Friday, 30 September 2016

దేవి శరన్నవరాత్రులలో మొదటిరోజు





విజయవాడలో దుర్గమ్మ మొదటి రోజున మనకి స్వర్ణకవచ అలంకృత దుర్గా దేవి గా దర్శనం ఇస్తుంది.
.....ఈ తొమ్మిది రోజులలో ఒకోక్క రోజు ఒకొక్క రూపములో మనము అమ్మని పూజిస్తాము..ఒకోక్క స్వరూపములో అమ్మ మనకి దర్శనము ఇస్తుంది...
విజయవాడలో దుర్గమ్మకి మొదటి రోజున స్వర్ణకవచ అలంకృతరూపముగా పూజిస్తాము...ఆ రూపము వెనుక ఉన్న కధ ను తెల్సుకుందాము.

దుర్గముడు అనే రాక్షసుడు ఉండేవాడు...ఆయన గొప్ప తపస్సు చేసాడు బ్రహ్మ గారి కోసము...బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యి..." ఏమి కావాలి నీకు అని అడగగా..."నాకు వేదములు అన్ని కూడా వశము కావాలి " అని అడిగాడు..."దేవతలను నేను జయించాలి " అని అన్నాడు...అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు "తధాస్తు" అనగా వేదములు అన్నీ కూడా దుర్గముడు లోకి ప్రవేశిన్చాయి...బ్రాహ్మణులు అందరు వేదాలు మర్చిపొయారు...సంధ్యవందనాలు లేవు...హవ్విసులు లేవు, ఙ్ఞాలు లేవు...యాగాలు లేవు.....దేవతలకి హవిస్సులు లేక ఆకలితో విలవిల లాడి పొయారు....నీటి చుక్క లేదు...తల్లి అనుగ్రహం లోపించి పోయింది...భూమండలం మీద అంతా వాతావరణం క్షీణి ంచిపోయింది...అందరు నాశనము అవుతుంటె ఆ దుర్గముడు చాలా సంతొషించాడు...హవిస్సులు లేక దేవతలు అందరు వృద్ధులు లాగా మారిపోయి, నీర్సపడిపోయారు.
అప్పుడు...దేవతలు అందరు కలిసి అమ్మని ప్రార్థన చేసారు....అప్పుడు అమ్మ ప్రత్యక్షమై, అమ్మ కరుణ ప్రసరించగానే, మళ్ళి అలా ప్రత్యక్షమైన తల్లిని చుసి అన్నములేక ఆకలిగా ఉంది , నిన్ను స్తుతి చెయ్యడానికి కుడా మాకు ఒపిక లేక ఉన్నాము అని దేవతలు అమ్మని ప్రాధేయపడగా.....అమ్మ అప్పుడు అందరికి " శాకాంబరి దేవిగ " కనిపించింది..అనంత హస్తాలతో...
అసలు పృథ్వి శాకాంబరి దేవి కాదా....అలా అమ్మ ఆ రూపము దాల్చి అందరికి...పళ్ళు, కాయగూరలు...అన్ని ఇచ్చింది.....మళ్ళి హోమాలు, ఙ్ఞాలు, యాగాలు మొదలు అయ్యాయి....
ఎంటి నీరసపడిపొయిన బ్రహ్మాండం అంతా మళ్ళీ చిగురించుకుంది అని దుర్గముడు ఆలోచన చెయ్యగా.....అమ్మ అందరికి అన్నం పెడ్తోంది అని దుర్గముడుకి తెలిసింది...అప్పుడు అమ్మ ఆ రాక్షసుడితో యుద్ధం చెయ్యలెదు..ముందు అందరికి రక్షణ చక్రం వేసి... .అప్పుడు పదకొండు రోజులు యుద్ధం చేసి...దుర్గముడి కన్నులు తీసి...అందరిని కాపాడుతు .....వేదములు తన లోనుండి...మళ్ళి ఆవిర్భావం అయ్యేటట్లు చేసి......దేవతలకు వాటి రక్షణ కార్యము అప్ప చెప్పింది ...అందుకే ఆ రక్షణ కవచం తో అమ్మ అందరిని కాపాడింది కనుక .....నవరాత్రుల్లో...అమ్మని మొదటి రోజున..." స్వర్ణకవచ అలంకృత" రూపములో పూజిస్తాము.......



సర్వే జనాః సుఖినో భవంతు,

శుభమస్తు.

వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

follow us :
plz like , share , follow and subscribe

facebook page

Printerest

Twitter

Instagram

Blog


జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
AKAANKKSHA YEDUR
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371












No comments:

Post a Comment