పూజ చేసేటప్పుడు ఆచరించవలసిన నియమములు
కొందరు
నిత్యం, మరికొందరు వారాల ప్రకారం ఇంట్లో దేవుడుని పూజిస్తూ ఉంటారు. అయితే
పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి. వాటిని ఈక్రిందన..
- పూజ గది లో దేవుని ఫొటోలు పూర్తిగా ఉండవలెను చెదలు పట్టినవి పనికిరావు.
- ఒట్టి పీట పైన కూర్చొని పూజ చేయరాదు లేడీ చర్మం కానీ,దర్భ ఆసనం కాని.నూతన వస్త్రము గాని వేసుకుని పూజ చేయవలెను.
- స్నానం చేయకుండా దేవుని పూజ, సంధ్యా వందనం, సూర్య నమస్కారం చేయరాదు
- దైవానికి కుంకుమ తో పూజ చేయునప్పు డు ముఖం మీద పడునట్లు పూజ చేయరాదు
- దేవుని పూజ చేయునప్పు డు తూర్పు ఈశాన్య మూలము గా కూర్చొని చేయవలెను
- దీపారాధన కుందె లో వేసిన నూనె ను తిరిగి తీయరాదు
- తీర్థం తాగిన పిదప ఆ చేతిని శిరస్సు మీద రాసుకొనరాదు బట్ట కు తుడుచుకొనవలెను
- నైవేద్యం లేకుండా దేవుని పూజించ రాదు
- దీపారాధన చేయునప్పుడు ఒంటి వత్తి వెలిగించ రాదు
- దీపారాధన అగ్గిపుల్ల తో వెలిగించ రాదు ఆగరు వత్తి తో వెలిగించ వలెను
- తీర్థ ప్రసాదము లను ఒంటి చేతిలో తీసుకొనరాదు
No comments:
Post a Comment