Thursday, 15 September 2016

ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఎదురౌతుంటే...

ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు  ఎదురౌతుంటే...

లక్ష్మి దేవికి 8 శుక్రవారాలు, 8 ముత్తైదువులకు, ఇంటి గృహిణి ద్వారా సౌభాగ్య సామగ్రి ( కుంకం, పసుపు, చందనం, తాంబూలం, వీలు అయితే ఎరుపురంగు జాకెట్టు గుడ్డ,దక్షిణ ) కానుకగా ఇప్పించండి. అలా ఇస్తే మీ ఇంటి గృహానికి మంచి ని తప్పక లక్ష్మి దేవి చేకూర్చుతుంది.

మీ ఇంటి లో ఉండే దేవుని మందిరం లో,ఒక మంచి రోజు, ఒక కుంకుమ భరిణలో “గోమతి చక్రం” అనేది కుంకుమ భరిణలో ఉంచి మూతపెట్టి, కదిలించకుండా, దేవుని మందిరం లో ఉంచండి , దానికి పూజాది కార్యక్రమాలు, ఏమి చేయనవసరం లేదు. అలా చేస్తే మీ గృహంలో పరిష్కారం కాని సమస్యలు ఏమైనా ఉంటె పరిష్కారం అవటానికి అవకాసం ఉన్నది.





గోమతిచక్రాలు 3 తీసుకోండి, వాటిని పొడి చేసి,ఒక మంచి రోజు, ఇంటి ముందర చల్లండి. మీ ఆర్ధిక బాధలు తొలగిపోవును .


మీ ఇంటి ముఖ ద్వారానికి, ఒక మంచి రోజు, బయట  లక్ష్మి దేవి ఫోటో ఉంచండి, ఆ లక్ష్మి దేవి వెనుక రెండు ఏనుగులు బంగారపు కలశాలతో లక్ష్మి దేవికి అభిషేకం చేస్తూ ఉండాలి. ఇంటి లోపలి వస్తున్నప్పుడు లోపలి వైపు  ద్వారంపైన గడపలోకి అడుగు పెడుతున్న లక్ష్మి దేవి ఫోటో ఉంచాలి.అలా ఉంచినట్టైతే మీ ఆర్ధిక పరమైన పనులలో ఆటంకములు ఉండవు.


లక్ష్మి కవచాన్ని ధరించడం ద్వారా సమస్త ఆర్దిక ఆటంకాలు పటాపంచాలౌతాయి.


పూజ మందిరంలో లక్ష్మి కారక గవ్వలని ఎర్రటి వస్త్రం లో మూటకట్టి ఉంచడం లేదా లక్ష్మి సాధన సెట్ ని పూజించటం ద్వారా కూడా ఆర్దిక ఇబ్బందులను అధిగమించ వచ్చు.


ఉత్తరం వైపుగా హాల్ లో కూర్మ ప్లేట్ ని ఉంచాలి .అందులో రోజు నీళ్ళు పొయ్యాలి .దీని ద్వారా ఇంట్లో లక్ష్మి కల పెరుగుతుంది.నేగిటివ్ వైబ్రెషన్ ని తగ్గించి ఆర్దిక ఇబ్బందులను క్రమంగా తొలగిస్తుంది.

 

 

 శుభమస్తు

No comments:

Post a Comment