ఉగాదికి ముందు రోజును క్రొత్త అమావాస్య అనడం ఒక వాడుక. ముఖ్యంగా గుంటూరు, క్రిష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో చాలా విశేషంగా చెప్పుకుంటారు.
రాబోయే క్రొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కనుక క్రొత్త అమావాస్య అని మన పెద్దలు అంటూంటారు.
క్రొత్త అమావాస్య నాడు గ్రామ దేవత (నూకాలమ్మ, మరిడమ్మ, పోలేరమ్మ, దుర్గాలమ్మ మొదలైన గ్రామదేవతలు) లను ఆరాధించుతారు. ఈ రోజున అమ్మవారికి ఉపారములు (అమ్మవారికి పెట్టే నైవేద్యములు) పెడతారు.అవి వేడి ఉపారము, చల్లని ఉపారము అని కడుపు చలువకోసం (తమ పిల్లలు చల్లగా ఉండాలని) పెడతారు. పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలికి ఇస్తారు.
క్రొత్ప అమావాస్యనాడు ముఖ్యంగా పప్పు (పెసర పప్పు), తెలగపిండి (నువ్వుల చెక్క) కూర చేస్తారు. ఇంకా పోలి పూర్ణం బూరెలు, గారెలు వడపప్పు, పానకం, పెరుగు (చల్లని ఉపారంలో ఇస్తారు).
ఇంటిలో ఈశాన్యంలో గోడకు గుండ్రంగా పసుపురాసి (అమ్మవారి ముఖం వలె), కుంకుమతో బొట్టుపెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూజించుతారు.
అమ్మవారికి నైవేద్యంగా మూడు విస్తర్లు వేసి,వండిన పదార్థములను వడ్డించి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. అనంతరం అమ్మవారిని ధ్యానించి, తమ పిల్లలు చల్లగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని మ్రొక్కుకుంటారు.
అమ్మ వారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలిని పిలిచి అతనికి ఇస్తారు.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment