Friday, 2 April 2021

ఏప్రిల్ నెలలో 2021 పండుగలు, ముఖ్య దినాలు:

 



హిందూ పంచాంగం ప్రకారం, ఏప్రిల్ నెల అంటేనే ఫాల్గుణ మాసం, ఛైత్ర మాసం కలిసి ఉంటాయి. ఈ పవిత్రమైన పర్వదినాల్లో ఉగాది పండుగతో పాటు అనేక పండుగలు మరియు వ్రతాలు వచ్చాయి.

ఈ ఏడాదిలో తెలుగు రాష్ట్రాల ప్రజలు తెలుగు నూతన సంవత్సరంగా జరుపుకోనుండగా.. ఇతర రాష్ట్రాల వారు గుడి పడవ, ఇతర పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. మరోవైపు క్రైస్తవులు పవిత్రమైన రోజుగా భావించే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా ఇదే మాసంలో వచ్చింది. ఈ సందర్భంగా ఏప్రిల్ మాసంలో ఏయే తేదీల్లో ఏయే పండుగలు వచ్చాయి.. ఏయే రోజుల్లో వచ్చాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ఏప్రిల్ 3, 4 తేదీల్లో

మన దేశంలోని చాలా రాష్ట్రాల్లో శీతలా సప్తమి, శీతల అష్టమి రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ మాసంలోని క్రిష్ణ పక్ష సప్తమి, అష్టమి తిథుల్లో నిల్వ ఉంచిన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు. ఈరోజున ఇళ్లలో పొయ్యి, గ్యాస్ వంటి వాటిని వెలగించరు. ఇవి ఈ మాసంలోని మూడు, నాలుగు తేదీల్లో వచ్చాయి.
ఏప్రిల్ 7, 23వ తేదీల్లో.. ఈ ఏప్రిల్ మాసంలో రెండు విశిష్ట ఏకాదశులు వచ్చాయి. అవి ఒకటి పాపవిమోచని ఏకాదశి, రెండోది కామడ ఏకాదశి. ఈ పవిత్రమైన రోజుల్లో శ్రీ మహా విష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఇవి ఈ నెల ఏడో తేదీ, 23వ తేదీన వచ్చాయి. ఈ రెండు రోజుల్లో చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు.


ఏప్రిల్ 13న

 హిందువులు ముఖ్యమైన పండుగల్లో ఉగాది ఒకటి. ఈ పవిత్రమైన రోజు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటారు. తెలుగు నూతన ఏడాది కూడా ఈరోజు నుండే ప్రారంభమవుతుంది. ఈరోజున తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకలో ఉగాది పండుగగా జరుపుకుంటారు. మహారాష్ట్ర, గోవాలో అయితే గుడిపడవ అని.. ఇతర ప్రాంతాల్లో మరికొన్ని పేర్లతో ఈ పండుగను జరుపుకుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఈ పండుగ ఈ నెల 13వ తేదీన వచ్చింది.

ఏప్రిల్ 15, 21న..

మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉగాది రోజున నూతన సంవత్సర వేడుకలను జరుపుకుంటే.. పశ్చిమ బెంగాల్ ప్రజలు మాత్రం ఏప్రిల్ 15వ తేదీన గౌరీపూజ పేరిట వేడుకలను జరుపుకుంటారు. ఈ సమయంలో వారు శివపార్వతులను ఆరాధిస్తారు. అనంతరం శ్రీరాముడు జన్మించిన రోజు అంటే.. శ్రీరామ నవిమి కూడా ఇదే మాసంలో వచ్చింది. ఈ నెల 21వ తేదీన ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.
ఏప్రిల్ 27న.. తెలుగు వారి నూతన సంవత్సరంలో తొలి పౌర్ణమి అంటే ఛైత్ర పౌర్ణమి తిథి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున చాలా మంది హిందువులు ఉపవాసం ఉంటారు. తాము ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించనప్పుడు, ఆ పని విజయవంతంగా పూర్తవడంతో హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.


ఏప్రిల్ 30న..

తెలుగు వారి నూతన సంవత్సరంలో హిందువులలో చాలా మంది వికట సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండి.. వినాయకుడిని ఆరాధిస్తారు. ఈరోజు సూర్యోదయం నుండి సూర్యస్తమయం వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు. చంద్రుడి దర్శనం తర్వాత భోజనం చేస్తారు.

సర్వేజనా సుఖినిభావంతు

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)

శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371








No comments:

Post a Comment