ఏకాదశి మాత జయంతి.
శ్రీ మహావిష్ణువు మురారి అయిన రోజే
కార్తీక బహుళ ఏకాదశి .
మురాసురుడు అనే రాక్షసున్ని
సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు
వేయి సంవత్సరాలుగా యుద్ధం చేసి ,
యుద్ధ మధ్యలో అలసిపోయి , మూర్ఛపోయి
సింహావతి అనే గృహలో సేద తీరుతున్నప్పుడు ,
విష్ణువు శరీరం నుండి
ఒక అత్భుతమైన సౌందర్యవతి ఆవిర్భావించి ,
మురాసురుడితో యుద్ధం చేసి
సంహారం చేస్తుంది.
ఆ సౌందర్యరాశికి ఏకాదశి అని
శ్రీ మహావిష్ణువు నామకరణం చేస్తాడు.
తన రక్షణ కోసం ప్రత్యక్షం అయిన
ఏకాదశి దేవతను చూసి
విష్ణుమూర్తి చాలా సంతోషించి ,
నీకేం వరం కావాలో కోరుకోమంటూ అడుగగా,
దానికి ఏకాదశి తాను
ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని
ఎవరైతే ఆ రోజున ఉపవాసం ఉండి
విష్ణుమూర్తిని ధ్యానిస్తారో
వారి కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా ,
వారి పాపాలన్నీ హరించుకుపోవాలని
కోరుకుంది.
ఆమె కోరికలకి విష్ణుమూర్తి
తన అంగీకారాన్ని తెలుపడంతో
ఏకాదశి మాత ఉత్పత్తి అయిన సందర్భంగా ,
ఈ కార్తీక బహుళ ఏకాదశి రోజును
ఉత్పత్యేకాదశిగా , ఏకాదశి జయంతిగా
అత్యంత విశిష్టత ఏర్పడింది.
ఏకాదశి వ్రతాలకు ఈనాటి నుండే
ఆరంభమైయ్యాయి.
శ్రీ మహావిష్ణువుతో ముడివడిన
ఏకాదశుల వ్రతమహాత్మ్యం ఆచరించడం వల్ల
అష్టకష్టాలతో తలమునకలై పోతున్న
సర్వ మానవాళికి ఉద్ధరించేందుకే
సాక్షాత్ శ్రీ మహావిష్ణువే ఈ ఏకాదశుల వ్రతాలను
ఏర్పాటు చేసి సమస్త వ్యధల నుండి
విముక్తి పొంది మరణానంతరం
వైకుంఠ ప్రాప్తి పొందగలరని
పద్మపురాణం నందు తెల్పబడి వుంది.
శ్రీ మహావిష్ణువు అంశ నుండి
ఉద్భవించిన ఏకాదశి మాత ద్వారా
మురాసురిన్ని వధించడం వల్ల
శ్రీ మహావిష్ణువును మురారి అని
సకల దేవతలు కీర్తిస్తూ పుష్పవర్షం కురిపించారు.
ఆనాటి నుండి కార్తీక కృష్ణ ఏకాదశి రోజున
మురారిని స్మరించి ఆరాధించాలని
శాస్త్ర వచనం.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment