గురుగ్రహదోష నివారణకు నవరత్నాల్లోని కనకపుష్యరాగాన్ని ధరించడం మంచి ఫలితాలనిస్తుంది. ఆంగ్లంలో సైగటెరియస్ అని పిలువబడే ఈ పుష్యరాగాన్ని ధనుస్సురాశి జాతకులు ధరించాలి. ఈ రాశికి అధిపతి బృహస్పతి కావున, ధనుస్సురాశి జాతకులంతా.. దయాహృదయులుగా ఉంటారు. మృదువుగా సంభాషించడం, అధికారం చెలాయించడం వీరి నైజం.
ఈ రాశికి చెందిన జాతకులు కనకపుష్యరాగ రత్నాన్ని ధరించడం ద్వారా... బలము, నేత్రజ్యోతి పెరుగుతుందని రత్నాలశాస్త్రం పేర్కొంటుంది. వ్యాపారము, వ్యవసాయములలో వృద్ధి చెందడంతో పాటు, చదువు, అభ్యాసముల్లో ప్రగతి చెందుతారు.
పుష్యరాగాన్ని ఎలా కనుగొనాలంటే...?
కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు ఉండవు. చూసేందుకు పారదర్శకంగానూ, కాంతివంతంగానూ ఉంటుంది. పుష్యరాగాన్ని చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది. అసలైన పుష్యరాగాన్ని ఎండలో ఉంచితే వెలుగు వ్యాపిస్తుంది.
ఎలా ధరించాలంటే...?
కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. గురువారం సూర్యోదయ సమయంలో ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. బంగారంతో పుష్యరాగాన్ని పొదిగించుకుని ధరించడం మంచిది. ముందుగా పాలులో గానీ, గంగాజలములో గానీ శుద్ధిచేయాలి. పుష్యరాగాన్ని ధరించే ముందు 160 సార్లు గురుధ్యాన శ్లోకములు ధ్యానించడం మంచిది.
గురు గ్రహ అనుగ్రహం కొరకు 16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం
దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతిరోజూ 160 మార్లు
చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.16
గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి. ప్రతి
రోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు
మంత్రాన్ని జపించండి. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా
గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి. గురు పౌర్ణమి పర్వదినమున
18 సార్లు స్తవం పారాయణ చేయాలి. గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను
గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ
రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.
కనకపుష్యరాగంపై ఎటువంటి చారలు ఉండవు. చూసేందుకు పారదర్శకంగానూ, కాంతివంతంగానూ ఉంటుంది. పుష్యరాగాన్ని చేతిలో తీసుకుంటే బరువుగా ఉంటుంది. అసలైన పుష్యరాగాన్ని ఎండలో ఉంచితే వెలుగు వ్యాపిస్తుంది.
ఎలా ధరించాలంటే...?
కుడిచేతి చూపుడు వ్రేలుకు ధరించాలి. గురువారం సూర్యోదయ సమయంలో ధరించాలని రత్నాల శాస్త్ర నిపుణులు అంటున్నారు. బంగారంతో పుష్యరాగాన్ని పొదిగించుకుని ధరించడం మంచిది. ముందుగా పాలులో గానీ, గంగాజలములో గానీ శుద్ధిచేయాలి. పుష్యరాగాన్ని ధరించే ముందు 160 సార్లు గురుధ్యాన శ్లోకములు ధ్యానించడం మంచిది.
- "దేవానాంచ ఋషీనాంచ, గురుం కాంచన సన్నిభం
- బుద్ధి మంతం త్రిలోకేశం, తం నమామి బృహస్పతిం"
No comments:
Post a Comment