మేషం: నిరుద్యోగులు శుభవర్తమానాలు అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. వాహనాలు కొనుగోలు చేస్తారు.
వృషభం: పరపతి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. భూలాభాలు కలుగుతాయి.
మిథునం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. ఆస్తి వివాదాలు తప్పవు. అంచనాలు తారుమారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆలయాల సందర్శనం..
కర్కాటకం: కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. కష్టమే తప్ప ఫలితం కనిపించదు. పనుల్లో తొందరపాటు. ఆరోగ్య,కుటుంబ సమస్యలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు గందరగోళం.
సింహం: భూ, గృహయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో విభేదాలుతొలగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. చర్చలు సఫలం. ప్రముఖుల పరిచయాలు.
కన్య: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అరోగ్య,కుటుంబసమసమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో
చిక్కులు. శ్రమ మరింత పెరుగుతుంది.
తుల: కాంట్రాక్టర్లకు అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఇంతకాలం పడిన కష్టంఫలిస్తుంది. భూలాభం. యత్నకార్యసిద్ధి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
వృశ్చికం: వ్యవహారాలలో అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. నిరుద్యోగుల యత్నాలు ఫలించవు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి..
ధనుస్సు: ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక ప్రగతి ఉంటుంది.దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. విందువినోదాలు. చర్చలు ఫలిస్తాయి.
మకరం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆర్థిక విషయాలలో పురోగతి. సన్నిహితులసాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులుతొలగుతాయి.
కుంభం: ఎంతకష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలు. బంధువుల నుంచి విమర్శలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు. విద్యార్థులకు శ్రమాధిక్యం.
మీనం: బంధువులతో వైరం. దూరప్రయాణాలు. పనుల్లో ఆటంకాలు చికాకుపరుస్తాయి. మీ అంచనాలు తప్పుతాయి. బాద్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనుకోని ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశ పరుస్తాయి.
సర్వేజనా సుఖినిభావంతు
శుభమస్తు.
No comments:
Post a Comment