Monday 12 April 2021

ఉగాది పచ్చడి విశిష్టత



"ఉగాది"నాడు చేసుకొనే పచ్చడి ఎంతో ప్రాముఖ్యమైనది. షడ్రుచుల పచ్చడిని ఆరగించడం వెనుక జీవితసారం గోచరిస్తుంది. ఈ పచ్చడిలో
మధురం(తీపి),
ఆమ్లం(పులుపు),
కటు(కారం),
కషాయ(వగరు),
లవణం(ఉప్పు), తిక్త(చేదు)
రుచులు మిళితమై ఉంటాయి..
ఈ ఆరు రుచులు జీవతంలో ఎదురయ్యే
సంతోషం(తీపి),
దుఃఖం(చేదు),
కోపం(కారం),
భయం(ఉప్పు),
విసుగు(చింతపండు),
ఆశ్చర్యం/సంభ్రమం(మామిడి) సమ్మేళనం.
అంతేకాకుండా ఈ ఆరు రుచులు ఆరు రకాలైన లాభాలను కలుగచేస్తున్నవి.
కొత్త బెల్లం ఆకలిని కలిగిస్తుంది.
చింతపండు కఫ వాతాల్ని పోగొడుతుంది.
పచ్చి మిరపకాయలోవిటమిన్ c అధిక స్థాయిలో ఉంది.
మామిడి ముక్క జీర్ణ ప్రక్రియకు తోడ్పడుతుంది.
వేప పువ్వు చేసే మేలు పలు విధాలుగా ఉంటుంది.. వేప చెట్టు కి ఆయుర్వేదం లో విశేష స్థానం ఉంది.
సవత్సరం మొత్తం అన్ని రుచుల్ని కలగలిపి ఆయుర్వేద విలువలతో కూడిన సమతుల్యమైన ఆహారం తీసుకోవాలనే అంతర్లీన సందేశం మన ఉగాది పచ్చడి లో ఉంది.
సంవత్సరం మొత్తం
శారీరక మరియు మానసిక ఆరోగ్య సమతుల్యత పై శ్రద్ద పెట్టాలనే అద్భుత సందేశాన్ని సులువుగా చేసుకునే ఒక పచ్చడి అనే ఆచారం లో నిక్షిప్తం చేయడం మన హిందూ సంస్కృతి సంప్రదాయాల గొప్పదనం .


సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371







No comments:

Post a Comment