ఇంట్లో ఆందోళనలు తీవ్రంగా ఉన్నా లేదా ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నా ఈ పరిహారాలతో సమస్యలు అంతమవుతాయి. ఇలా చేయడం ద్వారా మీకు డబ్బు కొరత అస్సలు రాదు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉండాలంటే పాటించాల్సిన ఐదు నివారణలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పరిహారంతో అపారమైన సంపద లభిస్తుంది..
జ్యోతిషశాస్త్రం ప్రకారం వ్యాపారంలో మీరు నిరంతరం నష్టాన్ని ఎదుర్కొంటుంటే మీరు ప్రత్యేక పరిహారం పాటించాలి. ఇందుకోసం ఏదైనా గురువారం ఒక కొబ్బరికాయ తీసుకొని ఒకటిన్నర మీటర్ల పొడవుండే వస్త్రంలో కట్టుకోండి. అనంతరం అందులో ఓ లడ్డు ఉంచి శ్రీ మహావిష్ణువు పాదాల వద్ద సమర్పించండి. మీ ఆర్థిక సమస్యలను అధిగమించడానికి మీ మనస్సులో శ్రీహరిని ప్రార్థించండి. ఈ విధంగా 7 గురువారాలు పాటించండి. ఫలితంగా అపారమైన సంపద పొందుతారు.
ఈ పరిహారంతో ఆర్థిక సమస్యలు తీరుతాయి..
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ జీవితంలో డబ్బు రాకపోయినట్లయితే మంగళవారం నాడు కొబ్బరి నూనె, మందార నూనెలో కుంకుమ కలిపి స్వస్తిక్ గుర్తును తయారు చేయండి. దీంతో పాటు మీకు డబ్బు సంబంధిత సమస్యలను తొలగిపోవాలని ప్రార్థించండి. 5 మంగళవారాలు ఇలా చేయడం ద్వారా ఆంజేయస్వామి అనుగ్రహం మీకు కలుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలన్నీ ముగుస్తాయి.
ఈ నివారణతో ఆదాయ వనరులు పెరుగుతాయి..
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment