డిసెంబరు 14న సూర్యగ్రహణం ఏర్పడనుంది. భారత కాలమాణం ప్రకారం సూర్యగ్రహణం రాత్రి 7 గంటల 3 నిమిషాలకు ప్రారంభమై.. డిసెంబరు 15 రాత్రి 12.24 గంటలకు ముగుస్తుంది. 2020.. సూర్యగ్రహణంతో వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో దీని గురించి ఇతర విషయాలు తెలుసుకుందాం.
నిమిషాలకు ప్రారంభమై.. డిసెంబరు 15 రాత్రి 12.24 గంటలకు ముగుస్తుంది. 2020.. సూర్యగ్రహణంతో వీడ్కోలు పలకనున్న నేపథ్యంలో దీని గురించి ఇతర విషయాలు తెలుసుకుందాం.
భారత్ లో ఈ గ్రహణం కనిపించదు.
ఈ సూర్యగ్రహణం భారత్ లో కనిపించదని నమ్ముతున్నారు. అందువల్ల సూతక ప్రభావం దీనిపై ఉండదు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సూర్యగ్రహణం వృశ్చిక రాశిలో, జ్యేష్ఠ్య నక్షత్రంలో సంభవించనుంది. దక్షిణామెరికా, దక్షిణాఫ్రికా అట్లాంటిక్ హిందూ మహాసముద్రం, ఫసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. భారత్ లో కనిపంచదు కాబట్టి సూతక కాలాన్ని పరిగణించరు.
ధనస్సు సంక్రాంతి రోజు సూర్యగ్రహణం.
సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించే రోజున ఈ సూర్యగ్రహణం పడుతోంది. సూర్యుడు ఏదైనా రాశిచక్రంలోకి ప్రవేశించినప్పుడు దాన్ని సంక్రాంతి అని అంటారు. ధనస్సు సంక్రాంతి రోజున సూర్యగ్రహణం పడటం చాలా ప్రత్యేకమైందిగా భావిస్తారు. ధనస్సు సంక్రాంతి డిసెంబరు 16, 2020 నుంచి 2021 జనవరి 14 వరకు ఉంటుంది. జనవరి 14న మకర రాశిలో సూర్యుడు సంక్రమణం చెందితే దాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు.
మొదటి సూర్యగ్రహణం జూన్ లో ఏర్పడనుంది..
అంతకుముందు ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం జూన్ 21న ఏర్పడింది. ఈ గ్రహణం తర్వాత ప్రపంచంలో చాలా చోట్లు తిరుగుబాట్లు జరిగాయి. ఇప్పటికీ కూడా మనం కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. కరోనా నుంచి ఇప్పటి వరకు దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయారు. సూర్యగ్రహణం తర్వాతే ఎక్కువ మంది మరణించడం గమనార్హం.
ఈ విషయాలపై దృష్టి పెట్టండి..
సర్వే జనాః సుఖినో భవంతు,
శుభమస్తు.
No comments:
Post a Comment