శరన్నవరాత్రి మహోత్సవ పూజలలో ఉపవాసం చేస్తారు.వారి వారి శారీర స్థితిని బట్టే చెయ్యాలి కాని ఎక్కడ ఇలానే చెయ్యాలి అని చెప్పలేదు.కాకపోతే నియమాన్ని పూజకి ముందే సంకల్పించుకోవాలి.దానికి 3 పద్దతులు చెప్పబడ్డాయి.ఉపవాసం, నక్తం ,ఏకభుక్తం.ఈ మూడింటిలో ఏదైనా భక్తులు పాటించవచ్చు వారి వారి శక్తానుసారం.
మొత్తం 9 రోజులు ఉపవసించి నవరాత్రి దీక్ష చెయ్యగలిగిన వారు చెయ్యవచ్చు.అలా ఉండలేని వాళ్ళు ఏకభుక్తం అంటే మధ్యాహ్న నివేదన అనంతరం ప్రసాదాన్ని స్వీకరించి రాత్రి భోజనాన్ని విడిచిపెట్టాలి.
పగలు సాయంత్రం పూజ అనంతరం ఒకటేసారి రాత్రి మాత్రమే భుజిస్తే అది నక్తము.అలాను చెయ్యవచ్చు.
కలశ స్థాపన అయ్యాక అమ్మవారు సూక్షంసరీరంలో అక్కడే ఉంటారు ,అమ్మవారిముండు కోపతాపాలు,ఈర్శద్వేశాలు మొదలైన దుర్గునాలు దరిచేరకుండా సాత్వికమైన మనసుతో ఆరాధించాలి.
No comments:
Post a Comment