ఇంట్లో పూజగది తలుపులను, పూజ అయిన తరువాత ఏమిచేయాలి?
చాలామంది
ఇంట్లో పూజగది ప్రత్యేకంగా ఉంటుంది. లేదా కొందరు హాల్లోనే ఒక మందిరంలా
చేసుకుని పూజ చేస్తారు. అయితే పూజ అయిన తరువాత పూజ గది తలుపులు తెరిచి
ఉంచాలా లేక దగ్గరకు వేయాలని కొందరికి అనుమానం ఉంటుంది. పూజ ప్రశాంతంగా
చేసుకుని హారతి ఇచ్చిన తరువాత, ఆ హారతి కొండెక్కేవరకు తెరచి ఉంచి, ఆతర్వాత
నెమ్మదిగా దగ్గరకు వెయ్యాలి. పూజగదిలో ఉన్నంత సేపు ప్రాసంతమైన మనసుతో
దేవుడిని ఆహ్వానిస్తాము. ఆతర్వాత మనం ఇంట్లో, నిత్య జీవతంలో ఎన్నో తప్పులు
తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాము. అవన్నీ ఆదేవుడి ద్వారము తెరిచి ఉంచి
ఎదురుగా చేయకూడదు కనుక, తలుపులు దగ్గరకు వేయడం మంచిదని పెద్దలు అంటారు.
No comments:
Post a Comment