*నీలాతుంగ స్తనగిరి తటీ సుప్త ముద్బోధ్య కృష్ణం*
*పారార్థం స్వం శృతిశతశిరస్సిద్ధం అధ్యాపయంతీ*
*స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా*
*బలాత్కృత్యభుంక్తే*
*గోదా తస్యై నమ* *ఇదమిదం భూయయేవాస్తుభూయః*
*స్వోచ్ఛిష్టమాలికా బంధ గంధ బందుర జిష్ణవే*
*విష్ణుచిత్త తనూజాయైు గోదాయైు నిత్యమంగళం*
భక్తుడికి భగవంతుడిపై సర్వాధికారాలూ ఉంటాయని ప్రపంచానికి తెలిపిన తన్మయి , ఆండాళ్ గోదాదేవి. తులసి వనంలో జన్మించి , భట్టనాథ ఆళ్వార్‌కి పెంపుడు బిడ్డయైు వటపత్రశాయి భక్తురాలై.. స్వామితో అనన్య సంబంధం పెంచుకొని , తాను ధరించిన పూదండనే తనకి ప్రియమైనదని ఆ దేవుడితోనే అనిపించుకొన్న మహాభక్తురాలు. ఆ స్వామిని పొందడానికి , అలనాటి గోపికల కాత్యాయినీ వ్రతం లాగా , తానూ ప్రధాన గోపికగా ఊహించుకొని , తన స్నేహితురాండ్లని గోపికలుగా తీర్చిదిద్ది , అనన్య భక్తురాలిగా కీర్తింపబడి భక్తులందరూ చూచుచుండగా , శ్రీరంగనాథుడి ఆకాంక్షల మేరకు , జ్యోతిలా మారి ఆయన్ను చేరిన భక్త శిరోమణి. ఆమె 30 పాశురములు / పాటలు రాసి , పాడి మన కోరికలు తీరడానికి *తిరుప్పావై* పేరిట భక్తులకు ధారపోసింది.
*ధనుర్మాసం.. భక్తపారవశ్యంతో కూడుకున్న పండుగ. గోదాదేవి స్వామి వ్రతం చేసి , నారాయణుని పలువిధాల కీర్తించి కృష్ణమందిరం చేరి , కృష్ణకుటుంబాన్ని లేపి తాము వచ్చిన కార్యం గురించి విన్నవించుకుంటుంది.*
*తమని ఎలా కటాక్షించాలో కూడా తానే భక్తవివశయైు సూచిస్తుంది. సింహం గుహ నుండి వచ్చిన విధంగా కృష్ణుడు వచ్చి సభలోకి తమని ఆహ్వానించాలనీ , తమ గురించి స్వయంగా అడిగి తెలుసుకోవాలని.. అప్పుడు తమ కోరికలేమిటో వివరంగా విన్నవించుకోవాలనీ కృష్ణుడికి , ద్వారపాలకుల ద్వారా తెలియపరుస్తుంది. ఆమె సూచించిన మేరకే కృష్ణుడు కొలువు తీరి కుశల ప్రశ్నలు వేసి *‘మీ కోరికలేమిట’* ని అని అడుగుతాడు. దానికి గోదాదేవి.. *‘కల్యాణ గోవిందా ! మీరు ఈ ఆడపిల్లలందరికి సన్మానం చేయాలి. చేతి ఆభరణాలు గాజులు కంకణాలు , భుజకీర్తులు కర్ణాభరణాలైన చెవిదిద్దులు , పాదా భరణాలు , మాకు సరిపడే సరిపోయే దుస్తులు ఇవ్వాలి. అవి మాకు నచ్చునట్లుగా మీరే సవరించాలి. మాకు భజించడానికి సంగీత పరికరాలు కావాలి. ఆ తరువాత పాలల్లో మునిగిన అన్నం తింటుంటే నోటి నుండి కారి మోచేతుల మీదుగా ప్రవహించేట్టుగా నెయ్యి ఉండాలి.*
*ఇంతేకాదు గోవులను కాచే గోవిందా ! నీవు మాలో ఒకడిగా ఉంటూ భుజించాలి. నీకు , మాకు ఉన్న సంబంధం విడదీయరానిది. మనం అంతా గొల్లవారమే తెంపినా తెగని సంబంధం. మేము అజ్ఞానులమని విదిలించుకోవద్దు. నీ మీద ప్రేమతో చనువుగా ఉన్నందుకు కోపగించుకోవద్దు. నీ పాదాలని మేము తనివితీరా స్పృశించే విధంగా కడిగే విధంగా మీరు సహకరించాలి’* అంటూ గోదాదేవి భగవత్ సాన్నిధ్యాన్ని , అనుభవించి అకారత్రయములైన జ్ఞానభక్త ప్రపత్తులను అనన్యగతిత్వమును , అనన్య శరణత్వమును , అనన్య భోగ్యత్వమును అదేవిధముగా పరమాత్ముడి భక్తవశంకరత్వాన్ని అశేష జనానికి ప్రసారం చేసింది.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.
follow us :
plz like , share , follow and subscribe
facebook page
YouTube
Printerest
Twitter
Instagram
Blog
జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9666602371
No comments:
Post a Comment