Monday, 5 September 2016

వినాయకుడు - ఏక వింశతి పత్రి పూజ విశిష్టత




వినాయకుడు గజ ముఖుడు కదా! ఏనుగుకు ఇష్టమైనవి ఆకులు, కనుక పత్రి పూజ చేస్తాం. గణేశునికి "ఏక వింశతి" అంటే 21 రకాల పత్రితో పూజిస్తాము. అందులో తులసి ఆకులు కూడా వాడతాము. సాధారణం గా తులసి మాలలను శ్రీ కృష్ణునికి తప్ప మరెవరికి పూజలో ఉపయోగించము. ఈ ఇరవై ముఖ్యమైన పత్రి కాకుండా చాల రకాల పత్రిని వినాయకుని పూజలో వాడతాము. అయితే మనం నివసించే ప్రదేశాలలో పెరిగే చెట్లను బట్టి ఈ ఇరవై ఒక్క రకాలలో కొన్ని మార్పులు చేస్తుంటాం. ఉదాహరణకు నేరేడు, వెలగ వంటి పత్రి, వాటి పండ్లు అంటే వినాయకునికి ప్రీతి. అయి21 పత్రి పేర్లు--ఏక వింశతి పత్రి పూజ(తెలుగు పేర్లు)

1::మాచీ పత్రం Artemisia.vulgaris మాఛిపత్రి
2::బృహతీపత్రం Solanum.indicum బృహతీపత్రం (ములక)
3::బిల్వపత్రం Aegle.marmelos భిల్వం (మారేడు)
4::దూర్వాయుగ్మం cyandon.Dactylon (శే్వత) గరిక
cyandon.linearis (నీల)
5::దత్తూర పత్రం Datura.stramonium ఉమ్మెత్త
6::బదరీపత్రం Zizyphus.jujuba గంగరేగ (రేగు)
7::అపామార్గపత్రం Achyranthes.Aspera ఉత్తరేణి
8::తులసి పత్రం Ocimum Sanctum తులసి
9::చూతపత్రం Mangifera.Indica మామిడి
10::కరవీర పత్రం Nerium.Odorum గనే్నరు
11::విష్ణుక్రాంత పత్రం Evolvulus.Alsinoides అపరాజిత
12::దాడిమి పత్రం Punica.Granatum దానిమ్మ
13::దేవదారుపత్రం Cedrus.Deodara దేవదారు
14::మరువక పత్రం Origanum.Majorana మరువం
15::సింధువారపత్రం Vitex.Negundo సింధువారం (వావిలా)
16::జాజి పత్రం Jasminum.Auriculatum జాజి
17::గండలీ పత్రం Cynodon.Dactylon సర్పాక్షి
18::శమీ పత్రం Prosopic.spicigera జమ్మి
19::అశ్వత్థ ఫత్రం Ficus.Religiosa రావి
20::అర్జున ఫత్రం Terminalia.Arjuna మద్ది
21::ఆర్క పత్రం Pterocarpus.Santalinus జిల్లేడు

గణేశుని పూజ చేసేటప్పుడు ఒక్కొక్క నామం చదువుతూ ఆయా పత్రిని సమర్పిస్తాము. ఆయా ఆకుల సంస్కృతము మరియు తెలుగు పేర్లు దిగువ పట్టికలో చూడగలరు.

సం. వినాయకుని నామము పత్రి పూజయామి తెలుగు పేరు
1. ఓం సుముఖాయ నమః మాచీ పత్రం పూజయామి మాచిపత్రి
2. ఓం గణాధిపాయ నమః బృహతీ పత్రం పూజయామి వాకుడు
3. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వ పత్రం పూజయామి మారేడు
4. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం పూజయామి గరిక
5. ఓం హరసూనవే నమః దత్తూర పత్రం పూజయామి ఉమ్మెత్త
6. ఓం లంబోదరాయ నమః బదరీ పత్రం పూజయామి రేగు
7. ఓం గుహాగ్రజాయ నమః ఆపామార్గ పత్రం పూజయామి ఉత్తరేణి
8. ఓం గజకర్ణాయ నమః తులసీ పత్రం పూజయామి తులసి
9. ఓం ఏకదంతాయ నమః చూత పత్రం పూజయామి మామిడి
10. ఓం వికటాయ నమః కరవీర పత్రం పూజయామి ఎర్ర గన్నేరు
11. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంత పత్రం పూజయామి విష్ణుకాంత
12. ఓం వటవే నమః దాడిమీ పత్రం పూజయామి దానిమ్మ
13. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారు పత్రం పూజయామి దేవదారు
14. ఓం ఫాలచంద్రాయ నమః మరువక పత్రం పూజయామి మరువం
15. ఓం హేరంబాయ నమః సింధువార పత్రం పూజయామి వావిలి
16. ఓం శూర్పకర్ణాయ నమః జాజీ పత్రం పూజయామి జాజి
17. ఓం సురాగ్రజాయ నమః గండకీ పత్రం పూజయామి దేవకాంచనం
18. ఓం ఇభ వక్త్రాయ నమః శమీ పత్రం పూజయామి జమ్మి
19. ఓం వినాయకాయ నమః అశ్వత్థ పత్రం పూజయామి రావి
20. ఓం సురసేవితాయ నమః అర్జున పత్రం పూజయామి తెల్ల మద్ది
21. ఓం కపిలాయ నమః ఆర్క పత్రం పూజయామి జిల్లేడు
ఏక వింశతి పత్ర పూజ’లో ఉన్న
‘‘శరీర మాధ్యంఖలు ధర్మసాధనమ్‌’’ శ్లోకం... మన దేహాన్ని ఆరోగ్యంగా పోషించుకుంటేనే మనకు ధర్మ సాధన సాధ్యమవుతుందనే విషయం చెప్తోంది. అందుకే మన పండగలు, దైవారాధనలు పలు ఆరోగ్య సంబంధిత సూత్రాలతో ముడిపడి ఉన్నాయి. గణనాథునకు మనం చేసే ‘ఏక వింశతి పత్ర పూజ’లో ఉపయోగించే 21 రకాల పత్రాల్లో ఉన్న ఔషధ గుణాలు.

మాచీపత్రం పూజయామి!!
మాచీపత్రం/నాగదమని : ఆర్త్‌మీసియా వల్గారిస్‌- మంచి సువాసన గల పత్రి. తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.

బృహతీపత్రం పూజయామి!!
బృహతీపత్రం/ వాకుడాకు/ సోలానమ్‌ సురాటెన్స్‌ : దగ్గు, ఉబ్బసం, నంజు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.

బిల్వపత్రం పూజయామి!!
బిల్వపత్రం/ మారేడు/ ఈగల్‌ మార్‌మెలోస్‌ : ఈ వృక్షం బహు ప్రయోజనకారి. ఆకు పసరు పలు చర్మ దోషాలను నివారిస్తుంది.

దూర్వాయుగ్మం పూజయామి!!
దూర్వాపత్రి / గరిక గడ్డి/ సైనోడానీ డాక్టైలాన్‌ : రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలకు పనిచేస్తుంది.

దత్తూరపత్రం పూజయామి!!
దత్తూరపత్రం/ ఉమ్మెత్త / దతూర ఇనాక్జియా : ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతములకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాటులకు విషహరిణిగా పనిచేస్తుంది.

బదరీపత్రం పూజయామి!!
బదరీ పత్రం / రేగు / జిజిఫస్‌ మౌరిషియానా : అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.

అపామార్గపత్రం పూజయామి!!
అపామార్గ పత్రం / ఉత్తరేణి/ ఎభిరాంఢస్‌ అస్పెరా : గాయాలను మాన్చటంలో, ఇతర చర్మ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

తులసీపత్రం పూజయామి!!
తులసీదళం/ బృందావని / ఆసిమమ్‌ సాంక్టమ్‌ : దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు, క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది.

చూతపత్రం పూజయామి!!
చూతపత్రం/మధుఫల/ మాంజిఫెరా ఇండికా: మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

కరవీరపత్రం పూజయామి!!
కరీవీర పత్రం/గన్నేరు / నీరియమ్‌ ఇండికమ్‌: తలలో చుండ్రును తగ్గిస్తుంది. ఈ మొక్క విషతుల్యం కావున తగిన జాగ్రత్తలు తీసుకొని వాడాలి.

విష్ణుక్రాంతపత్రం పూజయామి!!
విష్ణుక్రాంతపత్రం/వరకాంత ఇవాల్యులస్‌ అల్సినాయిడెస్‌ : దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది.

దాడిమీపత్రం పూజయామి!!
దాడిమీపత్రం /దానిమ్మ/ పునికాగ్రానేటమ్‌: శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది.

దేవదారుపత్రం పూజయామి!!
దేవదారుపత్రం / దేవదారు/ సెడ్రస్‌ దియోదారా: దేవదారు తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి, లైంగిక ఉత్ర్పేరణకు ఉపయుక్తంగా ఉంటుంది.

మరువకపత్రం పూజయామి!!
మరువకపత్రం/ మరువం/ మాజోరానా హారైన్‌సిస్‌ : నరాల ఉతే్త్ప్రరణకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగపడుతుంది.

సింధువారపత్రం పూజయామి!!
సింధువారపత్రం/ వాదిలి వైటెక్స్‌ నెగుండో: వాతం, శరీరం, తలమాడు నొప్పిలను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.

జాజీపత్రం పూజయామి!!
జాజీపత్రి/జాజి పువ్వు / జాస్మినమ్‌ గ్రాండిఫ్లోరమ్‌ : ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి శక్తిని కల్పిస్తాయి. వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.

గండకీపత్రం పూజయామి!!
గండకీపత్రం/ కామంచి/ కాకమాసి/ సోలానమ్‌ నైగ్రమ్‌ : కడుపులో నులిపురుగులను హరిస్తుంది.

శమీపత్రం పూజయామి!!
శమీపత్రం/జమ్మి ప్రోసోపిస్‌ సైనరేరియా: ఈ ఆకురసం మాడుకి చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టు పైనుంచి వీచే గాలి స్వచ్ఛంగాను, ఆహ్లాదంగాను ఉంచుతుంది.

అశ్వత్థపత్రం పూజయామి!!
అశ్వత్థపత్రం / రావి/ ఫైకస్‌ రెలిజియోజా: శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు వినియోగిస్తారు.

అర్జునపత్రం పూజయామి!!
అర్జునపత్రం/ తెల్లమద్ది/ వీరతరు: దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి పనిచేస్తుంది.

అర్కపత్రం పూజయామి!!
అర్కపత్రం/ తెల్లజిల్లేడు కాలోట్రాపిస్‌ ప్రాసెరా : తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతివంతం చేస్తాయి.

No comments:

Post a Comment