ఉగాది అనగానే తెలుగువారి క్రొత్త సంవత్సరంగా మాత్రమే బావిస్తారు. కానీ చాలా మందికి తెలియని అసలు చరిత్ర కూడా దీని వెనుక దాగిఉంది. ఉగాది అంటే యుగాది అని అర్ధం. యుగాది అంటే యుగాలకు ఆది. మొదటిది, ప్రారంభం అని అర్ధం. అదే జాంభవంతుని పుట్టుక. అందుకే జాంభవంతుని "ఆది జాంభవునిగా" సంబోదిస్తారు. అంటే జాంభవంతుని పుట్టుకే యుగం ఆరంభం, పుట్టిన తేదీ అన్నమాట. హిమాలయాల్లో జాంభవంతుడు తపస్సులో ఉండగా అటుగా వెల్లే దేవతామూర్తులు జాంబవంతుని స్మరిస్తూ మహా ఆదిగా ఉన్నవాడా అని సంభోదించడం మనం పురాణాల్లో చూస్తాం. ఆ క్రమంలోనే మహా ఆదిగ అంటే ఎప్పటినుండో ఉన్నవాడా, మహా ఆదిగ మాదిగ అని స్దిరపడింది. జాంభవంతుని జన్మదినం సందర్భంగా నిర్వహించే ఈ ఉగాదిని ఘనంగా నిర్వహించుకుంటుంటాం. కొత్త బట్టలు, కొత్త రుచులతో స్వాగతం పలికే ప్రతి ఏడాదిని ఈ యుగారంభంని గుర్తుచేసుకుంటు జాంభవంతుని స్మరణ చేసుకున్న ధన, కనక, వస్తు ప్రాఫ్తి జరిగి , నూతన ఆనందంతో జీవితం ప్రారంభమౌతుందని దక్షణ భారతీయుల విశ్వాశం.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment