Tuesday, 13 April 2021

ఉగాది పంచాంగం : దేశంలో సకాలంలో వర్షాలు.. భయోత్పాతాలు..

 



ప్లవ నామ సంవత్సరంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, ప్రజలంతా సుఖసంతోషలతో ఉంటారు. దేశంలో అక్కడక్కడ కలహాలు, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందని తెలిపారు. ప్రపంచంలో భయోత్పాలు పెరుగుతాయని, పలు వస్తువుల ధరలు పెరుగుతాయని చెబుతున్నారు. పంచాంగంలో విశేషాలు కొన్ని మీ కోసం..

కలి గతాబ్ది- 5122,
క్రీస్తుశకం 2021-22,
శాలివాహన శకం-1943,
భారత స్వాతంత్య్ర శకం 74-75
నవనాయక ఫలితాలు
రాజు-కుజుడు, 
మంత్రి-బుధుడు, 
సేనాధిపతి- చంద్రుడు,
సస్యాధిపతి- శుక్రుడు, 
ధాన్యాధిపతి- గురువు, 
అర్ఘాధిపతి- కుజుడు, 
మేఘాధిపతి- కుజుడు, 
రసాధిపతి- రవి, 
నీరసాధిపతి- శుక్రుడు, 
రాజవాహనం- నావ, 
గోష్ఠాగార ప్రాపకుడు (స్థాన సంరకక్షుడు), 
గోష్ఠాద్బహిష్కర్త-యముడు.

నవనాయక వర్గంలో శుభాధిక్యం ఉండడంతో దేశంలోని అన్ని ప్రాంతాల్లో సమయానుకూలంగా వర్షాలుంటాయి. సుభిక్షం, క్షేమం, ప్రజారోగ్యం ఉంటాయి. మధ్యమ వృష్టి, పంటలు మధ్యమంగా పండే అవకాశాలున్నాయి. అయితే, ప్రజల మధ్య అన్యోన్యత, ప్రేమానురాగాలు పెరుగుతాయి. సుఖ సంతోషాలు వెల్లివిరిసినా అక్కడక్కడా కలహాలు, విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉన్నది.

రాజు-కుజుడు : అంగారకుడు రాజు కావడంతో అగ్నిభయం, శస్త్ర భయం, పంటలు తగ్గడం, అల్పవృష్టి, చోరులు, దుర్మార్గులు ప్రబలడం వంటి ఫలితాలు ఉంటాయి. దేశాల యుద్ధాలు జరుగవచ్చు. సైన్య నష్టం జరుగొచ్చు. యుద్ధ తీవ్రత ఉంటుంది. లోకంలో భయోత్పాతాలు పెరుగుతాయి. ఎర్రని వస్తువులు, కందులు, మిర్చి, పగడాలు, బెల్లం, కలప, అగ్ని సంబంధిత పదార్థాలు, బంగారం, వెండి, సీసం, ఇనుము, ఉక్కు, కంచు, రాగి, ఇత్తడి, యంత్రపరికరాలు, బొగ్గు, పెట్రోలు, కిరోసిన్‌, కంకర, సిమెంట్‌, ఆముదం, నార-గోనె సంచులు, ఉల్లిగడ్డ, పొగాకు, తేయాకు, కాఫీ గింజలు, పసుపు, మాంసం మొదలైన వస్తువుల ధరలు పెరుగవచ్చు.

రాజ వాహనం : నావ (పడవ) కావడం వల్ల ఈ ఏడాది ప్రజా కల్లోలం, ఆకలి బాధలు తలెత్తవచ్చు. పశువుల నష్టం అధికం అవుతుంది. పంటలు నశించవచ్చు. యుద్ధం వల్ల ఉపద్రవాలు ఏర్పడతాయి. నౌకాదళానికి సమస్యలు. వస్తు నౌకలు సముద్రంలో మునిగిపోయే ప్రమాదం ఉన్నది. తద్వారా వ్యాపార నష్టం సంభవించవచ్చు. రవాణా వ్యవస్థలో ఒడుదొడుకులు ఉండవచ్చు. ధాన్యాల ధర పెరుగవచ్చు.

మంత్రి-బుధుడు: గాలులు అధికంగా వీస్తాయి. పంటలు మధ్యమంగా పండుతాయి. ప్రజలు సుఖిస్తారు. భోగ విలాసాలతో సంతృప్తి చెందుతారు. ధనధాన్య వృద్ధి ఉంటుంది. గోధుమలు, బియ్యం, ఆవాలు, మినుములు, శనగలు, వేరుశనగ, పత్తి, వెండి, నార, గోనెసంచులు, కాగితం, కలప, నూనెగింజల ధరలు పెరుగును.

సేనాధిపతి-చంద్రుడు: ఆహార ధాన్యాలు, వెన్న, నెయ్యి, చక్కెర, వెండి, బంగారం, పెట్రోలు, దుస్తుల ధరలు పెరుగవచ్చు. వర్షాలు బాగా కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. ప్రజారోగ్యం బాగుంటుంది. పశువులు క్షీర సమృద్ధిని కలిగి ఉంటాయి.

సస్యాధిపతి-శుక్రుడు: ధాన్య సమృద్ధి. ముఖ్యంగా తెల్ల ధాన్యాలు బాగా పండుతాయి. దేశమంతా ప్రజల ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. సంపద పెరుగుతుంది. సమస్త ధాన్యాలు, వస్తువుల ధరలు పెరుగవచ్చు.

ధాన్యాధిపతి-గురువు: వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. పంటలు విశేషంగా పండుతాయి. పాడి బాగుంటుంది.

అర్ఘాధిపతి-కుజుడు: యుద్ధ భయం పెరుగుతుంది. వర్తక, వ్యవసాయదారులకు హాని. పశు సంపదకు నష్టం. ఎర్రని ధాన్యాల ధరలు పెరుగుతాయి. వెండి, బంగారం, కందులు, మిర్చి, వేరుశనగ, ఇనుము, ఉక్కు, రాగి, సీసం, ఇత్తడి మొదలైన వస్తువుల ధరలు పెరుగును.

మేఘాధిపతి-కుజుడు: అల్పవృష్టి, గాలి ఎక్కువగా ఉంటుంది. ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎర్రని ధాన్యాలు విశేషంగా పండుతాయి.

రసాధిపతి-రవి: నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలైన రస వస్తువుల ధరలు పెరుగును. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసెనూనె, నువ్వుల నూనె, చింతపండు, నిమ్మ, నారింజ, మామిడిపండ్ల ధరలు పెరుగును.

నీరసాధిపతి-శుక్రుడు: కర్పూరం, అగరు, చందనం, వెండి, బంగారం, ముత్యాలు, దుస్తుల ధరలు పెరుగవచ్చు.

  • పశుపాలకుడు యముడు కావడం వల్ల పాల ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. పాడి తగ్గవచ్చు.
  • పశువులకు రోగాది పీడలు ఉండవచ్చు. పశు నష్టం సంభవించవచ్చు.
  • గోష్ఠాగార ప్రాపకుడూ యముడు కావడం వల్ల పాడిపంటలు తగ్గును. వర్షపాతం మధ్యమం. పంటలు ఓ
  • మోస్తరుగా పండుతాయి. ధరలు పెరుగుతాయి. పశువులకు హాని తలెత్తవచ్చు.
  • గోష్ఠాద్బహి ప్రాపకుడు కూడా యముడే అయ్యాడు. ఫలితంగా పంటలు తక్కువగా పండవచ్చు. మధ్యమ
  • వృష్టి. పంటలకు చీడపీడల బాధ పెరుగవచ్చు. ధరలు పెరుగుతాయి.

సంవత్సర ఫలం

పర్వతాకారంలో ఉన్న మేఘాలు ఆకాశాన సంచరిస్తూ మంచి వర్షాలు కురిపిస్తాయి. పాలకులు, ప్రజలు సంతోషిస్తారు. ధనధాన్య వృద్ధి. పాడిపంటల అభివృద్ధి ఉంటుంది. ప్రజలు సుభిక్షంగా ఉంటారు. చైత్రమాసంలో వర్షాలు కురవొచ్చు. వైశాఖంలో ప్రజాక్షోభ, కల్లోల పరిస్థితులు తలెత్తవచ్చు. అగ్నిబాధలు, రోగపీడలు ఉంటాయి. జ్యేష్ఠంలో ఆహార ధాన్యాల ధరలు పెరుగవచ్చు, దేశంలో తూర్పు ప్రాంతాల్లో ప్రజా కల్లోలం చెలరేగవచ్చు. అషాఢంలో వాయుసహిత వృష్టి, భయోత్పాతాలు, రోగాలు ఉంటాయి. శ్రావణంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. భాద్రపద మాసంలో ధాన్యాల ధరలు తగ్గుతాయి. ఆశ్వీయుజంలో సమస్త వస్తువుల ధరలు పెరుగవచ్చు. కార్తీకంలో ఆహార ధాన్యాల ధరలు తగ్గవచ్చు. పుష్య, మాఘ, ఫాల్గుణ మాసాల్లో ప్రజలు సుభిక్షంగా, ఆరోగ్యంతో ఉంటారు.

గురు సంచారం

స్వస్తి శ్రీ శార్వరి నామ సంవత్సరం ఫాల్గుణ కృష్ణ నవమి సోమవారం 5/4/2021 రాత్రి 12-24 గంటలకు అతిచార వశాత్‌ గురువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. శ్రీ ప్లవ నామ సంవత్సరం భాద్రపద శుక్ల అష్టమి మంగళవారం 14/9/2021 సా॥4-44 గంటలకు తిరిగి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కార్తీక కృష్ణ పాడ్యమి శనివారం 20/11/2021 రాత్రి 11-31 గంటలకు మళ్లీ కుంభరాశిలోకి గురువు ప్రవేశించనున్నాడు. తదాది సంవత్సరమంతా కుంభరాశిలోనే ఉంటాడు.

శని సంచారం

ఈ సంవత్సరమంతా శని మకరరాశిలోనే సంచరిస్తున్నాడు. మకరంలో శని వల్ల భయోత్పాతాలు ఎక్కువగా ఉంటాయి. ధరలు పెరుగుతాయి. అధిక వర్షాలు కురుస్తాయి. పురోహితులు, బ్రాహ్మణులు, వైద్యులకు హాని కలుగవచ్చు.

రాహు-కేతు సంచారం

సంవత్సరాది నుంచి ఫాల్గుణ శుక్ల చతుర్దశి గురువారం 17/3/2022 ఉ॥ 6-26 గంటల వరకు రాహువు వృషభంలో, కేతువు వృశ్చికంలో సంచరిస్తున్నారు. ఆనాటి నుంచి సంవత్సరాంతం వరకు రాహువు మేషంలో, కేతువు తులలో సంచరిస్తారు.

పుష్కర నిర్ణయం

శ్రీ ప్లవ నామ సంవత్సర కార్తీక కృష్ణ పాడ్యమి శనివారం 20/11/2021 రాత్రి 11.31 గంటలకు గురువు కుంభరాశిలో ప్రవేశం. తేది 21/11/2021 నుంచి సింధూ మహానది పుష్కరాలు ప్రారంభం. 2/12/2021 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయి. పుష్కర సమయంలో సింధూనదిలో స్నానం పుణ్యప్రదం. పితృదేవతల ప్రీత్యర్థం తర్పణ, పిండ ప్రదాన, దానధర్మాలు చేయాలి.

కర్తరీలు

శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర కృష్ణ అష్టమి మంగళవారం 4/5/2021 నుంచి వైశాఖ కృష్ణ విదియ శుక్రవారం 28/5/2021 వరకు వాస్తు కర్తరీలు. చైత్ర అమావాస్య మంగళవారం 11/5/2021 నుంచి వైశాఖ శుక్ల చతుర్దశి మంగళవారం 25/5/2021 వరకు అగ్ని వాస్తు కర్తరీలు.

ఇవి చేయవచ్చు: గృహప్రవేశం, ఉపనయనం, వివాహం, యజ్ఞయాగాదులు.

ఇవి చేయకూడదు: గృహారంభం, నూతన వస్త్రధారణ, విత్తననాట్లు, కేశ ఖండనం, కొత్త వాహన కొనుగోలు, దేవాలయ ఆరంభం, బావి తవ్వడం.

మేష సంక్రమణం

శ్రీ ప్లవ నామ సంవత్సర చైత్ర శుక్ల పాడ్యమి మంగళవారం 13-4-21 రోజున రాత్రి 2-32 గంటలకు భరణీ నక్షత్రం రెండో పాదం, మకర లగ్నంలో సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు.

ఫలితం: శుక్ల విదియ: యుద్ధ వాతావరణం,

మంగళవారం: ధరలు పెరుగును, ప్రజా కల్లోలములు, అగ్ని భయం, దుర్మార్గులచే ఇబ్బందులు, చోరబాధలు తలెత్తవచ్చు.

రాత్రి సమయం: ఆహార కొరత. భరణి నక్షత్రం: ఉపద్రవాలు.

ప్రీతి నామ యోగం: అనుకూల వర్షములు.

కౌలవ కరణం: సువృష్టి.

మకర లగ్నం: పరస్పర విరోధం.

సాముదాయిక ఫలితం : ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతారు. చోర, రోగాగ్ని భయాలు తలెత్తవచ్చు. కొన్ని ప్రాంతాల్లో పంటలకు అనుకూల వర్షాలు ఉంటాయి. సుభిక్షారోగ్యాలు కలుగుతాయి.

వర్షము – ఆఢకము – ఫలము: రాజు కుజుడు కావడం వల్ల ఈ సంవత్సరం రెండు తూముల వర్షం ఉంటుంది. అంటే మధ్యమ వర్షాలు కురుస్తాయి. సముద్రాల్లో 9 భాగాలు, పర్వతాల్లో 9 భాగాలు, భూమిపై రెండు భాగాల వర్షం కురువవచ్చు. మొత్తం మీద ఈ ఏడాది రెండు తూముల వర్షం, మూడు తూముల వాయువు ఉంటుంది.

ఆఢకదారుని నిర్ణయం: ఈ సంవత్సరం అంతా గోప (గొల్లవాని) హస్తమందు ఆఢకము ఉన్నది. దేశమందు సుభిక్ష క్షేమారోగ్యాలు, పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి. ధాన్యాదుల ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గవచ్చు. ఈ ఏడాది వర్షం-15, ధాన్యం-13గా ఉంటుంది. సుమారుగా 12 వీసముల పంట ఫలిస్తుంది. మొత్తమ్మీద ఈ సంవత్సరం నవనాయక వర్గం, ఉపనాయక వర్గం, కార్తెలు, సంక్రమణలు, జగల్లగ్న,వర్షలగ్న గ్రహస్థితిని పరిశీలిస్తే సుభిక్ష, క్షేమారోగ్యాలు ఉండి, ప్రజలు సుఖంగా జీవనాన్ని గడుపుతారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాభావం, కలహాలు, వ్యాధులు, కల్లోలాలు ఉండే అవకాశాలు ఉన్నాయి.



సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371











No comments:

Post a Comment