Saturday, 3 September 2016

గడపపై కూర్చోవడం మంచిది కాదా? అలా కూర్చుంటే ఏమౌతుoది?

గడపపై కూర్చోవడం మంచిది కాదా? అలా కూర్చుంటే ఏమౌతుoది?


ఇంటికి ప్రధాన ద్వారంపై కూర్చోవడం మంచిది కాదా? అలా కూర్చుంటే అరిష్టం, దారిద్ర్యమా? ఇంటికి ప్రధాన ద్వారానికి గల గడపపై కూర్చోకూడదని మన పెద్దలు అంటారు.   కిటికీలు, ద్వారాల ద్వారానే గాలి, వెలుతురు ఇంటిలోకి వచ్చి వెళ్తూంటాయి. అలాంటప్పుడు ఇంట్లోకి వచ్చే గాలిని, వెలుతురును, ఇంటిలోపల గల నెగటివ్‌ ఎనర్జీ బయటికి తీసుకెళ్లే గాలిని గడపపై కూర్చుని అడ్డుకోవడం సైన్స్ పరంగా మంచిది కాదని.. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యానికి మంచిది కాదు.

ఇక ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే.. గడపకు మధ్యలో కూర్చోవడం మంచిది కాదు. గడపపై కూర్చోవడం, గడపకు దిగువనున్న మెట్లపై కూర్చోవడం కూడా అంత మంచిది కాదు. అలా కూర్చుంటే ఇంటిలోనికి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకున్న వారవుతాము. అంతేగాకుండా ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు.. ప్రధాన ద్వారం అమర్చేటప్పుడు పూజలు నిర్వహించి, నవరత్నాలు, పంచలోహ వస్తువుల్ని ప్రధాన ద్వార గడప కింద ఉంచడం ఆనవాయితీ. అందుకే ప్రధాన ద్వారాన్ని దైవాంశంగా, లక్ష్మీదేవిగా పూజిస్తాం. కాబట్టి దైవాంశం నిండిన ప్రధాన ద్వారం (గడప)పై కూర్చోవడం.. లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది.అందుకే మన పూర్వికులు గడప పైన కూర్చోవడమే కాదు తొక్కడం ,ఎక్కి నిల్చోవటాని కూడా వద్దని చెప్పేవాళ్ళు. ఇంకా ఇలా కూర్చోవడం ద్వారా ఈతిబాధలు ఉత్పన్నమవుతాయి, అరిష్టంకూడాను.

No comments:

Post a Comment