Wednesday, 14 September 2016

పూజ గది వాస్తు

పూజ గది వాస్తు


ఇంటిలోని ఆయా గదుల మాదిరిగానే పూజగది విషయంలోనూ వాస్తు కొన్ని నిర్దిష్టమైన సూచనలు చేస్తోంది. ఇల్లు నిర్మించిన తీరును బట్టే అక్కడ కాపురముండే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వాస్తు చెబుతోంది.ఆర్ధిక స్థోమత, మారుతున్న గృహ నిర్మాణ అవసరాలు, పట్టణ, నగర ప్రాంతాల్లో పరిమితమైన స్థలంలోనే గృహ నిర్మాణం చేయాల్సి రావటం, అపార్టుమెంట్లలో నివసించాల్సి రావటం వంటి కారణాల వల్ల చాలామంది ప్రత్యేకంగా పూజగదికి తగినంత స్థలం కేటాయించలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పూజాగదికి సంబంధించి వాస్తు ఏమి చెబుతోందో తెలుసుకుందాం.
  • ఈశాన్య మూల ఈశ్వరునికి నిలయం గనుక ఆ మూల పూజ గది నిర్మాణానికి అత్యుత్తమమైన స్థానం. ఈ గదిలో ఉదయాన్నే సూర్యకిరణాలు ప్రసరించటం మూలంగా అక్కడ చేసే ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగిపోతాయి. ఈ గదిలో పూజ చేసే సాధకుడు ఈశాన్య మూల లేదా టూరు, ఉత్తర దికులకు అభిముఖంగా కూర్చొని సాధన చేయటం మంచిదని వాస్తు చెబుతోంది.
  • పూజగదిలో అనవసరపు బరువులు లేకుండా చూడటంతో బాటు ఎప్పుడూ పరిశుభ్రంగా కూడా ఉంచుకోవాలి. పూజ గది వల్ల ఈశాన్యం పూర్తిగా మూతపడకూడదు.
  • ఈశాన్య గదిని పూజగదిగా వాడితే అందులో ఎత్తుగా సిమెంట్ పూజా పీఠం, మెట్లు కట్టరాదు. కలపతో చేసిన మందిరాన్ని లేదా పీటను పెట్టి దానిపై శుభ్రమైన వస్త్రాన్ని పరచి దేవుని ప్రతిమలు పెట్టుకోవాలి.
  • ఈశాన్యాన పూజ గది నిర్మాణం కుదరనివారు తూర్పు లేదా ఉత్తర దిక్కుల్లో నిర్మించుకోవచ్చు. అదీ కుదరకపోతే వంటింటి ఈశాన్య మూల పూజా మందిరాన్ని పెట్టుకోవచ్చు. సరిపడా స్థలం ఉంటే మధ్యలో పూజ గదిని నిర్మించుకొని తగినంత ఖాళీ వదిలి నలువైపులా ఇంటినిర్మాణం చేసుకోవచ్చు.
  • సెల్లార్ లో గాలి, వెలుతురు ఉండవు గనుక అక్కడ పూజగది పనికిరాదు. అలాగే వృద్ధులు , పిల్లలకు అందుబాటులో ఉండదు గనుక పై అంతస్తుల్లో కూడా పూజగది నిర్మాణం అంత శ్రేయస్కరం కాదు.
  • పూజ గదిని ఆనుకొని ఏ వైపునా లేదా పూజగదికి సరిగా పై, కింది అంతస్తులోనైనా కూడా స్నానాలగది లేదా టాయిలెట్ ఉండకూడదు. అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ కొనేముందే ఈ విషయాన్ని పరిశీలించుకోవాలి. పూజ గదిలో అటక నిర్మించి పాత సామానులు, బరువైన వస్తువులు పెట్టటం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు. పూజ గదిలో డబ్బు, ఇతర విలువైన వస్తువులను ఉంచరాదు.
  • పూజగదికి ఎప్పుడూ రెండు తలుపులుండేలా చూడాలి. ఈ గదికి తప్పనిసరిగా గడప ఉండాలి.
  • నైరుతి, ఆగ్నేయ గదులను పూజగదులుగా వాడరాదు. అయితే తప్పని పరిస్థితిలో ఏ గదిలోనైనా ఈశాన్యపు అలమారలలోగాని, పీటమీదగాని దేవుడి పటాలు, ప్రతిమలు పెట్టుకోవచ్చు.
  • పడకగదిలోనే స్నానాలగదులు నిర్మించటం, మైల తదితర కారణాల వల్ల బెడ్ రూంలో పూజామందిరాన్ని పెట్టకూడదు. ఇంటి యజమాని ఇంటి నైరుతి మూలన శయనించాలని, ఆ చోటుకు ఎదురుగా ఉండే ఈశాన్యంలో దేవుడి గది ఉండాలని వాస్తు స్పష్టం చేస్తోంది.

No comments:

Post a Comment