మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. పాతమిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. వాహనయోగం. వ్యాపారులు ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు.
వృషభం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు. బంధువిరోధాలు. వ్యాపారులకు ఒడిదుడుకులు. ఉద్యోగులకు నిరుత్సాహం.
మిథునం: సన్నిహితులతో విభేదాలు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు పనిభారం. ఆలయాలు సందర్శిస్తారు.
కర్కాటకం:పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారుల అంచనాలు నిజం కాగలవు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి.
సింహం: మిత్రుల నుంచి కీలక సమాచారం. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు నూతనోత్సాహం.
కన్య: ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులు ఒత్తిళ్లకు లోనవుతారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పనుల్లో అవాంతరాలు.
తుల: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. అందరిలోనూ గౌరవం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారులకు అనుకూలం. ఉద్యోగులు హోదాలు పొందుతారు.
ధనుస్సు: కుటుంబసభ్యులతో వివాదాలు. అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
మకరం: బంధువుల కలయిక. విందువినోదాలు. కాంట్రాక్టర్లకు అనుకూలం. అదనపు రాబడి దక్కుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది. దైవదర్శనాలు.
కుంభం: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
మీనం: ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉత్సాహం.
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment