Monday 12 April 2021

2021-2022 శ్రీ ప్లవ నామ సంవత్సర మకర రాశి ఫలాలు

 



మకర రాశి ఫలితములు
ఉత్తరాషాఢ 2,3,4 పాదములు (బొ, జా, జీ)
శ్రవణం 1,2,3,4 పాదములు (జే, జో, ఖా, ఖొ)
ధనిష్ఠ 1,2 పాదములు (గా, గి)

ఆదాయం-14 వ్యయం-14 రాజయోగం-3 అవమానం-1

🎉ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 5 నుండి సెప్టెంబర్ 14 వరకు మరియు నవంబరు 20 నుండి సంవత్సరాంతం వరకు కుంభంలో (ద్వితీయం) సంచరించి మిగిలిన కాలము అంతయు మకరరాశి (జన్మ)లో సంచరించును. శని సంవత్సరం అంతయు మకరంలో (జన్మ) సంచరించును. రాహువు వృషభంలో (పంచమం) కేతువు వృశ్చికంలో (లాభం) సంచరించెదరు. ఈ సంవత్సరం అధిక కాలము గురు కేతువు గ్రహముల అనుకూలము వలన కాలము నడుచును.
🎉ఏలినాటి శని అని భయపడకండి. చాలావరకు సమస్యలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న కాలము. చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో లాభాలు అధిక స్థాయిగా వస్తాయి. కొన్ని ప్రయత్నాలు తేలికపాటివి కూడా పూర్తి అవ్వవు. మరి కేవలం శని ఒకరే అనుకూలం లేదు. గురువు కుంభంలో వుండగా ధర్మ కార్యములు చేయు అవకాశం కలిగిస్తారు. తరచుగా బుద్దిభ్రంశం కలుగుతుంది. ఎప్పుడూ సహకారం చేసేవారు కూడా మీకు వైరంతో వుంటారు. ముఖవర్చస్సు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఉద్యోగ విధి నిర్వహణ మీరు ఎంత బాగా చేసినా గుర్తింపురాదు. అంతేకాక తోటి ఉద్యోగులు, పై అధికారులు తరచుగా ఆగ్రహిస్తారు. మరికొన్ని సందర్భాలలో వీరే చాలా బాగా సహకరించి మిమ్మల్ని వృత్తిపరమైన సమస్యల నుండి బయటపడవేస్తారు. అంతా విచిత్రమైన స్థితి.
🎉యిక వ్యాపారులకు ఆశించిన మేర శుభ పరిణామాలు అందవు. కానీ మంచి వ్యాపారమే జరుగుతుంది. ఈ సంవత్సరం ఏ విషయంలోనూ యితరులతో పోలిక అనవసరము. మనకు మంచి ఫలితాలు ఉన్నాయా? లేదా? అని చూసుకుంటే సుఖపడతారు. ఆర్థిక వనరులు అస్తవ్యస్తంగా ఉన్ననూ యిబ్బందికరం కాదు అనే చెప్పాలి. ఆదాయం కొన్నిసార్లు బాగుండి కొన్నిసార్లు చికాకులను కలిగిస్తూ ఉంటుంది. ఖర్చులు నియంత్రించలేని పరిస్థితి ఉంటుంది. మకరంలో గురువు సంచారం చేయుకాలంలో ఏదో ఒకరకంగా తెలివితేటలు పనిచేయక పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జూలై, జూన్, ఆగస్టు, సెప్టెంబరు మాసాలలో కుజ సంచారం అనుకూలం లేని రోజులలో అందరితో కలహాలు బాగా పెరుగుతాయి. శారీరక చికాకులు ఉంటాయి. కుంభ గురువు కాలం అంతా చాలా చక్కగా జీవనం సాగుతుంది.
🎉చాలావరకు మీరు అందర్నీ గౌరవించి మీరు గౌరవమర్యాదలు అందుకుంటూ ముందుకు వెడతారు. కుంభంలో గురువు వున్నకాలంలో సమస్యలు సరి చేసుకుంటూ అందరి దగ్గర లబ్దిపొందుతూ శుభకార్యాలు వినోద కార్యములలో పాల్గొంటూ సుఖంగా జీవనం చేస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు చాలా విచిత్ర స్థితిని ఏర్పరుస్తాయి. పనులు ఆలస్యం అవడం ప్రధానం. ఒక విద్యావిషయంగా వెళ్ళేవారికి పనులు పూర్తి అవుతాయి కానీ ఒత్తిడి ఎక్కువ. ఉద్యోగ విషయంగా వెడదాము అనుకునేవారికి పనులు పూర్తి అయ్యే సమయానికి నిర్ణయాలలో మార్పు చోటు చేసుకుంటుంది. కన్స్ట్రక్షన్ రంగంలో వున్నవారికి మరియు రియల్ ఎస్టేట్ రంగంలో వారికి ఆర్థిక వెసులుబాటు సరిగా లేకపోవడం దృష్ట్యా పనులు ఆలస్యం అవుతాయి. ఫైనాన్స్ వ్యాపారలు గత సంవత్సరం కంటే మంచి వ్యాపారం చేస్తారు అని చెప్పాలి.
🎉షేర్ వ్యాపారులు మరియు వస్తువులు నిల్వ చేసి వ్యాపారం చేయువారి విషయంలో గురుబలం బాగుంది. కావున మంచి లాభాలు అందుతాయి. శుభకార్య ప్రయత్నాలు వేగవంతం అవుతాయి. పుణ్యకార్యసక్తత పెరుగుతుంది. తరచుగా పూజ్యులను గురువులను దర్శనం చేసుకుంటారు. అంతటా శుభ ఫలితాలు అందుకుంటారు. ఆనందిస్తారు. విద్యార్థులకు గురుబలం బాగుంది. మందగమనంగా విద్యావ్యాసంగం నడిచినా ఫలితాలు అనుకూలముగా ఉండడం విశేషం. రైతులకు శ్రమ ఎక్కువ అయితే ఫలితాలు బాగుంటాయి. అందరూ సహకరిస్తారు. కోర్టు వ్యవహారములలో వున్నవారికి పనులు బాగా ఆలస్యం అయినా మీ శ్రేయోభిలాషుల వలన మీరు రక్షణాత్మకంగా ఉంటారనే చెప్పాలి. వృత్తి సంబంధ వ్యవహారములు సానుకూలం కాదు.
🎉స్థానచలన ప్రయత్నాలలో ఉన్నవారికి, ధనం సమృద్ధిగా ఉండి యిబ్బందికర ఘటనలు ఎదురౌతాయి. ఈ విషయంలో స్నేహితులు కూడా బాగా సహకరిస్తారు. నిర్ణయాలు సరిగా జరగవు. ప్రమోషన్ ప్రయత్నాలు ప్రత్యేకం చేసుకోవలసినదే. మీరు ప్రమోషన్ లిస్టులో ఉన్నా ప్రమోషన్ అందకపోవచ్చును. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి యిబ్బందికర ఘటనలు చాలా ఎదురౌతాయి. భయపడకండి. నూతన వ్యాపార ప్రయత్నాలు మందగమనంగా సాగుతాయి. అయితే పూర్తిగా సక్సెస్ అని చెప్పలేము. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంగా ప్రత్యేక జాగ్రత్తలు పాటిస్తారు. చాలావరకు సమస్యలకు దూరం అవుతారు. ఏలినాటి శని వలన ఖర్చు శ్రమ తప్పవు కదా! అదే కోణంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. కంగారు లేదు.
🎉పిల్లల విషయంలో కూడా పెద్దగా భయపడవలసిన అవసరం లేదనే నా భావన. విశేషంగా ఈ సంవత్సరం కుంభంలో గురువు సంచారం కాలంలో కుటుంబసభ్యులు అందరూ కలిసి నిర్ణయాలు చేయు అవకాశం ఉంటుంది. ఋణ విషయంలో పాత ఋణములు వున్నవారికి ఋణములు ప్రతిబంధకం అవ్వవు. కొత్త ఋణములు పొందే విషయంలోను మరియు పాత ఋణములు తీర్చే విషయంలో చికాకులు అధికంగా పొందే అవకాశం ఉన్నది. ఆరోగ్య విషయంలో బహుశ్రద్ధ జాగ్రత్త అవసరం. గురు సంచారం వలన సమస్యలు దాటతారు అని చెప్పాలి. అయితే నరములు, రక్తము, చర్మము వంటి వాటిలో సమస్యలు వున్నవారికి యిబ్బందులు కలుగుతాయి. గౌరవ మర్యాదలకు యిబ్బంది కలుగకుండా ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయండి. శని వలన మార్కెటింగ్ ఉద్యోగులకు టార్గెట్ ఆలస్యంగా పూర్తి అవుతుంది. సంతృప్తికరమైన రీతిగా ఉద్యోగం ఉండదు. భోజనం అకాలంలోను అసంతృప్తిగాను చేయవలసిన అవసరం ఈ రాశి వారికి తరచుగా ఎదురయ్యే ఘటన.
🎉స్త్రీలకు ఈ సంవత్సరం జూన్ దగ్గర నుండి నాలుగు మాసాలు ఏవిధమైన జాగ్రత్తలు పాటింపలేక పనులు సమర్థంగా చేయలేక యిబ్బంది పొందుతారు. అయితే మిగిలిన కాలం అంతా చాలా చక్కగా పనులు చేసుకొని మంచి జీవనం చేయు అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం కూడా చాలా బాగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు గురుసంచారం అనుకూలం దృష్ట్యా చాలా చక్కటి జాగ్రత్తలు పాటిస్తారు. అంతా శుభమే.
🎉ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విశేషములు ఏమనగా మానసిక అశాంతి, భయము పోగొట్టుకునేందుకు మార్గాలు మంచివి అందుకుంటారు. ఎప్పుడూ ఎవరో ఒకరు మీకు రక్షణ చేస్తుంటారు. భగవత్కృపకు మీరు కృషి చేస్తారు. సక్సెస్ అవుతారు. మంచి జీవనం సాగుతుంది.
🎉శ్రవణం నక్షత్రం వారికి విశేషములు ఏమనగా రోజూ శరీర రక్షణ మీద ప్రత్యేకమైన దృష్టిని వుంచవలసిన కాలము. చిన్న చిన్నగా ప్రారంభం అయి వైద్య ఖర్చులు తారాస్థాయికి పెరుగుతాయి. ఎవరి వ్యవహారములలోను ఎక్కువగా కలుగచేసుకోవద్దు.
🎉ధనిష్ణా నక్షత్రం వారికి విశేషములు ఏమనగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. రోజూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. గురుబలం వలన విద్యార్థులకు మరియు పబ్లిక్ రిలేషన్ కోసం కృషిచేసేవారికి సక్సెస్ రేట్ పెరుగుతుంది. శ్రద్ధతో జీవనం సాగిస్తారు.
🎉నిత్యం పఠింపవలసిన స్తోత్రం :
1. బాలాంకుండీంచ ఢమరుం శూలం శంఖం సుదర్శనం- దధానం భక్త వరదం దత్తాత్రేయం నమామ్యహం
2. ఓం నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే - వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాంపతయే నమః - ఈ శ్లోకం పారాయణ ద్వారా మీకు ప్రశాంతత చేకూరుతుంది.
🎉శాంతి : దోషము చేయు గ్రహములు శని, కుజుల నిమిత్తంగా ఏప్రిల్ /నవంబరు మాసములలో జపదాన హోమశాంతి మీరు దగ్గర వుండి చేయించుకోండి. షణ్ముఖ రుద్రాక్ష ధారణ అధికంగా మానసిక ఒత్తిడిని నిరోధిస్తుంది. సుబ్రహ్మణ్య, త్రిశతి పారాయణ చేయండి. శనివారం రోజున నువ్వులతో చేసిన పదార్థములు అందరికీ పంచండి. చెప్పులు బట్టలు దానం చేయండి.
🎉ఏప్రిల్ : ఉద్యోగంలో పై అధికారులతో సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడండి. అందరితో స్నేహంగా ఉంటే మీకు సౌఖ్యంగా జీవనం సాగుతుంది. పనులన్నీ మందగమనంగా నడుస్తూ ఉంటాయి. ఆశించిన లాభదాయకమైన ఫలితాలు ఉండవు. నష్టాలు లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంటుంది. గతం కంటే కొంచెం మంచి మార్పులు అందుకుంటారు. ఉద్యోగ, వ్యాపార విషయాలలో మీరు తీసుకొనే జాగ్రత్తలు మీకు శ్రీరామరక్ష అయ్యే అవకాశం ఉంటుంది.
🎉మే : ప్రతి పనిలోనూ ఆలస్యం చోటు చేసుకుంటుంది. అయితే కార్యవిజయమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు అందుకుంటారు. మీరు ఆశించిన రీతిగా ఏ పనీ జరగకపోయినా, ఓర్పు, నేర్పు ప్రదర్శించి చాలా కార్యక్రమాలను సానుకూలం చేసే ప్రయత్నంలో శ్రమ చేస్తారు. ఏ పని ఎలా ఉన్నా ఆరోగ్య విషయం మీద చాలా జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అధికారుల అండదండలతో అన్ని పనులు సానుకూలం చేసుకోగలుగుతారు.
🎉జూన్ : భార్యభర్తల మధ్య అనుకూలం పెరుగుతుంది. ఆదాయం వ్యయం సమతూకంగా ఉంటాయి. నిలకడగా వ్యాపారం చేస్తారు. అవసరానికి తగినవిధంగా ఋణ సౌకర్యం చేకూరుతుంది. ప్రతి పనిలోనూ సునిశితంగా ఆలోచించి నిర్ణయాలు చేయడం, తద్వారా కార్యక్రమాలను విజయవంతం చేసుకోవడంలో సక్సెస్ అవుతారు. ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు, ప్రణాళికలు చేసి మంచి ఫలితాలు అందుకుంటారు. అయితే ఈ నెలలో మీ పిల్లల వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
🎉జూలై: ఆరోగ్య విషయంగా బహు జాగ్రత్తలు తీసుకోవాలి. కలహాలు రాకుండా మీ మాట తీరు మార్చుకోవలెను. బుద్ధి మాంధ్యం పెరుగును. ఏ పనీ సవ్యంగా చేయలేని పరిస్థితి కొన్ని కొన్ని సందర్భాలలో ఏర్పడడం, గౌరవం పొందవలసిన చోట కూడా పొందలేకపోవడం జరుగుతుంది. శని, కుజుల సంచారం అనుకూలంగా లేని కారణంగా ఒకసారి శనికుజుల శాంతి చేయించు కోవడం మంచిది. తొందర పాటు ధోరణిగా ఎప్పుడూ ప్రవర్తించ రాదని ప్రత్యేకమైన సూచన.
🎉ఆగష్టు: రోజూ సమస్యలు ఉత్పత్తి అవ్వడం వాటిని తెలివిగా సరిచేయడం వంటివి జరుగుతాయి. ఆరోగ్య పరిరక్షణమీద దృష్టి చాలా ఎక్కువగా ఉండాలి. దూరప్రాంత ప్రయాణాలు చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాము. చాలా జాగ్రత్తగా అన్ని వ్యవహారాలను స్వయంగా చూసుకోవడం చాలా అవసరం. ఇతరులకు ఎటువంటి హామీలు ఇవ్వవద్దు. కుటుంబ వ్యవహారాలలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరింవలసిన అవసరం ఉంటుంది. నూతన ప్రయత్నాలకు శ్రీకారం చేయడం కంటే పాత సమస్యలకు, పాత వ్యవహారాలకు సంబంధించి పనులు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా అవసరం.
🎉సెప్టెంబర్ : ప్రశాంతత తగ్గే అవకాశం ఉన్నది. మోసం చేయువారు ఎక్కువ అవుతారు. మీరు రోజూ మీ విషయాలన్నీ కూడా స్వయంగా చేసుకుంటే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. క్రమంగా మాసాంతంలో కొన్ని మంచి మార్పులకు అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఒత్తిడి బాగా పెరుగుతుంది. అనుకున్న స్థాయి ఫలితాలు అందే అవకాశం ఉండదు. అయితే క్రమక్రమంగా గతంలో జరిగిన సమస్యల్ని ఒక్కొక్కటీ పరిష్కరించుకొంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో కృతకృత్యులవుతారు.
🎉అక్టోబర్ : అంతా బాగుంటుంది. కానీ ఏదో తెలియని అనిశ్చితి మీ యొక్క ప్రతి విషయము చాలా గోప్యంగా ఉంచవలసిన అవసరం ఉన్నది. గతం కంటే కూడా అభివృద్ధి పథంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి జీవనశైలికి అనుకూలం ఏర్పడు తుంది. ఉద్యోగ, వ్యాపార విషయాలలో అందరినుండి మంచి సహకారం అందుతుంది. ఆర్థిక కార్యకలాపాలలో ఉన్న సమస్యలు కూడా క్రమంగా తీర్చుకుని ముందుకు వెళతారు. మీకు ఆనందాన్ని యిచ్చేటటు వంటి క్షేత్రాల్ని దర్శనం చేసుకోవడం, శుభకార్యాలలో బంధుమిత్రులను కలవడం, అనుకోని రీతిగా శుభవార్తలు వినడం జరుగుతుంది.
🎉నవంబర్ : నమ్మకంగా యిబ్బంది పెట్టేవారు పెరుగుతారు. రోజూ మీరు ప్రత్యేక జాగ్రత్తలతో కాలక్షేపం చేయవలసిన కాలము. పనులు ఆలస్యం అవ్వడంతో ఇతరుల మీద ఆధారపడి కొన్ని సమస్యలకు మీరే ప్రత్యక్షంగా శ్రీకారం చేసే అవకాశం వస్తుంది. అయితే ఈ నెలంతా కూడా ప్రతిపనిని కూడా స్వయంగా చూసుకోవడం, ఆర్థిక, ఉద్యోగ విషయాలలో అధిక ఓర్పుతో వ్యవహరించడం చాలా అవసరం. ఋణ విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించమని ప్రత్యేకంగా సూచిస్తున్నాము.
🎉డిసెంబర్ : వాహనసౌఖ్యం తక్కువగా ఉంటుంది. పనిముట్లు వాడకంలో గాయములు అయ్యే అవకాశం ఉంటుంది. కలహములు రావడం వాటిని సరిచేయడం జరుగుతుంది. ఎవరి మీదా ఆధార పడి ఏ కార్యక్రమాన్ని చేయవద్దని ప్రత్యేకంగా సూచిస్తున్నాము. క్రమక్రమంగా గ్రహాలన్నీ వ్యయభావంతో ముడిపడి సంచారం చేస్తున్న కారణంగా ఎంతో జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. కార్యక్రమములు ఆలస్యం అవుతున్న సందర్భంలో ఓర్పు ఎక్కువగా ప్రదర్శింవలసిన కాలం.
🎉జనవరి : మీరు అన్ని విషయాలలో బహు జాగ్రత్తలు పాటించాలి. అనవసర విషయాలలో కలుగ చేసుకోవద్దు. యిబ్బందులు ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. తొందరపాటు ధోరణి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అన్ని పనులు కూడా స్వయంగా చేసుకోవడం చాలా ఉత్తమం. స్నేహపూర్వక వాతావరణంలో అన్ని పనులు పూర్తి చేసుకో వల్సిన అవసరం ఎక్కువగా గోచరిస్తుంది. ఆర్థిక కార్యకలాపాలు ఇబ్బందికరంగా ఉండకపోయినప్పటికీ చాలా జాగ్రత్తగా ప్రణాళికా బద్ధంగా వ్యవహరించవలసిన కాలము.
🎉ఫిబ్రవరి : ఉద్యోగ వ్యాపార విషయాలలో చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. వాహనములు, యంత్రములు, పనిముట్లు తరచుగా రిపేర్కు గురి అవుతాయి. అధికమైనటువంటి ధనవ్యయం సూచి స్తుంది అయితే ఆర్థికలావాదేవీలు మీకు సానుకూలంగా జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఋణ సౌకర్యం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. మితభాషణ అన్ని వ్యవహారాలలో చేయటం ద్వారా లాభాలు చేకూరుతాయి. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు ధోరణి సమస్యలకు దారితీస్తుంది.
🎉మార్చి : కొంతకాలం ఈ నెలలో అనుకూలము. కొంతకాలము ప్రతి కూలముగా కాలము నడుచును. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ సానుకూలముతో నెల నడుచును. మాసాంతంలో కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో చాలా మంచి ఫలితాలు పొందుతారు. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు అన్నింటిలో ప్రారంభంలో ఉన్నటువంటి పరిస్థితి క్రమక్రమంగా మార్పు తీసుకొని చివరిలో సానుకూలమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371






No comments:

Post a Comment