు విష్నుభక్తిరతులై తాళ్ళపాక చెన్న కేశవస్వామిని సేవించుకొంటు జేవితం గడిపేవారు.

ఈ నారాయణయ్య కథ తోనే మన అన్నమయ్య కథ మొదలౌతుంది. నారాయణయ్యకు చిన్నతనంలో ఎంతకీ చదువు రాలేదు. తండ్రి విఠలయ్య నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. తన వద్ద ప్రయోజనం లేదని ప్రక్కనే వున్న ఊటుకూరులో తన బంధువుల వద్ద వుంచాడు. ఊటుకూరు నేడు కడపజిల్ల రాజంపేట తాలూకాలో ఉన్నది. అక్కడ బళ్ళో ఉపాధ్యాయులు శతవిధాల ప్రయత్నించారు. గురువులు నారాయణయ్యను చతుర్విధ ఉపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువుపట్ల శ్రద్ధకలుగలేదు. నారాయుణిని కళ్లల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి పలకలేదు. వాళ్లు విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురిచెశరు. చివరకు గురువు నారాయణయ్యను కోదండమున వ్రేలాడదీశారు. కోలగగ్గెర విధించారు. గుంజిళ్లు తీయించారు. కోదండం అంటే దూలానికి తాడు కట్టి వ్రేలాడతీయడం. నారాయాణయ్యను అయ్యవార్లు ఇంతటి కఠిన పరీక్షలకు గురిచెసినప్పటికి నారాయణయ్య లేత మనస్సు గాయపడింది.
నలుగురూ అవహేళన చేస్తున్నారు. సిగ్గుతో, అవమానంతో క్రుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను కున్నాడు. నారాయాణయ్య ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతలమ్మగుడి సమీపాన పుట్టలో పాముందని ఎవరో చెబుతుండగా విన్నాడు. నారాయాణుడు ఒంటరిగ గుడి చేరి పుట్టలో చేయి పెట్టాడు. పాము కరవలేదు సరికదా ! నారాయాణయ్యకు త్రికాల వేదినియైన చింతలమ్మ ప్రత్యక్షమైంది.

నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది."ఎందుకు బాబు ఈ అఘ్హాయిత్యం. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు,తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు" అని నారాయాణయ్యను అనుగ్రహించి అంతర్ధానమైనది. అమ్మవారి ఆదేశం ప్రకారం నారాయాణయ్య తాళ్ళపాకచేరి ఆశ్రితక్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహించే వేదవేదాంగ పారంగతుడై సకలవిద్యలు పొందగలుగుతాడు. సర్వజ్ఞుడని కీర్తి పొందుతాడు. ఈ నారాయాణయ్య కుమారుడే నారాయణసూరి.
అన్నమయ్య తండ్రి అయిన నారాయణసూరి గొప్ప కవి, పండితుడు, సకల విద్యాధురంధరుడుగా ప్రసిద్దికెక్కినవాడు. అన్నమయ్య తండ్రి పేరు ’నారాయణసూరి’ గా చిన్నన్న పేర్కొనడాన్నిబట్టి తాళ్ళపాకవారు అన్నమయ్య జననానికి ముందే పండిత వంశస్ధులుగా కీర్తించబడేవారని భావించవచ్చును. నారాయణసూరి ధర్మపత్ని లక్కమాంబ, మహా భక్తురాలు. చెన్నకేశవస్వామి ఈమెతో ప్రత్యక్షంగా మాట్లాడేవాడట. భాగవతసేవా పరాయణులైన నారాయణసూరి, లక్కమాంబ లకు సంతానం లేకపోవడం తీవ్రవ్యధకు గురిఅయినారు. ఈ పుణ్య దంపతులు సంతానం కోసం చేయని వ్రతం లేదు, కొలవని దేవుడు లేడు.
"మాకు మంచి కొడుకును ప్రసాదించు స్వామీ" అని ఏడుకొండలస్వామికి మ్రొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు చూసి ఇద్దరూ వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం ప్రయాణమయ్యారు. లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి మందిరం ప్రవేశించారు. గరుడగంభం వద్ద సాగిలి మ్రొక్కారు. వాళ్ళకేదో మైకం కమ్మినట్లైంది. కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు కనిపించి ధగధగ మెరిసే ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అద్రుశ్యమైంది. వేంకటేశ్వరస్వామి తన నిజ ఖడ్గమైన నందకాన్ని ఆ పుణ్య దంపతులకు ప్రసాదించాడు. వాళ్ళు పరమానంద భరితులయ్యారు. వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంతోషంతో తాళ్లపాకకు తిరిగి వచ్చారు.
ఆ దంపతులు తిరుమల తిరుపతిని దర్శించుకొని, ధ్వజస్తంభం ఎదురుగా సాష్టాంగ ప్రమాణం ఆచరించినపుడు ఒక దివ్యమైన కాంతి లక్కమాంబ గర్భంలో ప్రవేశించిందని గాధ. కొండలయ్య తాను ధరించే "బిరుదు గజ్జియల ముప్పిడి కఠారాన్ని" వారికందజేశాడట. అలా పుట్టిన శిశువే అన్నమయ్య. లక్కమాంబ గర్భవతి అయింది. వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో ఒక శుభలగ్నంలో మూడు గ్రహాలు ఉన్నత దశలో వుండగా నారాయణసూరి, లక్కమాంబలకు నందకాంశమున పుత్రోదయమైనది, మగశిశువు ఉదయించాడు. సర్వధారి సంవత్సరం వైశాఖ శుద్ధ పూర్ణిమ నాడు కడప జిల్లా లోని రాజంపేట మండలం తాళ్ళపాక గ్రామములో అన్నమయ్య జన్మించాడు.
8వ యేట అన్నమయ్యకు ఆయన గురువు ఘనవిష్ణు దీక్షనొసగినపుడు అన్నమాచార్య నామం స్థిరపడింది. నారాయణసూరి ఆ శిశువునకు ఆగమోక్తంగా జాతకర్మ చేశాడు. "అన్నం బ్రహ్మేతి వ్యజనాత్" అనే శ్రుతి ప్రకారం నారాయణసూరి పరబ్రహ్మ వాచకంగా తన పుత్రునకు అన్నమయ్య అని నామకరణం చేశాడు. అన్నమయ్యకు అన్నమయ్యంగారు, అన్నమాచార్యులు, అన్నయగురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యంగారు అనే నామాంతరాలు తాళ్ళపాక సాహిత్యంలోను, శాసనాల్లోను కనిపిస్తాయి. శ్రీమహావిష్ణువు వక్షస్ధలమందలి కౌస్తుభమే శఠకోపయతిగా, వేంకటేశ్వరస్వామి గుడి ఘంట వేదాంతదేశికులుగా స్వామి హస్తమందలి నందకమనే ఖడ్గాంశలో పేయాళ్వారులు, అన్నమయ్యలు అవతరించారని ప్రాజ్గ్యుల విశ్వాసం.



............
....................
ఒక చిన్న మనవి : మనలో చాలామందికి పురాణ, ఇతిహాసాలు తెలియవు, శాస్త్రాలలో
చెప్పిన ధర్మ మార్గాలు తెలియవు, మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియవు, మన
పండుగల విశిష్టత తెలియదు, అందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ నేర్చుకుని,
ఆచరించడానికి వయోపరిమితి లేదు, తెలుసుకోవాలన్న తృష్ణ, జిజ్ఞాస ఉంటే చాలు,
అందుకే ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, మన భావితరాల వారికైనా
ఇవన్నీ తెలిసేలా బాధ్యత మనదే, ఏదీ ఆలస్యం కాదు, నేనూ ఇప్పుడే ఎన్నో
తెలుసుకుంటున్నాను , నేర్చుకుంటున్నాను, ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను,
అలానే అందరూ తెలుసుకుని, ఆచరిస్తారనే ఆశిస్తున్నాను
" శ్రీ విధాత పీఠం " ఫేస్బుక్ పేజీ ద్వారా మేము పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్లు
కూడా పరిశీలించండి, వాటిలో మీకు కొన్నైనా ఉపయోగపడితే మా శ్రమకు ఫలితం
కలిగుతుందని మా ఆశ. అందరికీ ఆధ్యాత్మిక విషయాలు తెలియజేయాలన్నదే
" శ్రీ విధాత పీఠం" ఫేస్ బుక్ పేజీ ద్వారా మా ప్రయత్నం.మీరు తెలుసుకోండి ,
మీకు తెలిసిన వారికి తెలియజేయండి , అందరికీ తెలిసేందుకు దయచేసి షేర్
చేయండి
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల
పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,
ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం,
విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట,
గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల
కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
facebook group :
(20+) Vidhatha Astro Numerology | Facebook
YouTube
Printerest
Twitter
Instagram
Blog
whatsapp group
Follow this link to join my WhatsApp group:
టెలిగ్రామ్
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
........

కూర్మరూపం







శ్రీ మహావిష్ణువు ధరించిన ద్వితియ అవతారం - శ్రీ కూర్మ అవతారం ! ఈ రోజునే శ్రీ కూర్మవతార జయంతి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం,వైష్ణవాలయాలను దర్శించడం తో పాటు విష్ణు సహస్రపారాయణం చేయాలి.
ఒకసారి దుర్వాస మహర్షి ఇంద్రునికి ఒక పూలమాలని స్నేహపూర్వకంగా ఇస్తాడు. సహజంగానే గర్వము, అహంకారము ఉన్న ఇంద్రుడు ఆ మాలని వాహనమైన ఐరావతం కి వేసాడు. గజరాజు ఆ మాలని తన కాలిక్రింద వేసి తొక్కడంతో కోపోద్రేకుడైన మహర్షి, " దేవతల వద్దనున్న సిరిసంపదలు నశిస్తాయి " అని శాపం ఇస్తాడు. దేవతలందరు కలిసి విష్ణుదేవుని వద్ద మొరపెట్టుకోగా, మహావిష్ణువు ఇలా సెలవిచ్చాడు " సముద్ర మదనం చేస్తే వచ్చిన నిధితో దేవలోకానికి ఎటువంటి కొరత ఉండదు. పైగా సాగర మదనం ద్వార వచ్చే అమృతంతో దేవతలు చిరంజీవులుగా, శక్తిమంతులుగా ఉంటారు, ఆ మదనానికి అసురుల సహాయం కోరండి" అని దేవేంద్రునితో చెప్తాడు. అమృతాన్ని అసురులకు కూడా పంచుతాము అని, అసురులకు చెప్పడం ద్వార, వారి సహాయంతో సాగరమదనానికి పూనుకొన్నారు.
మందరపర్వతాన్ని కవ్వంగా, వాసుకి ని తాడుగా చేసుకొని, వాసుకి తలవైపు సురులు, వెనుకవైపు అసురులు పట్టుకొని సాగరమదనం చేసారు. ఆ మహా పర్వతానికి ఆలంబనగా ఉండటానికి ఏదైన తక్కువే, అంతటి భారాన్ని మోయడానికి సాక్షాత్తు ఆ శ్రీమహా విష్ణువే కూర్మరూపం దాల్చి ఆలంబనగా నిలిచాడు. మదనంలో మొదటగా హలాహలం, లక్ష్మీ దేవి, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతము చివరకు అమృతము వచ్చాయి. మోహినీ అవతారంలో అమృతాన్ని అసురల బారినపడకుండా సురులుకి పంచుతాడు మాహావిష్ణువు.

ఏప్రిల్ 29, 2018 పంచాంగం




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 29, 2018
ఆదివారం (భానువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
వైశాఖమాసం శుక్లపక్షం
తిధి :చతుర్ధశి ఉ5.57
తదుపరి పౌర్ణమి
నక్షత్రం : చిత్త మ1.42
తదుపరి స్వాతి
యోగం : వజ్రం ఉ11.15
తదుపరి సిద్ధి
కరణం :వణిజ ఉ5.57
తదుపరి భద్ర/విష్ఠి సా5.49
సూర్యరాశి : మేషం
చంద్రరాశి : తుల
సూర్యోదయం : 5.41
సూర్యాస్తమయం : 6.15
రాహుకాలం :సా4.30 -6.00
యమగండం/
కేతుకాలం : మ12.00 - 1.30
వర్జ్యం : రా7.26 - 9.05
దుర్ముహూర్తం:సా4.34 -5.25
అమృతకాలం:ఉ7.17 -8.53 & తె5.16నుండి
శ్రీ కూర్మ జయంతి
అన్నమాచార్య జయంతి

వ్యాస పౌర్ణమి 
BUDDA POORNIMA
శుభమస్తు

శ్రీవేంకటేశధ్యానమ్ ( వేదవ్యాసకృతం)


వేదవ్యాసధ్యానమ్
శ్రీవేంకటేశమనువాసరమిన్దిరేశం
దుగ్ధాన్నపూర్ణమధుశర్కరగోఘృతాఢ్యమ్ ।
రమ్భాఫలేన సహ షడ్ సయుక్తదివ్య 
రాజాన్నసూపమమృతం స్మరతాం కరస్థమ్ ॥ ౧॥

సంపూర్ణవృష్టిమిహ వర్షయ కాలమేఘైః
దుర్భిక్షకాలరహితం కురు వేంకటేశ ।
కారుణ్యజీవననిధిర్జగతాం త్వమద్య
త్వామేవ నౌమి సతతం వరద ప్రసీద ॥ ౨॥

తిష్ఠన్ స్వామిసరోవరస్థలవరే శ్రీవేంకటేశ స్మయన్
లక్ష్మ్యాఽలఙ్కృతబాహుమధ్యవిలసత్సర్వాఙ్గభూషోజ్జ్వలః ।
వైకుణ్ఠాద్రిరసౌ సమస్తజగతామిత్యేవ సన్దర్శయన్
విశ్వాలిఙ్గనభాగ్యవాన్ విజయతే బ్రహ్మేన్ద్రరుద్రేశ్వరః ॥ ౩॥

వేదవ్యాసకృతం ధ్యానం నిద్రాన్తే స్మరతామిదమ్ ।
సర్వారోగ్యం చ భోగశ్చ నరాణాం తత్పదం భవేత్ ॥ 
 ॥ ఇతి వేదవ్యాసధ్యానమ్॥

శ్రీగణేశాష్టకమ్ ( వ్యాసవిరచితం)




         శ్రీగణేశాయ నమః ।
గణపతి-పరివారం చారుకేయూరహారం
        గిరిధరవరసారం యోగినీచక్రచారమ్ ।
భవ-భయ-పరిహారం దుఃఖ-దారిద్రయ-దూరం
        గణపతిమభివన్దే వక్రతుణ్డావతారమ్ ॥ ౧॥

అఖిలమలవినాశం పాణినా ధ్వస్తపాశం  var  హస్తపాశం 
        కనకగిరినికాశం సూర్యకోటిప్రకాశమ్ ।
భవభవగిరినాశం మాలతీతీరవాసం
        గణపతిమభివన్దే మానసే రాజహంసమ్ ॥ ౨॥

వివిధ-మణి-మయూఖైః శోభమానం విదూరైః
        కనక-రచిత-చిత్రం కణ్ఠదేశేవిచిత్రం ।
దధతి విమలహారం సర్వదా యత్నసారం
        గణపతిమభివన్దే వక్రతుణ్డావతారమ్ ॥ ౩॥

దురితగజమమన్దం వారణీం చైవ వేదం
        విదితమఖిలనాదం నృత్యమానన్దకన్దమ్ ।
దధతి శశిసువక్త్రం చాఽఙ్కుశం యో విశేషం
        గణపతిమభివన్దే సర్వదాఽఽనన్దకన్దమ్ ॥ ౪॥

త్రినయనయుతభాలే శోభమానే విశాలే
        ముకుట-మణి-సుఢాలే మౌక్తికానాం చ జాలే ।
ధవలకుసుమమాలే యస్య శీర్ష్ణః సతాలే
        గణపతిమభివన్దే సర్వదా చక్రపాణిమ్ ॥ ౫॥

వపుషి మహతి రూపం పీఠమాదౌ సుదీపం
        తదుపరి రసకోణం యస్య చోర్ధ్వం త్రికోణమ్ ।
గజమితదలపద్మం సంస్థితం చారుఛద్మం
        గణపతిమభివన్దే కల్పవృక్షస్య వృన్దే ॥ ౬॥

వరదవిశదశస్తం దక్షిణం యస్య హస్తం
        సదయమభయదం తం చిన్తయే చిత్తసంస్థమ్ ।
శబలకుటిలశుణ్డం చైకతుణ్డం ద్వితుణ్డం
        గణపతిమభివన్దే సర్వదా వక్రతుణ్డమ్ ॥ ౭॥

కల్పద్రుమాధఃస్థిత-కామధేనుం
        చిన్తామణిం దక్షిణపాణిశుణ్డమ్ ।
బిభ్రాణమత్యద్భుతచిత్తరూపం యః
        పూజయేత్ తస్య సమస్తసిద్ధిః ॥ ౮॥

వ్యాసాష్టకమిదం పుణ్యం గణేశస్తవనం నృణామ్ ।
పఠతాం దుఃఖనాశాయ విద్యాం సంశ్రియమశ్నుతే ॥ ౯॥

॥ ఇతి శ్రీపద్మపురాణే ఉత్తరఖణ్డే వ్యాసవిరచితం గణేశాష్టకం సమ్పూర్ణమ్ ॥

Friday 13 April 2018

ఏప్రిల్ 14, 2018 పంచాంగం




ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 14, 2018
శనివారం (స్థిరవాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి :త్రయోదశి ఉ7.49
తదుపరి చతుర్దశి
నక్షత్రం :ఉత్తరాభాద్ర తె3.42
యోగం : ఐంద్రం రా2.27
కరణం : వణిజ ఉ7.49
తదుపరి భద్ర/విష్ఠి రా7.51
సూర్యరాశి : మీనం
చంద్రరాశి :కుంభం
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం :ఉ9.00 -10.30
యమగండం:మ1.30 -3.00
వర్జ్యం : మ12.49 - 2.28
దుర్ముహూర్తం:ఉ5.49 -7.28
అమృతకాలం:రా10.44 - 12.23
శని త్రయోదశి
మాసశివరాత్రి
తమిళ సంవత్సరాది
మేష సంక్రమణం
శుభమస్తు

Thursday 12 April 2018

తామరమాల,పద్మ మాల లక్ష్మీదేవి అనుగ్రహా మాల

No automatic alt text available.

కలియుగంలో అత్యంత శీఘ్రంగా అనుగ్రహాన్నిచ్చేవి దశమహావిద్యలు. ఈ దేవతల మూలమంత్రాలను జపహోమ విధానం ద్వారా ఉపాసిస్తే సాధకులు తమ కామ్యాల్ని సులభంగా పొందగలరు.
దశమహావిద్యలలో పదవ మహావిద్య శ్రీ కమలాత్మికా దేవి కమలాత్మిక అంటే లక్ష్మీస్వరూపిణి అని అర్థం. సకలైశ్వర్య ప్రదాయిని, శాంత స్వరూపిణి అయిన ఈ మహావిద్యని ఉపాసిస్తే సకలవిధ సంపదల్ని, పుత్రపౌత్రాభివృద్ధిని, సుఖసంతోషాల్ని సాధకుడికి శ్రీ కమలాత్మికాదేవి ప్రసాదిస్తుంది.
No automatic alt text available.
మహాలక్ష్మిని కమలవాసిని అనికూడా అంటారు.
వెంకటేశ్వర మహాత్మ్యం కథ (తిరుమల క్షేత్రం స్థలపురాణం) ప్రకారం వైకుంఠంలో భృగుమహర్షి చర్యవలన కోపించి లక్ష్మీదేవి వైకుంఠం విడచి పాతాళానికి వెళ్ళింది. లక్ష్మీవియోగం వలన ఖిన్నుడైన స్వామి భూలోకంలో తపస్సు చేశాడు. శ్రీమన్నారాయణుడు శుకాశ్రామాన్ని చేరి స్వర్ణముఖీ నదీ తీరాన సరోవరం నిర్మించి 12 ఏళ్ల పాటు తపస్సు చేసిన తర్వాత లక్ష్మీదేవి తామర పుష్పంలో ఉద్భవించినట్లు పద్మ పురాణం తెలుపుతుంది. పాతాళంలో ఉన్న లక్ష్మీదేవి ప్రసన్నురాలై స్వర్ణముఖీ నది తీరాన తిరుచానూరు పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు బంగారు పువ్వులో ప్రత్యక్షమై కలువ పూదండలతో స్వామివారిని వరించింది. కనుక లక్ష్మీ దేవియే పద్మములో జన్మించిన పద్మావతి లేదా అలమేలు మంగ. తమిళంలో అలర్‌ అనగా పువ్వు. మేల్‌ అనగా పైన. మంగై అనగా అందమైన స్త్రీ - అలమేలు అనగా పద్మంలో ప్రకాశించున సుందరి. చాన అంటే స్త్రీ, తిరుచాన అంటే శ్రీమంతురాలెన స్త్రీమూర్తి అని అర్థం.
సరస్సులో తామర నిలకడగా ఉండదు. నీటి ప్రవాహానికి కదులుతూ అటూఇటూ ఊగుతూ ఉంటుంది. తానూ నిలకలేని దానిని అని చెప్పటమే లక్ష్మీదేవి తామర పూవులో కొలువై ఉండటములోని పరమార్థం.
తామర విత్తనాలను పద్మ,కమల,లోటస్ విత్తనాలని కూడ అంటారు. లక్ష్మీదేవి స్వరూపమైన
తామర విత్తనాలు సహజ సిద్దమైనవి. తామరవిత్తనాల మాలను లక్ష్మీదేవి ప్రతిమలకు,పటాలకు,శ్రీచక్రాలకు అలంకరించటం మంచిది.
తామరమాలను జాతకంలో శుక్రగ్రహ దోషాలు ఉన్నవారు మెడలో దరించటం గాని,జపంచేయటం గాని చేస్తే జాతకంలో ఉన్న శుక్రగ్రహ దోషాలు తొలగిపోతాయి..
తామరవిత్తనాలు లక్ష్మీ,శ్రీచక్ర పూజలో తప్పనిసరిగా ఉంచి పూజ చేయాలి.తామర విత్తనాలు,తామరమాలతో పూజ చేస్తే దనాభివృద్ధి కలుగుతుంది.
జాతకంలో శుక్రగ్రహ దోషం ఉన్న వారికి దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ,గొడవలు,అపోహలు ఉంటాయి.ఇలాంటి వారు తామరమాలతో శ్రీచక్రానికి పూజ చేసుకుంటే దాంపత్య జీవితంలో ఎటువంటి భాదలు ఉండవు.
ఓం శ్రీం హ్రీం క్లీం ఐ౦ కమల వాసిన్యై స్వాహా. అనే మంత్రంతో గురువుల ద్వారా ఉపదేశము పొంది, శ్రద్ధతో తామరమాలతో లక్ష్మీదేవిని పూజించాలి.


aగద్గురు శంకరాచార్య శ్రీ శృంగేరీ శారదా పీటాదీశ్వర శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీస్వామి వారితో


ఏప్రిల్ 13, 2018 పంచాంగం



ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻
ఏప్రిల్ 13, 2018
శుక్ర వారం (భృగువాసరే)
శ్రీ విళంబి నామ సంవత్సరం
ఉత్తరాయణం వసంతఋతువు
చైత్ర మాసం బహుళ పక్షం
తిధి : ద్వాదశి ఉ7.16
తదుపరి త్రయోదశి
నక్షత్రం:పూర్వాభాద్ర రా2.54
తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : బ్రహ్మం తె3.24
కరణం : తైతుల ఉ7.16 తదుపరి గరజి రా7.33
సూర్యరాశి : మీనం
చంద్రరాశి : కుంభం
సూర్యోదయం : 5.49
సూర్యాస్తమయం : 6.11
రాహుకాలం:ఉ10.30-12.00
యమగండo:మ3.00 -4.30
వర్జ్యం : ఉ8.20 - 10.01
దుర్ముహూర్తం:ఉ8.17 - 9.07 & మ12.25 - 1.14
అమృతకాలం:సా6.27-8.09
శుభమస్తు