మొక్కలు ఆక్సిజన్ ను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయి. కాలానికి తగినట్లు వర్షాలు పడాలన్నా, ప్రకృతికి మేలు చేయాలన్నా చెట్లను తప్పకుండా నాటాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మొక్కలను విధిగా నాటడం వల్ల అదృష్టం వరిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా జీవితంలో ఎదురయ్యే సమస్యలను సానుకూల శక్తి ద్వారా అధిగమించవచ్చని చెబుతారు. ఈ సానుకూల శక్తిని మొక్కల ద్వారా ఉత్పత్తి అవుతుంది. అయితే కొన్ని మొక్కలను నాటితే అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిషశాస్త్రం ప్రకారం ఎవరైనా వ్యక్తి రోడ్డు పక్కన 5 వట వృక్షాలను వాటితే ఎన్నో శుభఫలితాలు ఉంటాయాని పేర్కొంది. అంతేకాకుండా ఈ మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేయడం ద్వారా జీవితంలో ఎదురయ్యే అవరోధాలు, సమస్యలు వాటంతటా అవే వెళ్లిపోతాయి. అంతేకాకుండా జాతకులను వెంటాడుతున్న అనేక రకాలైన కష్టాలు, ఇబ్బందులు ముగిసిపోతాయి. సానుకూల శక్తి లభించి జీవితంలో విజయం సాధించడానికి తోడ్పడుతుంది.
మోదుగ చెట్టు నాటితే..
జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రజల జీవితాల్లో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొన్నట్లయితే 5 మోదుగ చెట్లను నాటాలి. అవి కూడా రోడ్డుకిరువైపులా నాటితే మంచిది. ఒకవేళ కుదరకపోతే పొలంలో నాటితే మంచిదని గుర్తుంచుకోండి. ఇంట్లో లేదా ఇంటి చుట్టూ ఎప్పుడూ వీటిని నాటకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఐదు మోదుగ చెట్లను నాటడం ద్వారా జాతకులకు 10 రెట్లు అధికంగా పుణ్యాన్ని పొందుతారని విశ్వసిస్తారు.
పారిజాత మొక్కలను నాటితే..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment